ఈ సమాజంలో ఏ మహిళకైనా ఒక్కసారైనా అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. అందుకోసమే పిల్లల కోసం తెగ ఆరాటపడుతుంటారు. కానీ గర్భధారణలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలామంది ఐవీఎఫ్, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనేందుకు యత్నిస్తుంటారు. ప్రస్తుత సరోగసీ అనే పద్ధతి చాలా వరకు సాధారణ ప్రక్రియగా మారిపోయింది.
అయితే ప్రముఖ బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంభావన సేత్ సైతం పిల్లల కోసం తెగ ఆరాటపడుతోంది. అందుకే ఇన్‌వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించారు. ఇప్పటికే నాలుగుసార్లు ఐవీఎఫ్ ప్రక్రియ ఫెయిల్ అయినప్పటికీ మరోసారి ప్రయత్నించారు బాలీవుడ్ నటి. అయితే ఐదోసారి కూడా ఆమెకు నిరాశే మిగిలింది.
ప్రెగ్నెన్సీ ధరించిన మొదటి త్రైమాసికంలోనే గర్భస్రావం అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంభావన. తన భర్తతో కలిసి యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాధను వ్యక్తం చేసింది. తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 12 వారాల ఇలా జరిగిందని బోరున ఏడ్చేసింది. నటి భర్త అవినాష్ ద్వివేది సైతం తాము గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే.. ఇలా జరిగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.
ఈ విషయాన్ని ప్రకటిస్తూ సంభవనా ఎమోషనలైంది. మా బిడ్డను రక్షించడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించింది. మూడు నెలల్లో 65 ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వచ్చిందని నటి తెలిపింది. కానీ చాలా ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుందని నాకు తెలియదు.. ఇది తలచుకుంటే చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు ప్రతిరోజూ 2-3 సార్లు ఇంజెక్షన్స్ ఇచ్చేవారని.. మేము మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని ఆమె భర్త అవినాశ్ బాధపడ్డారు.
కాగా..గతంలోనూ ఈ జంట ఐవీఎఫ్‌కు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది ఐదోసారి కావడంతో వారిని తీవ్ర మనో వేదనకు గురి చేసింది. గతంలో ఐవీఎఫ్ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు నటి వివరించింది. అంతేకాకుండా ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment