'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్‌ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్! | Shilpa Shetty reveals her mother Sunanda Shetty was suggested to Abort Her | Sakshi
Sakshi News home page

Shilpa Shetty: 'అమ్మ గర్భంతో ఉన్నప్పుడే ఇలా జరిగింది'.. శిల్పా శెట్టి షాకింగ్ కామెంట్స్!

Published Sun, Sep 10 2023 1:24 PM | Last Updated on Sun, Sep 10 2023 2:11 PM

Shilpa Shetty reveals her mother Sunanda Shetty was suggested to Abort Her - Sakshi

బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు.  బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్‌ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది.

(ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్‌: టాప్‌ హీరోయిన్‌)

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. 

శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్‌లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. 

సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

(ఇది చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement