Abortion
-
అబార్షన్ మాత్రలను ఎగబడి కొంటున్నారు.. ఎందుకంటే?
-
USA Elections Results 2024: ఆ నాలుగు వద్దు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రధానంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులైన మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. గర్భస్రావ హక్కులకు వ్యతిరేకి అయిన ట్రంప్ రాక పట్ల ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పురుషుల ఓట్లతోనే ఆయన గెలిచారని వారు భావిస్తున్నారు. ట్రంప్‌కు ఓటేసి గెలిపించినందుకు ప్రతీకారంగా పురుషులను పూర్తిగా దూరం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు! ఈ దిశగా దేశవ్యాప్తంగా వేలాది మంది మహిళలు ‘4బీ’ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ‘‘ఆ మగవాళ్లను దూరంగా పెడతాం. వారితో శృంగారం, పెళ్లి, పిల్లలను కనడం వంటి సంబంధాలేవీ పెట్టుకోబోం’’అని కరాఖండిగా చెబుతుండటం విశేషం! దక్షిణ కొరియాలో పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ట్రంప్ విజయం తర్వాత బాగా ట్రెండింగ్‌గా మారింది. ట్రంప్ మహిళల వ్యతిరేకి అని, స్త్రీవాదమంటే ఆయనకు పడదని డెమొక్రటిక్ పార్టీ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. గర్భస్రావ హక్కులకు మద్దతుగా నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ విజయంపై మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ట్రంప్ విజయంతో ఆవేదనకు గురై వారు కన్నీరుపెట్టారు. తమ బాధను సోషల్ మీడియాలో పంచుకోవడంతోపాటు 4బీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం పొడవునా మహిళల హక్కులపై ట్రంప్, హారిస్ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం సాగింది. 4బీ ఉద్యమం దానికి కొనసాగింపని చెబుతున్నారు. ఇది మహిళల విముక్తి పోరాటమంటూ పోస్టు పెడు తున్నారు. ‘‘తరాలుగా సాగుతున్న పురుషాధిక్యత, అణచివేతపై ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మా హక్కుల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాం’’ అంటున్నారు. 4బీ పోరాటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీని గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. పోస్టులు, లైక్‌లు, షేరింగ్లతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ రాడికల్ ఫెమినిస్ట్ ఉద్యమం నానాటికీ బలం పుంజుకోంటుంది. ఏమిటీ 4బీ ఉద్యమం?ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ’ఉద్యమం తర్వాత అదే తరహాలో దక్షిణ కొరియాలో 2018లో 4బీ ఉద్యమం మొదలైంది. ఓ మహిళ తన ఆర్ట్ క్లాస్‌లో భాగంగా నగ్నంగా ఉన్న పురుషున్ని ఫొటో తీసినందుకు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. దీనిపై మహిళల ఆగ్రహావేశాలు 4బీ ఉద్యమానికి దారితీశాయి. బీ అంటే కొరియా భాషలో సంక్షిప్తంగా నో (వద్దని) చెప్పడం. పురుషులతో డేటింగ్, పెళ్లి, శృంగారం, పిల్లలను కనడం. ప్రధానంగా ఈ నాలుగింటికి నో చెప్పడమే 4బీ ఉద్యమం. దీన్ని అణచివేసేందుకు కొరియా ప్రభుత్వం ప్రయతి్నంచింది. స్త్రీ పురుషుల ఆరోగ్యకరమైన సంబంధాలను ఇలాంటి ఉద్యమాలు దెబ్బతీస్తాయని అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ 2021లో చెప్పారు. ఇప్పుడక్కడ 4బీ గొడవ కాస్త సద్దుమణిగినప్పటికీ ప్రజలపై దాని ప్రభావం ఇంకా బలంగానే ఉంది. దాంతో కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. 4బీ ఉద్యమమే దీనికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభిప్రాయపడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్‌పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్‌పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్‌కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్‌ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్‌లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్‌పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్‌లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
గర్భ విచ్ఛిత్తికి ఆర్ఎంపీల ప్రోత్సాహం
ఎంజీఎం: ఆర్ఎంపీ, పీఎంపీల వైద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడంపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులుగా హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రి నుంచి వచ్చిన మహిళల ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు నరేష్, ఐఎంఏ అధ్యక్షుడు అన్వర్ ఆదివారం విచారణ చేపట్టారు. ములుగు జిల్లాకు చెందిన నాలుగు నెలల గర్భిణి అక్టోబర్ 3న మంగపేటకు చెందిన ఆర్ఎంపీ రామును కలవగా, గర్భ విచ్ఛిత్తికి మందులు ఇచ్చాడు. కడుపు నొప్పి రావడంతో మరిన్ని ట్యాబ్లెట్లు ఇవ్వగా.. కొంత ఉపశమనం కలిగినా, మళ్లీ నొప్పి తీవ్రత పెరగడంతో కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఈనెల 1న హనుమకొండ జీఎంహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి గర్భాశయం పగలడంతోపాటు శరీరంలోని రక్తం విషతుల్యమైందని నిర్ధారించారు. గర్భసంచి తొలగించి వెంటిలేటర్ చికిత్స అందించడానికి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల తనిఖీ బృందం గుర్తించింది. ఈ ఘటనపై ములుగు జిల్లా వైదారోగ్యశాఖ అధికారులు, పోలీసులకు సదరు ఆర్ఎంపీపై ఫిర్యాదు చేయనున్నట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు.సిద్దిపేట జిల్లా అక్కంపేట మండలానికి చెందిన మరో గర్భిణికి సైతం కేశవపూర్‌కు చెందిన రమణాచారి అనే నకిలీ వైద్యుడు గర్భ విచ్ఛిత్తికి మందులు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాపాయస్థితికి చేరుకుందని చెప్పారు. ఆమె ప్రాణాలను కాపాడిన వైద్యులు టీజీఎంసీ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు అతడిపై కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.ములుగులో మెడికల్ స్టోర్ యజమాని సొంత వైద్యం ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మరో గర్భిణికి జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపాన ఉన్న మెడికల్ స్టోర్ యజమాని ఇచ్చిన గర్భ విచ్ఛిత్తి మందులు వేసుకున్నాక..ఆమె స్పృహ కోల్పోవడంతో హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కౌన్సిల్ సభ్యులు తెలిపారు. వైద్యులు సత్వర చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.బాధిత మహిళ షాపు పేరు చెప్పకపోవడంతో ములుగు జిల్లా బస్టాండ్ ప్రాంతంలో అన్ని మందుల దుకాణాలను తనిఖీ చేసి సదరు మెడికల్ స్టోర్లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి బాంబే హైకోర్టు అనుమతి
ముంబై: పదకొండేళ్ల రేప్ బాధితురాలు తన 30 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతించింది. 11 ఏళ్ల చిన్నారి అబార్షన్‌కు మానసికంగా, శారీరకంగా సంసిద్ధంగా ఉందని వైద్య నిపుణుల బృందం చెప్పడాన్ని పరిగణలోకి తీసుకొని 30 వారాల గర్భవిచ్ఛిత్తికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా చిన్నారి పొత్తికడుపు గట్టిపడిందని భావించామని, థానే ఆసుపత్రిలోనూ డాక్టర్లు అలాగే భావించి మందులు రాసిచ్చారని తండ్రి కోర్టుకు తెలిపారు. అయినా బాలిక పరిస్థితిలో మార్పేమీ రాకపోవడంతో అక్టోబరు 24న ముంబై ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ బాలిక గర్భం దాల్చిందనే విషయాన్ని డాక్టర్లు ధ్రువీకరించారని ఆమె తండ్రి కోర్టుకు విన్నవించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోర్టును కోరడంతో 30 వారాల గర్భాన్ని తొలగించడానికి అనుమతిస్తూ జస్టిస్ షర్మిల దేశ్‌ముఖ్, జస్టిస్ జితేంద్ర జైన్ల ధర్మాసనం తీర్పునిచ్చింది. -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
శుక్రవారం మాది..
నేటి కాలంలో ఆడపిల్ల కడుపున పడినప్పటి నుంచీ కష్టాలే. ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడం నుంచి కిశోర బాలికలకు, బాలింతలకు పోషకాహారం అందకపోవడం దాకా ఎన్నో సమస్యలు. మహిళలు కేన్సర్లు సహా ఎన్నో శారీరక రుగ్మతలకు లోనైనా కప్పిపుచ్చుకుంటూ జీవిస్తున్న పరిస్థితి. పిల్లలను అంగన్వాడీలకు పంపడం లేదు. తెలియక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేలా, మహిళల్లో అవగాహన కల్పించేలా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఆస్పత్రులు, స్వయం సహాయక సంఘాలను ఒకే తాటిపై తీసుకువచ్చారు. ‘శుక్రవారం సభ’పేరిట ప్రభుత్వ సేవలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ముందు మా సేవలు చూడండి నేటి కాలంలో మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారు. పిల్లలను ప్రైవేటు బడులకు పంపుతున్నారు. అనారోగ్యమొస్తే ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఈ క్రమంలో ‘ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని ఎదగండి. చిన్నారులకు అంగన్వాడీలలో అందించే బాలామృతం, కిశోర బాలికలకు రక్తహీనతను తగ్గించే పోషకాహారం, బాలింతలకు బలవర్ధకమైన ఆహారం, మధ్య వయసు స్త్రీలకు ప్రతీ 3 నెలలకోసారి ప్రభుత్వ ఆస్పత్రిలో ‘ఆరోగ్య మహిళ’ పేరిట లభించే 52 ఉచిత పరీక్షల వివరాలు తెలుసుకోండి. ఈ సేవలన్నీ ప్రభుత్వం వద్ద ఉచితంగా అందుతాయి..’అంటూ ‘శుక్రవారం సభ’పేరిట వారానికి ఒక మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడే గర్భవతులకు సీమంతం, బాలింతలకు పోషకాహార పంపిణీ వంటివాటిని కలెక్టర్ స్వయంగా చేపడుతుండటం గమనార్హం. పీసీవోడీ, కేన్సర్, భ్రూణహత్యలపైనా.. నడి వయసు మహిళలకు ఆరోగ్య మహిళా పథకం ద్వారా పీసీవోడీ (గర్భాశయంలో కణతులు), కేన్సర్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ముప్పును ముందుగా గుర్తించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని.. అవే పరీక్షలు, చికిత్సలు ప్రైవేటులో చేస్తే రూ.లక్షల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం ఉచితంగా చేయిస్తుందని కలెక్టర్ సత్పతి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. మహిళలు తీవ్ర అనారోగ్యాల పాలైతే వారి కుటుంబాలు ఆగమవుతాయని సూచిస్తున్నారు. పిల్లల మానసిక వికాసానికి వీలుగా అంగన్వాడీలను ఆహ్లాద వాతావరణం ఉండేలా మారుస్తున్నారు. భ్రూణహత్యలను అరికట్టేలా మహిళల్లో చైతన్యం కల్పిస్తున్నారు. పోషకాహారం ప్రాధాన్యం తెలిసింది.. కలెక్టర్ సత్పతి మేడం మొదలుపెట్టిన శుక్రవారం సభ మాలో చైతన్యం తెచ్చింది. బాలింతలకు, గర్భవతుల సంక్షేమం కోసం మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మాలో రక్తహీనత నివారించేలా అవగాహన కల్పించారు. తల్లి పాల ప్రాముఖ్యత, అంగన్వాడీలలో లభించే సేవల గురించి చక్కగా వివరించారు. –అనిత, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్కేన్సర్ ముప్పు గురించి చెప్పారు కలెక్టర్ మేడం పీసీవోడీ, కేన్సర్ ఎలా వస్తాయో వివరించారు. మా ముందు తరాల వారు పనిలో పడి ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ప్రాణాలు పొగొట్టుకున్నారు. కలెక్టర్ మేడం తల్లిలా మాపై శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆడపిల్లల ప్రాధాన్యం వివరించి భ్రూణహత్యల నివారణపైనా అవగాహన కల్పించారు. – అఖిల, గృహిణి, వెంకట్రావుపల్లి, హుజూరాబాద్ -
‘అగ్ర’రాజ్యంలో అదే చర్చ
స్త్రీ హక్కులను గుర్తిస్తే.. వాళ్ల నిర్ణయా«ధికారాన్ని సమ్మతించినట్లే! వాళ్ల సాధికారతను గౌరవించినట్లే! అయితే ఇప్పుడు పేచీ అంతా అక్కడే.. మ్యారిటల్ రేప్ నుంచి అబార్షన్ కేస్ వరకు.. అమె చాయిస్‌ను అడిగేవాళ్లు లేరు సరికదా.. ఆమె అలా అడగడమే సరికాదని వాదిస్తున్నారు.. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు! అనిత (పేరు మార్చాం) ఎకనామిక్ ఎనలిస్ట్. ఆంట్రప్రెన్యూర్ కావాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం పెళ్లి, పిల్లలనే జంఝాటాలూ వద్దనుకుంది. కానీ తనంటే చాలా ఇష్టపడే ఓ ఇన్వెస్టర్ పెళ్లి ప్రపోజల్ తేవడంతో, ఇంట్లో వాళ్లూ బలవంత పెట్టడంతో పెళ్లికి ఒప్పుకుంది.. తనకున్న లక్ష్యాన్ని వివరించి, పిల్లల్ని కనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసి మరీ! అందుకు సరే అంటూ అనిత చేయి అందుకున్నాడు అతను. అయితే ఫ్యామిలీ ΄్లానింగ్ ఫెయిలై అనిత గర్భం దాల్చింది. అబార్షన్ ఆప్షన్‌ను ఎంచుకుంది. పెళ్లికి కాంప్రమైజ్ అయినట్టుగా, ప్రెగ్నెన్సీకీ కాంప్రమైజ్ అవమని ఒత్తిడి తెచ్చాడు భర్త. అలా కుదరదని తేల్చిచెప్పి, అబార్షన్ కోసం ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించింది. ‘భర్త అంగీకారం ఉంటేనేప్రోసీడ్ అవుతాను’ అంది డాక్టర్. హతాశురాలైంది అనిత! బాగా చదువుకున్నవాడు, లోకం తెలిసిన అనిత భర్తకే భార్య హక్కు గురించి తెలియకపోతే.. మిగిలిన వాళ్ల పరిస్థితేంటి! తొమ్మిది నెలలు మోసి, కని, పెంచే ఆమె అన్నిరకాలుగా సిద్ధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి! ఎందుకంటే ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ అధికారం! హర్ బాడీ.. హర్ చాయిస్! అందుకే ఇష్టం లేని గర్భాన్ని అవసరంలేదనుకునే హక్కు ఆమెకు ఉంటుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే ప్రధానాంశం అయింది. దీనిమీద.. అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్, కమలా హ్యారిస్‌ల మధ్య వేడిగావాడిగా చర్చ సాగుతోంది. డెమోక్రాట్స్ అభ్యర్థి కమలా హ్యారిస్.. స్త్రీలకు అబార్షన్ హక్కు ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది స్త్రీ నిర్ణయాధికారాన్ని, సాధికారతను సూచిస్తుందని ఆమె అభి్రపాయపడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంపేమో దీనికి సంబంధించి తన వైఖరిని మాటిమాటికీ మారుస్తూ వస్తున్నారు. నిన్నమొన్న జరిగిన డిబేట్లో కూడా ‘అబార్షన్ రైట్’ అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలనే నిర్ణయానికి మద్దతిచ్చాడు. ట్రంప్ మాటల మీద మిగతా వాళ్ల అభి్రపాయాలెలా ఉన్నా.. స్వయానా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అబార్షన్ అనేది స్త్రీ ఇష్టానికే వదిలిపెట్టాలి, అది ఆమె హక్కు.. ఈ విషయంలో రాజీకి చోటే లేదంటూ స్పష్టంగా చె΄్పారు. అంతేకాదు, ప్రాథమిక హక్కయిన వ్యక్తి స్వేచ్ఛను నేను సంరక్షిస్తాను’ అని చె΄్పారు. దీంతో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్ను వేసి ఉంచిన ప్రపంచం యావత్తూ దీని మీద చర్చనూ మొదలుపెట్టింది. అసలు ఈ అబార్షన్ రైట్ అనేది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నెలవైన అమెరికాలో ఎందుకంత వివాదమవుతోంది? ఆ నేపథ్యం ఏంటంటే.. అమెరికాలో అబార్షన్‌కి సంబంధించి స్త్రీ స్వేచ్ఛను సవాలు చేసేలా ఉన్న నియమ నిబంధనల మీద 1969ప్రాంతంలో పెద్ద ఉద్యమమే సాగింది ‘మై బాడీ.. మై చాయిస్’ నినాదంతో. ఈ క్రమంలో 1973లో ఆ దేశ సుప్రీంకోర్ట్.. రో (ఖ్ఛౌ) వర్సెస్ వేడ్ (గ్చిఛ్ఛీ) కేసులో గర్భస్రావం హక్కునుప్రాథమిక/ రాజ్యాంగ హక్కుగా తీర్పునిచ్చింది. అయితే అదే అమెరికా సుప్రీంకోర్ట్ 2022లో ఆ తీర్పును తిరగరాస్తూ అబార్షన్‌పై 1973 కంటే ముందున్న నియమ నిబంధనలే సరైనవని వ్యాఖ్యానిస్తూ మరో తీర్పునిచ్చింది. దీని మీద అమెరికా అంతటా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి.ఆ తీర్పు తర్వాత దాదాపు రెండువందల మందికి పైగా మహిళల మీద అబార్షన్ నేరం కింద కేసులు నమోదైనట్టు ఓ నివేదిక తెలిపింది. అప్పటి నుంచి అబార్షన్ రైట్ కోసం అమెరికాలోపోరాటం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు, వాటిని వ్యతిరేకిస్తూ మెలానియా వెలిబుచ్చిన తన అభి్రపాయంతో మళ్లీ ఒకసారి ప్రపంచంలోని దేశాలన్నీ అబార్షన్‌కి సంబంధించి తమ దేశాల్లోని చట్టాలు, అవి మహిళలకు ఇస్తున్న వెసులుబాటు, వాళ్ల హక్కుల్ని గౌరవిస్తున్న తీరుతెన్నులను పరిశీలించుకుంటున్నాయి. మనమూ మన దగ్గరున్న చట్టాన్ని ఒకసారి పరికిద్దాం!గర్భం దాల్చాలా? వద్దా? అనేది మహిళే నిర్ణయించుకోవాల్సిన విషయం. దీన్ని ఆమె స్వేచ్ఛకే వదిలేయాలని మన చట్టం చెబుతోంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, సెక్షన్ 3 ప్రకారం.. గర్భస్రావం తప్పనిసరైనప్పుడు దానికి గర్భిణి అంగీకారం మాత్రమే చాలు. 2017లో అనిల్‌కుమార్ వర్సెస్ అజయ్ పశ్రీచా కేసులో ‘గర్భం దాల్చాలా వద్దా అనే అంశంలో తుది నిర్ణయం మహిళదే. వైవాహిక బంధానికి సమ్మతించినంత మాత్రాన ఆ పురుషుడి బిడ్డకు తల్లినౌతానని ఆమె అంగీకరించినట్టు కాదు’ అని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి అబార్షన్ సమయంలో పురుషుడి అనుమతి అవసరం లేదు. స్త్రీ అంగీకారం మాత్రమే చాలు అని అర్థమవుతోంది. అయితే భర్త అనుమతి లేకుండా అబార్షన్ చేయించుకుంటే అది నేరం కాకపోయినప్పటికీ, ఆ కారణాన్ని చూపి భర్త విడాకులు కోరే అవకాశం ఉంటుంది.మొత్తంగా చూస్తే.. అబార్షన్‌కి సంబంధించిన చట్టాల్లో మనం అమెరికా కంటే మెరుగే అని తెలుస్తోంది. ఆ విషయంలో మన చట్టం.. స్త్రీ హక్కును గౌరవిస్తోంది. ఆచరణలో మటుకు సమాజం ఇంకా చైతన్యవంతం కావాలి. – సరస్వతి రమఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలిమదర్హుడ్ అంటే ఒకరకంగా స్త్రీల మీద టాక్సేషన్ లాంటిదే! ఎందుకంటే తొమ్మిది నెలలు మాత్రమే కాదు పిల్లలు పెరిగి, వాళ్లు ఇండిపెండెంట్ అయ్యే వరకు కూడా స్త్రీల కెరీర్పాజ్లోనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉద్యోగాల సొసైటీలో ఇదంతా అవరోధంగానే ఉంటుంది. ఇలాంటప్పుడే మదర్‌హుడ్ కావాలా? కెరీర్ కావాలా అని ఎంచుకునే పరిస్థితి ఎదురవుతుంది. రెండూ కావాలనుకునేవాళ్లు ఎన్నోరకాల ఒత్తిడికి లోనవుతుంటారు. ఆర్థికంగా, సామాజికంగా ఆమెకు ఎన్నో సౌలభ్యాలు సమకూర్చితే తప్ప ఆమె రెండు ఆప్షన్స్‌ను ఎంచుకునే వీలుండదు. కానీ ఈ వెసులుబాట్లేమీ లేవు, ఉండవు. అలాంటప్పుడు ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛను ఆమెకివ్వడమే కరెక్ట్. అబార్షన్‌ను ఆమె హక్కుగా గుర్తించి, గౌరవించాలి. – అపర్ణ తోట, జెండర్ కన్సల్టెంట్, ది పర్పుల్ వరండాస్త్రీ యంత్రం కాదుస్త్రీ శరీరం ఒక యంత్రం కాదు. బిడ్డను మోసి, కని, పెంచేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధపడి ఉండాలి. అందుకే అది పూర్తిగా ఆమె స్వేచ్ఛకు సంబంధించిన అంశం. పురుషుడికి ఆ విషయంలో ఎటువంటి హక్కు ఉండదు, ఉండకూడదు. నా ఉద్దేశంలో ఖ్ఛౌ ఠిట. గ్చిఛ్ఛీ కేసును అమెరికా సుప్రీంకోర్టు తిరగరాయడం సమంజసం కాదు. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్కలవరపెట్టే విషయం..ఈ మధ్యకాలంలో డోనాల్డ్ ట్రంప్, కమల హారిస్ మధ్య ట్ఛౌ ఠిటఠ్చీఛ్ఛీ పై జరిగిన చర్చ డెవలప్డ్ కంట్రీ అనే పిలవబడే అమెరికా, అక్కడి రాజకీయాల్లోని ఆలోచన ధోరణుల్లోని వ్యత్యాసాన్ని తెలుపుతోంది. అబార్షన్ హక్కులను పరిమితం చేయడానికి ఒత్తిడి తెచ్చిన వాళ్లలో ట్రంప్ ఒకడు. అతని హయాంలో అబార్షన్ హక్కులను పరిమితం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. Roe vs. Wade ఉద్యమానికి అతను మద్దతు ఇచ్చాడు. మరోవైపు పునరుత్పాదక హక్కులు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకి, అలాగే హెల్త్ కేర్ యాక్సెస్కిప్రాథమికం అనే ప్రగతిశీల దృక్పథం కమలది. బిడ్డని కనాలా వద్దా అని నిర్ణయం తీసుకునే హక్కు ఆడవాళ్ళ అధికారాన్ని సమానత్వాన్ని సూచిస్తుందని ఆమె వాదన. అబార్షన్ హక్కులు లేకపోవడం వలన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రజారోగ్యం మీద, సోషియో ఎకనామిక్ స్టేటస్ పైనా ప్రభావం ఉంటుందనే ముఖ్యమైన అంశాన్ని ఆమె లేవనెత్తింది. ఈ చర్చలో వచ్చినవి వ్యక్తిగత అభి్రపాయాలే కాదు, భవిష్యత్తులో అమెరికన్ సమాజం ఎలా ఉండబోతుందో కూడా తెలుపుతున్నాయి. అబార్షన్ హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలుప్రాణాలు కూడా కోల్పోయారు. మహిళల జననాంగాల గురించి పబ్లిగ్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన ట్రంప్ లాంటి పురుషహంకారులకు మహిళల స్వేచ్ఛ ఎలాగూ అర్థం కాదు. ఐతే ఇటువంటి వాదనలను సమర్థించే వాళ్లలో చదువుకున్న వాళ్లు, స్త్రీలూ కూడా ఉండడం కలవరపెట్టే విషయం. – దీప్తి శిర్ల, జెండర్ యాక్టివిస్ట్ -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్‌కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఫ్రాన్స్ పార్లమెంట్లో అబార్షన్ బిల్లుకు ఆమోదం!
ఫ్రాన్స్ పార్లమెంట్లో జరిగిన సంయుక్త సమావేశంలో అబార్షన్ బిల్లుకు ఆమోదం లభించింది. ఫ్రాన్స్ రాజ్యాంగంలో మహిళలకు గర్భస్రావం చేయించుకునే హక్కును పొందుపరిచే బిల్లుకు ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదం తెలిపారు. అబార్షన్‌ను రాజ్యాంగంలో చేర్చిన ప్రపంచంలోనే మొదటి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఈ బిల్లు అత్యధిక ఓట్లతో ఆమోదం పొందిన నేపధ్యంలో ఉమ్మడి సెషన్‌లోని సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో మహిళా హక్కుల కోసం పనిచేస్తున్నవారంతా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఈ బిల్లుకు చట్టపరమైన రూపం కల్పించేందుకు ఫ్రెంచ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 34ను సవరించారు. అనంతరం పార్లమెంటు ఉభయ సభల్లో అంటే జాతీయ అసెంబ్లీ,సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళలకు అబార్షన్ హక్కును కల్పిస్తుంది. ఉమ్మడి సెషన్‌ను ప్రారంభించిన దిగువ సభ స్పీకర్ యాయెల్ బ్రాన్-పివెట్ మాట్లాడుతూ మహిళకు అబార్షన్ హక్కును కల్పించిన మొదటి దేశం ఫ్రాన్స్ అని అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫ్రెంచ్ ప్రధాని గాబ్రియెల్ అటల్ మాట్లాడుతూ మహిళలు ఇకపై అబార్షన్ విషయంలో సొంత నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. మరోవైపు అబార్షన్‌ను వ్యతిరేకిస్తున్న సంస్థలు, కార్యకర్తలు ఈ బిల్లును ఆమోదంపై పార్లమెంటు నిర్ణయాన్ని తప్పుబట్టారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజకీయ లబ్ధి కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారు ఆరోపించారు. NEW: France's Parliament votes to make abortion a constitutional right, the first country in the world to do so. French PM Gabriel Attal: " We're sending a message to all women: your body belongs to you and no one can decide for you." pic.twitter.com/xI7EyZwvMv — Lewis Goodall (@lewis_goodall) March 4, 2024 -
సమస్య తొమ్మిది నెలలేనా?
ఇటీవలే ఓ వివాహిత 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు లేటైనా అబార్షన్ అవసరమవుతుంది. సరైన సమయంలో వైద్యం అందకపోవడం, లైంగికదాడి, గృహహింస, జైలు వంటివి ఎన్నో దీనికి కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపి వేయాలి. గర్భం వయసుపై పరిమితులు తొలగించాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అబార్షన్ చేయించుకునే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం 2021లో ఒక తీర్పునిచ్చింది. పిండం వయసు గరిష్ఠంగా 24 వారా లున్నా పీడిత మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించింది. వైకల్యమున్నప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు సిఫారసుతో అబార్ష¯Œ కు అనుమతించే పాత చట్టం నుంచి వీరికి విముక్తిని ప్రసాదించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల ముందు అబార్షన్‌కు అనుమతించే విషయంపై అనేక పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈ మార్పులు వచ్చాయి. అంతకుముందు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) యాక్ట్ (1971) ప్రకారం, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు (ఆర్ఎంపీలు) గర్భం ధరించిన 20 వారాల వరకూ అబార్షన్ చేసేందుకు అనుమతులుండేవి. 2021 నాటి సవరణ తీర్పు తరువాత కూడా చాలామంది మహిళలు వైద్యులు అబార్షన్‌కు నిరాకరించిన సందర్భాల్లో... కోర్టు నిర్దేశించిన సమయం దాటినా అఅబార్షన్కు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలే ఓ వివాహిత మహిళ 26 వారాల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ తరువాత కోర్టు అందుకు నిరాకరించడం తెలిసిన విషయాలే. పాలిచ్చే సమయంలో కొంతకాలం రుతుస్రావం జరగదు. అయితే ఈ మహిళ పాలిచ్చే సమ యంలోనే గర్భం ధరించింది. ఇది సహజం అనుకోవడంతో గర్భం ధరించినట్లు గుర్తించలేకపోయింది. ఏడాది క్రితమే బిడ్డకు జన్మనిచ్చి పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్స తీసుకుంటున్న ఈ మహిళ మరోసారి గర్భం ధరించడం గమనార్హం. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం అంతకుముందు పిటీషన్‌ను అనుమతిస్తూ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)ను ప్రక్రియ చేపట్టాలని నిర్దేశించింది. 2021 సవరణలకు ముందు అబార్షన్ కోసం కోర్టుకు ఎక్కిన కేసుల్లో అత్యధికం మానభంగం లేదా పిండాల వైకల్యం ఉన్నవారికి సంబంధించినవి. పైగా చాలావాటిల్లో గర్భం వయసు 20 వారాల కంటే ఎక్కువే. వేర్వేరు పరిస్థితుల కారణంగా మహిళలకు కొంచెం లేటైనా అబార్షన్ అనేది అవసరమవుతుంది. తొలినాళ్లలోనే అబార్షన్ చేసేందుకు వైద్యపరంగా అవకాశాల్లేకపోవడం వీటిల్లో ఒకటి. లైంగిక దాడి, గృహహింస, జైలు వంటివి ఇతర కారణాలు. గర్భం ధరించిన తరువాత పరిస్థితుల్లో వచ్చే మార్పులు (భాగస్వామి సాయం లేక పోవడం, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉద్యోగం వంటివి), శారీరక, మానసిక ఆరోగ్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసు కోవాల్సి ఉంటుంది. మెనోపాజ్ లేదా లాక్టేషనల్ అమెనోరియా (పాలిచ్చే సమయంలో రుతుస్రావం నిలిచిపోవడం) కూడా అబార్షన్‌కు తగిన కారణాలని చెప్పాలి. అబార్షన్లకు సంబంధించి 2021 నాటి సుప్రీంకోర్టు సవరణ గర్భం తాలూకూ వయో పరిమితిని పెంచింది మినహా ఇతర మార్పులేవీ చేయలేదు. దీనివల్ల ప్రయోజనం కొద్దిమందికే. తల్లి ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితి వస్తే ఓ ఆర్ఎంపీ ఏ దశలోనైనా గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఉండగా చాలామంది కేసుల భయంతో ఆ పని చేసేందుకు జంకు తున్నారు. ఫలితంగా మహిళలు గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. కోర్టులకు వెళ్లడం ఇష్టం లేని వారైతే గర్భాన్ని కొనసాగిస్తున్నారు లేదా ముతక పద్ధతులతో అబార్షన్ కు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గర్భం దాల్చిన తొలినాళ్లలోనే అబార్షన్ చేయించుకోవాలని అనుకున్నప్పటికీ కొంతమంది మహిళలు న్యాయ, వైద్యపరమైన అడ్డంకులను దాటలేకపోతున్నారు. పలుమార్లు వైద్యపరీక్షల అవసరం ఉండటం కూడా ప్రతిబంధకంగా మారుతోంది. ఒకవేళ న్యాయ స్థానాన్ని ఆశ్రయించినా న్యాయవాదుల ఇబ్బందికరమైన ప్రశ్నలను ఎదుర్కోవడం కూడా ఒక సమస్య. గత వారం సుప్రీంకోర్టులోనూ ఇలాంటి స్థితి ఎదురు కావడం చెప్పుకోవాల్సిన అంశం. అబార్షన్ కోరిన మహిళ మానసిక పరిస్థితి బాగాలేదనీ, కౌన్సెలింగ్ తీసు కోవాలనీ పలుమార్లు న్యాయవాదులు సూచించారు. ఇంతటి కష్టా నికి, ఇబ్బందికి ఓర్చినా తుది ఫలితం అనుకూలంగా ఉంటుందన్న గ్యారెంటీ లేకపోవడం గమనార్హం. అయితే ఒక్క విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అబార్షన్‌కు సంబంధించి భారతీయ చట్టాలు కొంత ఉదారంగానే ఉన్నాయని చెప్పాలి. అయినా అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, అబార్షన్‌లో అత్యుత్తమ విధానాల విషయంలో మాత్రం అంత గొప్పగా ఏమీ లేవన్నదీ సుస్పష్టం. గత ఏడాది ‘ఎక్స్’ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మధ్య జరిగిన ఒక కేసు విషయంలో వైద్యపరమైన చట్టాలను అవసరాలకు తగ్గట్టుగా అర్థ వివరణ తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు సూచించింది. ఆ కేసులో 24 వారాల వయసు గర్భంతో ఉన్న అవివాహిత మహిళకు అబార్షన్ చేయించుకునే హక్కు కల్పించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆ మహిళకు ఉన్న హక్కుల ఆధారంగా వైద్యపరమైన పరీక్షలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం, ఎంటీపీ చట్టాలపై లక్ష్యాధారిత అర్థ వివరణ తీసు కోవడం గమనార్హం. మహిళల వాస్తవిక జీవన పరిస్థితులు, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకుని మరీ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవాలి. అబార్షన్‌కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం... ప్రభుత్వాలు అబార్షన్‌ను నేరంగా పరిగణించడాన్ని నిలిపివేయాలి. గర్భం వయసుపై పరిమితులు, ఇతర నియంత్రణలను కూడా తొలగించాలి. దీనివల్ల అందరికీ వివక్ష లేని అబార్షన్ సేవలు అందుతాయి. ఏ సమయంలోనైనా సురక్షితంగా గర్భాన్ని తొలగించేందుకు ఉన్న పద్ధతులను ఉపయోగించాలని కూడా ఈ మార్గదర్శకాలు సూచించాయి. అబార్షన్ పై అడ్డంకులు విధాన పరమైన అడ్డంకులుగా మారుతున్నాయనీ, ఏ రకమైన శాస్త్రీయ ఆధా రాలు లేనివిగా మారాయనీ కూడా అవి వ్యాఖ్యానించాయి. గత వారం జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి. నాగరత్నల ముందు విచారణకు వచ్చిన కేసులో జస్టిస్ నాగరత్న, జస్టిస్ హిమా కోహ్లీ తీర్పుతో విభేదించిన విషయం తెలిసిందే. ‘ఎక్స్’ కేసును ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న గర్భం విషయంలో ఆ మహిళకు ఉన్న హక్కును గుర్తు చేశారు. మహిళ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ గర్భం అవాంఛితమైతే తొలగించుకునే హక్కు ఆ మహిళకు ఉందని స్పష్టం చేశారు. గర్భాన్ని కొనసాగించాలని కోరడం ఆ మహిళ ఆరో గ్యాన్ని పణంగా పెట్టడం అవుతుందనీ, ఇది ఆర్టికల్ 21, 15 (3)లను అతిక్రమించినట్లు అనీ వివరించారు. అయితే చివరకు ఈ మహిళకు ‘ఎక్స్’ మాదిరిగా అబార్షన్ చేయించుకునే అవకాశం కలగకపోవడం గమనార్హం. ‘ఎక్స్’ కేసులో అవాంఛిత గర్భం తాలూకూ ప్రభావాన్ని అర్థం చేసుకున్న కోర్టు... ఇంకో మహిళ విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించింది. అబార్షన్‌ను తొమ్మిది నెలల వ్యవహారా నికి పరిమితం చేసేసింది. అవాంఛిత గర్భం కారణంగా ఆ మహిళ కాన్పు తరువాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నది గుర్తించకపోవడం దురదృష్టకరం. వాదనల సందర్భంగానూ న్యాయమూర్తులు, ప్రభుత్వం పలుమార్లు ఈ కేసుకు ఇతర కేసులకు మధ్య తేడాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. అబార్షన్‌కు గల కార ణాల విలువ ఒకరికి ఎక్కువ? ఇంకొరికి తక్కువగా ఉంటాయా? -వ్యాసకర్త బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ) బోధకులు -
ఆ ఊపిరి ఆపలేం!
న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది. అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్‌కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది. చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్‌కు అనుమతించాలని కోరింది. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈ మెయిల్‌ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్‌కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది. చట్టమూ అంగీకరించదు... వివాహితలకు అబార్షన్ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. -
ఆమె గర్భం తొలగింపునకు అనుమతించం: సుప్రీం కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: తన 26 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె విజ్ఞప్తిని భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని, వైద్య నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తేల్చి చెప్పింది. ‘‘గర్భం 26 వారాలు మరియు 5 రోజులు. ఇది పిండం అసాధారణతకు సంబంధించింది కాదు. ఏ రకంగానూ తల్లికి తక్షణ ప్రమాదమూ లేదు. కాబట్టి.. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ తీర్పు ఇస్తే.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్‌లోని సెక్షన్ 3, సెక్షన్ 5లను ఉల్లంఘించడమే అవుతుంది. కాబట్టి.. ఆ గుండె చప్పుడును ఆపలేం’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బిడ్డ పుట్టాక బాధ్యతల్ని ప్రభుత్వమే చూసుకుంటుందని స్పష్టం చేశారాయన. తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని.. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఈ పిటిషన్‌పై తొలుత విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే, ఆ మరుసటిరోజే ‘‘పిండం బతికే అవకాశాలు ఉన్నాయి’’ అని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఎయిమ్స్ నివేదికపై ద్విసభ్య ధర్మాసనం.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో.. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. విచారణ కొనసాగించింది. ‘‘తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది’’ అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించింది. తదనంతర వాదనలు.. పిండంలో ఎలాంటి అసాధారణతలు లేవని ఎయిమ్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా గర్భవిచ్చిత్తికి మహిళను అనుమతించబోమంటూ తీర్పు ఇవాళ ఇచ్చింది. SC declines request for Medical Termination of Pregnancy. Says foetus is 26 weeks and 5 days old and medical report shows no abnormality to it. AIIMS to conduct delivery at appropriate time @IndianExpress https://t.co/o4oNHZXzNx — Ananthakrishnan G (@axidentaljourno) October 16, 2023 భిన్న తీర్పులు.. కీలక వ్యాఖ్యలు అక్టోబర్ 9వ తేదీన మహిళ గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 10వ తేదీన ఎయిమ్స్ వైద్య బృందంలోకి ఓ డాక్టర్ కీలకాంశం వెల్లడించారు. పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. దీంతో.. ఈ అంశం ద్విసభ్య ధర్మాసనం ముందుకు మళ్లీ వచ్చింది. అయితే ఈ మధ్యలోనే ద్విసభ్య ధర్మాసనం తీర్పుపై కేంద్రం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందుకు వెళ్లింది. గర్భవిచ్చిత్తికి అనుమతిస్తూ ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అదనపు సోలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి పిటిషన్ వేశారు. ఈ పరిణామంపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నలు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది సుప్రీం కోర్టు. ఇందులో ఏ బెంచ్ అయినా కీలకమే. మేం తీర్పు ఇచ్చాక.. మళ్లీ ఇదే పరిధిలోని బెంచ్ ముందుకు వెళ్లడం ఏంటి?. కేంద్రమే ఇలా చేస్తే.. రేపు ప్రైవేట్ వ్యక్తులు ఇలా చేయరా?’’ అని అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో పిండం బతికే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికపై ఇద్దరు మహిళా జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. జస్టిస్నాగరత్న.. మహిళ మానసిక స్థితి ఆధారంగా గర్భవిచ్చిత్తికి అనుమతించిన గత తీర్పునే సమర్థించగా.. జస్టిస్ హిమా కోహ్లీ మాత్రం అంతరాత్మను అనుసరించి అందుకు అంగీకరించబోనని, గర్భంలోని పిండానికి హక్కులు ఉంటాయనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ భిన్న తీర్పుల నేపథ్యంలో.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్.. ప్రకారం 24 వారాల్లోపు అబార్షన్‌కు అనుమతి ఉంటుంది. అంతకు మించి అబార్షన్ జరగాలంటే.. దివ్యాంగులు, మైనర్ బాలికలు, రేప్ బాధితురాలు, మానసిక స్థితి సరిగా లేనివాళ్లు .. ఇలా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చట్టం అనుమతిస్తుంది. -
పిండం ఎదుగుదల ఎలా ఉంది?
న్యూఢిల్లీ: వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో ఆమె గర్భంలో ఉన్న పిండం ఎదుగుదల ఎలా ఉందో నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఆ మహిళ ప్రసవానంతర మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటోందని గర్భాన్ని మోయడానికి ఆమె సిద్ధంగా లేదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని çపరిగణనలోకి తీసుకుంది. మానసిక సమస్యలకు ఆ మహిళ తీసుకుంటున్న మందులు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యానికి ఏమైనా హాని చేస్తాయో పూర్తిగా పరీక్షలు చేసి వివరంగా కోర్టుకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళ శారీరక, మానసిక స్థితి ఎలా ఉందో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ‘‘ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లయిన ఆ మహిళ ప్రసవానంతరం వచ్చే మానసిక సమస్యలతో బాధపడుతోందని పరీక్షల్లో తేలితే ప్రత్యామ్నాయంగా మరేౖవైనా మందులు ఇవ్వొచ్చా పరిశీలించాలి’’ అని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. ఎయిమ్స్ వైద్యులకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. -
వివాహిత 26 వారాల గర్భవిచ్చిత్తి కేసులో... సుప్రీం భిన్న తీర్పులు
న్యూఢిల్లీ: గర్భ విచ్చిత్తికి సంబంధించిన ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. సుప్రీం కోర్టులో ద్విసభ్య బెంచ్ బుధవారం భిన్న తీర్పుల్ని వెలువరించింది ఒక వివాహిత గర్భం దాలి్చన 26 వారాలకు గర్భవిచ్చిత్తి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఎయిమ్స్ ఇచి్చన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్ హిమ కొహ్లి పిండం గుండె ఆపేయాలని ఏ కోర్టు అయినా ఎందుకు చెబుతుందని ప్రశి్నస్తూ గర్భవిచ్ఛిత్తికి నిరాకరించారు. సుప్రీం బెంచ్‌లో మరో న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న దాంతో విభేదించారు. మహిళ నిర్ణయాన్ని తప్పనిసరిగా గౌరవించాలని అన్నారు. వివరాల్లోకి వెళితే........ ఇద్దరు పిల్లలున్న ఒక వివాహిత మూడోసారి గర్భం దాల్చింది. అప్పటికే కుంగుబాటు సమస్యతో బాధపడుతున్న ఆమె మానసికంగా, ఆర్థికంగా తాను మరో పిల్లని పెంచడానికి సంసిద్ధంగా లేనని, అందుకే గర్భవిచ్చిత్తికి అనుమతినివ్వాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గర్భం దాల్చి 26 వారాల కావడంతో ఎయిమ్స్‌లో వైద్యులు ఆమెని పరీక్షించి అబార్షన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని అక్టోబర్ 6న నివేదిక కూడా ఇచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ అక్టోబర్ 9న తీర్పు చెప్పింది.ఆ మహిళకు అబార్షన్ చేయాలని ఎయిమ్స్ వైద్యాధికారుల్ని ఆదేశించింది. అబార్షన్‌కు ముందు ఎయిమ్స్ డాక్టర్లు ఆమెని పరీక్షించి గర్భవిచ్చిన్నం చేసినా శిశువు సజీవంగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరో నివేదిక ఇచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వం గర్భవిచ్చిత్తి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అక్టోబర్ 10న మరో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా బుధవారం ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం బెంచ్ తొలుత ఎయిమ్స్‌లో మరో వైద్య బృందం గర్భవిచ్చిత్తి వల్ల వచ్చే ప్రమాదేమేమీ లేదని ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. అక్టోబర్ 6 న అబార్షన్‌కు ప్రమాదం లేదని వైద్యులు ఎందుకు నివేదిక ఇచ్చారు ? ఎందుకు ఆ దాపరికం ? నాలుగు రోజుల్లోనే ఎలా పరిస్థితి మారింది ? అని ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిపై న్యాయమూర్తులు ప్రశ్నల వర్షం కురిపించారు. గర్భ విచ్చిన్నం చేసినా శిశువు బతికే ఉంటుందని అంటే ఏ కోర్టు అయినా పిండం గుండె ఆపేయమని ఎందుకు చెబుతుంది ? అంటూ జస్టిస్ హిమాకొహ్లీ ప్రశ్నించారు. నా వరకు నేనైతే అలాంటి పని చేయలేనన్న జస్టిస్ హిమ గర్భవిచ్చిత్తికి నిరాకరించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుని ప్రస్తావించారు. ఇప్పటికీ ఆ మహిళ గర్భం తీసివేయడం పట్ల సుముఖంగా ఉన్నందున ఆమె నిర్ణయాన్ని గౌరవించాలంటూ గర్భవిచ్చిత్తికి అనుమతినిస్తూ తీర్పు చెప్పారు. ఆ మహిళ సామాజిక ఆర్థిక పరిస్థితులతో పాటు ఆమె శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా గర్భవిచ్చిత్తి చేయడమే సరైనదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఈ కేసుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌కు పరిశీలనకు సిఫారసు చేశారు. -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్‌పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. బాజీఘర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ హిందీతో పాటు తెలుగు, తమిళం సినిమాల్లోనూ నటించింది. కర్ణాటకలోని మంగళూరులో జన్మించిన ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు, వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రాను పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె సుఖీ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్) అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిల్పా శెట్టి తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ చిత్ర నిర్మాత అయిన తన తల్లి సునందశెట్టి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మా అమ్మకు నేను కడుపులో ఉండగా.. గర్భస్రావం అవుతుందని వైద్యులు చెప్పారని శిల్పాశెట్టి వెల్లడించారు. ఈ విషయాన్ని అమ్మ తనకు చెప్పిందని తెలిపింది. శిల్పా మాట్లాడుతూ.. 'మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది. తాను నన్ను కోల్పోతుందని వైద్యులు చెప్పారట. తాను గర్భంలో ఉన్నప్పుజే అమ్మ పరిస్థితి చాలా కష్టంగా ఉన్నందున అబార్షన్ చేయాలని వైద్యులు సూచించారట. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో మిస్ క్యారేజ్ అవుతుందని అమ్మ భయపడింది. తరచుగా అలా జరగడంతో అబార్షన్ తప్పదనుకున్నారు. కానీ నేను పుట్టాను. ఇది ఒక విధంగా నాకు పునర్జన్మే. అందుకే నేను ఏదో చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారణంతో పుట్టానని అనిపిస్తోంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో జీవితంలో ప్రేరణ ఇచ్చే మేసేజ్‌లు చేస్తుంటా. లైఫ్ అనేది ఎవరికీ కూడా అంతా ఈజీ కాదు. " అంటూ చెప్పుకొచ్చింది. సుఖీ చిత్రం ద్వారా సోనాల్ జోషి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, కుషా కపిల, పావ్లీన్ గుజ్రాల్, దిల్నాజ్ ఇరానీ, చైతన్య చౌదరి, జ్యోతి కపూర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా, శిఖా శర్మలు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీకి యాక్సిడెంట్.. జరిగింది ఇదే!) -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఇంటికే పరిమితం చేసినా లాక్ డౌన్ సమయంలో అమెరికాకు చెందిన ఒక యువతి చట్ట విరుద్ధమైన పనికి పాల్పడింది. సంతానం వద్దనుకున్న కారణంగా ఓ యువతి అబార్షన్ చేసి కడుపులోని బిడ్డని కడతేర్చింది. నెబ్రాస్కాలో 20 నెలల గర్భస్థ శిశువును చంపడం నేరం కాగా ఆమె 28 వారాలు నిండిన తర్వాత ఈ ఘోరానికి పాల్పడింది. దీంతో ఈ నేరం కింద అరెస్టైన ఆ యువతికి కోర్టు మూడు నెలల జైలు శిక్షతో పాటు అదనంగా మరో రెండేళ్ల ప్రొబేషన్ కూడా విధించింది. . వివరాల్లోకి వెళితే.. నెబ్రాస్కాకు చెందిన సెలెస్టె బర్గస్(19) లాక్ డౌన్ సమయంలో కడుపులోని 28 నెలల పిండాన్ని చంపుకుంది. అందుకు ఆమె తల్లి జెస్సికా బర్గస్(42) సహకరించింది. కానీ నెబ్రాస్కా దేశ చట్టం ప్రకారం 20 నెలల పిండాన్ని అబార్షన్ చేస్తే అది చట్టరీత్యా నేరం. అయితే ఆ యువతి గర్భాన్ని తొలగించడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. చివరకు తన తల్లి సాయంతో అబార్షన్‌కు పాల్పడి కటకటాల పాలయ్యింది. తన కూతురు గర్భాన్ని తొలగించడానికి సాయం చేసిన ఆ తల్లిపైన కూడా కేసు నమోదు చేశారు నెబ్రాస్కా పోలీసులు. నిజాన్ని దాచి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు కూతురిపైనా.. సాక్ష్యాధారాలు లేకుండా చేసినందుకు తల్లిపైనా అభియోగాలు మోపారు నెబ్రాస్కా పోలీసులు. ఇద్దరికీ శిక్ష ఖరారు కాగా సెప్టెంబరు నుండి అమల్లోకి వస్తుంది. మొదట పోలీసు విచారణలో డెలివరీ అయ్యిందని, కానీ మృత శిశువు జన్మించిందని అబద్ధం చెప్పింది ఆ యువతి. తీరా ఆమె ఫేస్బుక్ మెసేజులు పరిశిలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫేస్ బుక్‌లో గర్బనిరోధక మాత్రలు గురించి, పిండాన్ని మాయ చేసే ఉపాయం గురించి తన తల్లితో చేసిన చాటింగ్‌ను పోలీసులు కనుగొనడంతో ఈ విషయం బయటపడింది. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
ఆంక్షలు ఉన్నా.. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన రమిత (పేరు మార్చాం) ప్రస్తుతం రెండో నెల గర్భిణి. ఇటీవల హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆమె బలహీనతకు కారణాలపై ఆరా తీయగా విస్తుపోయే విషయం తెలిసింది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె.. మగపిల్లాడి కోసం ఆరు నెలల గర్భం సహా ఇప్పటికే 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఈసారీ లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధమైంది. లింగ నిర్ధారణపై నిషేధం, కఠిన ఆంక్షలు ఉన్నా.. ఇన్నిసార్లు నిర్ధారణ, అబార్షన్లు ఎలా సాధ్యమయ్యాయి? ఓవైపు డయాగ్నొస్టిక్స్ కేంద్రాల అక్రమాలు, మరోవైపు విదేశాలకు వెళ్లి మరీ ఈ దారుణానికి పాల్పడుతున్న తీరు పెరుగుతుండటం ఆందోళన రేపుతున్నాయి. విదేశాలకు వెళ్లి మరీ చిదిమేస్తూ.. మన దేశంలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. ఒకవేళ అక్రమంగా పరీక్షలు చేస్తున్నా.. సాధారణ డయాగ్నొస్టిక్స్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయడానికి కనీసం గర్భం దాల్చిన 16 వారాల వరకు ఆగాల్సి వస్తోంది. అదే యూకే, అమెరికా, సింగపూర్ వంటి చాలా దేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధమేదీ లేదు. పైగా 8 నుంచి 10 వారాల వ్యవధిలోనే నిర్ధారణ చేస్తుండటం, దీనిని రాతపూర్వకంగా కూడా వెల్లడిస్తుంటారు. మగ పిల్లలు కావాలనుకునే జంటలు దీనిని సావకాశంగా తీసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 9–10 వారాల గర్భిణులు విదేశాలకు వెళ్లి పరీక్ష చేయించుకుంటున్నారు. ఇక్కడ అబార్షన్లు చేయించుకుంటూ.. మన దేశంలో గర్భిణులకు 12 వారాల వరకు అబార్షన్ చేయడానికి చట్టబద్ధంగా వెసులుబాటు ఉంది. విదేశాల్లో లింగ నిర్ధారణ చేయించుకున్నవారు ఆడపిల్ల అని తేలితే.. ఇక్కడికి తిరిగి వచ్చాక ఆస్పత్రులకు వెళ్లి అబార్షన్ చేయించుకుంటున్నారు. ‘కండోమ్ ఫెయిల్యూర్, గర్భం రాకుండా వేసుకునే మందులు తీసుకోవడం మర్చిపోవడం’ అంటూ ఏదో కారణం చెప్తున్నారు. కొందరైతే లింగ నిర్ధారణతోపాటు అబార్షన్ కూడా విదేశాల్లోనే చేయించుకుని వస్తున్నారు. ఇందు కోసం థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు వెళ్తున్నారు. ‘‘డబ్బున్నవాళ్లు లిఖితపూర్వకంగా లింగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇచ్చే దేశాలకు వెళ్తున్నారు. కొందరు మధ్యతరగతి వారు కూడా మగ పిల్లలు కావాలన్న ఆశతో ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే లింగ నిర్ధారణ పరీక్షల రాకెట్‌ను నడిపించే వారి సంఖ్య పెరుగుతోంది’’ అని ప్రసూతి, గైనకాలజీ సొసైటీకి చెందిన డాక్టర్ శాంత కుమారి చెప్పారు. చైతన్యం కలిగించడమే మార్గం.. ‘‘తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు మన దేశంలో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేసుకోవడానికి రూ.25,000 నుంచి రూ. 45,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విదేశాలలోనూ చట్టబద్ధంగా కూడా దాదాపు ఇదే ఖర్చు అవుతుంది. ప్రయాణ ఖర్చులే అదనం. విదేశాల్లో పరిశుభ్రమైన పరిస్థితులలో, సరైన మెడికల్ బ్యాకప్‌తో జరుగుతుంది. దీనితో కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు కూడా చట్టపరమైన ఇబ్బందులను నివారించడానికి దేశం దాటుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవడానికి అవకాశం లేదు. జంటలలో అవగాహన పెంచడం, చైతన్యం కలిగించడం తప్ప మరోదారి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఏజెంట్లు, మధ్యవర్తుల వ్యవహారం లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్, నేరుగా అవాంఛనీయ గర్భాన్ని గానీ తొలగించుకోవాలనుకునే వారి కోసం.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, ఆస్పత్రులకు మధ్య ఏజెంట్లు, దళారులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ, విషయం బయటికి తెలియకుండా ‘పని’ కానిచ్చేస్తూ.. డయాగ్నొస్టిక్స్ కేంద్రాల వారికి, ఆస్పత్రులకు వీరే సొమ్ము ముట్టజెప్తుంటారు. ఇలాంటి ఏజెంట్లు, దళారుల వల్ల భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. కొడుకు కావాలనే కోరికతో.. మగ పిల్లలు కావాలనే కోరికతో లింగ నిర్ధారణ పరీక్షలకు వెంపర్లాడే వారిలో పేదలు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటారనేది సాధారణ నమ్మకం. ఈ విషయంలో సంపన్నులు, బాగా చదువుకుని, పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. పెరుగుతున్న ఖర్చులతో ఒకరిద్దరు పిల్లలు మాత్రమే కావాలనుకోవడం, అందులోనూ వంశాన్ని కొనసాగించడానికి కొడుకు ఉండాలన్న ఆలోచన, ఆ దిశగా ఇళ్లలో పెద్దల ఒత్తిళ్లు వంటివి.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడానికి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయించేందుకు తెగబడటానికి దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇది కూడా చదవండి: పుడమి తల్లికి తూట్లు! -
కరీంనగర్లో అబార్షన్ల కలకలం
కరీంనగర్‌టౌన్: గర్భంతో ఉన్న తన కోడలుకు క్లినిక్ నిర్వాహకురాలు అబార్షన్ చేసిందంటూ అత్తామామలు ఆసుపత్రిలో గొడవకు దిగి, దాడిచేసిన ఘటన మంగళవారం కరీంనగర్లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన ఓ వివాహిత జ్యోతినగర్‌లోని ఓ క్లినిక్‌కు రాగా అత్తామామలు సైతం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకొని తన కోడలు గర్భం తీయించుకుందని గొడవకు దిగారు. నిర్వాహకురాలితో పాటు కోడలి తల్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, దాడికి పాల్పడ్డారు. అయితే తనకు రక్తస్రావం అవుతుంటే చికిత్స చేయించుకునేందుకు వచ్చాను తప్ప.. అబార్షన్ చేయించుకోలేదని కోడలు చెప్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతినగర్ క్లినిక్ వెళ్లి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు సదరు క్లినిక్‌పై 2019 నవంబర్ 7న వైద్యారోగ్యశాఖ అధికారులు దాడి చేసి అబార్షన్లు జరుగుతున్న విషయంపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి, క్లినిక్‌ను మూసివేశారు. తాజాగా మంగళవారం జరిగిన ఈ ఘటనతో మళ్లీ ఆ క్లినిక్‌లో విచ్చలవిడిగా అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్రీట్మెంట్ చేయించుకునేందుకు నగరంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ ధర్మారం మండలం నుంచి ప్రత్యేకంగా పేషెంట్ జ్యోతినగర్‌లో ఉన్న సాధారణ క్లినిక్‌కు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
బాలిక 32 వారాల గర్భ విచ్ఛిత్తికి కేరళ హైకోర్టు అనుమతి
కొచ్చిన్: సొంత సోదరుడి అఘాయిత్యానికి బలై గర్భం దాల్చిన బాలికకు కేరళ హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఆమె 32 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి మంజూరు చేసింది. ‘బాధిత బాలిక(15) శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నట్లు వైద్య నివేదికను బట్టి తెలుస్తోంది. గర్భం కొనసాగింపు వల్ల ఆమె సామాజిక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని గర్భ విచ్ఛిత్తికి అనుమతివ్వాలని నిర్ణయిస్తున్నాం’ అని జస్టిస్ జియాద్ రహ్మన్ ఈ నెల 19న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు. తక్షణమే ఇందుకు సంబంధించిన చర్యలను అమలు చేసి, వారంలోగా పూర్తి వివరాలతో తమ ముందుకు రావాలని మలప్పురం జిల్లా వైద్యాధికారి, మంజేరి మెడికల్ కాలేజి హాస్పిటల్ సూపరింటెండెంట్లను ఆదేశించారు.