న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది.
అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్‌కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది.
చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్‌లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్‌కు అనుమతించాలని కోరింది.
ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈ మెయిల్‌ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్‌కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది.
చట్టమూ అంగీకరించదు...
వివాహితలకు అబార్షన్ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment