Unborn child
-
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
ఆ ఊపిరి ఆపలేం!
న్యూఢిల్లీ: 26 వారాల ఐదు రోజుల వయసున్న గర్భాన్ని తొలగించుకునేందుకు ఓ వివాహిత పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచి్చంది. ‘‘ఆమె ప్రసవానంతర కుంగుబాటుతో బాధపడుతుండటం వాస్తమేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు తేలి్చంది. అయితే గర్భస్థ శిశువు బాగానే ఉందని, ఆరోగ్యపరంగా అసాధారణ పరిస్థితులేమీ లేవని బోర్డు స్పష్టం చేసింది. ఆమె వాడుతున్న మందులు కూడా పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపేవేమీ కావని వెల్లడించింది. అంతేగాక పిండం వయసు వైద్యపరంగా అబార్షన్ (ఎంటీపీ)కి అనుమతించిన 24 వారాల గరిష్ట గడువును కూడా దాటేసింది. కనుక ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. ‘‘ఇప్పుడు అబార్షన్‌కు అనుమతించడం భ్రూణ హత్యతో సమానం. ఎంపీటీ చట్టంలోని 3, 5 సెక్షన్లను ఉల్లంఘించడమే. సదరు మహిళ ఆస్పత్రి ఖర్చులన్నింటినీ ఎయిమ్సే భరిస్తుంది. చిన్నారిని పెంచుకోవడమా, దత్తతకివ్వడమా అనేది ప్రసవానంతరం తల్లిదండ్రులు నిర్ణయించుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా ఉన్నారు. ఇప్పటికే తనకిద్దరు పిల్లలని, 2022 సెపె్టంబర్లో రెండో కాన్పు అనంతరం కుంగుబాటుకు గురయ్యానని పేర్కొంటూ ఓ 27 ఏళ్ల గర్భిణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మూడో బిడ్డను కని పెంచే శారీరక, ఆర్థిక, భావోద్వేగపరమైన స్తోమత లేనందున అబార్షన్‌కు అనుమతించాలని కోరింది. ఆమెను పరీక్షించిన ఎయిమ్స్ బృందం నివేదిక ఆధారంగా ఆమె 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అక్టోబర్ 9న సుప్రీంకోర్టు అనుమతించడం తెలిసిందే. ఈ తీర్పును వెనక్కు తీసుకోవాలంటూ కేంద్రం పిటిషన్ వేసింది. పిండం బాగానే ఉందని, చక్కగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటూ ఎయిమ్స్ బృందంలోని ఒక వైద్యుడు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 6న పంపిన ఈ మెయిల్‌ను ఉటంకించింది. ఈ నేపథ్యంలో దీనిపై పునరి్వచారణ జరిపిన జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.వి.నాగరత్న ద్విసభ్య ధర్మాసనం తొలుత అబార్షన్‌కు అనుమతించినా, బుధవారం భిన్నమైన తీర్పు వెలువరించింది. దాంతో కేసు సీజేఐ ధర్మాసనం ముందుకొచి్చంది. చట్టమూ అంగీకరించదు... వివాహితలకు అబార్షన్ చేసుకునేందుకు ఎంటీపీ చట్టం ప్రకారం అనుమతించిన గరిష్ట గడువు 24 వారాలు. అత్యాచార బాధితులు, దివ్యాంగులు, మైనర్ల వంటి బాధిత మహిళలకు ఇందుకు మినహాయింపు ఉంటుంది. ఈ గడువును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విడిగా విచారిస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. -
అమెరికాలో మహిళకి మరణశిక్ష అమలు
టెర్రెహాట్: పదిహేడేళ్ల క్రితం నిండు గర్భిణిని హత్య చేసి, ఆమె కడుపు కోసి గర్భంలో ఉన్న శిశువుని ఎత్తుకుపోయిన నేరానికి కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్గొమెరీ అనే మహిళకు మరణశిక్ష అమలు చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయడం 1953 సంవత్సరం తర్వాత ఇదే మొదటిసారి. ఇండియానాలోని టెర్రెహాట్ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇచ్చారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుది శ్వాస విడిచినట్టుగా జైలు అధికారులు వెల్లడించారు. మరణశిక్ష అమలు చేయడానికి ముందు లీసా కాస్త ఆందోళనతో కనిపించినట్టు జైలు అధికారులు చెప్పారు. ఇంజెక్షన్ ఇవ్వడానికి ముందు జైలులోని మహిళా అధికారి లీసా దగ్గరగా వచ్చి, ఆమె ముఖాన్ని కప్పి ఉంచిన మాస్కు తీసి, చివరగా చెప్పాల్సినదేమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి లీసా నెమ్మదిగా, వణుకుతున్న గొంతుతో ‘‘నో’’అని బదులిచ్చారు. మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా 2004 సంవత్సరం డిసెంబర్లో ఇంటర్నెట్లో కుక్క పిల్లల అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసింది. ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్ (23) మహిళని కాంటాక్ట్ చేసింది. స్టిన్నెట్ ఇంటికి వెళ్లిన లీసా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదో నెల గర్భిణి అయిన స్టిన్నెట్ మెడకి తాడు బిగించి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత వంటగదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి ఆమె గర్భాన్ని చీల్చి లోపల ఉన్న శిశువుని అపహరించింది. -
పుట్టబోయే బిడ్డతో సెల్ఫీ
స్యూ రాఫోర్ట్ ఈవిడ పేరు. యు.కె.లో ఉంటారు. వయసు 44. పిల్లలు 21 మంది. ఇప్పుడు ఇంకో పాపాయి వీళ్ల ఫ్యామిలీతో జాయిన్ అవడానికి రెడీగా ఉంది. స్యూ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ‘‘మరొకసారి నేను తల్లిని కాబోతున్నానన్న భావన నాలో మాతృత్వపు మధురిమల్ని కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డకు పేరేం పెట్టాలో తెలియడం లేదు’’ అంటున్నారు స్యూ. తన 13 వయేట తొలిసారి తల్లి అయ్యారావిడ. కడుపులో ఉన్న తన 22వ బిడ్డతో సెల్ఫీ దిగి అప్పుడే సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. -
గర్భిణులూ.. జాగ్రత్త!
లండన్: గర్భంతో ఉండగా అతిగా తినే మహిళలకో హెచ్చరిక. గర్భస్థ శిశువుకు అవసరానికి మించి, అధిక మొత్తంలో పోషకాహారం అందిస్తే.. ఆ శిశువు యుక్త వయసుకు వచ్చాక ఊబకాయం బారినపడే ప్రమాదముందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. పుట్టిన సమయంలో పిల్లల బరువుకు, 9-17 మధ్య వయసులో శరీరంలో కొవ్వుశాతానికి, నడుము చుట్టుకొలతకు దగ్గరి సంబంధం ఉందని యూకేలోని గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు తెలిపారు. గర్భిణిగా ఉండగా అతిగా పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుల్లో కొవ్వు శాతం పెరుగుతుందని తేలిందన్నారు. 5 వేల మంది తల్లులు, పిల్లల బొడ్డుతాడులోని రక్త నమూనాలను పరీక్షించి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. -
అడుగు తడబడి అనంతలోకాలకు...
* మంచంపై నుంచి లేవబోతూ కిందపడ్డ గర్భిణి * గర్భస్థ శిశువు సహా కన్నుమూత మలికిపురం : కొద్దిరోజుల్లోనే మంచం మీద తన పక్కనే పొత్తిళ్లలో వెచ్చగా ఒదిగి ఉండే బిడ్డను అపురూపంగా చూసుకుంటూ మురిసిపోవలసిన ఆ తల్లి.. ఆ ముచ్చట తీరకుండానే ఈ లోకాన్ని వీడింది.మంచం మీద నుంచి లేచే ప్రయత్నంలో అడుగు తడబడి, తూలి కిందపడి, తలకు తీవ్రగాయమై ఆమె కన్నుమూసింది. కడుపులోని బిడ్డా కన్ను తెరవకుండానే కడతేరిపోరుుంది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తంలో జరిగిన ఈ విషాదఘటన వివరాలు ఎస్సై విజయబాబు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నారుు.గ్రామానికి చెందిన బుడితి సత్యవతి (24)కి ఏడాది కిందట పెద కందాలపాలెంకు చెందిన యువకునితో పెళ్లరుుంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. గర్భం ధరించిన సత్యవతి పురుడు పోసుకునేందుకు శంకరగుప్తానికే చెందిన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ప్రస్తుతం ఆమెకు 9వ నెల. గురువారం ఉదయమే ఆమె ప్రసవం నిమిత్తం లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటాక సత్యవతి బాత్రూమ్కు వెళ్లేందుకు మంచం నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడింది. దాంతో తలకు తీవ్రగాయమై ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఆమెను తొలుత లక్కవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి రాజోలు ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించమన్నారు.అక్కడికి చేరుకునే సరికే సత్యవతి కడుపులోని బిడ్డతో సహా కన్నుమూసింది. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.