గర్భిణులూ.. జాగ్రత్త! | Pregnant women's Be careful | Sakshi
Sakshi News home page

గర్భిణులూ.. జాగ్రత్త!

Published Sun, Apr 3 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

గర్భిణులూ.. జాగ్రత్త!

గర్భిణులూ.. జాగ్రత్త!

లండన్: గర్భంతో ఉండగా అతిగా తినే మహిళలకో హెచ్చరిక. గర్భస్థ శిశువుకు అవసరానికి మించి, అధిక మొత్తంలో పోషకాహారం అందిస్తే.. ఆ శిశువు యుక్త వయసుకు వచ్చాక ఊబకాయం బారినపడే ప్రమాదముందని ఒక తాజా అధ్యయనంలో తేలింది.

పుట్టిన సమయంలో పిల్లల బరువుకు, 9-17 మధ్య వయసులో శరీరంలో కొవ్వుశాతానికి, నడుము చుట్టుకొలతకు దగ్గరి సంబంధం ఉందని యూకేలోని గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు తెలిపారు. గర్భిణిగా ఉండగా అతిగా పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుల్లో కొవ్వు శాతం పెరుగుతుందని తేలిందన్నారు. 5 వేల మంది తల్లులు, పిల్లల బొడ్డుతాడులోని రక్త నమూనాలను పరీక్షించి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement