University of Glasgow Researchers
-
ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!
లండన్: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘కెంప్యూటర్’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చు. -
గర్భిణులూ.. జాగ్రత్త!
లండన్: గర్భంతో ఉండగా అతిగా తినే మహిళలకో హెచ్చరిక. గర్భస్థ శిశువుకు అవసరానికి మించి, అధిక మొత్తంలో పోషకాహారం అందిస్తే.. ఆ శిశువు యుక్త వయసుకు వచ్చాక ఊబకాయం బారినపడే ప్రమాదముందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. పుట్టిన సమయంలో పిల్లల బరువుకు, 9-17 మధ్య వయసులో శరీరంలో కొవ్వుశాతానికి, నడుము చుట్టుకొలతకు దగ్గరి సంబంధం ఉందని యూకేలోని గ్లాస్గో వర్సిటీ పరిశోధకులు తెలిపారు. గర్భిణిగా ఉండగా అతిగా పోషకాహారం తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువుల్లో కొవ్వు శాతం పెరుగుతుందని తేలిందన్నారు. 5 వేల మంది తల్లులు, పిల్లల బొడ్డుతాడులోని రక్త నమూనాలను పరీక్షించి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.