ఇక ఎక్కడైనా ఔషధ తయారీ! | “Chemputer” may democratise pharmaceutical sector | Sakshi
Sakshi News home page

ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!

Published Tue, Dec 4 2018 4:21 AM | Last Updated on Tue, Dec 4 2018 4:21 AM

“Chemputer” may democratise pharmaceutical sector - Sakshi

లండన్‌: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్‌ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

‘కెంప్యూటర్‌’గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్‌లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్‌ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్‌ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్‌ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్‌ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్‌ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను  రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్‌ రూపంలోకి మార్చుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement