new method
-
నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అమలు
అట్మోర్(అమెరికా): మూడు దశాబ్దాల క్రితం వేయి డాలర్ల సుపారీ తీసుకుని ఒక మహిళను హత్యచేసిన కేసులో దోషికి అమెరికా నూతన పద్ధతిలో మరణశిక్షను అమలుచేసింది. 58 ఏళ్ల కెన్నెత్ ఎజీన్ స్మిత్ స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలాచేసి మరణశిక్షను అమలుచేసింది. ఇలా నైట్రోజన్గ్యాస్ను వాడి దోషికి మరణశిక్షను అమలుచేయడం ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ శిక్షను స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి అమలుచేశారు. అమెరికాలో 1982 ఏడాది నుంచి విషం ఇంజెక్షన్‌తో దోషులకు మరణశిక్షను అమలుచేయం మొదలెట్టాక మరో నూతన శిక్షా విధానాన్ని అమల్లోకి తేవడం ఇదే తొలిసారి. ఎలా అమలుచేశారు?: అట్మోర్ నగరంలోని హోల్మ్యాన్ కరెక్షన్ ఫెసిలిటీలో నైట్రోజన్ హైపోక్సియా శిక్ష అమలు ప్రక్రియను ఐదుగురు మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి చూపించారు. నైట్రోజన్ గ్యాస్ నింపిన సిలిండర్ పైపును దోషి స్మిత్ ముక్కుకు బిగించిన మాస్క్ ద్వారా శరీరంలోకి పంపించారు. స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ అనేది ప్రాణాధారమైన ఆక్సీజన్‌ను శరీరకణాలకు అందకుండా చేస్తుంది. దీంతో కణాలు ఆక్సీజన్ లేక క్షణాల్లోని మృతిచెందుతాయి. దీంతో మరణం సంభవిస్తుంది. రాత్రి 7.53 గంటలకు గ్యాస్‌ను పంపించారు. 8.25 గంటలలోపు అతను మరణించినట్లు ప్రకటించారు. ఏమిటీ కేసు?: చార్లెస్ సెన్సెట్ అనే మతాధికారి 1980లలో భారీగా అప్పులుచేశాడు. భార్యను చంపేస్తే బీమా సొమ్ము వస్తుందని ఆమె హత్యకు పథకం వేశాడు. చార్లెస్ నుంచి సుపారీ తీçసుకుని జాన్ ఫారెస్ట్ పార్కర్, స్మిత్ ఆయన భార్య ఎలిజబెత్‌ను చంపేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చాత్తాపంతో చార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. 2010లో పార్కర్‌కు అమలు శిక్షను అమలుచేయగా తాను నిర్దోషినంటూ ఇన్నాళ్లూ స్మిత్ కోర్టుల చుట్టూ తిరిగారు. జ్యూరీ జీవితఖైదు సిఫార్సుచేయగా జడ్జి ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతవరకూ లేని కొత్త విధానంలో శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వాదనలు నడిచాయి. ఇంతవరకు వాడని, క్రూరమైన, అసాధారణ శిక్షా విధానాన్ని ఎలా అమలుచేస్తారని స్మిత్ లాయర్లు వాదించినా శిక్ష అమలుకే కోర్టు పచ్చజెండా ఊపింది. -
కేన్సర్ కణాలపై అణువుల సుత్తి!
కేన్సర్... పేరు చెప్పగానే మరణం ఖాయమన్న ఆలోచనలు అందరిలోనూ మెదులుతాయి. అయితే అత్యాధునిక టెక్నాలజీ, పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు కేన్సర్ వ్యాధి నిర్వహణ ఎంతో సులువైంది. కాకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న వైద్య పద్ధతులు మూడింటితోనూ బోలెడన్ని సమస్యలు, దుష్ప్రభావాలైతే ఉన్నాయి. అందుకే అతితక్కువ దుష్ప్రభావాలున్న చికిత్స పద్ధతి కోసం శాస్త్రవేత్తలు చాలా చోట్ల పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా రైస్ యూనివర్శిటీ Rice University శాస్త్రవేత్తలు విజయం సాధించారు కూడా. ప్రత్యేకమైన కాంతి, కొన్ని అణువుల సాయంతో 99 శాతం కేన్సర్ కణాలను చంపేయవచ్చునని వీరు నిరూపించారు. ప్రస్తుతం కేన్సర్ చికిత్సకు ప్రధానంగా మూడు రకాల పద్ధతులను ఉపయోగిస్తుంటారు. ► శస్త్రచికిత్స కణితిని తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స(సర్జరీ) ఇది శరీరాన్ని బలహీన పరిచే ప్రక్రియ. ►ఇక రెండోది కీమో థెరపీ ఇందులో రేడియోధార్మిక రసాయనాల సాయంతో శరీరంలోని కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తారు. జుట్టు ఊడిపోవడం, వాంతులు, విరేచనాలు, అలవిగాని అలసట.. ఇలా రకరకాల దుష్ప్రభావాలు తప్పవు. ► మూడో పద్ధతి.. రేడియో థెరపీ రేడియో ధార్మిక పదార్థాలతో నేరుగా కణితులను నాశనం చేసేందుకు వాడే పద్ధతి ఇది కీమోథెరపీతో వచ్చే ఇబ్బందులే ఇక్కడ కూడా కనిపిస్తాయి ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ప్రిసిషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ టార్గెటెడ్ థెరపీ వంటివి మునుపటి పద్ధతుల కంటే కొంత మెరుగ్గా ఉన్నా... శాస్త్రవేత్తలు వీటిపై మరింత పట్టు సాధించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా ఏం చేశారంటే.. చాలా సింపుల్. అమైనో సయనైన్ అణువులు కొన్నింటిని తీసుకున్నారు. పరారుణ కాంతి కిరణాల ద్వారా వాటిని ఉత్తేజపరిచారు. ఫలితంగా ఈ అణువులు కంపించడం మొదలుపెట్టాయి. ఇలా కంపిస్తున్న అణువులను దగ్గరగా ఉంచడం ద్వారా కేన్సర్ కణాల పైపొరలు విచ్ఛిన్నమై నాశనమయ్యేలా చేశారు. అంతే!! ఈ అమైనో సయనైన్ అణువులను శరీరం లోపలి అవయవాల ఫొటోలు తీసేందుకు ఒక రకమైన రంగు మాదిరిగా ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. పరారుణ కాంతి పడినప్పుడు వీటిల్లోని అణువులు ఉత్తేజితమై ప్లాస్మాన్లుగా మారుతున్నాయి. అణువు లోపలే కంపిస్తూ ఉంటాయి. ఈ కంపనాలు కాస్తా కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమయ్యేందుకు కారణమవుతున్నాయి. పరారుణ కాంతి వినియోగానికీ ప్రాముఖ్యత ఉంది. ఈ కాంతి శరీరం లోపలికి దృశ్యకాంతి కంటే లోతుగా చొచ్చుకుపోగలదు. శరీరం లోపలి అవయవాలు మాత్రమే కాకుండా.. ఎముకలకు వచ్చే కేన్సర్లకు కూడా ఈ కాంతి ద్వారా చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నమాట. ఈ పద్ధతి పనితీరుపై రైస్ యూనివర్శిటీ రసాయన శాస్త్రవేత్త జేమ్స్ టూర్ మాట్లాడుతూ.. కంపనాలన్నీ క్రమ పద్ధతిలో ఒకేలా ఉండేలా చేయడం వల్ల కేన్సర్ కణాల పైపొరలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు. ‘‘నిజానికి ఈ పద్ధతిని కేన్సర్‌పై అణువుల సుత్తి దెబ్బ’’ అనాలి అంటారు ఆయన. ఎలుకల్లో కేన్సర్ మాయం.. రైస్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా గాజు పాత్రలో కేన్సర్ కణాలను ఉంచి అమైనో సైనైన్ అణువులను ప్రయోగించారు. ఆశ్చర్యకరమైన రీతిలో 99 శాతం వరకూ కేన్సర్ కణాలు నశించిపోయాయి. మెలనోమా కేన్సర్ కణితులున్న ఎలుకలపై వాడినప్పుడు కూడా కొంత కాలం తరువాత దాదాపు సగం ఎలుకల్లో కేన్సర్ కణాలన్నవి లేకుండా పోయాయి. ఈ పరిశోధనల్లో రైస్ యూనివర్శిటీతోపాటు టెక్సస్ ఏ అండ్ ఎం, యూనివర్శిటీ ఆఫ్ టెక్సస్‌లు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే... నేడో రేపో.. ప్రాణాంతక కేన్సర్‌ను ఎలాంటి దుష్ప్రభావాలు, శస్త్రచికిత్సల అవసరం లేకుండానే నయం చేసుకోవచ్చునన్నమాట!!! -
‘పది’ పరీక్షల్లో సంస్కరణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు కొత్త విధానం అమలు కానుంది. విద్యార్థుల భావవ్యక్తీకరణ, సృజనాత్మకత, భాషా నైపుణ్యాలు, అవగాహన తదితర అంశాలను సమగ్రంగా బేరీజు వేసేలా ఈ విధానాన్ని ప్రభుత్వం రూపుదిద్దింది. ఇందులో బిట్ పేపర్ రద్దు సహా అనేక నూతన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం ఉత్తర్వులు (జీఓ 69) జారీ చేశారు. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో జరగనున్న పరీక్షల నుంచే ఈ నూతన విధానం అమలుకానుంది. ప్రధాన మార్పులు ఇవీ... పరీక్షలలో విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇస్తారు. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. బిట్ పేపర్ వేరేగా ఉండదు. ప్రధాన ప్రశ్నాపత్రంలోనే లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇస్తారు. హిందీ, ఓఎస్సెస్సీ, కాంపోజిట్ తెలుగు తప్ప మిగిలిన అన్ని పరీక్షలకు సమయం 2:30 గంటలు. ప్రశ్నపత్రం చదివేందుకు మరో 15 నిమిషాలు. హిందీ పరీక్షకు 3 గంటలు, ఓఎస్సెస్సీ లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు. సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం స్వరూపం ఇలా ఉంటుంది (50 మార్కులకు) – ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 12 అబ్జెక్టివ్ ప్రశ్నలకు 6 మార్కులు. – 8 అతిలఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కో మార్కు చొప్పున 8 మార్కులు. – 8 లఘు ప్రశ్నలకు ఒకొక్క దానికి రెండేసి మార్కుల చొప్పున 16. – 5 వ్యాస రూప (ఎస్సే) ప్రశ్నలకు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి. –లాంగ్వేజ్, కాంపోజిట్ తెలుగు ప్రశ్న పత్రానికి 3.15 గంటల సమయం ఉంటుంది. –సర్టిఫికెట్లో సబ్జెక్టుల వారీగా, పేపర్ వారీగా గ్రేడులు ఇస్తారు. –సబ్జెక్టుల వారీగా 2 పేపర్లలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఉత్తీర్ణతపై అస్పష్టత ఇలా ఉండగా విద్యార్థుల పాస్ మార్కులపై ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సబ్జెక్టుల వారీగా కాకుండా పేపర్ వారీగా పాస్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పొందుపరిచారు. అయితే దీనిపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయింది. దీని వల్ల విద్యార్థులు ఒక పేపర్లో ఎక్కువ మార్కులు సాధించినా రెండో పేపర్లో పాస్ మార్కులు రాకుంటే ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పాస్ మార్కుల గురించి ప్రస్తావించలేదు. దీంతో పాత పద్ధతిలో సబ్జెక్టుల వారీగానే పాసు మార్కులు ఉంటాయని ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇక ఎక్కడైనా ఔషధ తయారీ!
లండన్: అత్యవసర సమయాల్లో రోగికి అవసరమైన ఔషధం దొరకకపోతే ఎదురయ్యే పరిస్థితి వర్ణనాతీతం. పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఔషధాలు వెంటనే దొరికే అవకాశం ఉన్నా.. కుగ్రామాలు, కొండ ప్రాంతాల్లో అత్యవసరంగా కావాల్సిన ఔషధాలు దొరికే పరిస్థితి లేదు. అయితే ఈ పరిస్థితులు త్వరలో తొలగిపోయే అవకాశాలున్నాయి. ఎక్కడి నుంచైనా ఔషధాలను కంప్యూటర్ సాయంతో తయారుచేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘కెంప్యూటర్’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా సులభంగా, అత్యంత నమ్మదగిన సహజ సిద్ధమైన ఔషధాలను తయారు చేసుకోవచ్చని బ్రిటన్‌లోని గ్లాస్గౌ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ఈ పద్ధతి అందుబాటులోకి వస్తే ఫార్మా రంగంపై కొన్ని కంపెనీల ఆధిపత్యం తగ్గిపోనుందని వారు పేర్కొన్నారు. ఈ కెంప్యూటర్ద్వారా రసాయన సమ్మేళనాల కోడ్‌ను అభివృద్ధి చేసి ఇతరులకు షేర్ చేయవచ్చు. ఈ రసాయన సమ్మేళన కోడ్‌ను అమలు చేసే విధానాన్ని కెంపేలర్ అంటారు. ఈ కెంపేలరే ఔషధాలను రూపొందించే విధానాన్ని వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు సైతం వారు అభివృద్ధి చేసిన రసాయన సమ్మేళనాలనూ డిజిటల్ రూపంలోకి మార్చుకోవచ్చు. -
పరి పరిశోధన
కొత్త కాంక్రీట్‌తో జల సంరక్షణ సులువు! వాన చినుకులన్నీ నేలలోకి ఇంకితే భూగర్భ జలం వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. కానీ.. నగరాల్లో అంగుళం ఖాళీ లేకుండా వేసే కాంక్రీట్ రోడ్ల కారణంగా నీరంతా కొట్టుకుపోతోంది. అయితే వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల కారణంగా ఈ చిక్కు సమస్య త్వరలోనే పరిష్కారం కానుంది. దృఢమైన కాంక్రీట్ ద్వారా కూడా నీళ్లు సులువుగా జారిపోయేలా వీరు ఓ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. ఏటికేడాదీ పెరిగిపోతున్న కార్బన్ ఫైబర్ వ్యర్థాలతోనే ఈ ఘనతను సాధించడం విశేషం. కాంక్రీట్ ద్వారా నీరు కొద్దిమోతాదులో ఇంకేందుకు అవకాశమున్నప్పటికీ ఇది కాస్తా కాంక్రీట్ దృఢత్వంపై ప్రభావం చూపుతుంది. కొద్దికాలానికే కాంక్రీట్ కొట్టుకుపోతుంది. ఈ నేపథ్యంలో కార్ల్ ఇంగ్లండ్, సొమాయా నాసిరీలు కార్బన్ ఫైబర్ వ్యర్థాలతో కొత్త రకం కాంక్రీట్‌ను తయారు చేశారు. ఇది దృఢంగా ఉండటమే కాకుండా సాధారణ కాంక్రీట్ కంటే ఎక్కువ మోతాదులో నీరు భూమిలోకి ఇంకేలా రంధ్రాలు కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పరిశోధన శాలలో ఈ కొత్త కాంక్రీట్ బాగా పనిచేసినప్పటికీ.. సాధారణ పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తుందో పరీక్షించాల్సి ఉందని.. ఆ తరువాత విస్తృత స్థాయి వాడకానికి సిద్ధం చేయవచ్చునని నాసిరీ అంటున్నారు. దెబ్బతిన్న గుండెను సరిచేసేందుకు కొత్త పద్ధతి తోక తెగిపోతే మళ్లీ పెంచుకోగల శక్తి బల్లులకు సొంతం. అలాగే కొన్ని రకాల చేపలు తమ గుండె కణజాలాన్ని మళ్లీ అభివృద్ధి చేసుకోగలవు. మనిషికీ ఇలాంటి శక్తి ఉంటే.. అనేక గుండెజబ్బులకు మెరుగైన, సులువైన చికిత్స సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పనిలోనే ఉన్నారు గ్లాడ్స్టోన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన వివేక్ శ్రీవాస్తవ. మన శరీరంలో కార్డియోమయోసైట్స్ అనే కణాలు కొన్ని ఉంటాయి. పిండ దశలో గుండె ఏర్పడేందుకు గణనీయంగా విభజితమయ్యే ఈ కణాలు.. ఆ తరువాత మాత్రం విభజనకు గురికావు. కార్డియోమయోసైట్స్కు మళ్లీ ఆ శక్తిని అందించేందుకు శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వివేక్ శ్రీవాస్తవ ఇందులో విజయం సాధించారు. జంతువులపై చేసిన ప్రయోగాల్లో కార్డియోమయోసైట్స్ విభజితమవడమే కాకుండా దెబ్బతిన్న గుండె కణజాలాన్ని మరమ్మతు కూడా చేసినట్లు శ్రీవాస్తవ ప్రకటించారు. కార్డియోమయోసైట్స్ విభజనకు సంబంధించి మొత్తం నాలుగు జన్యువులు పనిచేస్తున్నట్లు గుర్తించిన ఈయన వాటిని పూర్తిస్థాయిలో పనిచేసేలా చేయడం ద్వారా కణాలు వేగంగా విభజితమయ్యేలా చేయగలిగారు. కార్డియోమయోసైట్స్ విభజనను కచ్చితంగా నియంత్రించడం ఎలాగో అర్థం చేసుకోవడం ద్వారా ఈ పద్ధతిని మనుషుల్లోనూ ఉపయోగించవచ్చునని, తద్వారా గుండె పనిచేయని స్థితికి చేరుకున్న వారికీ సాంత్వన చేకూర్చడం వీలవుతుందని శ్రీవాస్తవ అంటున్నారు. వెలుగులు ఒడిసి పడతాయి... సూర్యుడి నుంచి వెలువడే వెలుగును వంద శాతం విద్యుత్తుగా మారిస్తే.. ఈ భూమ్మీద పెట్రోలు, డీజిల్ వంటివి అస్సలు అవసరం ఉండదు. కాకపోతే ఎంతటి గొప్ప సోలార్ ప్యానెలైనా కేవలం 25 శాతాన్ని మాత్రమే విద్యుత్తుగా మార్చగలవు. ఈ నేపథ్యంలో జర్మనీలోని బ్రాన్ష్వెగ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన ఆవిష్కరణ చేశారు. అన్ని దిక్కుల నుంచి వెలుతురును తీసుకుని అతితక్కువ ప్రదేశంలోకి కేంద్రీకరించగలిగే సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. వీటిని వరుసగా పేర్చడం ద్వారా సూర్యకిరణాల్లోని అన్నిరకాల కాంతిని విద్యుత్తుగా మార్చవచ్చు. ఈ పరికరం మొక్కల్లో వెలుతురును ఒడిసిపట్టే కణాల మాదిరిగా పనిచేస్తుందని ఫోటాన్లను శోషించుకుని ఇతర కణాలకు చేరవేస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త పీటర్ జోమో వల్లా తెలిపారు. దాదాపు 80 శాతం కాంతిని చిన్న ప్రదేశంలోకి కేంద్రీకరించగల ఈ పరికరాలతో భవిష్యత్తులో అతితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగల సోలార్ కాన్సెంట్రేటర్స్ను తయారు చేయవచ్చునని ఆయన వివరించారు. ప్రస్తుతం తాము నీలిరంగు కాంతిని శోషించుకుని మళ్లించగలిగేలా చేయగలిగామని.. ఇతర రంగులకు కూడా ఈ పద్ధతిని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. -
కృత్రిమ గర్భధారణ విజయవంతానికి కొత్త మార్గం
కృత్రిమ గర్భధారణ పద్ధతులను మరింత ఎక్కువ విజయవంతం చేసేందుకు స్టాన్‌ఫర్డ్, వోర్చెస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు. చురుకుగా, వేగంగా కదిలే శుక్రకణాలను వేరు చేసేందుకు ఓ పరికరాన్ని తయారుచేశారు. దీని పేరు స్పార్టాన్. ఊహూ.. గ్రీకు పురాణాల్లోని వ్యక్తి పేరు కాదు. ‘సింపుల్ పీరియాడిక్ అరే ఫర్ ట్రాపింగ్ అండ్ ఐసొలేషన్’కు సంక్షిప్త నామం ఇది. ఇందులో ఉన్నట్టుగానే ఈ పరికరం వీర్యకణాల్లో చురుకుగా ఉన్న వాటిని గుర్తించి వేరు చేస్తుందన్నమాట. సంప్రదాయ పద్ధతుల్లో వేగవంతమైన శుక్రకణాలను గుర్తించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ స్పార్టాన్... వేగంతోపాటు ఆరోగ్యవంతమైన వాటినీ గుర్తించగలదు. అంతేకాకుండా డీఎన్ఏ సమగ్రత ఉన్న వాటిని కూడా ఈ పద్ధతి ద్వారా ఒక దగ్గరకు చేర్చవచ్చునని, తద్వారా కృత్రిమ గర్భధారణ పద్ధతులతో గర్భం దాల్చే అవకాశాలతోపాటు మరింత ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువవుతాయని శాస్త్రవేత్తల అంచనా. సంప్రదాయ పద్ధతుల ద్వారా కణాలకు జరిగే హానిని కూడా స్పార్టాన్ అడ్డుకుంటుంది. తక్కువ ప్రయత్నాలతోనే గర్భం ధరించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడతుందని, తద్వారా నిస్సంతులకు ఖర్చు కూడా తక్కువవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
రైతు ఎస్సెమ్మెస్ పంపిస్తేనే సబ్సిడీ
– ఎరువుల సబ్సిడీలో కొత్త విధానం – నేరుగా కంపెనీలకు జమ – ఎరువులు కొన్నట్టు రైతు ఎస్ఎంఎస్ పంపిస్తేనే.. – జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు – వచ్చేనెల 1 నుంచి అమలు జంగారెడ్డిగూడెం : ఎరువులకు ఇచ్చే సబ్సిడీపై ప్రభుత్వం కొత్త విధానం అమలుచేయనుంది. తొలుత ఎరువులకు నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం యోచించినా అది సాద్యంకాదని భావించి కొత్త విధానానికి శ్రీకారంచుట్టింది. దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిరే్ధశించింది. వీటిలో రెండు జిల్లాలు రాష్ట్రానికి చెందినవి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కాగా, మరొకటి కృష్ణా జిల్లా. అక్టోబర్ 1 నుంచి సబ్సిడీలపై కొత్త విధానాన్ని అవలంభించాలని ప్రభుత్వం నిరే్ధశించింది. వంటగ్యాస్ లాగానే ఎరువుల సబ్సిడీని రైతుల ఖాతాకు నేరుగా నగదు బదిలీని చేయాలని తొలుత కేంద్రం భావించినా దానిని పక్కన పెట్టింది. అయితే తాజాగా రైతులకు కాకుండా ఆయా ఎరువుల కంపెనీలకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా జమచేసే మొత్తాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం ప్రారంభించనుంది. రైతుకు ఎరువులు చేరిన తరువాతే సబ్సిడీ మొత్తం ఎరువుల కంపెనీల ఖాతాల్లో జమ అవుతుంది. ఈప్రయోగాత్మక పథకం అమలుకు దేశ వ్యాప్తంగా 8 జిల్లాలను గుర్తించింది. దీనిలో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ పథకం ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు, అసలు దేశ వ్యాప్తంగా ఖచ్చితంగా ఎరువుల వినియోగం ఎంత జరుగుతుందో కూడా తెలుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎరువులు పక్కదారి పట్టడం, పక్క రాష్ట్రాలకు తరలి పోవడం, బ్లాక్ మార్కెటింగ్ తదితర అవినీతి మార్గాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎరువులకు ఇచ్చే సబ్సిడీని ఆయా ఎరువుల కంపెనీల నుంచి డీలర్ల ద్వారా రిటైల్ వ్యాపారులకు చేరిన తరువాత కంపెనీ ఇచ్చిన లెక్క ప్రకారం సబ్సిడీని కంపెనీలకు చెల్లిస్తోంది. ఈ విధానంలో ఎరువులు పక్కదారిపట్టడం కారణంగా కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికంగాపడుతున్నట్లు గుర్తించింది. వీటన్నింటిని అరికట్టేందుకు ఇటీవల ఈపోస్ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కొత్త సబ్సిడీ విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంలో రైతులకు అమ్మిన ఎరువులకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుంది. దీనికోసం కంప్యూటర్ ఆధారిత డిజిటల్ నెట్వర్క్ వినియోగిస్తుంది. ఎరువులు అమ్మే సమయంలో రైతుల వివరాలను దీనిలో నమోదు చేయాలి. ఎరువులు కొనుగోలు చేసిన తరువాత రైతు తన మొబైల్‌ఫోన్ ద్వారా ఫెర్టిలైజర్స్ మానిటరింగ్ వ్యవస్థకు ఎస్ఎంఎస్ చేయాలి. ఈ ఎస్ఎంఎస్ అందిన తరువాత ఏ కంపెనీ ఎరువు ఏ రైతు ఎంతకు కొన్నాడో ఆ కంపెనీకి ప్రభుత్వం సబ్సిడీని జమచేస్తుంది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈపోస్ వ్యవస్థను ఏర్పాటు చేయగా , తాజాగా కొత్త విధానం కూడా అమలులోకి తేనుంది. దీనికి రైతు ఆధార్ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు రైతులు, కౌలు రైతులు, అన్ని రకాల రైతులు కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నారు. ఖరీఫ్సీజన్లో 1.64 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తుండగా, రబీ సీజన్లో 2.33 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు. కాగా జిల్లాలో ప్రై వేట్డీలర్లు, సొసైటీల ద్వారా ఎరువులు సరఫరా , డీసీఎంఎస్ ద్వారా ఎరువుల సరఫరా మొత్తం అందరూ కలిపి 1160 మంది డీలర్లు ఉన్నారు. కొత్తవిధానం అమలు సాధ్యమేనాః ఎరువుల సబ్సిడీ లో కొత్త విధానం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పనేనా అని పలువురు సందేహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల్లో అంతగా చదువుకున్న వారు తక్కువగా ఉంటారని, రైతులందరికీ ఎరువులు కొనుగోలు చేసిన తరువాత ఎస్ఎంఎస్ పంపేందుకు సెల్ఫోన్లు ఉంటాయన్నది ప్రశ్నార్ధకమే. దీనికోసం రైతులకు సెల్ఫోన్లు కూడా సమకూర్చాల్సి ఉంటుంది. అంతేగాక ఎక్కువ శాతం కౌలురైతులే ఉంటారు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొన్నారు. -
లంగ్ క్యాన్సర్ చికిత్సలో నూతన విధానం
టొరంటో: ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి చికిత్సలో నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు గురువారం అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వివిధ అవయవాలకు సంభవించే క్యాన్సర్ వ్యాదుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌కు సంబంధించిన మృతుల్లో సుమారు 25 శాతం మృతులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ, రష్యాకు చెందిన ఐటీఎంవో యూనివర్సిటీ. యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీలు సంయుక్తంగా లంగ్ క్యాన్సర్ కణాలపై నిర్వహించిన ప్రయోగంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పరిశోధనకు సంబంధించి మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎమ్మా విన్సెంట్ మాట్లడుతూ.. క్యాన్సర్ కణాల జీవక్రియ సాధారణ కణాలతో పోల్చినప్పుడు విభిన్నంగా ఉంటుందని తెలిపారు. అయితే క్యాన్సర్ కణాలు 'పిఈపీసీకే' అనే జన్యువును ఉపయోగించుకొని వాటియొక్క విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎంజైమ్‌ను గుర్తించడం ద్వారా లంగ్ క్యాన్సర్ కణాల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలిపారు.