టొరంటో: ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి చికిత్సలో నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు గురువారం అమెరికన్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. వివిధ అవయవాలకు సంభవించే క్యాన్సర్ వ్యాదుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్కు సంబంధించిన మృతుల్లో సుమారు 25 శాతం మృతులు ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులే కావడం గమనార్హం. అమెరికాకు చెందిన మెక్గిల్ యూనివర్సిటీ, రష్యాకు చెందిన ఐటీఎంవో యూనివర్సిటీ. యూకేకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీలు సంయుక్తంగా లంగ్ క్యాన్సర్ కణాలపై నిర్వహించిన ప్రయోగంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
పరిశోధనకు సంబంధించి మెక్గిల్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ పరిశోధకుడు ఎమ్మా విన్సెంట్ మాట్లడుతూ.. క్యాన్సర్ కణాల జీవక్రియ సాధారణ కణాలతో పోల్చినప్పుడు విభిన్నంగా ఉంటుందని తెలిపారు. అయితే క్యాన్సర్ కణాలు 'పిఈపీసీకే' అనే జన్యువును ఉపయోగించుకొని వాటియొక్క విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ ఎంజైమ్ను గుర్తించడం ద్వారా లంగ్ క్యాన్సర్ కణాల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలిపారు.