హ్యూస్టన్: కాస్త వయసు మీదపడితే కీళ్ల నొప్పులు పెట్టే ఇబ్బంది అంతాఇంతా కాదు. అడుగుతీసి అడుగు వేయడానికే వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. ఇక మెట్లెక్కడమంటే వారికి నరకం కనిపిస్తుంది. అయితే ఇలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. తేలు విషం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పైగా ఎటువంటి దుష్ఫలితాలు కూడా ఉండవని భరోసా ఇస్తున్నారు.
ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధకుల్లో ఒకరైన క్రిస్టియన్ బీటన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఫైబ్రోబ్లాస్ట్ లైక్ సినోవైయోసైట్స్(ఎఫ్‌ఎల్‌ఎస్) కణాలు ఈ వ్యాధిలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ కణాలు పెరిగి.. ఒకచోటు నుంచి మరోచోటుకు కదిలినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుందని, ఈ కణాల కారణంగానే కొన్నిసార్లు కీళ్లు దెబ్బతింటాయన్నారు.
ఈ కణాలు రోగనిరోధక శక్తి కలిగించే కణాలను కూడా ఆకర్షించి, నాశనం చేస్తాయని తెలిపారు. తాజా చికిత్సలో తేలు విషయంలో ఉండే పొటాషియం కంపోనెంట్ ఎఫ్‌ఎల్‌ఎస్ కణాలను నిర్వీర్యం చేస్తుందని, ఫలితంగా ఇతర కణాలకు ఎటువంటి హాని కలగకుండానే వ్యాధి నయమవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment