scorpion
-
తేలు విషం ఖరీదు ఎంతో తెలుసా?
కొన్ని రోజుల క్రితం పాముల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషాన్ని సేకరించడం కోసమే వాటిని పెంచుతారు. ఇప్పుడు తాజాగా తేళ్ల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక గదిలో తేళ్లను పెంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. నిజానికి తేలు కరిస్తే, అది మరణానికి కూడా దారి తీస్తుంది. తేలు విషం ప్రాణాంతకం. అందుకే ఎవరైనాసరే తేళ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఒకేచోట కొన్ని వేల తేళ్లు కనిపిస్తే ఎలా ఉంటుంది? అవును.. ఇటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తేళ్లను ప్రత్యేక అరలలో ఉంచి పెంచుతుండటం కనిపిస్తుంది. వాటికి ఆహారం వేయడాన్ని కూడా చూడవచ్చు. తేళ్ల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలమీదకు వస్తుంది. ఇంతకీ తేళ్లను ఎందుకు పెంచుతారు? వీటి వలన ఉపయోగాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఔషధాల తయారీ తేళ్లను రెండు ప్రయోజనాల కోసం పెంచుతారు. మనిషిని చంపగల తేలు విషాన్ని అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తారు. తేలు విషాన్ని క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక వ్యాధులలో వినియోగిస్తారు. వాటి విషాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. పలు దేశాలలో తేళ్లను తింటారు. కాగా ఒక్కో తేలు ప్రతిరోజూ 2 మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని తేళ్ల పెంపకందారులు ఎంతో జాగ్రత్తగా సేకరిస్తారు. తేలు విషం లీటరు ధర 10 మిలియన్ డాలర్లు (రూ. 74 కోట్ల 15 లక్షలు) తేలు విషాన్ని సౌందర్య సాధనాల తయారీలోనూ ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు కొన్ని మిలియన్ల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని ఏలుతున్న భారత సంతతి నేతలు Did you know? Scorpions farms do exist. Each scorpion produces about 2 milligrams of venom daily, which is milked using a pair of tweezers and tongs. A liter is worth $10 million, used for cosmetics and medicines [📹 King Scorpion / efre812]pic.twitter.com/PGdbpdpG8h — Massimo (@Rainmaker1973) September 2, 2023 -
ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. గత నెల 23వ తేదీన నాగ్‌పూర్–ముంబై విమానంలో ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు తాజాగా ఎయిరిండియా తెలిపింది. విమానం ల్యాండయిన వెంటనే బాధిత ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించినట్లు తెలిపింది. ఆమె అనంతరం డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. సదరు విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు జరిపి, ఒక తేలును పట్టుకున్నారు. క్షుణ్నంగా పరిశీలించాకే విమానంలోకి వస్తు, సామగ్రిని తీసుకురావాలని క్యాటరింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్లో కాలికట్ నుంచి బయలుదేరి దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన ఎయిరిండియా కార్గో విమానంలో పాము కనిపించింది. -
షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే
సాక్షి,ముంబై: విషపూరిత జీవుల్లో ఒకటి తేలు. తేలు కుడితే వచ్చే బాధ వర్ణనా తం. అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి తేలు విషం ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్‌గా నిలుస్తుండటం విశేషం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల తేళ్లను పెంచుతూ వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. మార్కెట్లో దీని విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెడతారు. దాదాపు లీటరుకు వందకోట్ల రూపాయలకు పై మాటే. అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్ తేలు విషం భారీ ఖరీదు పలుకుతోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం డెత్‌స్టాకర్ అనే తేలు విషంలో మనుషులకి ప్రాణాంతకం కాదు గానీ, అంతకుమించిన మంచి గుణాలున్నాయి. 2021 నాటికి విషం చుక్క ధర 130 డాలర్లు. 4 లీటర్ల డెత్ స్టాకర్ జాతికి చెందిన తేలు విషం ధర 320 కోట్ల రూపాయలుగా ఉంది. ఒక తేలు ఒకసారి రెండు మిల్లీగ్రాముల విషాన్ని మాత్రమే ఇస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. బ్రిటానికా డాట్ కాం ప్రకారం, డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం గ్యాలన్ ధర 39 మిలియన్ల డాలర్లు. గ్యాలన్ విషంకోసం 2.64 మిలియన్ల సార్లు విషం తీయాలి లేదంటే 27 లక్షల తేళ్లనుండి విషాన్ని సేకరిస్తే ఒక గాలన్ నిండుతుందన్నమాట. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన తేలు డెత్‌స్టాకర్ తేళ్లు నార్త్ ఆఫ్రికానుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎడారి ప్రాంతాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సహారా, అరేబియన్, థార్ సెంట్రల్, సెంట్రల్ ఏషియా ఎడార్లు జీవిస్తుంటాయి. వీటి విషంలో న్యూరో టాక్సిన్స్, క్లారోటాక్సిన్స్.. క్యారిబ్డోట్యాక్సిన్స్, సిల్లాటాక్సిన్స్, ఏజిటాక్సిన్స్ ఉంటాయి. అంతేకాదు ఈ విషాన్ని సేకరించిందేందుకు ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తారు. తేళ్ల కొండిలకు పరికరం ద్వారా విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పుడు వాటంతట అవే విడుదల చేసే విషాన్ని సేకరిస్తారు. ప్రాణం పోసే విషం! ఎందులో వాడతారంటే? ఈ తేలు విషాన్ని క్యాన్సర్ కణితులను గుర్తించడంలోనూ, మలేరియా చికిత్సలో కూడా ఉపయోగిస్తారట. అందుకే దీనికి ఇంత డిమాండ్. అలాగే మెదడు కణితుల చికిత్సల, డయాబెటీస్ నివారణలోనూ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెత్‌స్టాకర్ స్కార్పియన్స్ విషంలో ఉండే క్లోరోటాక్సిన్ని కొన్నిరకాల క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, క్యాన్సర్ గడ్డలుఎక్కడ, ఏపరిమాణంలో ఉన్నాయో గుర్తించవచ్చట. అయితే డెత్‌స్టాకర్ స్కార్పియన్ విషం ప్రాణాంతకమైంది కాదు. ఇది కుడితే భయంకరమైన నొప్పి ఉంటుంది తప్పితే ఆరోగ్యకరమైన వయోజనులను చంపేంత విషపూరితమైంది కాదని స్వయంగా పరిశోధకులు వెల్లడించారు. కానీ పిల్లలు, వయోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' కార్ల ప్రపంచం.. ఓ లుక్కేసుకోండి!
భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు చాలామందికి తెలుసు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నిజ జీవితంలో ఎలాంటి కార్లను కొనుగోలు చేశారు, ఎలాంటి కార్లను వినియోగిస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం ఇక్కడ ప్రత్యేక కథనం. మహీంద్రా బొలేరో ఇన్వాడెర్: ఆనంద్ మహీంద్రా యుక్త వయస్సులో కొనుగోలు చేసిన కారు మహీంద్రా బొలేరో ఇన్వాడెర్. ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ. బొలేరో ఇన్వాడెర్ లైఫ్ స్టైల్ ఎస్యూవీ కావున సాఫ్ట్ రూఫ్ పొందుతుంది. ఇది 2.5 లీటర్ డీజల్ ఇంజన్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ కార్లు రోడ్లమీద కనిపించడం చాలా అరుదు. మహీంద్రా టియూవీ300: ఆనంద్ మహీంద్రా 2015లో టియూవీ300 కొనుగోలు చేశారు. డిజైన్ పరంగా చాలా సాలిడ్‌గా ఉన్నప్పటికీ పనితీరులో ఉత్తమంగా ఉంటుంది. మహీంద్రా టియూవీ300 అధికారిక 'ఆర్మీ' యాక్సెసరీ ప్యాక్, బోనెట్‌పై ఉండే హుల్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్, బ్లాక్ కలర్లో చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ యుద్ధ వాహనం మాదిరిగా కనిపిస్తుంది. మహీంద్రా టియూవీ300 ప్లస్: ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో ఉన్న కార్లలో టియూవీ300 ప్లస్ ఒకటి. దీనికి 'గ్రే ఘోస్ట్' అని పేరు పెట్టుకున్నారు. ఇది స్పెషల్ స్టీల్ వైట్ కలర్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మోడల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా చెప్పినట్లు సమాచారం. మహీంద్రా స్కార్పియో: ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగిన స్కార్పియో, ఆనంద్ మహీంద్రాను కూడా ఆకర్శించింది. ప్రస్తుతం స్కార్పియో కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఆనంద్ మహీంద్రా ఉన్న కారు పాత మోడల్. ఈయన ఎక్కువ రోజులు ఈ కారునే వినియోగించారని కొంతమంది చెబుతున్నారు. మహీంద్రా ఆల్టురాస్ జి4: ఆల్టురాస్ జి4 కూడా ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో చేరిన కార్లలో ఒకటి. ఇటీవల ఇందులోని కొన్ని వేరియంట్స్ నిలిపివేయబడినప్పటికి ఒకప్పుడు దేశీయ మార్కెట్లో విజయవంతంగా ముందుకు సాగింది. ఇది ప్రీమియమ్ ఆల్టురాస్ జి4 మహీంద్రా ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. ఈ కారుకి 'బాజ్' అనే పేరు ఉంది. 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్: గత సంవత్సరం ఆనంద్ మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేసి తన గ్యారేజిలో చేర్చారు. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు కాగా టాప్ మోడల్ ధర రూ. 23.90 లక్షలు. ఇది మొత్తం 25 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారుకి ఆనంద్ మహీంద్రా 'భీమ్' అని పేరు పెట్టుకున్నారు. -
ప్రాణం పోసే విషం.. లీటర్‌కు రూ.84 కోట్లు
సాధారణంగా విషం అంటే ప్రాణాలు తీసేది. పాములు, తేళ్లు, సాలీళ్లు ఇలా ఎన్నో రకాల జీవుల్లో విషం ఉంటుంది. కానీ అదే విషం కొన్నిసార్లు ప్రాణాలు కాపాడే ఔషధం కూడా. అలాంటిదే ‘డెత్‌స్టాకర్’ తేలు విషం. అత్యంత ప్రమాదకరమైన ఈ విషం ద్రవ పదార్థాల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైనది కూడా. మరి దీని విశేషాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ‘ విషం నుంచే ఔషధం తేలు కుట్టిందంటే మంటతో విలవిల్లాడిపోతాం. కుట్టిన తేలును బట్టి కొన్నిసార్లు అస్వస్థత పాలవడం, మరికొన్నిసార్లు అయితే ప్రాణాలు పోవడం కూడా జరుగుతుంది. దీనికి కారణం తేలు కొండిలోని విషం. అందులోని న్యూరో ట్యాక్సిన్లు. అంటే మన శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు. ఈ న్యూరో ట్యాక్సిన్లలో కొన్నిరకాలను అసాధారణ వైద్య చికిత్సల్లో వినియోగిస్తుంటారు. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. ‘ మెదడు కేన్సర్ చికిత్సలో.. భూమ్మీద ఉన్న తేళ్లన్నింటిలోనూ ‘డెత్‌స్టాకర్’ తేళ్లు అత్యంత విషపూరితమైనవి. ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఈ తేళ్లు రెండు నుంచి ఆరేళ్ల పాటు బతుకుతాయి. పది సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. వీటి విషంలో ‘క్లోరోట్యాక్సిన్’గా పిలిచే అత్యంత అరుదైన రసాయన పదార్థంతోపాటు మరికొన్ని ముఖ్యమైన న్యూరోట్యాక్సిన్లు ఉంటాయి. ఈ క్లోరోట్యాక్సిన్ మెదడులోని కేన్సర్ కణితులు మరింతగా విస్తరించకుండా అడ్డుకుంటుంది. అంతేగాకుండా మెదడులో కేన్సర్ సోకిన కణాలకు మాత్రమే అతుక్కుపోతుంది. దీనివల్ల వైద్యులు సర్జరీ చేసి కేన్సర్ సోకిన భాగాన్ని/కణాలను పూర్తిగా తొలగించేందుకు వీలవుతుంది. సాధారణంగా సర్జరీ తర్వాత కేన్సర్ కణాలు ఏమైనా మిగిలి ఉంటే.. వాటి వల్ల మళ్లీ కేన్సర్ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. క్లోరోట్యాక్సిన్ను మార్కర్‌గా వాడటం వల్ల ఈ సమస్య తప్పుతుంది. ‘ అత్యంత విలువైన విషం! ‘డెత్‌స్టాకర్’ తేలు విషం ధర ఒక లీటర్‌కు సుమారు రూ.84 కోట్లు (కోటి డాలర్లకుపైనే..). ఎందుకంత ధర అంటే.. ఈ విషంలో అత్యంత అరుదైన న్యూరోట్యాక్సిన్ ఉండటం, సేకరణ అత్యంత కష్టమైన పని అవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటమే. ఒక తేలు నుంచి ఒకసారి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే వస్తుంది. అంటే ఒక లీటర్ విషం కావాలంటే 10 లక్షల తేళ్ల నుంచి విషం సేకరించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల ఈ రకం తేళ్లను పెంచుతూ.. వాటి నుంచి విషాన్ని సేకరించి విక్రయిస్తుంటారు. ‘ప్రత్యేకంగా పరికరాన్ని రూపొందించి.. మామూలుగా తేళ్ల నుంచి విషం సేకరించడం కోసం.. మొదట వాటికి స్పల్ప స్థాయిలో కరెంట్ షాక్ ఇచ్చి, వాటి విష గ్రంధులను పరికరాలతో నొక్కుతారు. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తేళ్లు గాయపడటం, విష గ్రంధులు పగిలిపోవడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో మొరాకో శాస్త్రవేత్తలు తేళ్ల విషం సేకరణకోసం ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. తేళ్లను మెల్లగా పట్టుకుని, వాటి కొండిలను పరికరంలో పెడతారు. కొండిలోని విష గ్రంధుల వద్ద అతి సున్నితంగా కరెంట్ షాక్ ఇవ్వడం ద్వారా వాటంతట అవే విషాన్ని విడుదల చేస్తాయి. అవి గాయపడటం ఉండదు, ఎక్కువ విషం సేకరించవచ్చు. ‘ పాముల విషం నుంచి కూడా.. పాములు, తేళ్ల విషంలో ఉండే న్యూరోట్యాక్సిన్లు, ఇతర రసాయన పదార్థాలు మన శరీరంలోని నాడీ వ్యవస్థ, ఇతర అవయవాలపై ప్రత్యేకమైన ప్రభావం చూపుతాయి. ఒక్కో రకం జీవిలో భిన్నమైన రసాయన పదార్థాలు ఉంటాయి. వాటితో భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పాములు, తేళ్లు, ఇతర జీవుల విషం నుంచి సరికొత్త ఔషధాల అభివృద్ధికి పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ రకాల కేన్సర్లు, అధిక రక్తపోటు, గుండెపోటు, అల్జీమర్స్, పార్కిన్సన్స్, సుదీర్ఘకాలం బాధించే నొప్పులు వంటి సమస్యలకు పరిష్కారాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. -
రెక్కల తేల్ల గురించి విన్నారా..!
నేల మీద పాక్కుంటూ వచ్చే తేలును చూడగానే.. గుండె ఆగినంత పనవుతుంది. కనీసం ఆ పేరు విన్నా.. ఆగకుండా ఆమడదూరం పరుగుతీస్తాం. నేల మీద పాకే తేలుకే అంత భయపడితే .. రెక్కలు కట్టుకుని ఎరిగే తేలు కనిపిస్తే? ప్రాణాలు గాల్లో కలిసిపోవూ అంటారా? అయితే ఈ చిత్రాన్ని గమనించండి. ఇది ఎగిరే తేలు. కంగారు పడకండి.. ప్రమాదకరం కాదు. చూడ్డానికి అచ్చం తేలులా ఉండే ఈ ప్రాణి పేరు స్కార్పియన్ ఫ్లై. ఇదో కీటకం. తూనీగలు, కందిరీగల జాతికి చెందినది. వీటిలో మగ స్కార్పియాన్ ఫ్లైకి పొట్ట, జననాంగం పొడవుగా సాగి తేలు కొండిలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎగురుతుంటే అచ్చం తేళ్లలాగే కనిపిస్తాయి. ఇవి విషపూరితం కావు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎంతయినా ప్రకృతిలోని వింతలు.. వైవిధ్యాలను చూడతరమా! -
కొండలరాయుడికి తేళ్ల నైవేద్యం..
కోడుమూరు రూరల్:ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను సమర్పించి కోరికలుకోరుకుంటారు. కోడుమూరులో కొండమీద వెలసిన శ్రీ కొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ఏటా శ్రావణమాసం మూడవ సోమవారం ఈ ఆచారాన్ని కోడుమూరు వాసులు దశాబ్దాలుగా కొనసాగిçస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు భయపడిపోతారు. ఈ కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి భయం లేకుండా చేతులతో పట్టుకొని శ్రీ కొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టూ్ట మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. సోమవారం సాయంత్రం వందలాది మంది ప్రజలు కాలినడకన కొండపైకి చేరుకొని కొండలరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది కొండపైకి వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తేలు విషంతో కీళ్ల నొప్పుల నివారణ?
వినేందుకు కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ.. తేళ్ల విషయంలోని పదార్థాలతో ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించారు ఫ్రెడ్ హుచిట్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో తేలు విషంలోని ఓ బుల్లి ప్రొటీన్ కీళ్ల తాలూకు మంట/వాపు లను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారి మంట/వాపులను తగ్గించేందుకు ఇప్పటికే కొన్ని మందులు ఉన్నప్పటికీ వాటితో దుష్ప్రభావాలు ఎక్కువ. స్టెరాయిడ్లను వాడటం వల్ల శరీరం మొత్తం సమస్యలకు లోనవుతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే, బరువు పెరిగే అవకాశాలూ ఎక్కువ. ఒకటికంటే ఎక్కువ కీళ్లలో నొప్పులు ఉన్నవారికి ఈ దుష్ప్రభావాలను తట్టుకోవడం కష్టమవుతుందని, ఈ సమస్యను అధిగమించేందుకు తాము చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నామని డాక్టర్ జిమ్ ఓల్సన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నాలుగేళ్ల క్రితం తాము దుష్ప్రభావాలు లేని మందు కోసం తేలు, సాలీడు విషాల్లోని సుమారు పెప్టైడ్లను పరిశీలించినప్పుడు ఒక పెప్టైడ్ కార్టిలేజ్‌లోనే సహజంగా పెరుగుతున్నట్లు గుర్తించామని ఓల్సన్ తెలిపారు. ఈ పెప్టైడ్తో మెరుగైన చికిత్స కల్పించవచ్చునని గుర్తించి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, ఆపెప్‌టైడ్ ఆర్థరైటిస్ లక్షణాలను విజయవంతంగా నయం చేసిందని వివరించారు. అయితే ఈ ప్రొటీన్ ఆధారంగా కొత్త మందులు తయారు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. -
విమానంలో మహిళకు భయంకర అనుభవం!
అట్లాంటా: విమానంలో ప్రయాణించేటపుడు కొన్ని అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రయాణికులు బెంబేలెత్తిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయంకర అనుభవం ఎదురు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. వివరాలు.. ఓ మహిళ గురువారం ఉదయం పూట శాన్ఫ్రాన్సిస్కో నుంచి అట్లాంటా బయలు దేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ తేలు ఆమె కాలిపై అదేపనిగా కాట్లు వేసింది. దీంతో మహిళకు నొప్పి భరించలేకుండా ఉండటంతో బాత్రూంలోకి వెళ్లింది. ఇంకా ఏదో కుడుతున్నట్టుగా అనిపించడంతో మహిళ ప్యాంటు చెక్ చేసుకోగా.. అందులో నుంచి ఓ తేలు బయటపడింది. అది కూడా సజీవంగా ఉండటంతో ఆమె భయభ్రాంతులకు లోనైంది. ఈ క్రమంలో ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. విమానం ల్యాండ్ అయ్యాక సదరు మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక బాధితురాలికి విమానంలోనే ప్రాథమిక చికిత్స అందించామని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఆ మహిళ క్షేమంగా ఉంది. -
తేలు కుట్టి.. యువతి మృతి
తిరువళ్లూరు: తేలు కుట్టిన యువతికి చిక్సిత ఫలించకపోవడంతో మృతి చెందింది. తిరువళ్లూరు జిల్లా వెన్మనంబుదూర్ గ్రామానికి చెందిన సుధాకర్ కుమార్తె సాధన(19). గత నెల 10వ తేదీ తేలుకాటుకు గురయ్యింది. వెంటనే ఆమెను చిక్సిత కోసం తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నై వైద్యశాలకు తరలించగా, అక్కడ చిక్సిత పొందుతూ మంగళవారం రాత్రి 12 గంటలకు మృతి చెందింది. -
తేలుతో సరదా
మామూలుగా ఎవరైనా తేలు కనిపిస్తే భయంతో వణికిపోతారు. దొరికిన వస్తువుతో దానిని కొట్టి చంపుతారు. పొరపాటున తేలు కుట్టిందా ఆ నొప్పిని భరించడం ఎవరి తరం కాదు. ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా ఒకరోజంతా నొప్పే. కానీ అలాంటి తేలును కూడా ఒకరోజు పూజిస్తారు. కర్ణాటక ,రాయచూరు రూరల్: దేశవ్యాప్తంగా నాగపంచమి రోజున నాగదేవతకు పూజలు నిర్వహిస్తే యాదగిరి తాలూకాలోని కందకూరు గ్రామంలో కొండమాయి తేలు దేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన గ్రామంలో కొండమీద ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిæస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన తేళ్లు ఎక్కడపడితే అక్కడ దర్శనంమిస్తాయి. ఎర్ర తేలు, ఇనుప తేలు వంటి విషపూరితమైన తేళ్లు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. గ్రామ ప్రజలు కుల, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు, పిల్లలు ఈ తేళ్లను ఏమాత్రం భయం లేకుండా పట్టుకునేందుకు పోటీ పడుతుంటారు. పాములు కనిపిస్తే వాటిని సైతం మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. హాని తలపెట్టవట ఈ రోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, అవి కాటు వేసినా కొండమాయి దేవి విభూతిని పెట్టుకుంటే చాలు నయం అవుతుందనేది ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ విషయంపై గ్రామ ప్రజలను విచారించగా పంచమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం« ద్వారా ఇక్కడి ప్రజలకు ఏ విష జంతువూ హాని చేయదన్నారు. ఈ పండుగను వందలాది సంవత్సరాల నుంచి ఆచరిçస్తూ వస్తున్నారు. భక్తులు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామంతో పాటు చుట్టు పక్కల అనేక కొండలు ఉన్నా కొండమాయి దేవి కొండపై మాత్రం ఏ రాతిని కదిలించినా తేళ్లు దర్శనం ఇవ్వడం విశేషం. -
వామ్మో.. బీరు సీసాలో తేలు
పరకాల: బీరు సీసాలో తేలు అవశేషాలు కనిపించిన ఘటన పరకాల పట్టణంలోని ఓ వైన్స్షాపులో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటన మద్యం ప్రియులను కలవరానికి గురి చేసింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల ఆర్టీసీ డిపో సమీపంలోని వెంకటేశ్వర వైన్స్‌లో రాకేష్ ఓ కంపెనీకి చెందిన లైట్ బీరు కొనుగోలు చేశాడు. సీసా నలుపు రంగులో ఉండటంతో సీసాలోని బీరు మొత్తం పూర్తయ్యేంత వరకు తేలు ఉన్న విషయాన్ని గమనించలేకపోయాడు. బీరు సీసా అడుగు భాగంలో తేలు కనిపించడంతో విషయాన్ని వైన్స్ యాజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి ఆ యాజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. తాము ఏమైనా తయారు చేశామా అని షాపు యాజమాని అనటంతో కొద్ది సేపు మద్యం కొనుగోలు దారులతో గొడవ జరిగింది. తేలు అవశేషాలు ఉన్న బీరు త్రాగటంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు. ఘటనను పరకాల ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తాము విచారణ జరుపుతామని అధికారులు తెలపడంతో గొడవ సద్దుమణిగింది. అసలే వేసవి కాలం..బీరు పట్ల ఎక్కువగా ఇష్టపడే మద్యం ప్రియులు బీరు సీసాలో తేలు రావడంతో అయోమయానికి గురయ్యారు. -
తేలుకాటుకు విద్యార్థిని మృతి
చిత్తూరు, సదుం: బాగా చదివి ప్రయోజకురాలు కావాలన్నది ఆ విద్యార్థిని కల. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎంతగానో తపన పడేది. ఎంతో ఇష్టంతో కష్టపడి చదివేది. కానీ విధి చిన్నచూపు చూసింది. తేలుకాటు రూపంలో మృత్యువు ఆ బాలిక ప్రాణాలను బలిగొంది. వివరాలు.. మండలంలోని సజ్జలవారిపల్లెకు చెందిన పార్థసారథి, సుగుణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన వైష్ణవి (15) సదుం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్న వైష్ణవి ఆదివారం రాత్రి కరెంటు పోవడంతో ఆవరణలోకి వచ్చి చీకట్లో కూర్చొంది. అక్కడే ఆరబెట్టిన చింతకాయలలో ఉన్న తేలు ఆమెను కాటు వేసింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పీలేరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తరలించారు. తిరుపతి స్విమ్స్‌లో వైష్ణవి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మంగళవారం ఆమె మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, రాజు, నాగరాజారెడ్డి, ఉపాధ్యాయులు సందర్శించి నివాళులు అర్పించారు. వైష్ణవి చదువులో ఎంతో చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. -
యాదగిరి జిల్లాలో తేళ్ల జాతర
కర్ణాటక, యశవంతపుర : నాగపంచమి రోజు పుట్టలకు, నాగవిగ్రహలకు పూజలు చేయటం అనవాయితీ. అయితే ఇక్కడి ప్రజలు తేళ్లను పట్టకుని ఒంటిపై వేసుకుని ఒక పండుగలా జరుపుకుంటారు. నాగపంచమి పండుగ సందర్భంగా యాదగిరి జిల్లా గురుమఠకల్ తాలూకా కందకూరు గ్రామంలో గుట్టలో ఉన్న కొండమ్మదేవి జాతర సందర్భంగా అక్కడికి తేళ్ల అధిక సంఖ్యలో వచ్చి చేరుకుంటాయి. భక్తులు వాటిని పట్టకుని ఒంటిపై పాకేలా చేస్తారు. ఇలా చేస్తే రోగాలు దరి చేరవని వారి నమ్మకం. ఈ జాతర యాదగిరి జిల్లాలో విశేషంగా జరుగుతుంది. కొండమ్మదేవికి, తేళ్లకు ప్రత్యేక పూజలు భక్తులు తమ కోరికలను తీర్చుకోవటం అనవాయితీ. -
తేలు విషంతో కూడా చికిత్స..
హ్యూస్టన్: కాస్త వయసు మీదపడితే కీళ్ల నొప్పులు పెట్టే ఇబ్బంది అంతాఇంతా కాదు. అడుగుతీసి అడుగు వేయడానికే వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. ఇక మెట్లెక్కడమంటే వారికి నరకం కనిపిస్తుంది. అయితే ఇలాంటివారికి శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. తేలు విషం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పైగా ఎటువంటి దుష్ఫలితాలు కూడా ఉండవని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధకుల్లో ఒకరైన క్రిస్టియన్ బీటన్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఫైబ్రోబ్లాస్ట్ లైక్ సినోవైయోసైట్స్(ఎఫ్ఎల్ఎస్) కణాలు ఈ వ్యాధిలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ కణాలు పెరిగి.. ఒకచోటు నుంచి మరోచోటుకు కదిలినప్పుడు తీవ్రమైన నొప్పి కలుగుతుందని, ఈ కణాల కారణంగానే కొన్నిసార్లు కీళ్లు దెబ్బతింటాయన్నారు. ఈ కణాలు రోగనిరోధక శక్తి కలిగించే కణాలను కూడా ఆకర్షించి, నాశనం చేస్తాయని తెలిపారు. తాజా చికిత్సలో తేలు విషయంలో ఉండే పొటాషియం కంపోనెంట్ ఎఫ్ఎల్ఎస్ కణాలను నిర్వీర్యం చేస్తుందని, ఫలితంగా ఇతర కణాలకు ఎటువంటి హాని కలగకుండానే వ్యాధి నయమవుతుందని చెప్పారు. -
తేలు కుట్టినా ఏమీ కాదంటా..!
కోడుమూరు: సాధారణంగా విష పురుగులైన తేళ్లను చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఈరోజు (మూడో శ్రావణ సోమవారం) కోడుమూరు వాసులు ఏమాత్రమూ భయం లేకుండా తేళ్లను పట్టుకున్నారు. వాటిని చేతులపై, తలపై, నాలుకపై ఉంచుకొని నృత్యాలు చేశారు. ఈరోజు తేలు కుట్టినా ఏమీ కాదని, ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే విషప్రభావం తగ్గిపోతుందని వారు తెలిపారు. అదే మిగతా రోజుల్లో అయితే సమస్య వస్తుందని చెప్పారు. శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని కోడుమూరు సమీపంలోని కొండపై వేడుకను వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ఇష్టదైవమైన కొండలరాయుడి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తేళ్లను పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ వేడుక ఆనవాయితీగా జరుగుతోంది. ఈసారి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఫ్రాన్స్ దృష్టికి ‘స్కార్పిన్’ వ్యవహారం
పత్రాల లీక్‌పై దర్యాప్తు చేయాలని కోరిన భారత్ న్యూఢిల్లీ : స్కార్పిన్ జలాంతర్గాముల రహస్య పత్రాల లీక్ వ్యవహారాన్ని ఫ్రాన్స్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మమెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు భారత నౌకాదళం గురువారం తెలిపింది. ఈ లీక్ వ్యవహారం తీవ్రతను గుర్తించి దర్యాప్తు చేయాలని ఫ్రాన్స్‌ను కోరింది. భద్రత విషయంలో రాజీపడలేదనడానికి అంతర్గత మ దింపు చర్యలు చేపట్టామని ఒక ప్రకటనలో భార త నౌకాదళం పేర్కొంది. ఆ పత్రాల లీక్ విదేశా ల నుంచే జరిగిందని నొక్కి చెప్పింది. ఆస్ట్రేలియ న్ న్యూస్ ఏజెన్సీ వెబ్సైట్లో పెట్టిన పత్రాలు పరిశీలించగా.. భద్రతలో రాజీపడినట్లు ఏమీలేదని పేర్కొంది. లీక్ అయినట్లు చెబుతున్న 22,400 పేపర్లలో కొన్నింటిని మాత్రమే ఆస్ట్రేలియన్ పత్రిక బయటపెట్టింది. సున్నితమైన రహస్య సమాచారం బహిర్గతమైనట్లు వచ్చిన వార్తల ప్రామాణికత ఎంత అనేది దౌత్య మార్గాల ద్వారా సంబంధిత దేశాల నుంచి తెలుసుకుంటామని భారత నేవీ పేర్కొంది. రక్షణ మంత్రిత్వ శాఖ, నేవీ ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా భద్రతా రాజీ వ్యవహారం ఏమైనా బహిర్గతమైతే దాని ప్రభావం తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో నేవీ పేర్కొంది. వరుస సమావేశాలు.. లీకేజీ తర్వాత రక్షణ శాఖలో వరస సమావేశాలు జరుగుతున్నాయి. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, ఇతర అధికారులు రక్షణ మంత్రి పరీకర్‌కు తాజా సమాచారం చేరవేస్తున్నారు. లీక్‌ల నిగ్గు తేల్చడానికి అవసరమైతే విదేశాలకు ఒక బృందాన్ని పంపనున్నారు. మరిన్ని లీకేజీ పత్రాలు విడుదల స్కార్పిన్ నిర్మాణం, వ్యవస్థకు సంబంధించిన మరిన్ని లీకేజీ డాక్యుమెంట్లను ‘ద ఆస్ట్రేలియన్’ పత్రిక గురువారం విడుదల చేసింది. భారత నౌకాదళ ముద్రతో ఉన్న డాక్యుమెంట్లు వీటిలో ఉన్నాయి. లీకేజీతో భారత తీరప్రాంత భద్రత ప్రమాదంలో ఉందని వెల్లడించింది. కాగా, దేశ భద్రత విషయంలో రాజీపడేంత విషయమేమీ లేదని.. నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నేవీ వెబ్సైట్లలో ఉన్న వాటినే ఆస్ట్రేలియన్ పత్రిక ప్రచురించిందన్నారు. -
తేలుకాటుతో విద్యార్థిని మృతి
పెద్దవంగలి(చాగలమర్రి): తేలుకాటుతో 3వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. పెద్దవంగలి గ్రామానికి చెందిన చాపల మాబుబాషా, బీబీ దంపతుల రెండో కుమార్తె సమీరా(8) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం గ్రామంలోని మదర్సాకు వెళ్తూ మక్నా(స్కాఫ్)ను తలపై ధరించింది. దీంతో స్కాఫ్లో ఉన్న తేలు సమీరా కంటి కణితి భాగంలో కాటు వేసింది. విష ప్రభావంతో సొమ్మసిల్లి పడి పోయిన చిన్నారిని కుటుంబీకులు చాగలమర్రి కేరళా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం మృతి చెందింది. విద్యార్థిని మృతి చెందిన విషయం తెలసుకుకొన్న ఎంఈఓ అనురాధ, హెచ్ఎం శేషాద్రి, ఉపాధ్యాయులు, విద్యార్థులు చిన్నారి మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. అలాగే గ్రామ సర్పంచ్ కళ్యాణి, విద్యాకమిటీ చైర్మన్ మహబూబ్‌బాష, గ్రామ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. సమీరా విద్యతో పాటు క్రీడల్లో రాణించేదని పాఠశాల హెచ్ఎం తెలిపారు. -
తాటిచెట్టుపై తేలు కుట్టి కిందపడిన గీత కార్మికుడు
చికిత్స పొందుతూ మృతి రఘునాథపల్లి : తాటి చెట్టుపై తేలు కుట్టడంతో ఆ నొప్పి భరించలేక తొందరగా ది గుతున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతిచెందిన సంఘటన రఘునాథపల్లిలో శనివారం జరిగింది. గ్రా మానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు(38) గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిలో భాగంగా రోజులాగే నాగరాజు శని వారం ఉదయం శివారులోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్నాడు. చెట్టుపై ఉన్న తేలు నాగరాజు మెడపైపడి కుట్టింది. వెంటనే దానిని చేతితో దులుపగా అది కాలుపైన పడి మరోసారి కుట్టింది. ఆ బాధలో తొందరగా తాటిచెట్టు దిగుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి కిందపడ్డాడు. నేలపై తల బలంగా తాకడంతో మెడ నరాలు దెబ్బతిని నాగరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహచర గీత కార్మికులు వెంటనే 108లో రఘునాథపల్లి పీహెచ్‌సీకి తరలిం చారు. ప్రథమ చికిత్స అనంతరం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కొద్దిసేపటికే నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మృతితో భార్య నర్మ ద, కుమార్తెలు రమ్య, రచన, రుచిత అనా«థలయ్యారు. వారు అతడి మృతదేహంపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించించి. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, టీఆర్ఎస్ నేత రాజారపు ప్రతాప్, గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.