భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి దాదాపు చాలామందికి తెలుసు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే ప్రముఖ పారిశ్రామికవేత్తగా పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఈయన నిజ జీవితంలో ఎలాంటి కార్లను కొనుగోలు చేశారు, ఎలాంటి కార్లను వినియోగిస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వారికోసం ఇక్కడ ప్రత్యేక కథనం.
మహీంద్రా బొలేరో ఇన్వాడెర్:
ఆనంద్ మహీంద్రా యుక్త వయస్సులో కొనుగోలు చేసిన కారు మహీంద్రా బొలేరో ఇన్వాడెర్. ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ. బొలేరో ఇన్వాడెర్ లైఫ్ స్టైల్ ఎస్‌యూవీ కావున సాఫ్ట్ రూఫ్ పొందుతుంది. ఇది 2.5 లీటర్ డీజల్ ఇంజన్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ మోడల్ కార్లు రోడ్లమీద కనిపించడం చాలా అరుదు.
మహీంద్రా టియూవీ300:
ఆనంద్ మహీంద్రా 2015లో టియూవీ300 కొనుగోలు చేశారు. డిజైన్ పరంగా చాలా సాలిడ్‌గా ఉన్నప్పటికీ పనితీరులో ఉత్తమంగా ఉంటుంది. మహీంద్రా టియూవీ300 అధికారిక 'ఆర్మీ' యాక్సెసరీ ప్యాక్, బోనెట్‌పై ఉండే హుల్, రూఫ్ మౌంటెడ్ యాక్సిలరీ ల్యాంప్, బ్లాక్ కలర్లో చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ యుద్ధ వాహనం మాదిరిగా కనిపిస్తుంది.
మహీంద్రా టియూవీ300 ప్లస్:
ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో ఉన్న కార్లలో టియూవీ300 ప్లస్ ఒకటి. దీనికి 'గ్రే ఘోస్ట్' అని పేరు పెట్టుకున్నారు. ఇది స్పెషల్ స్టీల్ వైట్ కలర్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ మోడల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా చెప్పినట్లు సమాచారం.
మహీంద్రా స్కార్పియో:
ఒకప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగిన స్కార్పియో, ఆనంద్ మహీంద్రాను కూడా ఆకర్శించింది. ప్రస్తుతం స్కార్పియో కొత్త మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ ఆనంద్ మహీంద్రా ఉన్న కారు పాత మోడల్. ఈయన ఎక్కువ రోజులు ఈ కారునే వినియోగించారని కొంతమంది చెబుతున్నారు.
మహీంద్రా ఆల్టురాస్ జి4:
ఆల్టురాస్ జి4 కూడా ఆనంద్ మహీంద్రా గ్యారేజిలో చేరిన కార్లలో ఒకటి. ఇటీవల ఇందులోని కొన్ని వేరియంట్స్ నిలిపివేయబడినప్పటికి ఒకప్పుడు దేశీయ మార్కెట్లో విజయవంతంగా ముందుకు సాగింది. ఇది ప్రీమియమ్ ఆల్టురాస్ జి4 మహీంద్రా ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. ఈ కారుకి 'బాజ్' అనే పేరు ఉంది.
2022 మహీంద్రా స్కార్పియో-ఎన్:
గత సంవత్సరం ఆనంద్ మహీంద్రా స్కార్పియో-ఎన్ కొనుగోలు చేసి తన గ్యారేజిలో చేర్చారు. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు కాగా టాప్ మోడల్ ధర రూ. 23.90 లక్షలు. ఇది మొత్తం 25 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త కారుకి ఆనంద్ మహీంద్రా 'భీమ్' అని పేరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment