- చికిత్స పొందుతూ మృతి
తాటిచెట్టుపై తేలు కుట్టి కిందపడిన గీత కార్మికుడు
Published Sun, Jul 31 2016 1:52 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
రఘునాథపల్లి : తాటి చెట్టుపై తేలు కుట్టడంతో ఆ నొప్పి భరించలేక తొందరగా ది గుతున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతిచెందిన సంఘటన రఘునాథపల్లిలో శనివారం జరిగింది. గ్రా మానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు(38) గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిలో భాగంగా రోజులాగే నాగరాజు శని వారం ఉదయం శివారులోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్నాడు. చెట్టుపై ఉన్న తేలు నాగరాజు మెడపైపడి కుట్టింది. వెంటనే దానిని చేతితో దులుపగా అది కాలుపైన పడి మరోసారి కుట్టింది. ఆ బాధలో తొందరగా తాటిచెట్టు దిగుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి కిందపడ్డాడు. నేలపై తల బలంగా తాకడంతో మెడ నరాలు దెబ్బతిని నాగరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహచర గీత కార్మికులు వెంటనే 108లో రఘునాథపల్లి పీహెచ్‌సీకి తరలిం చారు. ప్రథమ చికిత్స అనంతరం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కొద్దిసేపటికే నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మృతితో భార్య నర్మ ద, కుమార్తెలు రమ్య, రచన, రుచిత అనా«థలయ్యారు. వారు అతడి మృతదేహంపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించించి. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, టీఆర్‌ఎస్ నేత రాజారపు ప్రతాప్, గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
Advertisement
Advertisement