Palm tree
-
నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?
నడిచే చెట్ల గురించి విన్నారా?. ఔను! మీరు వింటుంది నిజమే!. ఈ చెట్లు నిజంగా నడుస్తాయి అది కూడా సూర్యకాంతిని వెతుక్కుంటూ నడుస్తాయట. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?. నిజం నడిచేలా వాటి చెట్ల ఆకృతి కూడా అందుకు తగ్గట్టుగా ఉంటుంది. పైగా అలా నడిస్తే భూమిలో ఉన్న వేరు తెగిపోతుంది లేదా దాంతోపాటు ఎలా కదులుతుంది అని కదా డౌటు. అయితే ఆ చెట్టు ఎలా నడుస్తుంది? ఎలా కదులుతుందో సవివిరంగా చూద్దాం!. ఈ రకం చెట్టు దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్లను సక్రాటియా ఎక్సరిజా అంటారు. వాటి మూలాలు సూర్యకాంతి దిశగా పెరుగుతాయి. అందువల్ల ఇవి నడుస్తాయట. ఇవి అచ్చం తాటి చెట్టు మాదిరిగా ఉండే ప్రత్యేకమైన చెట్లు. ఏడాదికి సుమారుగా 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయని లెక్కించారు శాస్త్రవేత్తలు. దీని వ్యాసం 16 సెం.మీ ఉంటుందని చెప్పారు. వాస్తవానికి తాటి చెట్టు వేళ్లు ఎక్కువగా నేలలోపలికి చొచ్చుకుని ఉంటాయి. ఈ చెట్లకి మాత్రం వాటి వేర్లు భూమికి వెలుపల చీపురి ఆకృతిలో ఉంటాయి. ఈ ప్రత్యేక రకం తాటి చెట్లు నడుస్తున్నప్పుడు వాటికి ఉన్న పాత వేర్లు ఊడిపోవడం(నశించిపోవడం) జరుగుతుందట. ఇలా అవి రోజుకి రెండు నుంచి 3 సెం.మీ వరకు నడుస్తాయని చెబుతున్నారు నిపుణులు. అలా ఏడాదికి ఈ చెట్టు సుమారు 20 మీటర్ల దూరం వరకు నడుస్తాయని అంచనా వేశారు. ఇలాంటి చెట్లు దట్టమైన అడవుల్లోనే ఉంటాయని చెబుతున్నారు. ఇది నిజంగా అత్యంత విచిత్రంగా ఉంది కదూ!. సూర్యరశ్మిని అనుసరిస్తూ కదలడం అలా ఏకంగా కొంత దూరం వరకు నడవడం అనేది శాస్త్రవేత్తలకు ఓ అంతు చిక్కని మిస్టరీలా ఉంది. View this post on Instagram A post shared by Advancible (@advancible) (చదవండి: ఆ ఊరిలో నాలుగొందలకు పైగా ఇళ్లు ఉన్నాయ్! కానీ సడెన్‌గా..) -
తాటిచెట్టుపై విలవిల్లాడిన గీత కార్మికుడు.. ప్రాణాలకు తెగించి కాపాడి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): మండలంలోని దుమాలలో ఓ గీత కార్మికుడు కల్లు గీయడానికి బుధవారం తాటి చెట్టుపైకి ఎక్కి మోకు జారడంతో అక్కడే చిక్కుకొని రెండు గంటల పాటు విలవిల్లాడాడు. చివరికి మరో గీతకార్మికుడి సాహసంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దుమాల గ్రామానికి చెందిన ఆరేటి రాములు ఎప్పట్లాగే కల్లు గీసేందుకు బుధవారం ఉద యం తాటి చెట్టు ఎక్కాడు. కల్లు గీసే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నడుంపైనున్న మోకు భుజాలపైకొచ్చింది. దీంతో పట్టు తప్పి చెట్టుపైనే తలకిందులుగా వేలాడ సాగాడు. సమీపంలోని తోటి గీత కార్మికుడు ఆరేటి పర్శరాములు ప్రాణాలకు తెగించి చెట్టు పైకెక్కాడు. రాములు భుజం వద్ద ఉన్న మోకు ను సరిచేసి నడుంకు కట్టి కిందకు దించాడు. రాములును కాపాడిన పర్శరాములును సర్పంచ్ కదిరె రజిత, మండల ఉపాధ్య క్షుడు కదిరె భాస్కర్, గ్రామస్తులు అభినందించారు. చదవండి: సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు.. ఐదు జిల్లాల్లో పర్యటన -
తాటిచెట్టుపై 6 గంటలు తలకిందులుగా..
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువన గిరి జిల్లాలో శుక్రవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడుకి ముస్తాదు ఊడిపోవడంతో కాళ్లుపైకి తల కిందికి వేలాడుతూ ఆరుగంటల పాటు నరక యాతన అనుభవించాడు. సంస్థాన్ నారా యణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగోని మాసయ్య కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మాసయ్య శుక్రవారం ఆలస్యంగా 9గంటల ప్రాంతంలో కల్లు తీసేందుకు అదే గ్రామానికి చెందిన వీరమళ్ల దానయ్య పొలంలోని తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మాసయ్య ముస్తాదు ఊడిపోవడంతో మోకు, గుత్తిపై తలకిందు లుగా వేలాడాడు. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వచ్చి పెద్ద క్రేన్ సహాయంతో మాసయ్యను కిందికి దించారు. అప్పటికే అతడి ఎడమకాలు, చేయి చచ్చుబడ్డాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మాసయ్య ఆరు గంటల పాటు చెట్టుపైనే నరకయాతన అనుభవించారు. అధిక రక్తపోటుతో పక్షవా తం రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ఆహా ఏమి రుచి.. తేగలు తినడం వల్ల లాభాలివే..
సాక్షి, పశ్చిమగోదావరి: శీతాకాలంలో లభించే తేగలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ ఉండ్రాజవరం మండలంలో పలు గ్రామాల్లో తేగల రుచి బావుంటుందని ప్రజలు భావిస్తారు. ఉండ్రాజవరం మండలంలో పాలంగి, చివటం, ఉండ్రాజవరం, దమ్మెన్ను, వేలివెన్నుతో పాటు పెరవలి మండలం కానూరు, ముక్కమల, పెరవలి, అన్నవరప్పాడు తదితర గ్రామాల్లో తేగల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో తేగలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. తేగ బాగా ఊరటంతో పాటు రుచిగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. నిడదవోలు నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలు ఏటా ఈసీజన్లో తేగల విక్రయాలతో ఉపాధి పొందుతున్నారు. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు తేగల విక్రయాలు జోరుగా సాగుతాయి. పెద్ద సైజు తేగల కట్ట రూ.50 నుంచి రూ.100, చిన్న సైజు తేగల కట్ట రూ.20 వ్యాపారులు విక్రయిస్తున్నారు. తేగల ధర అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. తేగలను కుండల్లో పెట్టి కాలుస్తున్న దృశ్యం తేగల తయారీ విధానం మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో తాటిచెట్లు నుంచి తాటికాయలు తయారైన తరువాత వాటిని సేకరించి నేలలో గుంతలు తీసి పాతర వేస్తారు. అవి మొలకలు వచ్చి తేగలు తయారువు తాయి. ఇవి ఏటా నవంబర్ నాటికి సిద్ధమవుతాయి. ఆతరువాత పాతర నుంచి తేగలను నుంచి తాటి బుర్రలను వేరే చేస్తారు. తేగలను మట్టి కుండల్లో పెట్టి కాలుస్తారు. తరువాత వాటిని కట్టలు కడతారు. వీటిని స్థానిక దుకాణాల్లో, హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తారు. ఈఏడాది తేగల వ్యాపారం మార్కెట్ ఆశాజనకంగా ఉందని విక్రయదారులు అంటున్నారు. లాభాలు తాటి కాయల నుంచి మనకు లభించే ఈ తేగల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణశక్తి మెరుగ య్యేందుకు తేగలు దోహదపడతాయని కొనుగోలుదారుల నమ్మకం. తేగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తేగలు తింటే బరువు తగ్గడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. -
ఉరి తాడైన మోకు.. చెట్టుపైనే గీతకార్మికుడి మృత్యువాత
టేకుమట్ల (రేగొండ): ఉపాధికి ఊతమిచ్చిన మోకు ఓ గీతకార్మికుడి పాలిట ఉరితాడై ఉసురు తీసింది. పొద్దున్నే ఇంటి నుంచి తాటివనానికి బయలుదేరిన అతడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. వివరాలు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన బండి కొమురెల్లి(58) అనే గీత కార్మికుడు కల్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం గ్రామ సమీపంలోని తాటి వనంలోకి వెళ్లి చెట్టు ఎక్కాడు. వర్షాలకు చెట్టు తడిసి ఉండటంతో కల్లు వంచుకుని కిందికి దిగే క్రమంలో మోకు పట్టుజారింది. దీంతో పైనుంచి కిందకు పడుతుండగా, అతని మెడకు ఉరి మాదిరిగా మోకు బిగుసుకుంది. దీంతో చెట్టుపైనే కొమురెల్లి ప్రాణాలు విడిచాడు. చదవండి: పత్తి, మిరప సహా ఖరీదైన విత్తనాలతోనే అక్రమ వ్యాపారం -
చెట్టును ఇలా కట్ చేస్తారా?!
-
బాబోయ్ చెట్టును ఇలా కట్ చేస్తారా?!
భయానక దృశ్యం. ఆకాశమంత ఎత్తులో ఉన్న తాటి చెట్టును ఓ వ్యక్తి నరికేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమెరికన్ మాజీ బాస్కెట్ బాల్ ఆటగాడు రెక్స్ చాప్మన్ ట్విటర్లో శుక్రవారం షేర్ చేశాడు. ఈ వీడియోకు ‘ఎవరైన అతి పొడవాటి తాటి చెట్టును నరకడం చూశారా’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి ఈ అతి పెద్ద తాటి చెట్టు కొనవరకు ఎక్కాడు. అయితే చాలా పొడవుగా ఉండటంతో అతడు ఎక్కాగానే ఆ చెట్టు కిందకు వంగింది. (చదవండి: ఏరులై పారిన రెడ్‌వైన్.. మందుబాబులు షాక్) అయినా అతడు చెట్టుపై కుర్చోని తాటి చెట్టు కొన భాగాన్ని కత్తిరించడంతో కొమ్మలు ఊడి కిందపడ్డాయి. దీంతో వెంటనే ఆ చెట్టు ఆటూ ఇటూ గాలిలో ఊగుతుండటం చూసి ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. అయితే అతడు చెట్టునే గట్టిగ పట్టుకుని అలాగే ఉండటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. 34 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 6.6 మిలియన్ వ్యూస్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఆ వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. ‘ఆ వ్యక్తి చెట్టు నుంచి ఎగిరిపోతాడనుకునే వారు చేతులు ఎత్తండి’, ‘బాబోయ్ ఇది ఎంత ప్రమాదకరంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: వైరల్: అతడు ముక్కు కత్తిరించేసుకున్నాడు!) -
ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.
ముంబై : ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది. రాష్ట్రంలో ఒకపక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే.. మరోపక్క భారీ వర్షాలు అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులతో పాటు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ముంబై భారీ వర్షాలపై ట్విటర్లో స్పందించారు. (కొడుకు మరణం: అందుకే సబ్వే సర్ఫర్స్..) Of all the videos that did the rounds yesterday about the rains in Mumbai, this one was the most dramatic. We have to figure out if this palm tree’s Tandava was a dance of joy—enjoying the drama of the storm—or nature’s dance of anger... pic.twitter.com/MmXh6qPhn5 — anand mahindra (@anandmahindra) August 6, 2020 'బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్ చేసినట్లుగా కనిపించాయి. గాలి బీభత్సం చూస్తే.. ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది. మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నెటిజన్లు షేర్ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్ డ్రామాటిక్ వీడియోగా నిలిచింది.' అంటూ కామెంట్ చేశారు. మరోవైపు నెటిజన్లు ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం మహీంద్రా కామెంట్స్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. This was send on my family group chat featuring some classic gujju uncle commentary #MumbaiRains #MumbaiRainsLive #MumbaiRain pic.twitter.com/elQ2w4j0iR — Zara Patel (@zarap48) August 5, 2020 కాగా ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలో ప్రజారవాణా సేవలు అన్ని స్తంభించాయి. ఎక్కడి ట్రాఫిక్ అక్కడ నిలిచిపోయింది. వర్షాలు అధికంగా కురుస్తుండటంలో ముంబై, పుణెలో రెడ్అలర్ట్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షాన్ని రికార్డు చేసింది. 1974 తర్వాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. #WATCH A local in Wadala area of #Mumbai carries a kitten on his motorcycle after rescuing it, amid heavy rainfall in the city. He says, "I am taking the kitten home." pic.twitter.com/4qawgwJQzP — ANI (@ANI) August 6, 2020 -
ఇప్పుడే వస్తానన్నావ్ కదా డాడీ...
గూడూరు(మహబూబాబాద్) : ఇప్పుడే వస్తానని కుటుంబసభ్యులతో చెప్పి కల్లుగీసేందుకు వెళ్లిన అరగంటలో ఓ గీతకార్మికుడు తాటిచెట్టు ఎక్కి గుండెపోటుకు గురై చెట్టుపైనే మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో గురువారం జరిగింది. రాంపెల్లి సాంబయ్య(42) కల్లు గీసేందుకు ఇంటి సమీపంలో సెల్ టవర్ పక్కనున్న తాటిచెట్టును ఉదయం ఎక్కాడు. సగానికి పైగా చెట్టు ఎక్కిన తర్వాత హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో చెట్టుపైనే మోకు, గుజికి వేలాడుతుండగా ప్రధాన రహదారిలో వెళ్తు న్న వారు చూసి వెళ్లి పిలిచారు. అప్పటికే మృతి చెంది వేలాడుతున్నాడు. మృతుడి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. విష యం తెలిసి మండలకేంద్రంతోపాటు చుట్టుపక్క ల గ్రామాల ప్రజలు వచ్చి చూసి విలపించారు. ఇప్పుడు వస్తానన్నావ్ కదా డాడీ... మృతుడి భార్య మంజుల, కూతురు సుమనశ్రీ చెట్టు మధ్యలో వేలాడుతున్న సాంబయ్య మృతదేహాన్ని చూసి రోదించారు. ‘ఇప్పుడు వస్తాను.. టవర్ పక్కనున్న చెట్టెక్కివస్తా బిడ్డా.. అని వెళ్లావు కద డాడీ...’ అంటూ కూతురు రోదిస్తూ తల్లి మంజులను ఓదార్చుతుండటం పలువురిని కంటతడి పెట్టించింది. సీఐ బి.రమేష్‌నాయక్, ఎస్సై ఎస్కే.యాసిన్ చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని కిందకు దింపారు. మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
తాటిచెట్టుపై తేలు కుట్టి కిందపడిన గీత కార్మికుడు
చికిత్స పొందుతూ మృతి రఘునాథపల్లి : తాటి చెట్టుపై తేలు కుట్టడంతో ఆ నొప్పి భరించలేక తొందరగా ది గుతున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతిచెందిన సంఘటన రఘునాథపల్లిలో శనివారం జరిగింది. గ్రా మానికి చెందిన ఎర్రోళ్ల నాగరాజు(38) గీత వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిలో భాగంగా రోజులాగే నాగరాజు శని వారం ఉదయం శివారులోని తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్నాడు. చెట్టుపై ఉన్న తేలు నాగరాజు మెడపైపడి కుట్టింది. వెంటనే దానిని చేతితో దులుపగా అది కాలుపైన పడి మరోసారి కుట్టింది. ఆ బాధలో తొందరగా తాటిచెట్టు దిగుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి కిందపడ్డాడు. నేలపై తల బలంగా తాకడంతో మెడ నరాలు దెబ్బతిని నాగరాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సహచర గీత కార్మికులు వెంటనే 108లో రఘునాథపల్లి పీహెచ్‌సీకి తరలిం చారు. ప్రథమ చికిత్స అనంతరం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ కొద్దిసేపటికే నాగరాజు మృతి చెందాడు. నాగరాజు మృతితో భార్య నర్మ ద, కుమార్తెలు రమ్య, రచన, రుచిత అనా«థలయ్యారు. వారు అతడి మృతదేహంపై పడి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించించి. ఎస్సై రంజిత్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైస్ ఎంపీపీ మల్కపురం లక్ష్మయ్య, టీఆర్ఎస్ నేత రాజారపు ప్రతాప్, గౌడ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. -
ఏడాదంతా తాటి నీరా ఉత్పత్తి!
ఉద్యాన శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ - ప్రకృతిసిద్ధమైన పోషకాలున్న హెల్త్ డ్రింక్ తాటి నీరా - ఇప్పుడు తాటి ‘మగ, ఆడ కాడల’ నుంచి 7-8 నెలలు తీస్తున్నారు - మిగతా 4 నెలలు కూడా తాటి కాయల నుంచి నీరా తీయొచ్చంటున్న శాస్త్రవేత్తలు - నీరాను ఐస్ బాక్సుల్లో సేకరించి సీసాల్లో నింపి అమ్మొచ్చు - ఖరీదైన తాటి బెల్లం, తాటి చక్కెర తయారీతో అధికాదాయం పొందొచ్చు - గీత కార్మికులకు, తాటి చెట్లున్న రైతులకు ఏడాదంతా ఆదాయం తాటి కాయల నుంచి జాలువారే ఆరోగ్యదాయకమైన పోషక జలం ‘నీరా’ ఇక ఏడాది పొడవునా తాజాగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తూ. గో. జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు పీ సీ వెంగయ్య, జీ ఎన్ మూర్తి, కే ఆర్ ప్రసాద్ దీనికి సంబంధించిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలను ఈ వ్యాసం ద్వారా ‘సాగుబడి’ పాఠకులకు అందిస్తున్నారు. నాణ్యమైన నీరాను ఏడాది పొడవునా ప్రత్యేక ఐస్ బాక్స్‌ల ద్వారా సేకరించే పద్ధతిని ఈ సీనియర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నీరాను సీసాల్లో నింపి మార్కెటింగ్ చేయొచ్చు. కుటీర ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఔషధ విలువలున్న ఖరీదైన తాటి బెల్లాన్ని, చక్కెరను కూడా ఏడాదంతా తయారు చేయొచ్చు. గీత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది. పొలాల్లో, గట్లపైన తాటి చెట్లను పెంచుతున్న రైతులకు గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. ఈత చెట్ల నుంచి వర్షాకాలంలో నీరా తీయడం కష్టం. కానీ, తాటి చెట్ల నుంచి ఏడాదంతా తీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెట్టుబడి లేని తాటి తోటల పెంపకానికి ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని ఆశిద్దాం.. - సాగుబడి డెస్క్ గ్రామీణ భారతంలో తాటి చెట్టుకు విశిష్ట స్థానం ఉంది. ఈ చెట్టులో పనికిరాని భాగమంటూ లేదు. ముఖ్యంగా పూరిళ్ల నిర్మాణంలో వీటి పాత్ర వెలలేనిది. వేసవి తాపాన్ని తీర్చే తాటి ముంజలు, కల్లు వంటివాటిని ఎరుగని వారుండరు. మన దేశంలో 14 కోట్ల తాటి చెట్లున్నాయి. తమిళనాడులో అత్యధికంగా 6 కోట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 5 కోట్ల తాటి చెట్లున్నాయని అంచనా. ఇన్నాళ్లూ గీత కార్మికులు తాటి చెట్టు కాడల నుంచి నీరాను లేదా కల్లును జనవరి నుంచి మే నెల వరకు తీస్తున్నారు. అయితే, తాటి కాడల నుంచి కాకుండా కాయల నుంచి తీస్తే ఏడాది పొడవునా నీరాను తీసుకునే వినూత్న పద్ధతి మా పరిశోధనా కేంద్రంలో జరిపిన తాజా పరిశోధనల ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముదిరిన తాటి కాయల నుంచి నీరాను తీయడం ద్వారా ప్రజలకు పోషకవిలువలు కలిగిన ఆరోగ్యదాయకమైన పానీయం నీరా, తాటి బెల్లం తదితర ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. గీత కార్మికులకు ఏడాదంతా ఉపాధి, అధికాదాయం లభిస్తుంది. తాటి చెట్లు కలిగి ఉన్న రైతులకు కౌలు రూపంలో అధికాదాయం లభిస్తుంది. పన్నెండేళ్లు నిండిన తాటి చెట్టుకు కొద్ది సంఖ్యలో గెలలు రావడం ప్రారంభమవుతుంది. పాతికేళ్లు నిండిన చెట్ల (తాటి చెట్టు వందేళ్లకు పైగా కాయలు కాస్తుంది)కు పూర్తిస్థాయిలో 15-20 గెలలు వస్తాయి. పక్వానికి వచ్చిన తాటి చెట్టు ద్వారా ప్రతి నెలా రూ. 8 వేల మేరకు.. ఏడాది పొడవునా ఆదాయం పొందే అవకాశాలు ఇప్పుడున్నాయి. తాటి గెలల నుంచి ఊరే తాజా రసాన్ని నీరా అంటారు. తాజా నీరా మంచి వాసన, స్వచ్ఛమైన రంగులో తియ్యగా ఉంటుంది. ఇది మత్తును కలిగించదు. ఇది ఆరోగ్యవంతమైన హెల్త్ డ్రింక్. నీరా పులిస్తే కల్లుగా మారుతుంది. ఇది మత్తును కలిగిస్తుంది. తాటి గెలకు బదులు కాయల నుంచి నీరా.. తాటి చెట్టు నుంచి లభించే ఉత్పత్తుల్లో నీరా అతి ముఖ్యమైనది. తాటి చెట్లకు కాయలు రాక మునుపు తాటి కాడల నుంచి నీరా లేదా కల్లు తీయడం ఆనవాయితీ. మగ కాడల నుంచి అక్టోబర్/నవంబర్ నుంచి జనవరి/ఫిబ్రవరి వరకు, ఆడ కాడల నుంచి ఫిబ్రవరి/మార్చి నుంచి మే/జూన్ వరకు.. ఏడాదికి చెట్టుకు 300 నుంచి 600 లీటర్ల వరకు నీరా తీస్తున్నారు. అయితే, తాటి కాయల నుంచి కూడా జూన్ నుంచి సెప్టెంబర్/అక్టోబర్ వరకు నీరా తీయొచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఇక ఏడాది పొడవునా, చెట్టుకు ఏడాదికి 600 లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల వరకు నీరా ఉత్పత్తి చేయొచ్చని నిర్థారణ అయింది. ఈ విధానంలో ముదిరిన గెలలో అట్టడుగున ఉన్న తాటి కాయకు తొలుత గాటు పెట్టి నీరా సేకరిస్తారు. తర్వాత క్రమంగా పైనున్న కాయలకు గాటు పెట్టుకుంటూ మొత్తం గెలలోని అన్ని కాయల నుంచి నీరాను సేకరిస్తారు. ఒక మనిషి రోజుకు 12-15 చెట్ల నుంచి నీరాను సేకరించగలడు. తాటి కాయల నీరాలో పోషకాలెక్కువ.. గెల నుంచి తీసిన నీరాలో కన్నా.. కాయల నుంచి తీసిన నీరాలో పోషక విలువలు ఎక్కువ. ఆరోగ్యానికి మేలు చేసే మాంసకృత్తులు, చక్కెర, ఇనుము, నత్రజని, భాస్వరం, కాల్షియం, తయామిన్, విటమిన్లు వంటి పలు పోషకాలు అధిక పరిమాణంలో ఉండి టానిక్‌లా పనిచేస్తుంది. ఖర్జూరా, కొబ్బరి, జీరిక చెట్ల నుంచి లభించే ఆహారోత్పత్తుల్లో కన్నా నీరాలో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. చక్కెర శాతం సుమారు 12-15 వరకు ఉంటుంది. ఆడ చెట్ల నుంచి సేకరించే నీరాలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. నీరాతో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బసం, రక్తహీనత వంటి వ్యాధులను నివారిస్తుంది. క్షయవంటి రోగాలను పోగొడుతుంది. పులియని నీరాను శీతల పానీయంగా ఉపయోగిస్తారు. వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. సేకరించిన నీరాను శీతల పానీయంగా వాడాలంటే పులియకుండా, తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచాలి. దీనికోసం గుజరాత్, మహారాష్ట్రలో నీరా సేకరించే కుండకు సున్నం పూస్తారు. అయితే సున్నానికి బదులుగా పందిరి మామిడి పరిశోధనా స్థానం కూలింగ్ బాక్స్‌ను రూపొందించింది. చెట్టుకు నెలకు రూ. 800 పైగా నికరాదాయం పలు ప్రయోజనాలున్న తాటి నీరాను శుద్ధి చేసి, బాటిళ్లలో నింపి విక్రయించటం ద్వారా గీత కార్మికులు మంచి ఆదాయం పొందవచ్చు. తాటి బెల్లం (కిలో ధర రూ.300) తదితర అనుబంధ ఉత్పత్తుల తయారీతో కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుంది. చెట్టుకు నెలకు రూ. 800కు పైగా నికరాదాయం (పట్టిక చూడండి) పొందవచ్చు. 1970 నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి పొంది నీరాను సేకరించి, ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. గుజరాత్లో రైతుల సహకార వ్యవసాయ పరపతి సంఘాలే నీరాను సేకరించి విక్రయిస్తూ ఏటా రూ. 6-7 కోట్ల వ్యాపారం చేస్తుండడం విశేషం. నిర్వహణ ఖర్చులు కూడా లేని తాటి చెట్ల నుంచి ఏడాది పొడవునా నీరాను సేకరించి అధికాదాయం పొందే అవకాశాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పందిరిమామిడి ఉద్యాన పరిశోధనా కేంద్రంలో మోడల్ నీరా బాట్లింగ్ వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నది. వచ్చే మార్చి నాటికి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. (ఆహార శాస్త్రవేత్త పీ సీ వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు) -
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
మైలవరం (కృష్ణా జిల్లా) : మైలవరం మండలం చంద్రాల గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. తాటి ముంజల కోసం తాటి చెట్టు ఎక్కిన సత్యాల గోపాలరావు(27) అనే యువకుడు ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. -
తాటిచెట్టుపై నుంచి పడి..
సంగెం: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం లోహిత గ్రామంలో కల్లు కోసం తాటిచెట్టు పైకెక్కిన గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన కక్కెర్ల వెంకయ్య(48)గా గుర్తించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
తాటి చెట్టును ఢీకొన్న ఆటో.. ఒకరి మృతి
గంట్యాడ(విజయనగరం జిల్లా): గంట్యాడ మండలం గింజేరు వద్ద రోడ్డు పక్కనున్న తాటిచెట్టును ఓ ఆటో అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వెలగాడ గ్రామానికి చెందిన కుర్రాయి సన్యాసి(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. విజయనగరం నుంచి తామరాపల్లికి ఆటోలో వెళ్తుండగా బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.