తాటిచెట్టుపై తలకిందులుగా వేలాడుతున్న మాసయ్య
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువన గిరి జిల్లాలో శుక్రవారం కల్లు తీసేందుకు తాటి చెట్టు ఎక్కిన ఓ గీత కార్మికుడుకి ముస్తాదు ఊడిపోవడంతో కాళ్లుపైకి తల కిందికి వేలాడుతూ ఆరుగంటల పాటు నరక యాతన అనుభవించాడు. సంస్థాన్ నారా యణపురం మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన బాలగోని మాసయ్య కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి వర్షం కురవడంతో మాసయ్య శుక్రవారం ఆలస్యంగా 9గంటల ప్రాంతంలో కల్లు తీసేందుకు అదే గ్రామానికి చెందిన వీరమళ్ల దానయ్య పొలంలోని తాటిచెట్టు ఎక్కాడు.
ఈ క్రమంలో మాసయ్య ముస్తాదు ఊడిపోవడంతో మోకు, గుత్తిపై తలకిందు లుగా వేలాడాడు. సమీప రైతులు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది వచ్చి పెద్ద క్రేన్ సహాయంతో మాసయ్యను కిందికి దించారు. అప్పటికే అతడి ఎడమకాలు, చేయి చచ్చుబడ్డాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, సహాయక చర్యలు ఆలస్యం కావడంతో మాసయ్య ఆరు గంటల పాటు చెట్టుపైనే నరకయాతన అనుభవించారు. అధిక రక్తపోటుతో పక్షవా తం రావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment