బాబోయ్ చెట్టును ఇలా కట్‌ చేస్తారా?! | Viral Video: Man Cuts Palm Tree While Sitting On It | Sakshi
Sakshi News home page

భయానక దృశ్యం: బాబోయ్ చెట్టును ఇలా కట్‌ చేస్తారా?!

Published Mon, Sep 28 2020 2:12 PM | Last Updated on Mon, Sep 28 2020 3:49 PM

Viral Video: Man Cuts Palm Tree While Sitting On It - Sakshi

భయానక దృశ్యం. ఆకాశమంత ఎత్తులో ఉన్న తాటి చెట్టును ఓ వ్యక్తి నరికేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమెరికన్ మాజీ‌‌ బాస్కెట్‌ బాల్‌ ఆటగాడు రెక్స్‌ చాప్మన్‌ ట్విటర్‌లో శుక్రవారం షేర్‌ చేశాడు. ఈ వీడియోకు ‘ఎవరైన అతి పొడవాటి తాటి చెట్టును నరకడం చూశారా’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. ఇందులో ఓ వ్యక్తి ఈ అతి పెద్ద తాటి  చెట్టు కొనవరకు ఎక్కాడు. అయితే చాలా పొడవుగా ఉండటంతో అతడు ఎక్కాగానే ఆ చెట్టు కిందకు వంగింది. (చదవండి: ఏరులై పారిన రెడ్‌వైన్‌.. మందుబాబులు షాక్‌)

అయినా అతడు చెట్టుపై కుర్చోని తాటి చెట్టు కొన భాగాన్ని కత్తిరించడంతో కొమ్మలు ఊడి కిందపడ్డాయి. దీంతో వెంటనే ఆ చెట్టు ఆటూ ఇటూ గాలిలో ఊగుతుండటం చూసి ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురవుతున్నారు. అయితే అతడు చెట్టునే గట్టిగ పట్టుకుని అలాగే ఉండటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. 34 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ఇప్పటి వరకు 6.6 మిలియన్‌ వ్యూస్‌, వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ఈ వీడియోలోని ఆ వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతూ తమ స్పందనను తెలుపుతున్నారు. ‘ఆ వ్యక్తి చెట్టు నుంచి ఎగిరిపోతాడనుకునే వారు చేతులు ఎత్తండి’,  ‘బాబోయ్‌ ఇది ఎంత ప్రమాదకరంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.
(చదవండి: వైర‌ల్‌: అత‌డు ముక్కు క‌త్తిరించేసుకున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement