సంగెం: వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంగెం మండలం లోహిత గ్రామంలో కల్లు కోసం తాటిచెట్టు పైకెక్కిన గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి మృతిచెందాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన కక్కెర్ల వెంకయ్య(48)గా గుర్తించారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.