నేల మీద పాక్కుంటూ వచ్చే తేలును చూడగానే.. గుండె ఆగినంత పనవుతుంది. కనీసం ఆ పేరు విన్నా.. ఆగకుండా ఆమడదూరం పరుగుతీస్తాం. నేల మీద పాకే తేలుకే అంత భయపడితే .. రెక్కలు కట్టుకుని ఎరిగే తేలు కనిపిస్తే? ప్రాణాలు గాల్లో కలిసిపోవూ అంటారా? అయితే ఈ చిత్రాన్ని గమనించండి. ఇది ఎగిరే తేలు. కంగారు పడకండి.. ప్రమాదకరం కాదు.
చూడ్డానికి అచ్చం తేలులా ఉండే ఈ ప్రాణి పేరు స్కార్పియన్ ఫ్లై. ఇదో కీటకం. తూనీగలు, కందిరీగల జాతికి చెందినది. వీటిలో మగ స్కార్పియాన్ ఫ్లైకి పొట్ట, జననాంగం పొడవుగా సాగి తేలు కొండిలా కనిపిస్తుంది. ఈ కీటకాలు ఎగురుతుంటే అచ్చం తేళ్లలాగే కనిపిస్తాయి. ఇవి విషపూరితం కావు కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎంతయినా ప్రకృతిలోని వింతలు.. వైవిధ్యాలను చూడతరమా!
Comments
Please login to add a commentAdd a comment