
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. గత నెల 23వ తేదీన నాగ్‌పూర్–ముంబై విమానంలో ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు తాజాగా ఎయిరిండియా తెలిపింది. విమానం ల్యాండయిన వెంటనే బాధిత ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించినట్లు తెలిపింది.
ఆమె అనంతరం డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. సదరు విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు జరిపి, ఒక తేలును పట్టుకున్నారు. క్షుణ్నంగా పరిశీలించాకే విమానంలోకి వస్తు, సామగ్రిని తీసుకురావాలని క్యాటరింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్‌లో కాలికట్ నుంచి బయలుదేరి దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన ఎయిరిండియా కార్గో విమానంలో పాము కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment