women passenger
-
TSRTC: పల్లె వెలుగులు ఎక్కువగా వాడుకోండి: సజ్జనార్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణం అవుతోంది. సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తున్నాం. మరోవైపు ఫ్రీ జర్నీ కల్పిస్తూనే.. బస్సుల సంఖ్యను తగ్గించదనే విమర్శ టీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటోంది. అయితే అలాంటిదేం లేదని.. బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఒక ప్రకటన చేశారు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అయితే అది మరోలా ఉంటోందని చెబుతున్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారాయన. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరుతూ ఓ వీడియోను ఉంచారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతోందని అన్నారయన. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని, దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. -
ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో..
యశవంతపుర: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో ఓ మహిళ శుక్రవారం ఢిల్లీ బయల్దేరింది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆమెకు సీపీఆర్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. ఇండిగో విమానం 6E 869 ఢిల్లీ విమానంలో రోసమ్మ(60) మహిళ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో విలవిలాడిపోయారు. కాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ నిరంతర గణేశ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ అయిన అనంతరం విమానాశ్రయ అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రమాదం నుంచి బయట పడినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ -
మహిళలకు బస్సు ఆపని డ్రైవర్.. సీఎం కేజ్రీవాల్ వార్నింగ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. బస్టాప్‌లో మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాగా 2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎంత మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారనే నివేదికను బడ్జెట్ సమావేశాల్లో కూడా చూపిస్తున్నారు. అయితే గత కొన్నిరోజులుగా మహిళలు ఉన్నచోట కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చాలామంది మహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ డ్రైవర్ బస్టాప్‌లో మహిళలు ఉన్నచోట బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. ఇందులో ఓ బస్టాపులో ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా ఘటనకు సంబంధించి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సదరు వీడియో పోస్టు చేస్తూ.. మహిళలు ఉన్నచోట బస్సులు ఆపాల్సిందేనని, లేకుంటే సదరు డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మహిళలకు ప్రయాణం ఉచితం కాబట్టి కొంతమంది డ్రైవర్లు మహిళలను చూసి బస్సును ఆపడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని అస్సలు సహించేది లేదు. ఇలాంటి బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు. కాగా మహిళల కోసం బస్సు ఆపని సదరు డ్రైవర్‌ను గుర్తించి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో! ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB — Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2023 -
ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది!
న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. గత నెల 23వ తేదీన నాగ్‌పూర్–ముంబై విమానంలో ఈ దురదృష్టకర ఘటన జరిగినట్లు తాజాగా ఎయిరిండియా తెలిపింది. విమానం ల్యాండయిన వెంటనే బాధిత ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించినట్లు తెలిపింది. ఆమె అనంతరం డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. సదరు విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు జరిపి, ఒక తేలును పట్టుకున్నారు. క్షుణ్నంగా పరిశీలించాకే విమానంలోకి వస్తు, సామగ్రిని తీసుకురావాలని క్యాటరింగ్ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్లో కాలికట్ నుంచి బయలుదేరి దుబాయ్ ఎయిర్‌పోర్టులో ల్యాండయిన ఎయిరిండియా కార్గో విమానంలో పాము కనిపించింది. -
మహిళా సిబ్బందితో టాటా మోటార్స్ షోరూం!
హైదరాబాద్: టాటా మోటార్స్ తన డీలర్ భాగస్వామి వెంకటరమణ మోటార్స్‌తో కలిసి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మహిళా సిబ్బందితో ప్యాసింజర్ వెహికల్స్ షోరూంని ఇటీవల ప్రారంభించింది. మొత్తం 20 మంది మహిళా బృందంతో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ‘‘మహిళా షోరూం’’ అని కంపెనీ తెలిపింది. పెరుగుతున్న మహిళా కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఈ తరహా షోరూంను ప్రారంభించాము. నాయకత్వాన్ని కోరుకునే మహిళలకు ఈ కేంద్రం అంకితమని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. -
మహిళలకు హైదరాబాద్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. బస్టాపులతో పాటు మహిళలు ఎక్కడైనా సరే రాత్రి 7.30 తర్వాత చెయ్యెత్తి బస్సు ఆపవచ్చని, అవసరమైన చోట ఆపి దిగి వెళ్లిపోవచ్చని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని 29 డిపోలకు చెందిన మేనేజర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువ సమయం బస్టాపుల్లోనే వేచి ఉండకుండా.. బస్సు కోసం ప్రత్యేకంగా బస్టాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. మహిళా ప్రయాణికులు కోరిన చోట బస్సు ఆపకపోతే డిపో మేనేజర్లకు ఫిర్యాదు చేయొచ్చు. అధికారులు చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు అన్ని బస్సుల్లో డిపో మేనేజర్ల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచనున్నట్లు ఈడీ చెప్పారు. -
మహిళలు ఇక బస్టాండ్‌లో సేఫ్.. కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్ట్!
‘స్టే సేఫ్’... ఇది కేరళ ఆర్టిసీ తాజా ప్రాజెక్ట్. మహిళా ప్రయాణికుల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను మొదలెట్టింది. సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు... వీరు సేఫ్‌గా ఇక బస్టాండ్లలోనే గదులు తీసుకుని ఉండవచ్చు. వీరి కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్ ఏసి గదులు తయారవుతున్నాయి. అదీ ప్రయత్నించదగ్గ ధరలకు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశంసలు కూడా వస్తున్నాయి. గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలెట్టారు. అక్కడ మహిళలకు అవసరమైన వస్తువులు, చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు ఉండే స్టోర్ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు కేటాయించే, నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా ఇది కోవిడ్ సమయపు ఆలోచన కూడా అనొచ్చు. కోవిడ్ వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కొంచెం తగ్గింది. స్త్రీలకు తోడు వచ్చే వీలు లేనివారు, లేదా కోవిడ్ వల్ల బంధువుల ఇంటికి వెళ్లడం/రానివ్వడం కుదరని వారు ఎక్కడ ఉండాలి? వారి కోసం బస్టాండుల్లోనే గదుల ఆలోచన వచ్చింది. ఇది ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో సందేహం లేదు. హోటళ్ల కంటే ఇవే క్షేమకరం అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్ హోటళ్లు కిటకిటలాడొచ్చు. -
‘ట్రంప్ చెప్పాడు.. ఏం కాదని’
వాషింగ్టన్ : ఎన్ని చట్టాలు, ఉద్యమాలు వచ్చినా ఆడవాళ్ల పట్ల జరిగే వేధింపులకు, అత్యచారాలకు అంతమంటూ ఉండదనిపిస్తోంది. ఓ వైపు మహిళా లోకమంతా తమ పట్ల జరిగే వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతుంటే మరోపక్క మృగాళ్లు కూడా అదే రీతిలో రెచ్చిపోతున్నారు. ఇన్ని దరిద్రాల మధ్య ఇలాంటి పనులు చేసిన నీచులను మన నాయకులు వెనకేసుకురావడం మరీ దరిద్రం. ఇది ఒక్క మన దేశంలో పరిస్థితి మాత్రమే కాదు. అగ్ర రాజ్యం అమెరికాలో కూడా ఇదే దుస్థితి. మహిళను వేధించడమే తప్పంటే.. మహిళల వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని మా అధ్యక్షుడే చెప్పాడంటూ వితండవాదం ప్రారంభించాడు ఓ ప్రబుద్ధుడు. వివరాలు బ్రూస్ మైఖేల్ అలెగ్జాండర్(49) అనే ప్రయాణికుడు విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు మైఖేల్‌ను అరెస్ట్ చేశారు. అయితే మైఖేల్ తన తప్పును ఒప్పుకోకపోవడమే కాకా.. ‘ఆడవారి వ్యక్తిగత శరీర భాగాలను తాకడం తప్పు కాదని అమెరికా అధ్యక్షుడే చెప్పాడు’ అంటూ పోలీసులతో వాదించడం ప్రారంభించాడు. అయితే కోర్టు, పోలీసులు మైఖేల్ వాదనను పట్టించుకోలేదు. అతను చేసిన తప్పుకు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 2, 50, 000 అమెరికన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో 1,83,93,200) జరిమాన కూడా విధించింది. -
విమానంలో వింత..!
గ్లాస్గో : విమానంలో ఒకే ఒక్క ప్యాసింజర్ ప్రయాణించగా సిబ్బంది మాత్రం ఆమెను ఓ వీఐపీగా ట్రీట్ చేశారు. ఇది చదివి ఆ ప్యాసింజర్ బడా పారిశ్రామికవేత్తో, లేక పేరు మోసిన అధినేత అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఓ సాధారణ ప్రయాణికురాలు ఒంటరిగా విమానంలో ప్రయాణించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. స్కాట్లాండ్కు చెందిన కరోన్ గ్రీవ్ అనే మహిళ ఓ రచయిత్రి. ఆమె గత మూడు రోజుల కిందట గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్ అనే ప్రాంతానికి విమానంలో జర్నీ చేయాలనుకున్నారు. జెట్ 2 అనే ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే 189 మంది సీట్ల సామర్థ్యం ఉన్న ఆ విమానంలో కేవలం మూడు టికెట్లే బుక్ అయ్యాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ విమానం బయలుదేరే సమయానికి కేవలం కరోన్ గ్రీవ్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో సమయం మించిపోతుందని విమానం ఒక్క ప్రయాణికురాలితోనే వెళ్లిపోయింది. ఒకే ప్రయాణికురాలు కావడంతో ఎయిర్ లైన్స్ సిబ్బంది గ్రీవ్‌కు వీఐపీలా చూసుకున్నారు. దీంతో విమాన సిబ్బంది తనను చాలా బాగా చూసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. 'గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్కు జెట్ 2 విమానంలో ప్రయాణికురాలిని నేనొక్కదాన్నే. కెప్టెన్ లారా, ఇతర విమాన సిబ్బంది వీఐపీలా ట్రీట్ చేశారంటూ' కరోన్ గ్రీవ్ ట్వీట్ చేశారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా చోటుచేసుకుంటుందని విమాన సిబ్బంది తెలిపింది. @jet2tweets Amazing flight Glasgow to Heraklion yesterday I was the only passenger. Captain Laura and crew amazing, felt like a VIP all day! pic.twitter.com/q4CEkTf7Az — Karon Grieve (@KaronGrieve) 23 October 2017 -
విమానంలో మహిళపై వికృత చేష్టలు
ముంబయి: విమాన ప్రయాణంలో మహిళ గాఢ నిద్రలో ఉండగా తోటి ప్రయాణికుడు ఆమెపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. నిద్రిస్తున్న మహిళను అభ్యంతరకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందుతూ ఓ వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. చివరికి మహిళ ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. జూన్ 27న ఉదయం 6:15 నిమిషాలకు బెంగళూరు నుంచి ఓ విమానం ముంబై బయలుదేరింది. 31 ఏళ్ల సబీన్ హంజా అనే వ్యక్తి విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడి పక్క సీట్లో ఓ మహిళా ప్రయాణికురాలు కూర్చొని ఉంది. విమానం బయలుదేరిన కొద్దిసమయానికి తన పక్క సీట్లో కూర్చున్న మహిళ నిద్రించడం గమనించిన హంజా ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. ఏదో అలికిడికి ఉలిక్కిపడి లేచిన ప్రయాణికురాలు జరుగుతున్న సీన్ చూసి షాక్ తిన్నారు. తోటి ప్రయాణికుడు తనను చెప్పలేని చోట తాకుతూ లైంగిక చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఆమె ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది అక్కడికి వచ్చేలోగా ఆ వ్యక్తి ప్యాంట్ జిప్ పెట్టుకుని తనకేం తెలియదన్నట్లు కూర్చున్నాడని బాధితురాలు తెలిపారు. తొలుత నిందితుడు హంజాను సిబ్బంది హెచ్చరించి వదిలేశారు. 7:45 గంటలకు ముంబైకి విమానం చేరుకోగానే హంజాను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆగస్టు 15 నుంచి నగరంలో షీ ట్యాక్సీలు
- మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లకు వాహనాల అప్పగింత - తెలుపు,గులాబీ రంగుల్లో కార్లు - రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి సాక్షి,సిటీబ్యూరో : ఎట్టకేలకు నగరంలో షీ ట్యాక్సీలు రోడ్డెక్కనున్నాయి. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీ నుంచి మహిళా ప్రయాణికులకు వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. వుంగళవారం ఖైరతాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయుంలో జరిగిన సమీక్షా సవూవేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు. మొదటి విడత 12 వాహనాలను ప్రవే శపెడతామని, తరువాత 50 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 100 షీ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపొందించినా మహిళా డ్రైవర్లు లేకపోవడంతో కనీసం యాభై వాహనాలనైనా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు గతేడాది 18 మంది మహిళా డ్రైవర్లకు రెండు విడుతలుగా రవాణాశాఖ శిక్షణ ఇచ్చింది. మొదటి విడతలో శిక్షణ పొందిన 12 మంది మహిళా డ్రైవర్లకు ప్రస్తుతం కార్లను అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 లక్షలు కేటాయించినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐటీ జోన్లలో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ మహిళా ఉద్యోగుల అవ సరాలకు అనుగుణంగా షీ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. తెలుపు, గులాబీ రంగుల్లో... మహిళా ప్రయాణికులు గుర్తించేందుకు వీలుగా షీ ట్యాక్సీలను తెలుపు, గులాబీ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. మారుతీ డిజైర్ వీడీఐ కార్లను ఇందుకు ఎంపిక చేశారు. -
వీడియోతో బుద్ధి చెప్పింది...
స్త్రీలపై వేధింపులు రోజుకోజుకు ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బస్సులు, రైళ్లలోనే కాదు...విమానాల్లో కూడా వేధింపులు తప్పటం లేదు. తాజాగా అటువంటి సంఘటనే మరొకటి జరిగింది. ఈసారి ఏకంగా విమానంలోనే ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్‌కు చెందిన ఓ యువతి ప్రయాణికురాలు ఇండిగో విమానంలో భువనేశ్వర్ వెళ్తుంది. ఆమె వెనుక సీటులో ఓ వ్యక్తి కూర్చున్నాడు. చూడడానికి డీసెంట్‌గా ఉన్నా...బుద్ధి మాత్రం గడ్డి తింది. సీట్ల మధ్యలో ఉన్న గ్యాప్ నుంచి ఆ యువతిని తాకడానికి ప్రయత్నించాడు. దీంతో విసిగిపోయిన ఆమె ధైర్యం కూడదీసుకుని అతని ఫొటోతో పాటు అక్కడ జరుగుతున్న సంఘటనను కొద్దిసేపు వీడియో తీసింది. ఆ తర్వాత ఒక్కసారిగా కేకలు వేసింది.. అరుపులు విన్న విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ యువతికి అండగా నిలిచారు. తోటివారి సహాయంతో ఆమె ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సాధారణంగా ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే మహిళలు ప్రతిఘటించడానికి భయపడతారు. కానీ అలా చేయడం కూడా నేరం అనేది తన అభిప్రాయమని ఆమె పేర్కొంది. తన విషయానికి వస్తే చట్టాలు ఏం చేయలేవని నాకు తెలుసు అందుకే అందరి ముందు అతడిని అవమానం జరగాలని భావించి గట్టిగా అరిచానని' యువతి తెలిపింది. కాగా సదరు 'పెద్ద' మనిషి భువనేశ్వర్‌కు చెందిన పలు కంపెనీలకు ఛైర్మన్. అయితే జున్‌జున్‌వాలా పోలీసులు మాత్రం అతడిని కొద్దిసేపు కస్టడీలోకి తీసుకుని వదిలేయటం గమనార్హం.