- మొదటి బ్యాచ్‌లో శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లకు వాహనాల అప్పగింత
- తెలుపు,గులాబీ రంగుల్లో కార్లు
- రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడి
సాక్షి,సిటీబ్యూరో : ఎట్టకేలకు నగరంలో షీ ట్యాక్సీలు రోడ్డెక్కనున్నాయి. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీ నుంచి మహిళా ప్రయాణికులకు వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. వుంగళవారం ఖైరతాబాద్ రవాణా కమిషనర్ కార్యాలయుంలో జరిగిన సమీక్షా సవూవేశంలో ఈ అంశాన్ని వెల్లడించారు. మొదటి విడత 12 వాహనాలను ప్రవే శపెడతామని, తరువాత 50 వాహనాలను అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం 100 షీ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని ప్రణాళికలు రూపొందించినా మహిళా డ్రైవర్లు లేకపోవడంతో కనీసం యాభై వాహనాలనైనా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
ఈ మేరకు గతేడాది 18 మంది మహిళా డ్రైవర్లకు రెండు విడుతలుగా రవాణాశాఖ శిక్షణ ఇచ్చింది. మొదటి విడతలో శిక్షణ పొందిన 12 మంది మహిళా డ్రైవర్లకు ప్రస్తుతం కార్లను అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.36 లక్షలు కేటాయించినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐటీ జోన్‌లలో విధులు నిర్వహించే సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగుల అవ సరాలకు అనుగుణంగా షీ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
తెలుపు, గులాబీ రంగుల్లో...
మహిళా ప్రయాణికులు గుర్తించేందుకు వీలుగా షీ ట్యాక్సీలను తెలుపు, గులాబీ రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. మారుతీ డిజైర్ వీడీఐ కార్లను ఇందుకు ఎంపిక చేశారు.
ఆగస్టు 15 నుంచి నగరంలో షీ ట్యాక్సీలు
Published Wed, Aug 5 2015 2:04 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM
Advertisement
Advertisement