న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు. బస్టాప్‌లో మహిళల కోసం బస్సు ఆపని డ్రైవర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. కాగా 2019లో ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఎంత మంది మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారనే నివేదికను బడ్జెట్ సమావేశాల్లో కూడా చూపిస్తున్నారు.
అయితే గత కొన్నిరోజులుగా మహిళలు ఉన్నచోట కొంతమంది డ్రైవర్లు బస్సు ఆపకుండానే వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై చాలామంది మహిళలు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా ఓ డ్రైవర్ బస్టాప్‌లో మహిళలు ఉన్నచోట బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. ఇందులో ఓ బస్టాపులో ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా ఘటనకు సంబంధించి కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. సదరు వీడియో పోస్టు చేస్తూ.. మహిళలు ఉన్నచోట బస్సులు ఆపాల్సిందేనని, లేకుంటే సదరు డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మహిళలకు ప్రయాణం ఉచితం కాబట్టి కొంతమంది డ్రైవర్లు మహిళలను చూసి బస్సును ఆపడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిని అస్సలు సహించేది లేదు. ఇలాంటి బస్సు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు. కాగా మహిళల కోసం బస్సు ఆపని సదరు డ్రైవర్‌ను గుర్తించి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో!
ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2023
Comments
Please login to add a commentAdd a comment