
యశవంతపుర: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో ఓ మహిళ శుక్రవారం ఢిల్లీ బయల్దేరింది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆమెకు సీపీఆర్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది.
వివరాల ప్రకారం.. ఇండిగో విమానం 6E 869 ఢిల్లీ విమానంలో రోసమ్మ(60) మహిళ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో విలవిలాడిపోయారు. కాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ నిరంతర గణేశ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ అయిన అనంతరం విమానాశ్రయ అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రమాదం నుంచి బయట పడినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇది కూడా చదవండి: ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్
Comments
Please login to add a commentAdd a comment