CPR method
-
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్ ఓ వృద్ధుడి( 60 ఏళ్లు) ప్రాణాన్ని కాపాడారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2లో ఒక వ్యక్తికి గుండెపోటు రావటంతో గమనించి ఆమె వెంటనే స్పందించారు. ఆయన వద్దకు వెళ్లి ఛాతిమీద చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేసి స్పృహలోకి వచ్చేలా చేశారు. అనంతరం విమాశ్రయ అధికారులు ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాకర్ట్ చూపిన చొరవకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. డాక్టర్ చొరవతో ఆ వ్యక్తికి ప్రాణం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆమెను డాక్టర్ విశ్వరాజ్ వేమలగా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.Doctors are no less than God 🙏🏻An elderly passenger at the Delhi airport's Terminal 2 was revived by a doctor after he suffered a heart attack on the premises.She deserves an acknowledgement and recognition 👏🏻#DelhiAirport pic.twitter.com/0lOLyKj2RC— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024 -
ఫలించని సీపీఆర్.. శబరిమలలో సూర్యాపేట వాసి మృతి!
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): శబరిమలకు వెళ్లిన ఆత్మకూర్(ఎస్) మండలంలోని తుమ్మలపెన్‌పహాడ్ వాసి గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉయ్యాల లింగయ్య(37) సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో వాటర్‌ప్లాంట్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గత పదేళ్లుగా అయ్యప్ప మాల వేస్తున్న లింగయ్య ఈ ఏడాది కూడా మాల ధరించాడు. ఆదివారం సూర్యాపేట నుంచి 9మంది మాలధారులు హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమానంలో కేరళ రాష్ట్రంలోని కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగి కాలినడకన పంబాకు బయల్దేరగా లింగయ్య రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యాడు. సహచరులు సీపీఆర్ చేసినప్పటికీ మృతిచెందాడు. మృతుడికి భార్య ఉపేంద్రతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
CPR: ఒకేసారి 20 లక్షల మందికి సీపీఆర్ నేర్పిస్తే..
ఢిల్లీ: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి ఎక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఈ రెండు మూడేళ్ల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ, సీపీఆర్ Cardiopulmonary resuscitation (CPR) చేసి బతికిస్తున్న ఘటనలు మాత్రం అరుదుగా చూస్తున్నాం. గణాంకాల్లో పాతికేళ్లలోపు వాళ్లు కూడా ఉంటుండగా.. ఒబెసిటీ లాంటి సమస్యలు లేనివాళ్లు కూడా సడన్‌గా చనిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆపద సమయంలో రక్షించే.. సీపీఆర్‌పై దేశవ్యాప్త అవగాహన కోసం కేంద్రం నడుం బిగించింది. గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం.. సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. आज देश के हर कोने से 20 लाख से अधिक लोगों के साथ नेशनल बोर्ड ऑफ एग्जामिनेशन द्वारा आयोजित CPR प्रशिक्षण में भाग लिया। इस अभियान के माध्यम से अचानक कार्डियक अरेस्ट होने की स्थिति में हम दूसरे की मदद कर सकते ह pic.twitter.com/SOMLvsdBGl — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 6, 2023 అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్పైనా అవగాహన ఉండాలని అన్నారాయన. కొవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. -
శభాష్ పోలీస్.. వ్యక్తి ప్రాణం కాపాడిన పోలీసులు..
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంలో ట్రాఫిక్ పోలీసు అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగం. రణగొణ ధ్వనుల మధ్య దూసుకొస్తున్న వాహనాలు, ప్రతికూలంగా ఉండే వాతావరణం, తీవ్ర కాలుష్యం. ఎన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా.. డ్యూటీ చేయాల్సిందే. అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను నియంత్రించాల్సిందే. ఇవన్నీ రోజూ జరిగేవే కానీ.. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన.. పోలీసుల్లో డ్యూటీతో పాటు మానవత్వం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఆ రోడ్డులో నడుస్తూ వెళ్తోన్న గుజ్జల రాముకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కండిసా గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుజ్జల రాము హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. బేగంపేటలో నడుస్తూ వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. సీపీఆర్‌తో నిలిచిన ప్రాణం.. గుజ్జల రామును గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. పబ్లిక్ స్కూల్ పక్కన చెట్టు నీడలోకి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి రామును గమనించాడు. వెంటనే ఇన్స్పెక్టర్ బాలయోగి, మరో అధికారి శ్రీనివాస్‌తో కలిసి సీపీఆర్ చేశారు. అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి .. ఆగకుండా సీపీఆర్ చేయడంతో రాములో కదలిక వచ్చింది. కాసేపటికి స్పృహలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత మెరుగైన చికిత్సకు రామును గాంధీ ఆస్పత్రికి తరలించారు. Highly appreciate the timely efforts of Madhusudan Reddy Garu, Additional Commissioner of Traffic, North Zone, for performing #CPR on a man identified as Ramu who collapsed due to heart attack at Begumpet. The patient was shifted to Gandhi Hospital soon after and he is now… pic.twitter.com/2zhlEg8d4p — Harish Rao Thanneeru (@BRSHarish) August 30, 2023 విధుల్లో ఉన్న పోలీసులు సత్వరం స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారని అక్కడ ఉన్నవారంతా ప్రశంసించారు. అడిషనల్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి చేసిన సీపీఆర్, దాని వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు నిలపడంపై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఇది కూడా చదవండి: హృదయవిదారకం: గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టిన సోదరి -
ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో..
యశవంతపుర: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో ఓ మహిళ శుక్రవారం ఢిల్లీ బయల్దేరింది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆమెకు సీపీఆర్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. ఇండిగో విమానం 6E 869 ఢిల్లీ విమానంలో రోసమ్మ(60) మహిళ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో విలవిలాడిపోయారు. కాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ నిరంతర గణేశ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ అయిన అనంతరం విమానాశ్రయ అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రమాదం నుంచి బయట పడినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ -
పాపకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలబెట్టిన గోపి,బ్రహ్మనాయుడు
-
మహిళ ఆత్మహత్యాయత్నం.. పోలీసులు సీపీఆర్ చేయడంతో..
సాక్షి, నాగర్ కర్నూల్: పోలీసుల అప్రమత్తతో ఓ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్య చేసుకున్న మహిళకు సమయానికి పోలీసలు సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. దీంతో, పోలీసులను కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసించారు. వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్లోని రాంనగర్ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో, కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అపస్మారక స్థితిలో ఉన్న మహిళకు పోలీసులు సీపీఆర్ చేరారు. దీంతో, మహిళ స్పృహలోకి వచ్చింది. అనంతరం, ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మహిళను రక్షించిన పోలీసులపై కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్.. 90 మంది భారతీయులు కూడా! -
23 రోజుల పాపకు సీపీఆర్.. ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
చిన్నకోడూరు(సిద్దిపేట): పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగడంతో శ్వాస ఆగిపోయింది. 108 సిబ్బంది సీపీఆర్ చేసి పాప ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో బీహార్‌కు చెందిన ప్రేమ్‌నాథ్ యాదవ్, కవిత దంపతులు పనిచేస్తున్నారు. వీరికి 23 రోజుల వయసున్న బేబీ సుబ్బలక్ష్మి ఉంది. అయితే, ఆ పాపకు స్నానం చేయిస్తుండగా వేడి నీళ్లు మింగింది. దీంతో శ్వాస ఆగిపోయింది. వెంటనే గ్రామానికి చెందిన ఏఎన్ఎం తిరుమల, ఆశావర్కర్ సుగుణ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది అశోక్, వెంకట్ అక్కడకు చేరుకుని పరీక్షించి.. బేబీ గుండె, నాడీ కొట్టుకోవడం లేదని గమనించారు. వెంటనే ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి విషయం చెప్పి, ఆయన సూచనల ప్రకారం ప్రథమ చికిత్స (సీపీఆర్) చేస్తూ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బేబీ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని బంధువులు, హాస్పిటల్ సిబ్బంది అభినందించారు. ఈ ఘటనపై మంత్రి హరీష్ రావు స్పందించారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు తెలిపారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం అంటూ ట్విట్టర్లో కామెంట్స్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో 23 రోజుల బిడ్డకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి అభినందనలు 💐 అత్యవసర సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి చేసిన మీ సేవలు అమూల్యం🙏🏻 CPR Saves Lives. pic.twitter.com/tItoUzi1Vj — Harish Rao Thanneeru (@BRSHarish) April 5, 2023 -
కారు డ్రైవ్ చేస్తుండగా గుండెపోటు.. సీపీఆర్ చేసిన సీఐ.. కానీ..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుల కారణంగా ఎంతో మంది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం.. పెద్ద అంబర్‌పేట వద్ద ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో, బాధితుడు స్పృహాలోకి వచ్చాడు. అనంతరం, బాధితుడిని స్థానిక వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి చేరుకునేలోపే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. -
ఆకస్మిక గుండెపోటు సంఘటనలు: తెలంగాణలో సీపీఆర్‌పై శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఆకస్మిక గుండెపోటు సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బాధితుల ప్రాణాలు కాపాడటంపై వైద్య ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. అన్ని జిల్లాల్లో నూ కార్డియో–పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్), ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ప్రతీ జిల్లాకు 4 నుంచి ఏడుగురు మాస్టర్ ట్రైనర్లను పంపించనుంది. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, మున్సిపల్ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, కమ్యూనిటీ వలంటీర్లు, షాపింగ్ మాల్స్ ఉద్యోగులు, పెద్ద కాంప్లెక్స్‌ల్లో ఉండేవారికి సీపీఆర్, ఏఈడీలపై శిక్షణ ఇస్తారు. 108 సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ సీపీఆర్‌లో శిక్షణ ఇస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇప్పటికే 160 మంది మాస్టర్ ట్రైనర్లు హైదరా బాద్‌లో సీపీఆర్‌లో శిక్షణ పొందారు. ప్రతి మాస్టర్ ట్రైనర్ వారానికి 300 మందికి శిక్షణ ఇస్తారు. మనిషిని పోలిన బొమ్మలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ కా ర్యాచరణ ప్రణాళికను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేసింది.ౖ కలెక్టరేట్లలోనూ శిక్షణనిస్తారు. ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారు వెంటనే సీపీఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. -
Hyd: సీపీఆర్‌తో పోయే ప్రాణం తిరిగొచ్చింది
హైదరాబాద్ (రాజేంద్రనగర్): రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రాజశేఖర్ గురువారం మధ్యాహ్నం ఆరాంఘర్ చౌరస్తాలో డ్యూటీలో నిమగ్నమై ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నట్టుండి కలకలం రేగింది. అక్కడున్న వారంతా గుంపుగా ఒకచోట చేరారు. ఏం జరిగిందోనని రాజశేఖర్ అక్కడికి చేరుకున్నాడు. ఓ వ్యక్తిపై ఫుట్‌పాత్‌పై స్పృహ లేకుండా పడిపోయి ఉండటం గమనించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్లే కుప్పకూలిపోయాడని అతనికి అర్ధమయ్యింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేశాడు. దీంతో కోలుకున్న వ్యక్తిని వెంటనే 108లో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణం దక్కింది. ఈ సంఘటన టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిసింది. భార్యాపిల్లల్ని చూసి వెళుతుండగా.. బాలాజీ (45) కర్నూలు మార్కెట్ యార్డులో హమాలీగా పని చేస్తున్నాడు. అయితే ఇతని కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ సితార హోటల్ వెనుక బస్తీలో ఉంటోంది. దీంతో బాలాజీ వారానికి ఒక రోజు భార్య, ఇద్దరు పిల్లలను చూసేందుకు నగరానికి వస్తుంటాడు. గురువారం కూడా భార్యా పిల్లలను చూసి మధ్యాహ్నం కర్నూలు వెళ్లేందుకు ఆరాంఘర్ చౌరస్తాకు చేరుకున్నాడు. 3 గంటల సమయంలో ఫుట్‌పాత్‌పై నిల్చొని బస్సు కోసం ఎదురు చూస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఫుట్‌పాత్‌పైనే పడిపోయాడు. అయితే రాజశేఖర్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడాడు. అత్తాపూర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం హయత్‌నగర్‌లోని మరో ఆసుపత్రికి బాలాజీని తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫలితం ఇచ్చిన శిక్షణ : 2013 బ్యాచ్‌కు చెందిన పీసీ రాజశేఖర్‌కు గతంలో ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్లో సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చా రు. గుండె నొప్పి వచ్చిన వారికి ఎలా సహాయం చేయాలో నే ర్పించారు. ఇప్పుడదే శిక్షణ బాలాజీ ప్రాణాలు కాపాడింది. అభినందనల వెల్లువ: సీపీఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన రాజశేఖర్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అభినందించారు. నగదు బహుమతి కూడా అందించారు. Highly Appreciate traffic police Rajashekhar of Rajendranagar PS for doing a commendable job in saving precious life by immediately doing CPR. #Telangana Govt will conduct CPR training to all frontline employees & workers next week inview of increasing reports of such incidents pic.twitter.com/BtPv8tt4ko — Harish Rao Thanneeru (@BRSHarish) February 24, 2023 ప్రాణం కాపాడిన ట్రాఫిక్ పోలీస్ రాజశేఖర్ రాజేంద్రనగర్ ఆరంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటు రాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ చేసి ప్రాణం కాపాడాడు. ఇప్పుడు బాలరాజు సురక్షితంగా ఉన్నారు. pic.twitter.com/vDH3zdd6gm — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 24, 2023 -
క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేదే.. ఐఏఎస్ సమయస్పూర్తికి ఫిదా
ఇటీవలే బెంగళూరులో ఐకియా మాల్లో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, మాల్లో ఉన్న ఓ డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) బాధితుడి ఛాతిపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఇలాంటి ఘటనే చండీగఢ్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఓ వ్యక్తి కూర్చీలోనే కుప్పకూలిపోవడంతో ఆఫీసులో ఉన్న ఐఏఎస్ అధికారి వెంటనే స్పందించిన సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించాడు. వివరాల ప్రకారం.. చండీగఢ్ సెక్టార్-41కు చెందిన జనక్ లాల్ మంగళవారం చండీగఢ్ హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వెళ్లారు. తన ఇంటికి సంబంధించి ఉల్లంఘన కేసుపై అధికారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు వచ్చినట్టు గమనించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఐఏఎస్ యశ్పాల్ గార్గ్ అతడి వద్దకు చేరుకుని సీపీఆర్ చేశారు. ఛాతిపై రెండు చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో రెండు నిమిషాల్లోనే జనక్ లాల్ స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిచి అక్కడున్న వారి చూసి పర్వాలేదంటూ చేతులతో సైగా చేశారు. దీంతో, ప్రాణాపాయ స్థితి నుంచి జనక్ లాల్ బయటపడ్డారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. యశ్పాల్ గార్గ్‌కు అసలు సీపీఆర్ గురించే తెలియదని.. ఇటీవలే ఓ టీవీలో చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టు చెప్పారు. ఇక, జనక్ లాల్ ప్రాణాలు కాపాడిన గార్గ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. एक आदमी को हार्ट अटैक आया तो चंडीगढ़ के हेल्थ सेक्रेटरी IAS @Garg_Yashpal जी ने तुरंत CPR देकर उस आदमी की जान बचाई। उनके इस काम की जितनी सराहना की जाए उतनी कम है। हार्ट अटैक से जानें बचाई जा सकती हैं। हर इंसान को CPR सीखना चाहिए। pic.twitter.com/C7dWVsAoOI — Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023 -
మూడు సార్లు గుండె ఆగినా.. ప్రాణాలు నిలిపారు
సాక్షి, కర్నూలు (హాస్పిటల్): తెలంగాణ రాష్ట్రం గద్వాలకు చెందిన వరుణ్ అనే 8 ఏళ్ల బాలుడికి ఇన్ఫెక్షన్ కారణంగా మూడు సార్లు గుండె ఆగిపోయింది. ఇలాంటి స్థితిలో వైద్యులు.. బాలుడికి సీపీఆర్ చేసుకుంటూ మెరుగైన వైద్యం అందించడంతో తిరిగి ప్రాణం పోసుకున్నాడు. వివరాలను బుధవారం కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ వివరించారు. వరుణ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయానికి అతనికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఎంతో శ్రమించి వైద్యులు అతని గుండెను పునఃప్రారంభింపజేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. బాబుకు ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె సామర్థ్యం మందగించిందని తెలుసుకున్నారు. వైద్యం చేసే సమయంలోనే బాలుడి గుండె మూడు సార్లు ఆగిపోయింది. ఆ సమయంలో మెదడుకు రక్త సరఫరాలో ఇబ్బంది తలెత్తి పక్షవాతం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన వైద్యం కారణంగా పక్షవాతం రాలేదు. పిల్లల గుండెకు ఇన్షెక్షన్ సోకి గుండె పనితీరు మందగించడం చాలా అరుదుగా జరుగుతుందని, దీనిని వైద్య పరిభాషలో మయోకార్డియారెస్ట్ అంటారని డాక్టర్ మురార్జీ తెలిపారు. మయోకార్డియాటీస్ ఉన్నప్పుడు తక్కువ మంది పిల్లలకు తీవ్రమైన గుండె సమస్యలు తలెత్తుతాయని, వారికి ఇంట్రావీనస్ ఆయనోట్రోఫిక్ సపోర్ట్, మెకానికల్ వెంటిలేషన్‌తో ఇంటెన్సివ్ కేర్ థెరపీ అవసరం ఉంటుందని డాక్టర్ మురార్జీ వివరించారు. చదవండి: (బతికుండగా పదిమందికి పట్టెడన్నం.. చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం) -
CPR-Viral Video: నోటితో ఊపిరి అందించి భర్త ప్రాణాలు కాపాడిన భార్య
లక్నో: గుండెపోటుతో ఆచేతన స్థితిలోకి వెళ్లిన భర్తకు నోటితో ఊపిరి ఊది ప్రాణం పోసింది ఓ భార్య. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురా నగరంలో జరిగింది. రైలులో ప్రయాణం చేస్తుండగా ఓ వ్యక్తికి గుండపోటు వచ్చింది. మథురా స్టేషన్‌కు ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే బాధితుడిని ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే బాధితుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. బాధితుడి పరిస్థితిని గమనించి.. నోటితో ఊపిరి అందించటం (సీపీఆర్) చేయాలని అతడి భార్యకు సూచించారు. సుమారు 33 సెకన్ల పాటు భార్య ఊపిరి అందించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆమె భర్త. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మథురా రైల్వే స్టేషన్లో బాధితుడు కేశవన్‌తో అతడి భార్య దయా, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిజామొద్దిన్ నుంచి కోజికోడ్ వెళ్తుండగా.. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాధితుడు కేశవన్(67) తన భార్య దయాతో కలిసి రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. వారితో మొత్తం 80 మంది బృందం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్తున్నారు భార్యాభర్తలు. బీ4 కోచ్ 67-68 సీట్లలో ప్రయాణం చేస్తున్న కేశవన్.. కొద్ది దూరం వెళ్లగానే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మథురా స్టేషన్లో దించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు కేశవన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలింపు.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, నీరంజన్ సింగ్‌లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అంబులెన్స్‌ను పంపాలను సూచించారు. సీపీఆర్ చేసిన తర్వాత అంబులెన్స్‌లో రైల్వే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు తెలిపారు. గుండె, ఊపరితిత్తులకు సంబంధించిన చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ దిలీప్ కుమార్ కౌశిక్ తెలిపారు. సీపీఆర్ చేసేలా ప్రోత్సహించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేశవన్ భార్య దయా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేశవన్ ఇదీ చదవండి: వైరల్ వీడియో: చలనం లేని బిడ్డకు ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ 30 सेकेंड में पत्नी ने मौत के मुंह से खीच लाई जान, CPR देकर पति को बचाया, मौत भी इस महिला के सामने हार गई #CPR #Health #ViralVideo pic.twitter.com/rzqwsZCqCr — Zee News (@ZeeNews) October 2, 2022 -
‘ఊపిరి’ పోసిన ఎస్ఐ
గుడిహత్నూర్ (బోథ్): రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో ఉన్న యువకుడికి నోటిద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలందుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి. ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫారూఖ్ బుధవారం ఆదిలాబాద్ నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్‌పై వెళ్తున్నాడు. తోషం గ్రామ సమీపంలో మోటార్ సైకిల్ అదుపు తప్పి కింద పడిపోవడంతో ఫారూఖ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లి వెళ్తున్న ఎస్ఐ సునీల్ గమనించి తన వాహనాన్ని ఆపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఫారూఖ్‌కు నోటి ద్వారా శ్వాస అందించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. అనంతరం క్షతగాత్రుడిని తన వాహనంలో మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఫారూఖ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. ఎస్ఐ సునీల్ చేసిన ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు ప్రశంసించారు. -
గుండెజబ్బుతో అకాల మరణాలు ఎందుకంటే?
కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. గుండెపైన కిరీటం ఆకృతిలో కీలకమైన ధమనులుంటాయి. (అందుకే ఈ ధమనులను ‘కరోనరీ’ ధమనులంటారు). ఈ రక్తనాళాలే గుండెకు పోషకాలను (రక్తం, ఆక్సిజన్) సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్త సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. దీంతో 50 – 55 ఏళ్ల వారిలో గుండెపోటు వస్తుంది. కానీ 25%లో ఇది 40లోపు వాళ్లలో కూడా గుండెపోటు వస్తుంటుంది. ఇదీగాక కొందరు యువకుల్లో హఠాన్మరణాలు కనిపిస్తుంటాయి. దానికి రక్తసంబంధీకుల్లో జరిగే పెళ్లిళ్ల వంటి అంశాల కారణంగా జన్యుపరమైన కారణాలతో ఈ అకస్మాత్తు మరణాలు సంభవిస్తుంటాయి. ఇటీవల ఆ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు ముఖ్యమైన కారణం... వయసు పెరుగుతున్నకొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అంటారు. కొందరిలో ఈ అథెరో స్క్లిరోసిస్ మొదలైన ఏడాదిలోనే గుండెపోటు కనిపించవచ్చు. ఈ ముప్పునకు మరో ప్రధాన కారణం రక్తనాళాల్లో పేరుకునే కొలెస్ట్రాల్. ఇది క్రమంగా, నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటుంది.. కానీ కొందరిలో ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’ అంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల అవి సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరాను తగ్గించవచ్చు. దాంతోనూ గుండెపోటు రావచ్చు. ఇది ఛాతీలో నొప్పి రూపంలో కనిపించవచ్చు. ఈ కండిషన్‌ను ‘యాంజినా పెక్టోరిస్’ అంటారు. తగినంత రక్తం అందని కారణంగా గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే ‘హార్ట్ ఎటాక్’ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ (ఏఎమ్ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. కరొనరీ ఆర్టెరీ డిసీజ్ వివిధ రూపాల్లో ఉంటుంది. ఇలాంటప్పుడు... స్వల్పంగా అనిపించే ఛాతీ నొప్పి మొదలుకొని... తీవ్రమైన నొప్పి నుంచి అకస్మాత్తు మరణం వరకు ఏదైనా జరగవచ్చు. స్టెంట్లు కూడా కాపాడలేక పోవచ్చు... ఎందుకంటే? అంతా ఆరోగ్యంగానే ఉండి కూడా... అకస్మాత్తుగా మృతిచెందిన చాలామందిని పరిశీలిస్తే వారికి కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే కండిషన్ ఉన్నట్లు తెలుస్తుంది. కొందరిలో ఏదో కారణంతో దాన్ని కనుగొని (డయాగ్నోజ్ చేసి) ఉండవచ్చు లేదా ఎలాంటి లక్షణాలూ బయటకు కనిపించనందున మరికొందరిలో దీన్ని కనుగొని ఉండకపోవచ్చు. అయితే గతంలో గుండెపోటు వచ్చి ఉండి, అది బయటకు కనిపించకుండా గుండె పంపింగ్ వ్యవస్థ బలహీనపడటంతో ఈ హఠాన్మరణాలు సంభవించే అవకాశం ఉంది. ధమనులు మూసుకుపోవడంతో గుండెకు తగినంత రక్తం సరఫరా జరగడం లేదని గుర్తించినవారికి యాంజియోప్లాస్టీ చేయడం, స్టెంట్ అమర్చడం చేస్తారు. కానీ అలాంటి చికిత్స అందించినవారిలోనూ... చాలా అరుదుగానే అయినా కొందరు మృతిచెందుతుంటారు. స్టెంట్ వంటివి గుండెకు అవసరమైన రక్తసరఫరాను తప్పక పెంచుతాయి. అందులో సందేహం లేదు. కానీ అవి అమర్చేనాటికే... వారికి తెలియకుండానే గుండెపోటు వచ్చిన సందర్భాల్లో గుండె కండరాలు అప్పటికే బలహీనమై ఉండవచ్చు. బలహీనపడ్డ గుండె భాగాల్లో గుండెకు గాయమై (స్కార్ వచ్చి) ఉండవచ్చు. అలాంటి వారిలో... స్పందనలకు కారణమయ్యే గుండె తాలూకు ‘ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్’ అసాధారణంగా (అబ్–నార్మల్‌గా) మారవచ్చు. దాంతో గుండె స్పందనలు, గుండెవేగం విపరీతంగా పెరగవచ్చు. ఫలితంగా గుండెదడ (వెంట్రిక్యులార్ టాచీకార్డియా), వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ వంటి కండిషన్ల వల్ల అకస్మాత్తు మరణం (సడన్ కార్డియాక్ డెత్) సంభవించవచ్చు. ఇలాంటి రోగుల్లో వాస్తవమైన గుండెపోటు ఎప్పుడో 10 – 20 ఏళ్ల కింటే వచ్చి ఉండవచ్చు. ఇలాంటివారికి మరోమారు గుండెపోటు వచ్చిందంటే వారిలో కేవలం 30% – 40% మాత్రమే బతికేందుకు అవకాశముంటుంది. మొదటిసారి గుండెపోటు వచ్చాక... గుండె కండరం బలహీనమైన వారికి ‘డయలేటెడ్ కార్డియోమయోపతి’ అనే కండిషన్ ఉంటుంది. అలాగే మరికొందరికి ఎలాంటి గుండెపోటూ రాకపోయినప్పటికీ గుండె కండరం బలహీనంగా ఉంటుంది. మరికొందరికి వంశపారంపర్యంగానే జన్యుపరంగా గుండెకండరం బలహీనంగా ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలోని వారు హఠాన్మరణాలకు గురవుతుంటారు. ఇప్పుడు గుండెస్పందనల్లో కరెంటుకు సంబంధించిన అసాధారణతలకు కారణమయ్యే సమస్యలను (కార్డియాక్ ఎలక్ట్రికల్ డిజార్డర్స్)ను గుర్తించి తక్షణం చికిత్స అందించే ఎలక్ట్రోఫిజియాలజీ అనే అత్యాధునిక వైద్యవిభాగం చాలా బాగా అభివృద్ధి చెందింది. లక్షణాల ఆధారంగా ‘కాథ్’ లాబ్‌లలో ఎలక్ట్రో ఫిజియలాజికల్ స్టడీస్ ద్వారా బాధితులకు కలగబోయే ముప్పును కచ్చితంగా అంచనావేయవచ్చు. అంతేకాదు... అంతకు మునుపు లక్షణాలేమీ లేకుండా గుండెపోటు వచ్చినందున... అది ఎప్పుడో ఏదో సందర్భంలో ఈసీజీ తీసినప్పుడు తెలిసిపోయి, ఇతర పరీక్షలు నిర్వహించి సమస్యను కచ్చితంగా నిర్ధారణ చేయడం కూడా ఇప్పుడు సాధ్యమవుతుంది. తద్వారా అవాంఛిత అకస్మాత్తు /హఠాన్మరణాలను తేలిగ్గా నివారించవచ్చు. నిర్ధారణ /నివారణ / చికిత్స ఇక చికిత్స విషయానికి వస్తే... ‘ఇంప్లాంటబుల్ కార్డియోవెక్టార్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ)’ అనే ఉపకరణాన్ని బాధితుల దేహంలోనే అమర్చడం ద్వారా ఆకస్మిక మరణాలను నివారించవచ్చు. దేహంలోని ఈ ఉపకరణం నుంచి వచ్చే కొన్ని వైర్లను రక్తనాళాల ద్వారా గుండె కుడివైపు కింది గదిలో అమర్చుతారు. అదో మినీ కంప్యూటర్‌లా పనిచేస్తుంది. మంచి సమర్థత ఉన్న ఎలక్ట్రో కార్డియాక్ నిపుణుల కచ్చితమైన నైపుణ్యంతో కూడిన ప్రోగ్రామింగ్ వల్ల అది... గుండె ఎలక్ట్రిక్ సర్కుట్స్లో తేడాలు గ్రహించి, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉంటుంది. ఈ పరిజ్ఞానం హఠాన్మరణాల నివారణలో విప్లవాత్మకమైన ముందడుగు అని చెప్పవచ్చు. సీపీఆర్ ప్రాధాన్యత... ఇలా అకస్మాత్తుగా గుండె సమస్య వచ్చి కొద్దిక్షణాలపాటు గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వారికి సీపీఆర్ ఇవ్వడం ద్వారా హాస్పిటల్‌కు తీసుకు వచ్చేముందరే గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. ఇందుకు గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కుతుంటారు. ఈ ప్రక్రియనే కార్డియో పల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అంటారు. గుండె కండరాలు ఆగిన (కార్డియాక్ అరెస్ట్ జరిగిన) కొద్ది క్షణాల్లోపు ఈ ప్రక్రియను అనుసరిస్తే ఆ కీలకమైన క్షణాల్లో బాధితుడిని రక్షించవచ్చు. సీపీఆర్ వల్ల గుండె కండరాలనీ ఉత్తేజపరచి, మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందడం ప్రారంభమయ్యేలా చేయవచ్చు. దాంతో బాధితుడిని కాపాడే అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పుడున్న అత్యాధునిక పురోగతి వల్ల గుండెలో విద్యుత్ వ్యవస్థ కారణంగా వచ్చే తేడాలను సరిదిద్దేందుకు ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) అనే చిన్నపాటి పరికరాలు అందబాటులో ఉన్నాయి. వీటి ద్వారా గుండెదడ (టాకికార్డియా) / వెంట్రిక్యులార్ డీ ఫిబ్రిలేషన్ బాధితులను రక్షించే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్’ (ఏఈడీ) పరికరాన్ని ఆంబులెన్సుల్లో అమర్చి వాటిని పోలీస్ స్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ స్థలాల్లో ఉంచడం వల్ల చాలామందిని రక్షించడానికి వీలవుతుంది. మన దేశంలో పరిస్థితి... మన దేశంలో హఠాన్మరణాలు చాలా ఎక్కువ. ఇతర దేశాల్లో ఈ సమస్య చాలా వయసు పైబడినవారిలోనే వస్తుంది. కానీ మన దేశంలో ఇది యువతలోనూ చాలా సాధారణంగా / ఎక్కువ గా కనిపిస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం మొత్తం మరణాల్లో ఇలాంటివి 10% పైబడే ఉండవచ్చని అంచనా. తగిన సమయంలోనే చికిత్సలు అందించగలిగితే కీలకమైన మెదడు కండరాలు చచ్చుబడేలోపే బాధితులను సమర్థంగా కాపాడవచ్చు. డాక్టర్ హైగ్రీవ్ రావు సీనియర్ కార్డియాలజిస్ట్ – ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ -
ఆ క్షణాలు.. అమూల్యం
గుండెపోటు..విద్యుత్ షాక్..నీటిలో మునక..ప్రమాదాలు సంభవించినప్పుడు సడన్‌గా గుండె ఆగిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో అప్రమత్తమై ఛాతీపై ప్రెస్ చేయడం (కార్డియో పల్మనరీ రీససిటేషన్) చేయడం ద్వారా తిరిగి గుండె కొట్టుకునేలా చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అమెరికా లాంటి బేసిక్ లైఫ్ సపోర్టు మెదడ్స్‌పై పోలీసులు, ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, ప్రజల్లో సైతం అవగాహన ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. మనదేశంలో ఈ విధానంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని క్రిటికల్ కేర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రత్యేక కథనం ఇలా.. సాక్షి,ఒంగోలు: ‘‘నెల రోజుల కిందట గుంటూరుకు చెందిన వ్యాపారి బీసెంటు రోడ్డులో సడన్‌గా పడిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు అర్ధగంట జాప్యం జరిగింది. దీంతో అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సడన్ కార్డియాక్ డెత్‌గా వైద్యులు పేర్కొన్నారు.’’ ‘‘ఎంజీ రోడ్డులోని ఓ జ్యూయలరీ షాపులో ఉద్యోగి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. స్పృహకోల్పోయిన అతన్ని పక్కనే ఉన్న ఆస్పత్రికి నిమిషాల వ్యవధిలో తరలించారు. దీంతో అతనికి అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టుతో ప్రాణాలు కాపాడగలిగారు. రెండు సంఘటనలో గుండె ఆగిపోగా, సకాలంలో స్పందించడంతో ఉద్యోగి ప్రాణాలు కాపాడగలిగినట్లు నిపుణులు చెబుతున్నారు.’’ మనం చూస్తూ ఉండగానే కొందరు కుప్పకూలిపోవడం..స్పృహలో లేకుండా పోవడం, తట్టినా లేవక పోవడం, గుండె కొట్టుకోకుండా ఆగిపోవడాన్ని సడన్ కార్డియాక్ డెత్‌గా పేర్కొంటాం. గుండెపోటుకు గురైనప్పుడు, కిడ్నీ వ్యాధులు ఉన్న వారిలో, రక్తంలో సోడియం, పొటాషియం అధికంగా ఉన్న వారిలో ఇలా సడన్‌గా కార్డియాక్ డెత్‌కు గురవడం జరుగుతుంది. ఎలక్ట్రికల్ షాక్, పాయిజన్ తీసుకున్న వారు, నీటిలో మునిగిన వారు ఇలా సడన్ కార్డియాక్ డెత్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారిలో గుండె రక్తాన్ని పంపింగ్ చేయడం నిలిచిపోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోయి. బ్రెయిన్‌కు రక్తం అందక బ్రెయిడ్ డెడ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే సడన్ కార్డియాక్ డెత్ అయిన 8 నిమిషాల్లో సీపీఆర్ చేయడం ద్వారా గుండెను తిరిగి కొట్టుకునేలా చేయవచ్చునని, ఈ పద్ధతితో సడన్ కార్డియాక్ డెత్‌లను 50 శాతం వరకూ నివారించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు దీనిపై అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్(సీపీఆర్) అంటే ఏమిటీ :సడన్‌గా కుప్పకూలిన వ్యక్తి సడన్ కార్డియాక్ డెత్ అయినట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు సీపీఆర్ పద్ధతిని అనుసరించాలి. కుప్పకూలిన వ్యక్తిని చదునుగా ఉన్న ప్రాంతానికి తీసుకు వచ్చి వెల్లకిలా పడుకోబెట్టాలి. పల్స్ లేక పోతే వెంటనే రెండు చేతులతో ఛాతి మధ్య భాగంలో ప్రెస్ చేయాలి. నిమిషానికి వందసార్లు ప్రెస్ చేయడం ద్వారా గుండె చేసే రక్తం పంపింగ్‌కు మన కృత్రిమంగా చేసినట్లవుతుంది. దీంతో మెదడుకు రక్తప్రసరణ పరఫెక్ట్‌గా జరగడంతో బ్రెయిన్ డెత్‌ను నిరోధించగలగడంతో పాటు, గుండె తిరిగి కొట్టుకునేలా చేయవచ్చు. ఇలా చేస్తూనే నోటి ద్వారా కృత్రిమంగా శ్వాస అందించడం వలన రక్తంలో ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా మెయిన్ టెయిన్ అవుతంది. ఈ పక్రియను మనిషి పడిపోయిన ఎనిమిది నిమిషాల్లోపు చేసినట్లయితే సడన్ కార్డియాక్ డెత్‌లలో 50 శాతం నివారించవచ్చు. షాక్ గురైతే ఇలా చేయండి : ఎలక్ట్రికల్ షాక్‌కు గురైనప్పుడు గుండె షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు గుండె వేగం నిమిషానికి 400 నుంచి 500 సార్లు కొట్టుకోవడంతో శరీరంలో రక్తప్రసరణ నిలిచిపోతుంది. ఆ సమయంలో సీపీఆర్ మెదడ్ను అనుసరిస్తూనే వీలయినంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అక్కడ రోగికి పరీక్షించి డీసీ విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె సాధారణ స్థితికి తీసుకు రావడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ షాక్‌కు గురైనప్పుడు సరైన అవగాహన లేక పోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటున్నారు. అదే విధంగా నీట మునిగిన వారిని ఒడ్డుకు చేర్చిన తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయితే సీపీఆర్‌ను అనుసరించాలని చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం ఒక్కో సమయంలో గుండె ఆగిపోవడం జరుగుతుందని, ఈ విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో అయితే : అమెరికా లాంటి దేశాల్లో బేసిక్ లైఫ్ సపోర్టు, సీపీఆర్ విధానాలపై పోలీసు, ఫైర్ శాఖల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా అంబులెన్స్‌లో అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్ఎస్)లో శిక్షణ పొందిన సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చికిత్స ప్రారంభించడం జరుగుతుందని చెబుతున్నారు. మనకు కూడా ఆ తరహా అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తే అలాంటి ఘటనలో ప్రాణాలు కోల్పోతున్న వారిలో 50 శాతం మందిని కాపాడవచ్చునని పేర్కొంటున్నారు. -
పోతున్న ప్రాణాలు ఒడిసిపట్టింది
బ్రిస్టల్: 'ఒక్క నిమిషం ముందు వచ్చి ఉంటే బతికుండే వాడు' సాధారణంగా ఇది అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా వైద్యుల నోట వినిపించే డైలాగ్. ఈ మాట వినగానే అతడి తలరాత అంతేలే అందుకే చనిపోయాడని అనుకుంటాం. కానీ, వాస్తవానికి ఆ నిమిషానికి సరిగ్గా కాపలా కాస్తే పోయే ప్రాణాన్ని అరచేతపట్టుకొని తిరిగి ఆ వ్యక్తిని బతికించవొచ్చని బ్రిస్టల్ నగరంలో నిరూపితం అయింది. పట్టపగలే కత్తిపోట్లతో పడి ఉన్న ఓ 40ఏళ్ల బిల్డర్‌ను చూసి అందరూ తమకెందుకులే అని వెళ్లిపోతుండగా నర్సుగా పనిచేస్తున్న ఆమె మాత్రం ఆగిపోయింది. తన స్నేహితుడితో కలిసి అతడి వద్దకు గబాగబా వెళ్లి మొకాలిపై కూర్చొని అతడి ప్రాణం కోసం ఎంతో ఆరాటపడింది. అతడు ఎవరూ ఏమిటీ అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా.. డిగ్నిటీ అనే అహంకారానికి వెళ్లకుండా నేరుగా అతడి చేయి చేతుల్లోకి తీసుకొని పల్స్ చెక్ చేసింది. శ్వాస కూడా ఆగిపోయిన ఆ వ్యక్తికి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (సీపీఆర్) పద్ధతి ద్వారా తిరిగి ఊపరిపోసింది. అంతకుముందు అతడి ఛాతీపై తన శాయశక్తులా బలంగా నొక్కుతూ క్షణాల్లో దూరమవుతున్న ఆయుషును తిరిగి తనకు అందించింది. అలా దాదాపు ఐదు నిమిషాలపాటు రోడ్డుపక్కనే ఓ ప్లాట్ ఫాం పై పడుకోబెట్టి ఆమె చేసిన సేవ అంతా ఇంత కాదు. ఆ వెంటనే బాధితుడిని బ్రిస్టల్ లోని సౌత్ మెడ్ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు నిలబెట్టింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిమితంగానే ఉంది.