
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో గుండెపోటుల కారణంగా ఎంతో మంది చూస్తుండగానే కుప్పకూలి చనిపోయిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. కారు డ్రైవ్ చేస్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.
వివరాల ప్రకారం.. పెద్ద అంబర్‌పేట వద్ద ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు రావడంతో విలవిల్లాడిపోయాడు. అయితే, అక్కడే విధుల్లో ఉన్న సీఐ.. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి సీపీఆర్ చేశారు. దీంతో, బాధితుడు స్పృహాలోకి వచ్చాడు. అనంతరం, బాధితుడిని స్థానిక వైద్యం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రికి చేరుకునేలోపే అతడు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.