ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్ ఓ వృద్ధుడి( 60 ఏళ్లు) ప్రాణాన్ని కాపాడారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2లో ఒక వ్యక్తికి గుండెపోటు రావటంతో గమనించి ఆమె వెంటనే స్పందించారు. ఆయన వద్దకు వెళ్లి ఛాతిమీద చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేసి స్పృహలోకి వచ్చేలా చేశారు.
అనంతరం విమాశ్రయ అధికారులు ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాకర్ట్ చూపిన చొరవకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. డాక్టర్ చొరవతో ఆ వ్యక్తికి ప్రాణం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆమెను డాక్టర్ విశ్వరాజ్ వేమలగా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.
Doctors are no less than God 🙏🏻
An elderly passenger at the Delhi airport's Terminal 2 was revived by a doctor after he suffered a heart attack on the premises.
She deserves an acknowledgement and recognition 👏🏻#DelhiAirport pic.twitter.com/0lOLyKj2RC— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024
Comments
Please login to add a commentAdd a comment