heartattack
-
ప్రాణదాతా.. నీకు సలాం! వీడియో వైరల్
ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్ ఓ వృద్ధుడి( 60 ఏళ్లు) ప్రాణాన్ని కాపాడారు. ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2లో ఒక వ్యక్తికి గుండెపోటు రావటంతో గమనించి ఆమె వెంటనే స్పందించారు. ఆయన వద్దకు వెళ్లి ఛాతిమీద చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేసి స్పృహలోకి వచ్చేలా చేశారు. అనంతరం విమాశ్రయ అధికారులు ఆ వ్యక్తికి వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లేడీ డాకర్ట్ చూపిన చొరవకు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. డాక్టర్ చొరవతో ఆ వ్యక్తికి ప్రాణం వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక.. ఆమెను డాక్టర్ విశ్వరాజ్ వేమలగా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు.Doctors are no less than God 🙏🏻An elderly passenger at the Delhi airport's Terminal 2 was revived by a doctor after he suffered a heart attack on the premises.She deserves an acknowledgement and recognition 👏🏻#DelhiAirport pic.twitter.com/0lOLyKj2RC— Vani Mehrotra (@vani_mehrotra) July 17, 2024 -
గుండెపోటు నాటకంతో 20 రెస్టారెంట్లకు టోకరా: చివరికి ఏమైందంటే...?
రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టేందుకు గుండె పోటు డ్రామాలు ఆడడం అలవాటుగా మార్చుకున్నాడో ప్రబుద్ధుడు. ఇలా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 20 రెస్టారెంట్లలో ఇదే తంతు కొనసాగించాడు. కానీ మోసం ఎల్లకాలం సాగదు కదా. ఎట్టకేలకు పోలీసులు చిక్కాడు. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పెయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. డైలీ లౌడ్ ప్రకారం ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లడం, కడుపునిండా లాగించేయడం ఆనక మూర్ఛపోయినట్టు నటించి, గుండె నొప్పి అంటూ నైలపై దొర్లి దొర్లి హడావిడి చేయడం ఇదీ ఇతగాడి తంతు. స్పెయిన్‌లోని బ్లాంకా ప్రాంతంలోని స్థానిక రెస్టారెంట్లలో ఫ్యాన్సీ డిన్నర్ తింటాడు. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి గుండెపోటు అంటూ భయంకరమైన డ్రామాకు తెర తీస్తాడు. ఇతగాడి నాటకాన్ని పసిగట్టిన సిబ్బంది అప్రమత్తమై, ఈ కేటుగాడి ఫోటోను ఆ ప్రాంతంలోని అన్ని రెస్టారెంట్లకు పంపించి వారిని కూడా అలర్ట్ చేశారు. (టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!) దీన్ని గమనించని మనోడు ఒక లగ్జరీ రెస్టారెంట్లో యథావిధిగా సుష్టిగా భోంచేశాడు. ముందుగానే అక్కడి సిబ్బంది బిల్లు ఇచ్చారు. దీంతో సుమారు రూ. 3,081 బిల్లు చెక్కు ఇచ్చి వెళ్లి పోదామని చూశాడు. పాత బిల్లు సంగతి ఏంటని నిలదీశారు. అయితే హోటల్ గదికి వెళ్లి డబ్బులు తెస్తానని చెప్పాడు. సిబ్బంది అతన్ని వదిలి పెట్టలేదు. నాటకం మొదలు పెట్టాడు. గుండెనొప్పి వస్తోంది ఆంబులెన్స్‌ని పిలవాలంటూ హంగామా చేశాడు. కానీ వాళ్లు ఆంబులెన్స్‌కు బదులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతగాడి మోసానికి చెక్ పడింది. అతని ఫోటోను అన్ని రెస్టారెంట్లకు పంపి, అరెస్ట్ చేయించామని స్థానిక రెస్టారెంట్ మేనేజర్ మీడియాకు తెలిపారు. గత ఏడాది నవంబరు 22 నుంచి ఈ వ్యక్తి ఈ నగరంలోనే ఉంటున్నాడట. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) -
టాలీవుడ్లో విషాదం.. తారకరత్నను మరవకముందే మరొకరు మృతి
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. తారకరత్న మరణం మర్చిపోకముందే మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 2017లో వచ్చిన 'దర్శకుడు' మూవీకి ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బాజీరావు మస్తానీ, ధూమ్ 3, బేబీ, పంజా, యమదొంగ చిత్రాలకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా సేవలందించారు. ప్రవీణ్ మృతి చెందడం టాలీవుడ్ మరోసారి విషాదంలో మునిగిపోయింది. -
పదే పదే చెప్పినా పట్టించుకోలేదు.. డీజే సౌండ్ మోతకు కొత్త పెళ్లికొడుకు మృతి!
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఓ వరుడి కల కలగానే మిగిలిపోయింది. మండపంలో డీజే సౌండ్ మోతకు ఆ వరుడి గుండె లయ తప్పి స్టేజిపైనే అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన మండపం కాస్త మూగపోయింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొంది. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు బీహార్లోఘో వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో వివహం జరుగుతోంది. వధూవరులు స్టేజిపైకి వచ్చి దండలు మార్చుకుని, వచ్చిన అతిథులతో ఫోటోలు దిగుతున్నారు. అదే సమయంలో అతడి మిత్రులు డీజే సౌండ్‌ను పెంచి, డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి హంగామా కారణంగా ఆ వాతావరణమంతా సందడి నెలకొంది. అంతా బాగానే నడుస్తుండగా, డీజే తనకు ఇబ్బందిగా ఉందని సౌండ్ తగ్గించాలని పదేపదే కోరాడు వరుడు. కానీ, అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పాటలు యథావిధిగానే బిగ్గరగా వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది క్షణాల తర్వాత వరుడు వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోగా, కుటుంబ సభ్యులు, అతిథులు వెంటనే అతడిని వైద్య సహాయం కోసం స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ దురదృష్టకర సంఘటన వెనుక పెళ్లి ఊరేగింపులో డీజే సంగీతం ఎక్కువగా వినిపించడమే కారణమని తెలిసింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. నివేదికల ప్రకారం, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి సీతామర్హి జిల్లాలో డీజేల వినియోగాన్ని నిషేధించారు. వివాహాలు, ఇతర బహిరంగ కార్యక్రమాల సమయంలో డీజేల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది. చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత.. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి
కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. మన్దీప్ రాయ్ (74) బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్దీప్ రాయ్ ఆదివారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన మరణంపై ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మన్దీప్ రాయ్ బెంగాలీ అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించారని తెలిపారు. కన్నడ పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మన్దీప్ రాయ్ నటించిన చిత్రాలు వరుసగా 'మించిన ఓట', 'పుష్పక విమానం', 'దేవర ఆట', 'నాగరహావు', 'ఆప్త రక్షక', 'అమృతధారే', 'కురిగాలు సార్ కురిపాలు' వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. Mandeep Roy | Originally Bengali, Settled and Acted in Kannada Film Industry, Closely Connected to #Kannada #People He is Unforgettable in #Pushpaka Vimana #RIP #MandeepRoy #KFI #Kannada pic.twitter.com/TcP5EBNsFg — Venkat Bharadwaj (@csvenkat) January 29, 2023 -
ఇండియా గెలిచిన ఆనందంలో స్నేహితులతో పార్టీ.. అంతలోనే గుండెపోటుతో..
సాక్షి, హైదరాబాద్: ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిందన్న ఆనందంలో మద్యం సేవించి రాత్రి పొద్దుపోయే వరకు డ్యాన్స్‌లు చేశారు. ఉదయాన్నే చాతి నొప్పితో యువకుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఎన్.తిరుపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకకు చెందిన ప్రకాష్(26) నాలుగేళ్ల క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. అంజయ్యనగర్‌లోని పద్మా నిలయంలో ఉంటూ కొండాపూర్‌లోని ఎయిర్టెల్ డీటీహెచ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్ చూశారు. ఇండియా గెలవడంతో స్నేహితులతో కలిసి తెల్లవారు జామున 2 గంటల వరకు మద్యం తాగి డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో చాతిలో నొప్పిగా ఉందని చెప్పిన ప్రకాష్ నిద్రకు ఉపక్రమించాడు. ఉదయం నిద్ర లేచిన అతను కొద్దిసేపు వాకింగ్ చేసి మళ్లీ ఛాతిలో నొప్పి వస్తుందని విశ్రాంతి తీసుకుంటానని గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి స్నేహితులు అతడిని లేపేందుకు యత్నించగా అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (గణపతి మండపానికి రూ. 316 కోట్ల బీమా) -
గుండెపోటుతో మరో క్రికెటర్ అకాల మరణం
ముంబై రంజీ జట్టు పేసర్ రాజేష్ వర్మ(40) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని తన మాజీ సహచర ఆటగాడు భవిన్ థక్కర్ ధృవీకరించాడు. కాగా 2002లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రాజేష్ వర్మ వర్మ అరంగేట్రం చేశాడు. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన వర్మ మొత్తం ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. అతడు తన చివరి మ్యాచ్‌లో బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో ఆడాడు. 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన రాజేష్ వర్మ 23 వికెట్లు పడగొట్టాడు. దీంట్లో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక 2007లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో రాజేష్ వర్మ భాగంగా ఉన్నాడు. "రాజేష్ వర్మ మరణ వార్త విని షాక్‌కు గురయ్యా. అండర్-19 నుంచి మేమిద్దరం కలిసి క్రికెట్ ఆడాం. 20 రోజుల క్రితం మేమిద్దరం కలిసి ఓ టోర్నమెంట్లో పాల్గొన్నాం. శనివారం (ఏప్రిల్ 23) నేను అతడితో దాదాపు 30 నిమిషాలు పాటు ఫోన్లో మాట్లాడాను. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 4 గంటలకు అతడి చనిపోయాడాని నాకు ఫోన్ వచ్చింది. అతడు మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. అతడు మమ్మల్ని విడిచి వెళ్లి పోవడం చాలా బాధగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఠక్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'అతడు యార్కర్ల కింగ్.. ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు' -
జూనియర్ గద్దర్‌కు ఘన నివాళి
సాక్షి, అలంపూర్: జూనియర్ గద్దర్‌గా పేరుగాంచిన ఉపాధ్యాయుడు ప్రభాకర్‌కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కన్నీటి వీడ్కోలు పలికారు. అలంపూర్‌కు చెందిన ప్రభాకర్ గుండెపోటుతో మంగళవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు స్ధానిక శ్మశాన వాటికలో బుధవారం నిర్వహించారు. కళాకారుడిగా, సామాజిక సేవా కార్యకర్తగా, యూటీఎఫ్ సంఘంలో జిల్లా కోశాధికారిగా వివిధ రంగాల్లో సేవలు అందించి అందరి మన్ననలు పొందిన ఉపాధ్యాయుడు మృతితో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఉపాధ్యాయుడు మృతి చెందిన సమాచారంతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బుధవారం అలంపూర్‌కు చేరుకొని భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. అదేవిధంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, మహబుబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు రామదాసు, జిల్లా అధ్యక్షుడు తిప్పన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, ఎంఈఓలు రాజు, అశోక్‌కుమార్, డేవిడ్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీరితోపాటు వెంకటేష్ రమేష్, కృష్ణ, నాగరాజు తదితరులున్నారు. అలాగే హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ ఉపాధ్యాయుడు ప్రభాకర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర పశు వైద్యాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ ఉన్నారు. అనంతరం వారు ప్రభాకర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ప్రభాకర్ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం పాల్గొన్నారు. భౌతికకాయాన్ని సందర్శించిన ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్‌గౌడ్, జయరాముడు, కిషోర్, సుంకన్న ఉన్నారు. -
దివికేగిన అతిలోక సుందరి
-
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
సిద్దిపేట రూరల్: గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి చెందిన సంఘటన మండలంలోని వెంటాపూర్లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ యాదమ్మ (50) సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం అర్ధరాత్రి గుండెనొప్పి రావడంతో కుటుంబీకులు ఆమెను పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలను వెంకటాపూర్‌లో నిర్వహించారు. రెండు దశాబ్దాల పాటు ఆమో వెంకటాపూర్ సర్పంచ్‌గా పని చేశారు. -
ఆటో నడుపుతుండగా ఆగిన డ్రైవర్ గుండె
తిమ్మాపూర్ : ఆటో నడుపుతూనే డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన మండలంలోని నుస్తులాపూర్ వద్ద గురువారం జరిగింది. కొహెడకు చెందిన మామిడి మురళి(55) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం కొహెడ నుంచి కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆటోలో ప్రయాణికులతో తిరుగుపయనమయ్యాడు. నుస్తులాపూర్ స్టేజీ దాటిన తరువాత కొంతదూరం నెమ్మదిగా నడుపుతూ ఆటోను రోడ్డు దింపాడు. రోడ్డు పక్కన ఉన్న టైర్ పంక్చర్ షాప్ వద్దకు వెళ్లి అక్కడున్న మిషన్ తాకి నిలిచిపోయింది. డ్రైవర్ మురళిలో ఆటోనే వెనక్కి ఒరిగి మృతిచెందాడు. అందులో ఉన్న ప్రయాణికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు అక్కడకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబసభ్యులు అదే ఆటోలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. వారం రోజుల్లో ఇద్దరు డ్రైవర్లు... వారం రోజుల్లో కొహెడ మండలానికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు తిమ్మాపూర్ మండలంలో మృతి చెందారు. ఆగస్టు 25న ఇందిరానగర్ వద్ద ఆటోను కారు ఢీకొనగా కొహెడకు చెందిన ఆటో డ్రైవర్ బస్వరాజు శ్రీనివాస్ మృతి చెందాడు. ఆయన కర్మ కోసం ప్లేట్లు, గ్లాసులు, ఇతర వస్తువులు తీసుకెళ్తున్న కొహెడకే చెందిన ఆటోడ్రైవర్ మామిడి మురళి గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. -
గుండెపోటుతో కుప్పకూలి డ్రైవర్ మృతి
సూర్యాపేట(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండు ఆవరణలో గురువారం రాత్రి 9.20 గంటలకు ఒక ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గురువారం రాత్రి బస్టాండు ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెపోటుతో పొగాకు రైతు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జీలుగుపల్లి మండలం ములగలంపల్లిలో ఓ పొగాకు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలు.. ములగలంపల్లికి చెందిన రైతు సోమగాని రాంబాబు పొగాకు పండించేవాడు. అయితే, పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడం, అప్పులు ఎక్కువైన కారణంగా మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందాడు. మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, మండలానికి చెందిన నాయకులు పరామర్శించారు. -
అప్పుల బాధతో గుండెపోటు.. రైతు మృతి
కోస్గి(కర్నూల్) : అప్పుల బాధతో మానసిక వేదనకు గురవుతున్న ఓ రైతు గుండెపోటుతో తన పొలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా కోస్గి మండలంలోని జలగల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. జలగల గ్రామానికి చెందిన రొక్కప్పకు వరుసగా మూడేళ్లపాటు పంటలు సరిగా పండలేదు. దీంతో రెండు లక్షల రూపాయల అప్పులయ్యాయి. దీనికి తోడు కొడుకు ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలో తన పొలంలో ఉండగా రైతు రొక్కప్పకు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.