సూర్యాపేట(నల్గొండ జిల్లా): నల్గొండ జిల్లా సూర్యాపేట కొత్త బస్టాండు ఆవరణలో గురువారం రాత్రి 9.20 గంటలకు ఒక ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా గురువారం రాత్రి బస్టాండు ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.