
మంచిర్యాల: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బూసి బాపు(53) శనివారం విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం భోజనం తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాలకు తీసుకెళ్లమని సూచించారు.
వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసువెళ్లి చూపించగా వారు కూడా మంచిర్యాలకు రెఫర్ చేశారు. కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య గౌరుబాయి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment