డ్రైవింగ్ సీటులో ఉండి టికెట్లు కొడుతన్న డ్రైవర్
శ్రీకాకుళం ,పాలకొండ రూరల్ : ఆర్టీసీ ప్రయాణం సుఖం.. శుభప్రదం.. అంటున్న సంస్థ అందుకు తగ్గట్లు చర్యలు తీ సుకోవటంలో విఫలమవుతోంది. ప్రయాణికులను స కాలంలో గమ్యస్థానానికి చేర్చే క్రమంలో.. తీసుకోవా ల్సిన భద్రతా చర్యలు విస్మరిస్తోంది! ఒకే వ్యక్తికి డ్రై వర్, కండక్టర్ విధులను అప్పగించడంతో డ్రైవర్లు చే తులు ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ నెక్ రీజయన్ పరి ధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో తొ మ్మిది డిపోలున్నాయి. వీటి పరిధిలో అధిక శాతం స ర్వీసులు, సంస్థకు లాభాలు తెచ్చేవి విశాఖ రూట్ బ స్సులు. వీటిని సమర్థంగా నిర్వహించాల్సిన యాజ మాన్యం.. కేవలం తమ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ఒకే డ్రైవర్‌తో రెండు విధులు నిర్వహిస్తోంది !!
ఒక్కో స్టేజ్ వద్ద 20 నిమిషాలు..
పాలకొండ– విశాఖ సింగిల్ రహదారిలో ట్రాఫిక్ అధికం. దీనికితోడు ఈ రహదారిలో గమ్యస్థానం 128 కిలోమీటర్లు. 3 గంటల 15 నిమిషాల్లో చేరాలి. ఈ ప్రయాణంలో 55 చోట్ల వేగనిరోధకాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్టణం చేరేలోపు కొమ్మాది నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అధికం. పాలకొండ నుంచి బయలుదే రిన బస్సు రాజాం, చీపురుపల్లి, విజయనగరం కాంప్లెక్స్‌ల్లో ఎక్కిన ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేం దుకు ఒక్కో స్టేజీ వద్ద 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ లెక్కన నిర్ణీత సమయంలో సగం సమయం టికెట్లు అందించడానికే సరిపోతుంది. దీంతో అదనంగా రెండు గంటలు ప్రయాణికుడు బస్సులోనే కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వీరు అసహనానికి గురవుతున్నారు. ఇది కేవలం పాలకొండ డిపోలోనే కాదు రీజియన్ పరిధిలో సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట, విజయనగం డిపోల్లో జరుగుతోం ది.
పెరుగుతున్న ఒత్తిడి.. లోపిస్తున్న ఏకాగ్రత
వన్‌మేన్ సర్వీస్ పేరిట కేవలం డ్రైవర్‌కు రెండు విధులు అప్పగించడంతో విధినిర్వహణలో వీరు ఒత్తిడికి గురై మానసికంగా ఏకాగ్రత కోల్పోతున్నారు. నిర్ణీత సమయం, ప్రయాణికుల నుంచి సొమ్ము సేకరణ, సమయపాలన పాటించాలనే తపన, ప్రయాణికుల ఒత్తిళ్లు, ట్రాఫిక్‌ను అధిగమించటం వంటివి ఏకకాలంలో నిర్వహించలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్లిష్టమైన స్థితిలో విధినిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లకు ఉద్యోగులపై వేటు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పాలకొండ డిపోకు చెందిన వన్‌మెన్ సర్వీసు బస్సులు రెండు చోట్ల(ఎంటీ–ఏ) ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం యాజమాన్యం ఒత్తిళ్లతో కిందిస్థాయి అధికారులు తమపై భారమైన విధులు కేటాయిస్తున్నట్లు సదరు సిబ్బందే చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రమాదాలు నిలువరించేందుకు డ్రైవర్లకు ఏకాగ్రత, విశ్రాంతి కావాలంటున్న సంస్థ ఈడీ ఎ.రామకృష్ణ ఈ వన్‌మేన్ ‘షో’పై దృష్టిసారించకపోవటం గమనార్హం. ఇప్పటికైనా యాజమాన్యం ఈ విధానంపై పునరాలోచించి ఇటు భద్రతతో పాటు సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయాలి
ఆర్టీసీ సేవలు నిరుత్సాహపరుస్తున్నాయి. పాలకొండ నుంచి విశాఖకు కేవలం మూడు గంటలు అని చెప్పి తీరా బస్సు ఎక్కిన తర్వాత ఐదు గంటల సమయం తీసుకుంటున్నారు. వివిధ పనులపై వెళ్లేవారు అధిక సమయం బస్సులోనే గడపాలి. దీనిపై వినియోగదారుల ఫోరానికి ప్రయాణికులు ఫిర్యాదు చేయాల్సి ఉంది.– కె.స్వామినాయుడు, ప్రయాణికుడు
హైవే డ్రైవింగ్ సరేసరి
నెక్ రీజియన్‌లో ఉన్న తొమ్మిది డిపోల్లో పలాస, టెక్కటి, శ్రీకాకుళం–1,2 డిపోలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, ఎస్.కోట, విజయనగరం డిపోల సర్వీసులు అధికంగా గ్రామీణ రహదారుల్లో నడపాల్సి ఉంది. దీంతో కొన్ని డిపోల్లో డ్రైవర్లకు విధులు కొంతమేర సక్రమంగా ఉంటే మిగిలిన గ్రామీణ డిపోల పరిధిలో ఉన్న డిపోల్లో డ్రైవర్లు క్లిష్టమైన విధులు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నారు.