conducters
-
ఆర్టీసీలో వన్‌మేన్ షో
శ్రీకాకుళం ,పాలకొండ రూరల్ : ఆర్టీసీ ప్రయాణం సుఖం.. శుభప్రదం.. అంటున్న సంస్థ అందుకు తగ్గట్లు చర్యలు తీ సుకోవటంలో విఫలమవుతోంది. ప్రయాణికులను స కాలంలో గమ్యస్థానానికి చేర్చే క్రమంలో.. తీసుకోవా ల్సిన భద్రతా చర్యలు విస్మరిస్తోంది! ఒకే వ్యక్తికి డ్రై వర్, కండక్టర్ విధులను అప్పగించడంతో డ్రైవర్లు చే తులు ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ నెక్ రీజయన్ పరి ధిలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో తొ మ్మిది డిపోలున్నాయి. వీటి పరిధిలో అధిక శాతం స ర్వీసులు, సంస్థకు లాభాలు తెచ్చేవి విశాఖ రూట్ బ స్సులు. వీటిని సమర్థంగా నిర్వహించాల్సిన యాజ మాన్యం.. కేవలం తమ నిర్వహణ ఖర్చు తగ్గించుకునేందుకు ఒకే డ్రైవర్‌తో రెండు విధులు నిర్వహిస్తోంది !! ఒక్కో స్టేజ్ వద్ద 20 నిమిషాలు.. పాలకొండ– విశాఖ సింగిల్ రహదారిలో ట్రాఫిక్ అధికం. దీనికితోడు ఈ రహదారిలో గమ్యస్థానం 128 కిలోమీటర్లు. 3 గంటల 15 నిమిషాల్లో చేరాలి. ఈ ప్రయాణంలో 55 చోట్ల వేగనిరోధకాలు ఉన్నాయి. అలాగే విశాఖపట్టణం చేరేలోపు కొమ్మాది నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ అధికం. పాలకొండ నుంచి బయలుదే రిన బస్సు రాజాం, చీపురుపల్లి, విజయనగరం కాంప్లెక్స్‌ల్లో ఎక్కిన ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేం దుకు ఒక్కో స్టేజీ వద్ద 20 నిమిషాల సమయం పడుతుంది. ఈ లెక్కన నిర్ణీత సమయంలో సగం సమయం టికెట్లు అందించడానికే సరిపోతుంది. దీంతో అదనంగా రెండు గంటలు ప్రయాణికుడు బస్సులోనే కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వీరు అసహనానికి గురవుతున్నారు. ఇది కేవలం పాలకొండ డిపోలోనే కాదు రీజియన్ పరిధిలో సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట, విజయనగం డిపోల్లో జరుగుతోం ది. పెరుగుతున్న ఒత్తిడి.. లోపిస్తున్న ఏకాగ్రత వన్‌మేన్ సర్వీస్ పేరిట కేవలం డ్రైవర్‌కు రెండు విధులు అప్పగించడంతో విధినిర్వహణలో వీరు ఒత్తిడికి గురై మానసికంగా ఏకాగ్రత కోల్పోతున్నారు. నిర్ణీత సమయం, ప్రయాణికుల నుంచి సొమ్ము సేకరణ, సమయపాలన పాటించాలనే తపన, ప్రయాణికుల ఒత్తిళ్లు, ట్రాఫిక్‌ను అధిగమించటం వంటివి ఏకకాలంలో నిర్వహించలేక అవస్థలు పడుతున్నారు. ఈ క్లిష్టమైన స్థితిలో విధినిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లకు ఉద్యోగులపై వేటు పడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల పాలకొండ డిపోకు చెందిన వన్‌మెన్ సర్వీసు బస్సులు రెండు చోట్ల(ఎంటీ–ఏ) ప్రమాదాలకు గురయ్యాయి. కేవలం యాజమాన్యం ఒత్తిళ్లతో కిందిస్థాయి అధికారులు తమపై భారమైన విధులు కేటాయిస్తున్నట్లు సదరు సిబ్బందే చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రమాదాలు నిలువరించేందుకు డ్రైవర్లకు ఏకాగ్రత, విశ్రాంతి కావాలంటున్న సంస్థ ఈడీ ఎ.రామకృష్ణ ఈ వన్‌మేన్ ‘షో’పై దృష్టిసారించకపోవటం గమనార్హం. ఇప్పటికైనా యాజమాన్యం ఈ విధానంపై పునరాలోచించి ఇటు భద్రతతో పాటు సిబ్బందిపై ఒత్తిడి లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేయాలి ఆర్టీసీ సేవలు నిరుత్సాహపరుస్తున్నాయి. పాలకొండ నుంచి విశాఖకు కేవలం మూడు గంటలు అని చెప్పి తీరా బస్సు ఎక్కిన తర్వాత ఐదు గంటల సమయం తీసుకుంటున్నారు. వివిధ పనులపై వెళ్లేవారు అధిక సమయం బస్సులోనే గడపాలి. దీనిపై వినియోగదారుల ఫోరానికి ప్రయాణికులు ఫిర్యాదు చేయాల్సి ఉంది.– కె.స్వామినాయుడు, ప్రయాణికుడు హైవే డ్రైవింగ్ సరేసరి నెక్ రీజియన్‌లో ఉన్న తొమ్మిది డిపోల్లో పలాస, టెక్కటి, శ్రీకాకుళం–1,2 డిపోలు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, ఎస్.కోట, విజయనగరం డిపోల సర్వీసులు అధికంగా గ్రామీణ రహదారుల్లో నడపాల్సి ఉంది. దీంతో కొన్ని డిపోల్లో డ్రైవర్లకు విధులు కొంతమేర సక్రమంగా ఉంటే మిగిలిన గ్రామీణ డిపోల పరిధిలో ఉన్న డిపోల్లో డ్రైవర్లు క్లిష్టమైన విధులు నిర్వహించలేక చేతులెత్తేస్తున్నారు. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేష్టన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేష్టన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేష్టన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. -
బస్సులు ఫుల్...ఆదాయం నిల్..
దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో కండక్టర్ల చేతివాటం ఆకస్మిక తనిఖీలో దొరికిన ముగ్గురు సిబ్బంది ఇద్దరి సస్పెన్షన్, ఒకరికి జరిమానాl అన్నవరం : నష్టాల్లో నడుస్తున్న అన్నవరం దేవస్థానం ట్రాన్స్‌పోర్టు ను లాభాల బాటలోకి మళ్లించేందుకు అధికారులు చేస్తున్న య త్నాలు ఇంటి దొంగల పుణ్యమా అని నిష్ఫలంగా మారుతున్నా యి. అన్నవరం కొండపై నుంచి రైల్వేస్టేçÙన్కు నడిచే దేవస్థానం బస్‌లలో భక్తులు ఎక్కువగానే ప్రయాణిస్తున్నా ఆదాయం అంతంతమాత్రమే. ఈ నేపథ్యంలోజరిపిన తనిఖీల్లో కొందరు కండక్టర్లు భక్తుల నుంచి నగదు వసూలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా జేబులలో వేసుకుంటున్న విషయం వెల్లడైంది. దేవస్థానం ట్రాన్స్‌పోర్టు గత మూడేళ్లుగా రూ.లక్షల నష్టాన్ని చవి చూస్తున్నా భక్తుల కోసం నిర్వహిస్తున్నారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం నాలుగు బస్‌లను రైల్వేస్టేçÙన్ నుంచి కొండమీదకు నడుపుతోంది. సగం మందికే టిక్కెట్లు.. తెల్లవారుజామున రెండున్నర గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకూ ఆరు ప్రధాన రైళ్లు అన్నవరం స్టేషన్లో ఆగుతాయి. వాటిలో వచ్చే భక్తులు దేవస్థానం బస్‌ల ద్వారా రత్నగిరికి చేరుకుంటారు. అయితే కొందరు కండక్టర్లు బస్ నిండా భక్తుల్ని ఎక్కించాక కొందరికే టిక్కెట్లు ఇచ్చి మిగిలిన వారికి ఇవ్వకుండా ఆ సొమ్ములను దిగమింగుతున్నారు. బస్‌లో 50 మంది ఎక్కినా టి క్కెట్లు సగం మందికే ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈఓ ఆదేశాల తో దేవస్థానం రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నాలుగు రోజుల క్రితం తెల్లవారుజామున 5 గంటల సమయంలో స్టేçÙన్ నుంచి రత్నగిరి కి వస్తున్న బస్‌ను తనిఖీ చేయగా భక్తుల్లో కొందరికి టిక్కెట్లు ఇవ్వని విషయం వెల్లడైంది. ఔట్సోర్సింగ్ పై పనిచేస్తున్న ఆ బస్ కండక్టర్ బి.వేంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. ఆదివారం మరో రెండు బస్‌లు తనిఖీ చేయగా ఒక కండక్టర్ ఆర్.రామకృష్ణ 20 మంది భక్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని తేలడంతో సస్పెండ్ చేశారు. మరో కండక్టర్ బీవీ కిషోర్ ఐదుగురికి టిక్కెట్లు ఇవ్వకపోవడంతో రూ.రెండు వేలు ఫైన్ విధించారు. బస్‌లలో ఆకస్మిక త నిఖీలను ఇక ముందూ కొనసాగిస్తామని ఈఓ నాగేశ్వరరావు సోమవారం ‘సాక్షి’కి తెలిపారు.