అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు | RTC bus Lost control | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

Published Mon, Oct 5 2015 8:16 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

RTC bus Lost control

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.

సోమవారం రాజాం వెళుతున్న ఆర్టీసీ బస్సు సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో కిక్కిరిసి ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమదాం అనంతరం ప్రయాణికులంతా ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement