out of control
-
అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు
బీబీనగర్: వరంగల్–1 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. శనివారం హైదరా బాద్ నుంచి వరంగల్‌కు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపుతప్పి రహదారి పక్కన గల గుంతలో చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. దాదాపు 200 మీటర్లు దూరం వరకు బస్సు అలా ముందుకు వెళ్లిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే స్థానికులు వెంటనే వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. కాగా, బస్సులో 20 మంది పైగా ఎస్సై పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు. ఆదివారం పరీక్ష ఉండగా వారు ఒక రోజు ముందుగానే వరంగల్‌కు బయలుదేరారు. వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాతాలకు చెందిన వారని తెలిసింది. స్టీరింగ్ లాక్ కావడంవల్లే: డ్రైవర్ రాజన్న ఈ ప్రమాదంపై డ్రైవర్ రాజన్న మాట్లాడుతూ.. ఎయిమ్స్ సమీపంలోకి రాగానే స్టీరింగ్ లాక్ కావడంతో బస్సు ఎడమ వైపు దూసుకెళ్లిందని, వెంటనే బ్రేక్ వేశానని, అయినా కొంతదూరం చెట్లపొదల్లోకి వెళ్లి నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం ప్రయాణికులను ఇతర డిపోలకు చెందిన బస్సులలో ఎక్కించి పంపించారు. ఇదిలా ఉండగా బస్సు చెట్లను ఢీకొని ఆగిపోవడంతోనే తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు తెలిపారు. -
ఐఎస్ఎస్కు తప్పిన పెనుముప్పు
మాస్కో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పెనుముప్పు తప్పింది. రష్యా ప్రయోగించిన ఓ మాడ్యూల్లో ఏర్పడిన మంటల కారణంగా ఐఎస్ఎస్ దిశ మారింది. నిమిషానికి అర డిగ్రీ చొప్పున మొత్తం 45 డిగ్రీల కోణంలోకి వెళ్లింది. భూమిపై ఏర్పాటు చేసిన సెన్సర్లు దీన్ని గుర్తించడంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అప్రమత్తమమై దాన్ని సరిచేసింది. అసలేం జరిగింది: గురువారం రష్యాకు చెందిన నౌకా అనే మాడ్యూల్ ఐఎస్ఎస్ వద్దకు ప్రయాణ మైంది. ఐఎస్ఎస్కు అది చేరుకున్న తర్వాత ఆటోమేటిగ్గా దానికి అనుసంధానం కావాల్సి ఉంది. అయితే, అలా జరగలేదు. దీంతో మాన్యువల్‌గా మాడ్యూల్‌ను ఐఎస్ఎస్కు అనుసంధానం చేశారు. అంతలోనే మరో సమస్య ఏర్పడింది. నౌకా మాడ్యూల్ లోని థ్రస్టర్లు ఉన్నట్టుండి మండటంతో ఐఎస్ఎస్ దిశ మారడం ప్రారంభమైంది. దీన్ని భూమ్మీద ఉన్న సెన్సర్లు గుర్తించడంతో నాసా శాస్త్రవేత్తలు అప్రమత్త మయ్యారు. నాసాకు చెందిన థ్రస్టర్లను, ఇంజిన్లను పూర్తిగా ఆపేశారు. దానికి వ్యతిరేక దిశలో ఉన్న మరో మాడ్యూల్ నుంచి థ్రస్టర్లను మండించి సరైన దిశకు మళ్లించారు. ఈ ప్రక్రియ 45 నిమిషాల పాటు సాగింది. ప్రారంభంలో మాడ్యూల్ దిశ మారుతుండగా మొదటి 15 నిమిషాల్లో కోల్పోయిన సిగ్నల్స్.. ఐఎస్ఎస్ తిరిగి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ అందాయి. ప్రమాదం జరిగి ఉంటే.. నాసా శాస్త్రవేత్తలు తక్షణం స్పందించ డంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే ఐఎస్ఎస్లో ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్లు ప్రమాదంలో పడి ఉండేవారు. అలా జరిగితే ఆకాశంలోకి తప్పించుకోవడానికి వేరే సదుపాయాలు ఉన్నాయని నాసా పేర్కొంది. తప్పించుకోవడానికే ఏర్పాటు చేసిన స్పేస్ ఎక్స్ క్రూ కాప్సూ్యల్ వారి ప్రాణాలను రక్షించేదని తెలిపింది. -
గాల్లో గిరగిరా తిరిగిన ఎంపీ చాపర్
జైపూర్ : బీజేపీ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాలక్‌నాథ్ ఆళ్వార్ నుంచి హెలికాఫ్టర్‌లో ప్రయాణమయ్యారు. అయితే చాపర్ టెకాఫ్ అవుతుండగా నియంత్రణ కోల్పోయింది. భూమికి కొద్ది ఎత్తులోనే గాల్లో గిరగిరా తిరిగింది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాపర్ ఎక్కడ కూలిపోతుందనే భయంతో అరవడం ప్రారంభించారు. కానీ పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే చాపర్ సరైన దిశలో ప్రయాణించిది. ఈ భయానక పరిస్థితి నుంచి బాలక్‌నాథ్ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్వార్ నుంచి బాలక్‌నాథ్ ఎంపీగా విజయం సాధించారు. ఆయనకు మొత్తంగా 7.6 లక్షల ఓట్లు వచ్చాయి. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
అమరావతి ,చినలింగాయపాలెం(కాకుమాను): ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఇరువురికి స్వల్ప గాయాలైన సంఘటన మండలంలోని చినలింగాయపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది.ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొన్నూరు నుంచి పెదనందిపాడు వైపు వస్తూ చినలింగాయపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే బస్సు టైరు కమాన్ కట్టలు విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ సుభానీ చాకచక్యంతో బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో మొత్తం 29మంది ప్రయాణికులు ఉండగా వారిలో పది మంది విద్యార్థులు ఉన్నారు.పఠాన్ సప్తాజ్ అనే మహిళకు, మరో చిన్నారికి ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పొన్నూరు ప్రజా వైద్యశాలకు తరలించారు.కాకుమాను ఎస్ఐ రామాంజనేయులు క్షతగ్రాతుల వివరాలను సేకరించారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం రాజాం వెళుతున్న ఆర్టీసీ బస్సు సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో కిక్కిరిసి ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమదాం అనంతరం ప్రయాణికులంతా ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.