
జైపూర్ : బీజేపీ ఎంపీ మహంత్ బాలక్‌నాథ్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టెకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పింది. వివరాల్లోకి వెళితే.. బాలక్‌నాథ్ ఆళ్వార్ నుంచి హెలికాఫ్టర్‌లో ప్రయాణమయ్యారు. అయితే చాపర్ టెకాఫ్ అవుతుండగా నియంత్రణ కోల్పోయింది. భూమికి కొద్ది ఎత్తులోనే గాల్లో గిరగిరా తిరిగింది. దీంతో అక్కడ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చాపర్ ఎక్కడ కూలిపోతుందనే భయంతో అరవడం ప్రారంభించారు.
కానీ పైలట్ చాకచాక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కొద్దిసేపటికే చాపర్ సరైన దిశలో ప్రయాణించిది. ఈ భయానక పరిస్థితి నుంచి బాలక్‌నాథ్ క్షేమంగా బయటపడటంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్వార్ నుంచి బాలక్‌నాథ్ ఎంపీగా విజయం సాధించారు. ఆయనకు మొత్తంగా 7.6 లక్షల ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment