
అమరావతి ,చినలింగాయపాలెం(కాకుమాను): ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఇరువురికి స్వల్ప గాయాలైన సంఘటన మండలంలోని చినలింగాయపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది.ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పొన్నూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పొన్నూరు నుంచి పెదనందిపాడు వైపు వస్తూ చినలింగాయపాలెం అడ్డరోడ్డు వద్దకు రాగానే బస్సు టైరు కమాన్ కట్టలు విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పింది. డ్రైవర్ సుభానీ చాకచక్యంతో బస్సును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
బస్సులో మొత్తం 29మంది ప్రయాణికులు ఉండగా వారిలో పది మంది విద్యార్థులు ఉన్నారు.పఠాన్ సప్తాజ్ అనే మహిళకు, మరో చిన్నారికి ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పొన్నూరు ప్రజా వైద్యశాలకు తరలించారు.కాకుమాను ఎస్‌ఐ రామాంజనేయులు క్షతగ్రాతుల వివరాలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment