ధర్నా చేస్తున్న టీఎంయూ నాయకులు
నారాయణపేట రూరల్: ఆయన దాదాపు 30 ఏళ్లుగా ఆర్టీసీకి సేవలు అందిస్తూ మరో ఎనిమిది నెలల్లో పదవీ విరమణ పొందనున్న డ్రైవర్.. తన జీవితకాలంలో ఎప్పుడు కూడా మందు తాగలేదు.. స్నేహితులు, తోటి వర్కర్లు సైతం ఈ విషయంలో ఎన్నోసార్లు ఆ యన్ను అభినందించారు.. అయితే అలాంటి వ్యక్తిని జీవంలేని ఎలక్ట్రానిక్ వస్తువును అడ్డం పెట్టుకుని చేయని త ప్పు చేసినట్లు ముద్దాయిగా నిలబెట్టారు. రోజువారి విధులకు పంపకుండా అం దరి మధ్య ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే లా ప్రవర్తించారు.. చివరికి ఎటూ తేల్చకుండా కేస్‌షీట్ చూసి పనిష్‌మెంట్ డిసై డ్ చేస్తామని తాపీగా చెప్పుకొస్తున్నారు.
డిపో ఎదుట ఆందోళన
ఆర్టీసీ డిపోలో విధులకు హాజరయ్యే డ్రైవర్లకు ప్రతిరోజు ఉదయం సెక్యూరిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసి లోపలికి పంపించడం ఆనవాయితీ. ఈ క్ర మంలో గురువారం ఉదయం డ్యూటీకి వచ్చిన డ్రైవర్ ఎస్‌ఎన్ నాయక్‌కు సైతం పరీక్షించగా అది 54 పాయింట్లు చూయి ంచింది. విషయం తెలిసిన డీఎం భక్షినాయక్ వెంటనే ఆయన డ్యూటీని రద్దు చేసి పక్కకు కూర్చోబెట్టారు. అయితే తన జీవితకాలంలో మందు తాగలేదని చెప్పి నా వినిపించుకోలేదు. తోటి కార్మికులు, కార్మిక సంఘం నాయకులు చెప్పినా పట్టించుకోలేదు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ సరిగ్గా పనిచేయడం లేదని, వెంటనే మరొకటి తెచ్చి పరీక్షించాలని కోరినా చేయకపోవడంతో టీఎంయూ ఆద్వర్యం లో డిపో ముందు ధర్నా నిర్వహించారు. డీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిషన్ పొరపాట్లతో ఇటీవల ఒక డ్రైవర్‌ను సైతం ఇబ్బంది పెట్టారని, తిరిగి అదే పునరావృతం అయ్యిందని వాపోయారు. దాదాపు గంటపాటు బస్సులు బయటకు రాకపోవడం.. అసలే పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కా ర్యక్రమంలో హన్మంతు, వెంకట్రాము లు, కేవీఆర్ గౌడ్, మైనొద్దీన్, ఆంజనేయులు, మల్లేష్, మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.
పరిస్థితిని సమీక్షించిన సీఎస్‌ఐ
బ్రీత్ ఎనలైజర్ సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తూ ఆందోళన చేసిన విషయం జిల్లా అధికారుల దృష్టికి పోవడంతో వెంటనే జిల్లా చీఫ్ సెక్యూరిటీ అధికారి ఆంజనేయులును నారాయణపేటకు పంపించి పరిస్థితిని సమీక్షించారు. మిషన్ పనిచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం డీఎం, డ్రైవర్ ఎస్‌ఎన్ నాయక్, యూనియన్ లీడర్లతో వేర్వేరుగా సమావేశమై మాట్లాడారు. ఆల్కహాల్ తీసుకోకపోయినా మనం తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు, మెడిసిన్ వల్ల పాయింట్లు చూయించే అవకాశం లేకపోలేదని చెప్పారు. ఈ విషయంలో కార్మికుడికి నష్టం జరగకుండా చూస్తామని, ఆయన పీ కేస్ చూసి ఉన్నతాధికారులు పనిష్‌మెంట్ ఖరారు చేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment