కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడు కన్నుమూశారు. మన్‌దీప్ రాయ్ (74) బెంగళూరులో గుండెపోటుతో మరణించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్‌దీప్ రాయ్ ఆదివారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఆయన మరణంపై ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు వెంకట్ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మన్‌దీప్ రాయ్ బెంగాలీ అయినప్పటికీ బెంగళూరులో స్థిరపడి కన్నడ చిత్ర పరిశ్రమలో నటించారని తెలిపారు. కన్నడ పరిశ్రమతో గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మన్‌దీప్ రాయ్ నటించిన చిత్రాలు వరుసగా 'మించిన ఓట', 'పుష్పక విమానం', 'దేవర ఆట', 'నాగరహావు', 'ఆప్త రక్షక', 'అమృతధారే', 'కురిగాలు సార్ కురిపాలు' వంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశారు.
Mandeep Roy | Originally Bengali, Settled and Acted in Kannada Film Industry, Closely Connected to #Kannada #People He is Unforgettable in #Pushpaka Vimana #RIP #MandeepRoy #KFI #Kannada pic.twitter.com/TcP5EBNsFg
— Venkat Bharadwaj (@csvenkat) January 29, 2023
Comments
Please login to add a commentAdd a comment