
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత గౌరాక్లర్ మెడలో మూడు ముళ్లు వేశారు. మైసూరులో ఏర్పాటు చేసిన భారీ వేదికపై పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ వెడ్డింగ్ కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేశారు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ సైతం డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.
అయితే పెళ్లి తర్వాత తొలిసారి తన భార్య ధన్యతతో కలిసి ఆధ్యాత్మిక బాటపట్టారు డాలీ ధనుంజయ్. తన సతీమణితో కలిసి ఉగాది రోజున ప్రముఖ సిద్దేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతేకాకుండా కన్నడలో తాను నిర్మించిన విద్యావతి అనే మూవీ పోస్టర్‌తో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. వచ్చేనెల 10న విద్యావతి సినిమా థియేటర్లలో సందడి చేయనుందని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ‍్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్‌లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్‌లోనూ అదరగొట్టేశాడు.