dhanunjay
-
Singer Dhanunjay Unseen Photos: సింగర్ ధనుంజయ్ క్యూట్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
నన్ను చూసి'నారా'!
ఆ హావభావాలు.. ఆ కంటిచూపు.. కనుముక్కు తీరు.. శరీర కదలికలు.. నడక.. ఒడ్డూ పొడుగూ అచ్చం చంద్రబాబు నాయుడు పోలికలే. ఆయన పాత్రలో ఒదిగిపోయి మెప్పించారు. నటనలో ఏమాత్రం అనుభవం లేని ఓ సాధారణ వ్యక్తి పాత్ర పోషణలో ఔరా అనిపించారు. ఆయనే ధనుంజయ్ ప్రభు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిగా నటించారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయారు. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ చిత్రం గురువారం విడుదలైంది. ఈ సినిమాను చూసేందుకు ధనుంజయ్ ప్రభు (55) బుధవారం రాత్రి హైదరాబాద్ వచ్చారు. శ్రీనగర్ కాలనీలోని విన్‌ఫ్లోరా హోటల్లో దిగారు. గురువారం ఉదయం సినిమా చూసేందుకు జూబ్లీహిల్స్‌లోని చట్నీస్ హోటల్లో అల్పాహారం తీసుకుని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చిత్రాన్ని చూశారు. ఈ సినిమాలో నటించేందుకు తనకు వచ్చిన అవకాశం, ఆదరణ తదితర అంశాలపై ఆయన ఇలా ముచ్చటించారు. బంజారాహిల్స్: మాది ముంబై. ఆటో రిక్షా యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేశాను. అక్కడ బతుకుభారం కావడంతో థానే సమీపంలోని త్రయంబకేశ్వర్‌లో మహాలక్ష్మి భవన్ పేరుతో రెస్టారెంట్‌ను నడుపుతున్నాను. ఒకరోజు హోటల్ సప్లయర్ రాకపోవడంతో నేనే కస్టమర్లకు భోజనం సరఫరా చేయాల్సి వచ్చింది. నాకు తెలియకుండానే ఓ కస్టమర్ నేను భోజనం వడ్డిస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. తాను మాజీ సీఎం చంద్రబాబు నాయుడులా ఉంటానంటూ ఫేస్బుక్లో పెట్టడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. నన్ను పలకరించడానికి చాలా మంది వచ్చారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రామ్‌గోపాల్‌వర్మ నా ఆచూకీ తెలుసుకోవడానికి రెండునెలలు కష్టపడి ఎట్టకేలకు మా హోటల్‌కే వచ్చారు. నన్ను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. నేను అచ్చంగా చంద్రబాబునాయుడులా ఉంటానని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత ఫోన్ కాల్.. వర్మ వెళ్లిపోయిన తర్వాత కొద్దిరోజులకు నాకు ఫోన్ కాల్వచ్చింది. వారం రోజుల పాటు హైదరాబాద్ రావాలనిచెప్పడంతో ఇక్కడికి వచ్చాను. అప్పుడే నన్ను సినిమాలో చంద్రబాబు పాత్రలో నటించాలని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. వర్మ పేరున్న దర్శకుడు కావడం నన్ను నటించమని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కథ మొదట్లో తెలియదు. నాకు ఆ పాత్రలో నటించడం వరకే చెప్పారు. నాలో నటుడు ఉన్నాడన్న విషయాన్ని వర్మనే బయటకు తీశారు. ఆయనకు కృతజ్ఞతలు. మూడు వారాలు బాబు వీడియోలు చూశా.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించేందుకు నన్ను ఒప్పించారు. బాబు ఆహార్యం, అలవాట్లు, డ్రెస్ సెన్స్, పద్ధతులు, హావభావాలు అన్నీ అచ్చు గుద్దినట్లుగా ఉండాలని వర్మ చెప్పడంతో ఇక్కడే ఉండి చంద్రబాబుకు సంబంధించిన పలు వీడియోలు, ప్రసంగాలు, అసెంబ్లీలో ఆయన హావభావాలు గమనించాను. సినిమా బాగా వచ్చింది.. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రకు బాగా రెస్పాన్స్ వచ్చింది. బాబులో పరకాయ ప్రవేశం చేశావంటూ మెచ్చుకున్నారు. జబర్దస్త్ ఫర్మామెన్స్ చేశావని కొనియాడారు. ఇప్పుడు నేను సెలబ్రిటీనయ్యాను. సినిమా చూసి బయటకురాగానే వందలాది మంది ప్రేక్షకులు నా వద్దకు వచ్చి ఫొటోలు దిగారు. చంద్రబాబులా నటించడం చాలా కష్టమని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమా మంచి కాలక్షేపం. ఫన్నీగా ఉంటుంది. సినీ అవకాశాల్ని వదులుకోను.. ఈ సినిమాలో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. చంద్రబాబు పాత్ర కావడంతో బాగా పేరొచ్చింది.నా నటన కూడా అందరికీ నచ్చింది. వర్మసినిమాలో నటించడంతో మరింత పేరొచ్చింది. మంచి అవకాశాలు వస్తే నటిస్తాను. -
‘ఆ పిల్లల వివరాలు వెబ్సైట్లో పెడుతున్నాం’
సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్ ధనుంజయ్. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్పీఎఫ్ వెబ్ పోర్టల్‌లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్‌తో పాటు ఫోన్ నెంబర్లను వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు. -
భయానికి అర్థం తెలియదు
‘‘నేను థియేటర్ ఆర్టిస్టుని. సిద్ధు (డైరెక్టర్), వర్మగారు ఆడిషన్ చేసి ‘భైరవగీత’ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నారు. నా తొలి సినిమా తెలుగులో చేయడం హ్యాపీ. ఈ సినిమా నా జీవితాంతం గుర్తుంటుంది’’ అని ఐరా మోర్ అన్నారు. ధనుంజయ్, ఐరా మోర్ జంటగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవగీత’. రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతోంది. ఐరా మోర్ పంచుకున్న విశేషాలు... ► లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘భైరవగీత’. ఇందులో నేను గీత పాత్రలో నటించా. స్వతంత్ర భావాలు కలిగిన స్ట్రాంగ్ అమ్మాయి. లండన్‌లో చదివి హోమ్ టౌన్‌కి వస్తుంది. దేవుడి మీద పెద్దగా భక్తి ఉండదు. కానీ మానవత్వాన్ని నమ్ముతుంది. కుల వ్యవస్థను నమ్మదు. సొంత ఇంట్లోనే కులాల మధ్య అంతరం కనిపిస్తుంది.. బానిసత్వం తెలుస్తుంది. అలాంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. వర్మగారు ముక్కుసూటి మనిషి. ఆయనకు ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. అంతేకానీ, మనసులో పెట్టుకుని కన్ఫ్యూజ్ చేయరు. ► మాది జమీందారీ కుటుంబం. మా సామాజిక వర్గంలో భయం అనే పదానికి మీనింగ్ తెలియదు. భయం తెలియకపోవచ్చు కానీ, ఒక రకమైన బెరుకు మాత్రం ఉంటుంది. ► చాలా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. అక్కడ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ ఉండేది కాదు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపించేది. నేను కిసెస్కి కంఫర్టబుల్ కాదు. కానీ, తొలి సినిమాలో అవన్నీ చేసేటప్పుడు కాస్త థ్రిల్లింగ్‌గానే అనిపించింది. నా పాత్రను దృష్టిలో పెట్టుకుని చాలా చేశా. నాకు తెలుగు అర్థం కాదు. పాత్రను అంగీకరించడానికి ముందు నేను వందసార్లు ఆలోచిస్తా. ► ‘మీటూ’ లాంటి విషయాల గురించి అమ్మాయిలు చెప్పడం మంచిదే. మనం పనిచేసే వాతావరణం చాలా క్లియర్‌గా ఉండాలి. నేను రవితేజ, మహేష్బాబుగార్ల సినిమాలు చాలా చూశా. అనుష్కగారంటే చాలా ఇష్టం. నా పాత్ర నచ్చితే అది చిన్న రోల్ అయినా చేస్తా. -
అలా అన్నాడంటే ఫ్రాడ్ లేదా పిచ్చోడు అయ్యుండాలి
‘‘భైరవగీత’ నాకు చాలా స్పెషల్ మూవీ. నేను ఇన్నేళ్లలో ఎన్నో సినిమాలకు దర్శకుడిగా చేయడంతోపాటు చాలా చిత్రాలు నిర్మించాను. డైరెక్షన్ అంటే ఓవరాల్ ఎఫెక్ట్ అనుకుంటారు అందరూ. కానీ ఉన్న మెటీరియల్‌ను ఉపయోగించి సినిమాటిక్ యాంగిల్లోకి మార్చేవాడే నిజమైన దర్శకుడు అని నా భావన’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సిద్ధార్థ తాతోలుని దర్శకునిగా పరిచయం చేస్తూ రామ్‌గోపాల్ వర్మ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా, భాస్కర్ రాశి నిర్మించిన చిత్రం ‘భైరవ గీత’. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘సిద్ధార్థ నా దగ్గర ఒక సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పనిచేశాడు. అప్పుడు విలువైన సలహాలు ఇచ్చేవాడు. అతను ఇంటిలిజెంట్. కడప వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే సిద్ధార్థ ఆ ట్రైలర్‌ను నేను చేస్తానన్నాడు. సిద్ధూ అ సినిమా ఎలా చేస్తాడనే డౌట్ ఉండేది. నువ్వు నిజంగా చేయగలుగుతావా? అని కూడా అడిగాను. ఎవరైనా చేయలేని పని చేస్తాను అన్నాడంటే వాడు ఫ్రాడ్ అన్నా అయ్యుండాలి లేదా పిచ్చోడైనా అయ్యుండాలి. అతను పిచ్చోడు కాదు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రష్ చూసి షాకయ్యాను. ఈ సీన్‌ను ఇలా కూడా తీయొచ్చా అనిపించింది. అది నాకొక లెసన్. డైరెక్షన్ అనుభవం లేకుండా చేయటమనేది రేర్‌గా జరుగుతుంది. నా టైమ్‌లో నేను, మణిరత్నం, శేఖర్ కపూర్ ఎక్కడా అసిస్టెంట్స్‌గా చేయలేదు. ‘భైరవగీత’ కష్టంతో కూడుకున్న సినిమా. 90 శాతం కొత్తవాళ్లతో తీసిన చిత్రం’’ అన్నారు. సిద్ధార్థ తాతోలు మాట్లాడుతూ– ‘‘ఇంజనీరింగ్ చదివిన నేను సినిమాల్లోకి వెళతాను అనగానే నన్ను సపోర్ట్ చేసిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రాముగారికి థ్యాంక్స్ చెప్పి ఇచ్చిన చాన్స్‌ని చిన్నదిగా చేయదలచుకోలేదు. హీరో ధనుంజయ్‌ను ఈ సినిమా తర్వాత అందరూ భైరవా అని పిలుస్తారు. హీరోయిన్ ఐరా మోర్తో ప్రేక్షకులు ప్రేమలో పడతారు. అభిషేక్ గారితో పాటు నన్ను నమ్మి నాతో వర్క్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నిజ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. నేను ఇప్పటివరకు 10 సినిమాల్లో నటించాను ఇది నా 11వ చిత్రం’’ అన్నారు ధనుంజయ్. -
మంచి ప్రయత్నం
ధనుంజయ్, హృతిక సింగ్ జంటగా దినేష్. పి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ప్రయత్నం’. ధనుంజయ్ నిర్మించారు. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ ధనుంజయ్ భిన్నంగా ఆలోచించి ‘ప్రయత్నం’ సినిమాతో వస్తున్నాడు. చిరంజీవి అభిమాని అయిన ధనుంజయ్ విశాఖపట్నంలో ఉన్న కళాకారులను ప్రొత్సహించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. నటించాలనే ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న వైజాగ్ కళాకారులకు ఈ మూవీ ద్వారా అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ధనుంజయ్. -
హెల్మెట్ వాడకం తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వాడకం తప్పనిసరని జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని రహదారుల్లో దీని వాడకాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జాతీయ రహదారిపై హెల్మెట్ వాడకం నిబంధన అమలు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ఈ నెల 15వ తేదీ నుంచి కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ పదో తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొంత వెసులుబాటు ఇచ్చామన్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం నిబంధన కఠినంగా అమలు చేసేందుకు సమావేశం నిర్ణయించింది. హెల్మెట్ వినియోగం విషయంలో సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం స్పష్టమైన నిర్దేశాలు జారీ చేసిందన్నారు. ప్రతి ప్రాణం విలువైనదేనని... స్వయం రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. రూ. 14 లక్షలు మంజూరు ప్రమాదాల నివారణలో భాగంగా రహదారులపై స్టాపర్ బోర్డులు ఏర్పాటుకు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 14 లక్షలు మంజూరు చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. తక్షణమే స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేయాలని రవాణా, పోలీసు శాఖలకు సూచించారు. రహదారులు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్స్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు, వాహనాలు ఆగిపోయినపుడు వాటిని పక్కకు తీసేందుకు, రాంగ్ పార్కింగు వంటి సమయాల్లో త్రోయింగ్ వెహికల్ అవసరమని, దానిని సమకూర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటికే నగరపాలకసంస్థ టెండర్లను పిలిచామని సహాయ సిటీ ప్లానర్ వివరించారు. జాతీయ రహదారి పొడవునా రహదారి భద్రతా అంశాలను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జంక్షన్ల వద్ద రంబ్లిక్ స్టిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు పలాస 50 పడకల ఆస్పత్రిలో ట్రామాకేర్ కేంద్రం ఏర్పాటుకు రూ. 8 లక్షలు కేటాయించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత సౌకర్యాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి బి.సూర్యారావును ఆదేశించారు. గోల్డెన్ అవర్ సమయంలో ట్రామాకేర్ సేవలు ఎంతో అవసరమన్నారు. ట్రామాకేర్‌కు అవసరమయ్యే ఇతర సదుపాయాలను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధుల నుంచి సమకూర్చాలని ఆదేశించారు. భద్రతపై విస్తృత ప్రచారం: ఎస్పీ జిల్లా ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ మాట్లాడుతూ రహదారి భద్రతపై పోలీసుశాఖ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపట్టడం జరుగుతోందన్నారు. అవగాహన చర్యలతో ఫిబ్రవరి నెలలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో కేవలం మూడు మరణాలు మాత్రమే సంభవించాయన్నారు. జాతీయ రహదారిపై హెల్మెట్ నిబంధన కచ్చితంగా అమలు చేస్తుండడంతో ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో రాత్రిపూట అవగాహన చర్యలు చేపట్టడమే కాకుండా స్టాప్ అండ్ వాష్ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. 23 నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు రవాణాశాఖ ఉప కమిషనర్ సీహెచ్ శ్రీదేవి మాట్లాడుతూ రహదారి భద్రతా చర్యలకు రూ. 50.69 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఈ మొత్తంలో రూ. 22.54 లక్షలు విడుదల చేసిందని, మిగిలిన మొత్తంలో రాష్ట్రస్థాయిలో రహదారి భద్రతా పరికరాలు కొనుగోలు చేసి సరఫరా చేస్తారన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 23 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రహదారి భద్రతా చర్యలకు కేఆర్ స్టేడియం వద్ద ఉన్న సంస్కార్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం రూ. 2 లక్షలను విరాళంగా అందించిందన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వై.వెంకటేశ్వరరావు, డీఎస్పీలు ఎం. కృష్ణమూర్తినాయుడు, పి. మారావు, జి.స్వరూపారాణి, కె.రాఘవ, రవాణాశాఖ అధికారులు జె.రామ్‌కుమార్, పీవీ రావు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేత హత్య కుట్ర భగ్నం
-
వైఎస్ఆర్ సీపీ నేత హత్య కుట్ర భగ్నం
సాక్షి, అనంతపురం : జిల్లాలో మరోసారి అలజడి చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ యాదవ్‌ను చంపేందుకు కుట్ర పన్నిన పదిమంది కిరాయి హంతక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి పరిటాల సునీత డైరెక్షన్లోనే ధనుంజయ్ యాదవ్ హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడి ఆత్మహత్య
ఉరవకొండ : మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్రీరాములు, మృతుని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... మహిళ విషయంగా గ్రామానికి చెందిన వెంకటేసులు, అతని బామ్మర్ది మందలించడంతో అవమానభారంతో మనస్థాపానికి గురయ్యాడు. పెన్నహోబిళం సమీపంలోని తన సొంత పొలంలో శీతలపానీయంలో విషపు మందు కలుపుకొని తాగడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కూలీలు కొందరు వెంటనే ధనుంజయ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్య
కరీంనగర్: ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కతలాపూర్ మండలం గంభీర్పూర్లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ధనుంజయ్(33) ఆర్.ఎం.పీ డాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
కొడుకుని చంపిన తండ్రి
గుంతకల్లు : చిల్లర దొంగతనాలు, చిన్న నేరాలకు పాల్పడుతూ తమ పరువు తీస్తున్నాడని భావించిన ఓ తండ్రి తన సొంత కొడుకును గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన మంగళవారం అనంతపురం జిల్లా గుంతకట్టు పట్టణంలోని అంకాలమ్మగుడి వీధిలో చోటు చేసుకుంది. వివరాలు.. అంకాలమ్మగుడి వీధిలో నివాసముండే వశీకేరి కొడుకు ధనుంజయ్ (20) గత కొంతకాలంగా చిల్లర నేరాలకు పాల్పడుతున్నాడు. దీంతో ధనుంజయ్‌ను తండ్రి పలుమార్లు మందలించాడు. తండ్రి మాటలను ధనుంజయ్ పెడచెవిన పెట్టాడు. అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ధనుంజయ్ తండ్రి మంగళవారం గొడ్డలితో దాడి చేసి హతమార్చాడు. స్థానికులు ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన వశీకేరి నివాసానికి చేరుకున్నారు. అనంతరం ధనుంజయ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి వశీకేరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
కాపురానికి పంపలేదని కత్తితో దాడి
గుంతకల్ (అనంతపురం): భార్యను కాపురానికి పంపలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన ముగ్గురు బావమరదులపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్‌లోని హనుమేష్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో డ్రైవర్ అయిన ధనుంజయ్ స్థానికంగా పోర్టర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య నందిని ఆరు నెలల గర్భిణి. ఆమె మూడు రోజుల క్రితం పట్టణంలోని హనుమేష్‌నగర్‌లో తన పుట్టింటికి వెళ్లింది. భార్యను వెంటనే కాపురానికి పంపించాలని ధనుంజయ్ ఫోన్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులను కోరాడు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, కుదుటపడిన తర్వాత పంపిస్తామని చెప్పారు. ఈ క్రమంలో బావకు సర్ది చెబుదామని నందిని సోదరులు గణేశ్, అనిల్, రాజా మంగళవారం సాయంత్రం ధనుంజయ్ ఇంటికి వెళ్లారు. కోపంతో ధనుంజయ్ కత్తితో వారిపై దాడి చేశాడు. గాయపడిన ముగ్గురినీ కర్నూలు ప్రభుత్వ ఆస్ప్రత్రికి తరలించారు. వీరిలో గణేశ్, రాజా పరిస్థితి విషమంగా ఉంది. -
అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహత్య
రాప్తాడు (అనంతపురం): అగ్రిగోల్డ్ నుంచి రావాల్సిన డిపాజిట్ల విషయమై బాధితులు ఒత్తిడి చేయడంతో.. ఓ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదిపల్లిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ధనుంజయ్ చౌక ధరల దుకాణం నిర్వహిస్తున్నాడు. అగ్రిగోల్డ్ ఏజెంట్ కూడా అయిన అతడు గతంలో గ్రామానికి చెందిన పలువురి నుంచి సుమారు రూ.10 లక్షలను డిపాజిట్లు చేయించాడు. అవి తిరిగి రాకపోవడంతో ఆదివారం బాధితులు ధనుంజయ్‌ను నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన అతడు సోమవారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘ఎఫ్ఐఆర్’పై హైకోర్టుకు ఢిల్లీ సర్కారు
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పట్టణంలో నీట మునిగిన హడ్కో కాలనీలో వైఎస్సార్సీపీ నేతలు శనివారం పర్యటించారు. అనంతరం బాధితులకు పార్టీ నేతలు ఎన్ని ధనుంజయ్, గేదెల పురుషోత్తం తదితరులు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావు మాట్లాడుతూ, వర్షాలతో జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన వార్డు ల, కాలనీవాసులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యుడు అందవరపు సూరి బాబు, కేవీవీ సత్యనారాయణ, టి.కామేశ్వరి, దాసరి అప్పన్న, ఎ. త్రినాథ రెడ్డి, అప్పాజీరెడ్డి, కల్లేపల్లి విజయ్‌కుమార్, ఉండ్రాళ్ళ ధర్మారావు, పోతల రామారావు, చెట్లపల్లి మోహన్, ఎన్.శ్రీనివాస్, పాల్గొన్నారు. బూరవల్లిలో... బూరవల్లి (గార) : వంశధార నదీ ప్రవాహానికి గురైన 15 గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమా లు కొనసాగుతున్నాయి. శనివారం ఉద యం వైఎస్సార్సీపీ నాయకులు బూరవల్లి, అంబళ్లవలస పంచాయతీల పరిధిలోని ప్రజలకు బ్రెడ్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ముందుగా బూరవల్లి గ్రామం లో వరద దెబ్బకు కూలిన ఇళ్లను నాయకులు మార్పు ధర్మారావు, అందవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ, గేదెల పురుషోత్తం పరిశీలించారు. బాధితుల తో మాట్లాడి బ్రెడ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో పర్యటించి బాధితులకు ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. తర్వాత అంబళ్లవలసలో పర్యటించి బాధితులను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీస శ్రీహరిరావు, తంగి శివప్రసాద్, మళ్ల నర్సునాయుడు, చిట్టిబాబు, మళ్ల నారాయణమూర్తి, కొబగాన అప్పారావు, కర్రి పద్మావతి, బూరవల్లి రంగారావు, సత్యనారాయణ, శిమ్మ నీలం పాల్గొన్నారు. పంటనష్టం పరిశీలించిన నాయకులు పలాస రూరల్ : వరద బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వైఎ స్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యు డు డాక్టర్ కణితి విశ్వనాథం ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పలాస మండలం పూర్ణభద్ర, అమలకుడియా, సరియాపల్లి, వీరభద్రాపురం, టెక్కలిపట్నం, కమలాపురం, గోపివల్లభపురం, రేగులపాడు, మోదుగులపుట్టి, గరుడుఖండి గ్రామాల్లో ఆయన శని వారం పర్యటించి నష్టపోయిన పంటల ను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇచ్ఛాపురంలో.. ఇచ్ఛాపురం రూరల్ : బాహుదా నది పొంగిపొర్లడంతో ముంపునకు గురైన గ్రామాల్లో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎంవీ కృష్ణారావు పరిశీలించారు. జగన్నాథపురం, టి.బరంపురం, శాస నం, అరకుబద్ర, బొడ్డబడ తదితర గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
కూలీ సొమ్ము కోసం ఆందోళనలు
పెదబయలు, న్యూస్‌లైన్: గత ఏడాది చేసిన పనులకు కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉపాధి కార్యాలయానికి తాళం వేసి సిబ్బందిని ఐదు గంటల పాటు నిర్బంధించారు. గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండా సన్నిబాబు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసి 8 నెలలు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు. కూలీ సొమ్ము కోసం ధర్నాలు, ర్యాలీలు చేయాల్సిన దుస్థితి నెలకొం దని ఆవేదన చెందారు. ఫినో సిబ్బంది ద్వారా సొమ్ము అందిస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఏపీవో ధనుంజయ్ స్పందిస్తూ కూలీలకు రూ.67 లక్షలు చెల్లించాల్సి ఉంద న్నారు. మూడు రోజుల్లో రూ.15 లక్షలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఉపాధి కూలీలు శాంతించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కిల్లో శరభన్న, కోమటి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అరకులోయలో... అరకు రూరల్: బకాయి ఉన్న ఉపాధి కూలీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధి కూలీలు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలు వంతాల పూర్ణ (చినలబుడు సర్పంచ్), గొల్లూరి రాజు, సొనాయి కృష్ణారావు, సీపీఎం నేత పొద్దు బాలదేవ్ ల ఆధ్వర్యంలో కూలీలు ఉపాధి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లు, ఉపాధి ఏపీఎంలను నిర్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని ఉపాధి కూలీలకు సుమారు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉందన్నారు. తక్షణం సొమ్ము పంపిణీ చేయాలని కోరుతూ ఫినో సంస్థ మండల కో-ఆర్డినేటర్లను నిలదీశారు. వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యాలయంలోనికి వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. ఈ నెల 28లోగా బకాయి సొమ్ము మొత్తం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో వారిని విడిచిపెట్టారు.