ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కతలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
కరీంనగర్: ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కతలాపూర్ మండలం గంభీర్‌పూర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన ధనుంజయ్(33) ఆర్.ఎం.పీ డాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.