మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీరాములు, మృతుని బంధువులు తెలిపారు.
ఉరవకొండ : మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్‌ఐ శ్రీరాములు,
మృతుని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... మహిళ విషయంగా గ్రామానికి చెందిన వెంకటేసులు, అతని బామ్మర్ది మందలించడంతో అవమానభారంతో మనస్థాపానికి గురయ్యాడు.
పెన్నహోబిళం సమీపంలోని తన సొంత పొలంలో శీతలపానీయంలో విషపు మందు కలుపుకొని తాగడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కూలీలు కొందరు వెంటనే ధనుంజయ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.