konapuram
-
అప్పుడే సర్వే వివరాలు విడుదల: లగడపాటి
సాక్షి, పెనుకొండ రూరల్: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని.. అది రాష్ట్రప్రజల బలమైన ఆకాంక్ష అని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం కోనాపురంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలతో ప్రత్యేకహోదా రాదని.. పోరాటాల ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే పరిశ్రమలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రజలు ఇదే విషయాన్ని బలంగా విశ్వసిస్తున్నారన్నారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని, ప్రత్యేకహోదా ఇవ్వకపోతే రానున్న ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అదే గతి పడుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని.. ఎన్నికల సర్వే వివరాలు ఎన్నికలకు ముందుగా విడుదల చేస్తానని చెప్పారు. -
ఇసుకదిన్నె పడి కూలీ మృతి
పరిగి (పెనుకొండ రూరల్) : పరిగి మండలం కోనాపురం సమీపంలో సోమవారం ఇసుక దిబ్బపడి కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మణేసముద్రం గ్రామానికి చెందిన గౌరప్ప(48) దినసరి కూలీ. సోమవారం ట్రాక్టర్ పనులకు వెళ్లాడు. ట్రాక్టరుకు ఇసుక లోడు వేసి కూలీలు పంపారు. అనంతరం ఇసుకను కింది భాగంలో ఒక చోటుకు చేర్చుతుండగా పైనుంచి ఒక్కసారిగా ఇసుకదిన్నెలు విరిగి మీద పడటంతో గౌరప్ప ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి ఆత్మహత్య
ఉరవకొండ : మండలంలోని కోనాపురానికి చెందిన ధనుంజయ(23) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ శ్రీరాములు, మృతుని బంధువులు తెలిపారు. వారి కథనం ప్రకారం... మహిళ విషయంగా గ్రామానికి చెందిన వెంకటేసులు, అతని బామ్మర్ది మందలించడంతో అవమానభారంతో మనస్థాపానికి గురయ్యాడు. పెన్నహోబిళం సమీపంలోని తన సొంత పొలంలో శీతలపానీయంలో విషపు మందు కలుపుకొని తాగడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కూలీలు కొందరు వెంటనే ధనుంజయ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
చెరువు నింపండి
∙మీ కోసంలో కోనాపురం గ్రామస్తుల వినతి అనంతపురం అర్బన్ : ‘సార్ మా గ్రామానికి సంబంధించిన గుండేవని చెరువు కాలువ కంటే ఎత్తులో ఉంది. దీంతో కాలువ నీరు చేరువులోకి చేరదు. ఎత్తిపోతల ద్వారా చెరువుని నింపి ఆదుకోండి.’ అంటూ జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతంకు కనగానిపల్లి మండలం కోనాపురం గ్రామస్తులు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని నిర్వహించిన మీ కోసంలో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, జడ్పీ సీఈఓ రామచంద్ర అర్జీలు స్వీకరించారు. కోనాపురం గ్రామస్తులు ఇంటూరి పరంధామరెడ్డి, పత్తిపాటి రామాంజినేయులు, గిరిశపు హనుమంతు, నారా శ్రీరాములు, తదితరులు అర్జీ ఇచ్చి తమ సమస్యను తెలిపారు. కనగానపల్లి, రాంపురం, కోనాపురం, కుర్లపల్లి, బోలేపల్లి గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గుండేవని చెరువుకి నీరు ఇస్తే భూగర్భ జల మట్టం పెరిగి పై గ్రామాల్లో బోర్లకు నీరు వస్తుందని తెలిపారు. రైతులను ఆదుకోవాలి.. జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినిందని, రైతులకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు రామాంజి, తదితరులు విన్నవించారు. ఏజెన్సీ కొనసాగించండి మధ్యాహ్న భోజన ఏజెన్సీ ద్వారా కుటుంబం గడుస్తోంది. ఏజెన్సీని తొలగించడంతో ఇబ్బంది పడుతున్నాము. కనికరించి ఏజెన్సీ కొనసాగించే ఆదేశాలిచ్చి ఆదుకోవాలని ఎండీఎం ఏజెన్సీ నిర్వాహకురాలు జె.రమణమ్మ విన్నవించుకుంది. -
వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతి
పెనుకొండ రూరల్(పరిగి) : మండలంలోని కోనాపురంలో పెంటా వ్యాక్సి¯ŒS వికటించి మూడు నెలల చిన్నారి శనివారం మృతి చెందింది. తల్లిదండ్రులు రామచంద్ర, సుధ తెలిపిన వివరాల మేరకు.. శనివారం ఉదయం చిన్నారిని గ్రామంలోని అంగ¯ŒSవాడీ కేంద్రం–2 వద్దకు తీసుకెళ్లి నెల ఇంజక్ష¯ŒS వేయించామన్నారు. ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మరణానికి కారణం ఏఎ¯ŒSఎంలు లతిత, కుమారి లేనని వారు ఆరోపించారు. ఈ విషయంపై పరిగి పీహెచ్సీ డా.జగదీష్‌ను వివరణ కోరగా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హతమయ్యాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
పరిగి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఏడాది తర్వాత ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇదే సమయంలో అప్పట్లో పోలీసులు ప్రవర్తించిన తీరుపై జనం మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా పరిగి మండలం కోనాపురం శివారులోని జయమంగళి నదిలో 2013 మార్చి 20న గుర్తు తెలియని వ్యక్తి వృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అప్పటి హిందూపురం రూరల్ సీఐ వేణుగోపాల్, పరిగి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ కేసు నమోదు చేశారు. విచారణ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు బతికున్న వ్యక్తినే చనిపోయాడని చెప్పి అమాయకులను కేసులో ఇరికించారు. గ్రామానికి చెందిన దాళప్ప బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లగా.. జయమంగళి నదిలో లభించిన మృతదేహం అతడిదేనని తేల్చేశారు. అదే గ్రామానికి సత్యనారాయణ అలియాస్ సత్తి, నరసింహమూర్తి, మోదా గేటుకు చెందిన జిక్రియా అతడిని చంపారని.. వారిని నిందితులుగా గుర్తించి ఈ ఏడాది జనవరి 23న కోర్టులో హాజరు పరిచారు. హత్యకు గురయ్యాడని పోలీసులు చెప్పిన దాళప్ప బుధవారం ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు నిందితులుగా ఉన్న వారు, వారి కుటుంబసభ్యులు తెలిపారు.