
ఇసుకదిన్నె పడి కూలీ మృతి
పరిగి (పెనుకొండ రూరల్) : పరిగి మండలం కోనాపురం సమీపంలో సోమవారం ఇసుక దిబ్బపడి కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మణేసముద్రం గ్రామానికి చెందిన గౌరప్ప(48) దినసరి కూలీ. సోమవారం ట్రాక్టర్ పనులకు వెళ్లాడు. ట్రాక్టరుకు ఇసుక లోడు వేసి కూలీలు పంపారు. అనంతరం ఇసుకను కింది భాగంలో ఒక చోటుకు చేర్చుతుండగా పైనుంచి ఒక్కసారిగా ఇసుకదిన్నెలు విరిగి మీద పడటంతో గౌరప్ప ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.