labor
-
వారానికి 4 రోజులే పని.. కొత్త లేబర్ కోడ్ వచ్చేస్తుందా?
మోదీ ప్రభుత్వం రానున్న బడ్జెట్లో (Budget 2025-26) కొత్త లేబర్ కోడ్ (New Labor Code) నిబంధనల అమలును ప్రకటించవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రాబోయే బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అధికార వర్గాల ప్రకారం.. ఈ కొత్త లేబర్ కోడ్లు మూడు దశల్లో అమల్లోకి రానున్నాయి. దీంతో ఉద్యోగులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి. అలాగే వారానికి 4 రోజులే పని చేసే అవకాశం ఉంటుంది. పీఎఫ్ కోసం కట్ చేసే డబ్బు పెరిగితే ప్రతి నెలా వచ్చే జీతం తగ్గవచ్చు.మూడు దశల్లో కొత్త లేబర్ కోడ్లేబర్ కోడ్ కొత్త కొత్త విధానాలను అమలు చేయడానికి ఆయా యాజమాన్యాలకు తగిన సమయం ఇచ్చేందుకు మూడు దశల్లో దీన్ని అమలు చేస్తారని తెలుస్తోంది. 2025-26 బడ్జెట్లోనే ప్రభుత్వం ఈ కోడ్లను ప్రకటిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది అమలులోకి వస్తుంది. ఈ లేబర్ కోడ్లు అటు యాజమాన్యాలకు అనువుగా ఉండటమే కాకుండా ఇటు ఉద్యోగులకు కూడా మెరుగైన సామాజిక భద్రత కల్పిస్తాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: Budget 2025: కొత్త ట్యాక్స్ శ్లాబ్ రాబోతోందా?మొదటి దశలో 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీలు ఈ కోడ్లను అనుసరించడం తప్పనిసరి. రెండో దశలో 100-500 మంది ఉద్యోగులున్న మీడియం కంపెనీలను దీని పరిధిలోకి తీసుకురానున్నారు. మూడో దశలో 100 మందిలోపు ఉద్యోగులున్న చిన్న కంపెనీలపై ఈ కోడ్లను అమలు చేయనున్నారు. లేబర్ కోడ్ కొత్త నియమాలు, పథకం ప్రకారం, ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు సుమారు రెండు సంవత్సరాలు పడుతుంది. దేశ వ్యాపార నిర్మాణంలో 85 శాతం కంటే ఎక్కువ వాటా ఎంఎస్ఎంఈలు అంటే చిన్న పరిశ్రమలదే.రాష్ట్రాలతో చర్చలుఈ కోడ్లను అమలు చేసేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే పనిలో మంత్రిత్వ శాఖ బిజీగా ఉంది. మొదటి దశలో వేతనాలు, సామాజిక భద్రతా కోడ్‌పై కోడ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే మార్చి నాటికి అన్ని రాష్ట్రాలతో ముసాయిదా నిబంధనలు ఖరారు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.ఏమిటీ లేబర్ కోడ్లు?భారత ప్రభుత్వం 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా ఏకీకృతం చేసింది. యాజమాన్యాలతోపాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. నాలుగు కోడ్లు ఇవే.. వేతనాలపై కోడ్, సామాజిక భద్రతా కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, చివరిది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్ కోడ్.4 రోజులు పని.. 3 రోజులు సెలవుకొత్త లేబర్ కోడ్లలో వారంలో నాలుగు రోజుల పని, మూడు రోజుల విశ్రాంతి విధానం కూడా ఉండవచ్చు. ఉద్యోగుల పని, జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే ఈ విధానం ఉద్దేశం. అయితే వారానికి నాలుగు రోజులే పని చేయాలనే నిబంధన వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి. మరోవైపు ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగే పరిస్థితిలో ఉద్యోగుల చేతికి అందే జీతం తగ్గవచ్చు. -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
ఇంటిముందు మృతదేహం, డబ్బు, లేఖ
పుల్లలచెరువు/యర్రగొండపాలెం: ఒక యువకుడి మృతదేహాన్ని కొందరు వ్యక్తులు కారులో తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామంలో సంచలనం కలిగించింది. మృతదేహంతోపాటు రూ.35 వేలు, క్షమాపణ లేఖ ఉంచి వెళ్లారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. మృతుడు ఉప్పు శ్రీను (35) భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేస్తుంటాడు. పనుల కోసం ముఠావాళ్లతో చెన్నై, తెలంగాణ, ఇతర దూర ప్రాంతాలకు వెళుతుంటాడు. 10 రోజుల కిందట పనులకు చెన్నై వెళ్లాడు. అతడికి నయంకాని వ్యాధి ఉన్నట్లు గుర్తించిన భార్య పిల్లలను తీసుకుని రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కొందరు వ్యక్తులు తెల్లటి కారులో శ్రీను మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి ఇంటిముందు పడేసి వెళ్లారు. మట్టి ఖర్చులకు రూ.35 వేలు, క్షమాపణ లేఖ అక్కడ ఉంచి వెళ్లారు. ఆ లేఖలో ‘అమ్మా.. పనిచేసే ప్రదేశంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈ క్రమంలో మీ అబ్బాయి చనిపోయాడు. మాకు దెబ్బలు తగిలాయి. తల్లి శోకం తీర్చలేనిదని మాకు తెలుసు. కానీ ఏమీచేయలేక పోయాం. మీ అబ్బాయి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు ఇస్తున్నాం. అమ్మా క్షమించండి..’ అని రాసి ఉంది. ఈ లేఖను బట్టి భవన నిర్మాణ పనులు జరిగే సమయంలో తోటి కూలీలతోపాటు శ్రీను కిందపడి ఉంటాడని, ఈ నేపథ్యంలో అతను చనిపోగా మరికొందరికి దెబ్బలు తగిలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని అప్పజెప్పే తరుణంలో గ్రామస్తులు తమపై దాడిచేసే అవకాశం ఉందని, పోలీసు కేసులు అవుతాయనే భయంతో ఇంటిముందు పడేసి వెళ్లి ఉండవచ్చని అనుకుంటున్నారు. మృతుడి ఇంట్లో దొరికిన మందులు, పరీక్షల రిపోర్టును బట్టి అతనికి నయంకాని వ్యాధి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సీఐ కె.మారుతీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ వై.శ్రీహరి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్మిక చట్టాల పటిష్టతకు ఏపీ నుంచి పూర్తి సహకారం అందిస్తాం: సీఎం జగన్
-
ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో 47వ జాతీయ కార్మిక సదస్సు రెండు రోజులపాటు అట్టహాసంగా జరిగింది. 19 రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేయగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ జాతీయ కార్మిక సదస్సు ముగింపు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. 'ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. తిరుపతిలో జరుగుతున్న ఈ సదస్సుకి ముఖ్యులంతా రావడం సంతోషకరం. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నాను. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం, అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నాం. అందరికీ బెస్ట్ విషెష్ చెబుతూ' సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. చదవండి: (భారతదేశం శ్రామికుడి శక్తి : ప్రధాని) -
చెరకు గడ చీలుస్తున్న గర్భసంచి
‘నీ గర్భసంచి ఇవ్వు... నీకు కూలిడబ్బులు ఇస్తా’ అని ప్రపంచంలో ఒక్క భారతదేశంలోనే అనగలుగుతారేమో. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీలు పడే బాధలు ఎన్నో ఎందరికి తెలుసు? మహారాష్ట్రలోని బీడ్ చెరకు ఉత్పత్తిలో మేటి. అక్టోబర్ నుంచి మార్చి వరకు అక్కడ కోతకాలం. కోతకు వచ్చిన కూలీలు నెలసరికి మూడురోజుల విశ్రాంతి తీసుకుంటే కూలి డబ్బులు పోతాయి. జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అందుకే అక్కడ కూలి చేయడానికి ముందే గర్భసంచి తొలగించుకుంటారు. ఈ కడుపుకోతపై దర్శకుడు అనంత్ మహదేవన్ ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం– బిట్టర్‌స్వీట్) అనే మరాఠి సినిమా గత సంవత్సరం తీశాడు. వివిధ ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో అవార్డులు పొందుతున్న ఈ సినిమా ఇటీవల జనవరి 8–15 తేదీల మధ్య జరిగిన కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. ఈ సినిమా వెనుక ఉన్న అసలు కథ ఇది. ‘చెరకు కట్ చేసే మిషను రెండున్నర కోట్లు ఉంటుంది. చక్కెర ఉత్పత్తిదారులు అంత పెట్టి మిషన్ ఎందుకు కొంటారు... అతి సలీసుగా కూలీలు దొరుకుతుంటే’ అంటారు దర్శకుడు అనంత్ మహదేవన్. ఆయన మరాఠిలో తీసిన ‘కడ్వా గూడ్’ (చేదుబెల్లం) సినిమా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ సినిమా ఉత్సవాల్లో ప్రశంసలు అందుకుంటోంది. ప్రశంస సినిమా గొప్పదనం గురించి కాదు. ఒక చేదు వాస్తవాన్ని కథగా ఎంపిక చేసుకోవడం గురించి. ఎందుకంటే ఈ సినిమా చెరకు కోత కోసం పని చేసే లక్షలాది మంది మహిళా కూలీల వెతను చూపింది కాబట్టి. బీడ్‌లో బతుకుపోరు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలలో షుగర్ ఫ్యాక్టరీలకు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం చాలా కీలకం. చెరకుపంట కోత కాలం అది. లక్షల ఎకరాల్లో పంటను కోయడానికి కూలీలు కావాలి. మహారాష్ట్రలోని ఒక్క బీడ్ జిల్లాలో 5 లక్షల మంది చెరకు కోత కూలీలు ఉన్నారు. బీడ్ అంతగా పంటలు పండని ప్రాంతం కనుక ఇక్కడి నుంచి వలస ఎక్కువ. వీరు చెరకు కోత వచ్చే ఆరు నెలల కాలం కోసం కాచుకుని ఉంటారు. చెరకు కోతకు వెళ్లి్ల ఏం కోల్పోతున్నారనేది ‘బిట్టర్‌స్వీట్’ సినిమాలో చూపించాడు దర్శకుడు. వీరి కన్నీరు రక్తం కలగలవడం వల్లే ఇండియా నేడు ప్రపంచంలోనే రెండవ పెద్ద చక్కెర ఎగుమతిదారు అయ్యిందని అంటాడతను. దారుణమైన దోపిడి చెరకు పంట కోయించి ఫ్యాక్టరీలకు చేరవేసేందుకు చక్కెర ఫ్యాక్టరీలు ‘ముకదమ్’లను ఏర్పాటు చేసుకుంటారు. ముకదమ్‌లంటే దళారీలు. వీరు కూలీలను పట్టుకొని వచ్చి కోత కోయించాలి. అంతేకాదు ఇచ్చిన సమయంలో ఇచ్చినంత మేరా కోత జరిగిపోవాలి. ఇందుకోసం దళారీలు బీడ్ ప్రాంతం నుంచి వయసులో ఉన్న భార్యాభర్తలను కూలికి పిలుస్తారు. వీరిని ‘జోడీ’లంటారు. ఈ జోడీలకు ముందే 80 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఇచ్చేస్తారు. ఆ మేరకు వీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. రోజుకు పది నుంచి 12 గంటలు పని చేయాలి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఒక జోడి రోజులో రెండు మూడు టన్నుల చెరకు పంటను కోస్తారు. నెలసరి తప్పించుకోవడానికి జోడీలు ప్రతిరోజూ పని చేయాలి. చేయకపోతే కూలి దక్కదు. పైగా జరిగిన నష్టానికి జుర్మానా కట్టాలి. ఈ ఆరునెలల కాలంలో జోడీలోని భార్య నెలసరి సమయంలో మూడు రోజుల విశ్రాంతి తీసుకునే అవసరం పడొచ్చు. మూడురోజుల కూలీ పోవడం ఎదురు జుర్మానా కట్టాల్సి రావడం జోడీకి చాలా కష్టం అవుతుంది. అందుకని నెలసరి రాకుండా గర్భసంచిని తీసేయించడం బీడ్‌లో ఒక దయనీయమైన ఆనవాయితీ అయ్యింది. బీడ్ జిల్లాలో దాదాపు 100 ఆస్పత్రులు ఉంటే వాటిలో పది ఆస్పత్రులు ఇవే పని మీద ఉంటాయి. దళారీలకు ఈ ఆస్పత్రులతో అండర్స్టాండింగ్ ఉంటుంది. దళారీ గర్భసంచి తీసే ఆపరేషన్ కోసం విడిగా అప్పు ఇస్తాడు. అది ప్రతి సంవత్సరం కూలీలో కొంత కొంత కోత వేసుకుంటాడు. పైగా గర్భసంచి ఆపరేషన్‌కు మనిషిని పంపినందుకు కమిషన్ కూడా దొరుకుతుంది. ‘గర్భసంచులు లేని స్త్రీల ఊరు అని బీడ్ గురించి వార్త చదివాకే నాకు ఈ సినిమా తీయాలనిపించింది’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమా కథలో... ఈ సినిమా కథలో దర్శకుడు సత్యభామ అనే కోత కూలీ పాత్ర ద్వారా మనకు కథ చెప్పే ప్రయత్నం చేస్తాడు. కోత పని సజావుగా సాగడానికి సత్యభామ గర్భసంచిని తీయించుకోవాలని ఆమెపై వొత్తిడి వస్తుంది. తీయించుకోవాలా వద్దా అనే సంఘర్షణలో మనకు సమస్య నేపథ్యం తెలుస్తుంది. చివరకు సత్యభామ గర్భసంచి తీయించుకోవడానికే అంగీకరిస్తుంది. ‘ఇది ఆమె శారీరక హక్కును బలవంతంగా తిరస్కరింప చేయడమే. పిల్లలు కనే హక్కును నివారించడమే. తన దేహం మీద తన హక్కును మహిళా కూలీలు కోల్పోవడమే కాదు భావితరాల పుట్టుకను కూడా నిరాకరిస్తున్నారు’ అంటాడు దర్శకుడు అనంత్ మహదేవన్. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే నటించారు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా మంచి స్పందనను పొందుతోంది. – సాక్షి ఫ్యామిలీ -
దిక్కులేని సిపాయి
కూలీలను వెంటేసుకొని ఆవేశంగా వస్తున్న రాంబాబును చూస్తూ లెక్క ప్రకారం అయితే భూస్వామి భూషయ్య ఒక మోస్తరుగానైనా కంగారుపడిపోవాలి. అదేమి లేకుండా చాలా తేలిగ్గా...‘‘ఏంట్రా అబ్బాయి’’ అన్నాడు.‘‘కూలీలు’’ అని పిడికిళ్లు బిగించినంత పనిచేశాడు రాంబాబు.‘కూలీలు’ అనే చిన్న మాటలోనే చెప్పకనే ఎన్నో విషయాలు చెప్పాడు రాంబాబు. కూలిపోతున్న కూలీల జీవితాల గురించి కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కావచ్చు.పట్నంలో చదువుకొని వచ్చిన రాంబాబుకు కూలీలతో పనేమిటి? ఈ రాంబాబు అందరిలాంటోడైతే కూలీలతో పనేమిటి? అనే అనుకోవచ్చు. కానీ రాంబాబు చదువుతో పాటు సమాజాన్ని చదువుకున్నవాడు. అందుకే కూలీల సమస్యలను తన ఇంటి సమస్యగా చేసుకొని భూషయ్య ఇంటికొచ్చాడు.భూషయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు.‘‘కూలీల సంగతి కూలోడు, రైతుల సంగతి రైతోడు పడతాడు. కుర్రోడివి నీకెందుకు ఈ ఎవ్వారం’’ విసుక్కున్నాడు భూషయ్య.‘‘చదువుకున్నాడని యవ్వారానికి వచ్చాడు’’ వెక్కిరింపుగా అన్నాడు భూషయ్య భజనుడు.‘‘వచ్చి మాత్రం ఏంచేస్తాడు! వరిముక్క చేతికి ఇచ్చి ఏంట్రా ఇది అని అడిగితే వడ్లుగాసే చెట్టు అనేవాడివి నీకెందుకురా...ఎళ్లు’’ రాంబాబును ఊకలా తేలికగా తీసేశాడు భూషయ్య.మరి భజనుడు ఊరుకుంటాడా..‘‘ఇదిగో గాడిద పని గాడిద కుక్క పని కుక్క చేయాలి. తెల్సిందా!’’ అని అరిచాడు.‘‘నువ్వు ఇక్కడ ఉన్నావంటే మర్యాద దక్కదు’’ అని హెచ్చరించాడు కూడా.‘‘వెళ్లిపోకపోతే?’’ కోపంగా అన్నాడు రాంబాబు.‘‘తలగొరుకుడు, సున్నంబొట్లు, గాడిద మీద ఊరేగింపు...చాలా’’ తన మాటలతో రాంబాబును మరింత రెచ్చగొట్టాడు భజనుడు.అంతే...‘‘ఏంట్రా కుశావు’’ అని ఆ భజనుడి వైపు పిడుగులా దూసుకువచ్చాడు రాంబాబు.∙∙ ఏటి ఒడ్డున పాక హోటల్.ఆలివ్‌గ్రీన్ దుస్తుల్లో ఉన్న ఒకాయన టీ తాగుతున్నాడు. ఊరికి కొత్తోడిలా ఉన్నాడు. అప్పుడే అక్కడి వచ్చాడు కామయ్య.‘‘పేరు?’’ అని కొత్తవ్యక్తిని అడిగాడు.‘‘చంద్రశేఖరం’’‘‘చంద్రశేఖరం అని తెల్సండీ. ఊరు?’’‘‘తోలేరు’’‘‘చంద్రశేఖరం... తోలేరు అనే సంగతి తెల్సండి. పని?’’‘‘ప్రభుత్వం వారు నాకు ఈ ఊళ్లో పొలం ఇచ్చారు. దాని కోసం వచ్చాను’’‘‘కరణంగారితో పనన్నమాట. మనం ఉండాలన్నమాట’’‘‘కరణంగారు మీకు తెలుసా?’’‘‘కాకిని, కరణంగారిని తెలియని వారు ఈ ఊళ్లో ఉంటారా! ఎటొచ్చి కొంచెం కమిషన్ అవ్వుద్ది’’‘‘కమిషనా! ఎందుకు?’’‘‘ఎందుకేమిటండీ, కరణంగారితో పని కావాలంటే కామయ్యగోరు కదలాలి. కామయ్యగోరు కదలాలంటే కమిషన్ ఉండాలి. ముందు ఆ కాగితాలు మన చేతిలో పెట్టండి. రేపు రండి. మీ భూమి తీసుకువచ్చి మీ చేతిలో పెడతాను’’అమాయకంగా కామయ్య సాలెగూడులో చిక్కుకుపోయాడు పాపం ఆ మిలిటరీ ఆయన. సూటిగా చెప్పాలంటే మిలిటరీ చంద్రశేఖరం మోసపోయాడు.∙∙ ‘‘కరణంగారు ఈ చేను ఎక్కడుందండీ?’’ చంద్రశేఖరం పొలం గురించి వివరం అడిగాడు రాంబాబు.‘‘ఎక్కడిదంటే...’’ నసిగాడు కరణం.చంద్రశేఖరం పొలాన్ని భూషయ్య నొక్కేశాడని రాంబాబుకు అర్థమెంది.‘‘దీన్నంతా ముత్యాలమ్మ చేను అంటారు. ఇది ఎప్పటి నుంచో భూషయ్య చేతిలో ఉంది’’ అని తనతో పాటు వచ్చిన చంద్రశేఖరానికి చెప్పాడు రాంబాబు.తన చేను గురించి భూషయ్యను అడగడానికి వెళ్లాడు చంద్రశేఖరం.‘‘భూషయ్య గారు ఆ చేను నాది. నాకు పట్టా వచ్చింది. దాన్ని మీరు అట్టి పెట్టుకున్నారు’’భూషయ్య తనదైన శైలిలో ఇలా అన్నాడు...‘‘కిట్టమూర్తి మనం అట్టిపెట్టుకోవడమేమిటయ్యా. అది ముత్యాలమ్మ తల్లిది. కాదంటే ఆ తల్లికే కోపం వస్తది. మనకేం!’’‘‘ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఆ గట్టు మీద తాడిచెట్టు కల్లు దొంగతనం చేయడానికి ఓ అర్ధాయుష్షు వెధవ చెట్టెక్కాడు’’ అని భజనుడు అన్నాడో లేదో పూజారి టక్కున అందుకున్నాడు...‘‘రక్తం కక్కుకొని టపీమని చావబోయి ఆగాడు. అంటే ఒకటి....అమ్మతల్లి మహత్యం నీకింకా తెలియదు. ఆమె తలుచుకుంటే భూమి దద్దరిల్లుతుంది. ప్రళయం వచ్చేస్తుంది’’‘‘భయంకర శత్రుమూకలను నేలమట్టం చేయడంలో నా కాలు పోయినా ఆ గుండె బలం అలాగే ఉంది. నేను అవిటివాన్ని అయినా ఆ సాహసం అలాగే ఉంది. ప్రభుత్వం నాకు పట్టా ఇచ్చింది. ఆ భూమి నాది’’ అని గట్టిగా అరిచాడు చంద్రశేఖరం.తాటిముంజలు తింటూ తాటికాయలను నరుకుతున్న పనివాడిని చూస్తూ తనదైన శైలిలో స్పందించాడు భూషయ్య...‘‘రేయ్ పోతూ! పట్టా కత్తి చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్లు నరుక్కెళుతుంటే, వొకనాడు అమ్మతల్లి కన్ను విప్పుతుంది. కుండెడు రక్తం భళ్లునా కక్కాలి’’∙∙ ‘‘రాంబాబు... ఆరునూరైనా సరే రేపే మనం చేలో దిగుతున్నాం. పొద్దుటే వచ్చేయ్. చేనులో కలుద్దాం’’ ఆవేశంగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు చంద్రశేఖరం.మరుసటి రోజు...చేనులో చంద్రశేఖరం కనిపించలేదు.ఆయన శవం కనిపించింది.కళ్లనీళ్లతో శవాన్ని భుజానికెత్తుకున్నాడు రాంబాబు.దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు...‘‘మీరంతా ఇటు చూడండి. తలలు పక్కకు తిప్పుకోకండి. నా దేశం అని నా జనం అని వెర్రిప్రేమలు పెంచుకొని ఆవేశంతో శత్రువుల మీదికి దూకి కాలు పోగొట్టుకున్న పిచ్చిసిపాయి. అయినా భ్రమలు తీరక ఇంకా ఏదో చేయాలనే తాపత్రయంతో వచ్చి ఒంటరిగా చచ్చిన దిక్కులేని సిపాయి. ఇతడ్ని తగిలేయడానికి నాతో రాగలిగిన వారు ఎవరు? మీరా? మీరా?’’ -
వలస వరస మారింది!
కల్వకుర్తి రూరల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు వలసల జిల్లాగా పేరుంది. ఇక్కడ ఉపాధి లేక వేలాది మంది కూలీలు ముంబైకి వెళ్లడం సర్వసాధారణం. అలాంటి పాలమూరుకు ఆంధ్రప్రదేశ్ నుంచి పనుల కోసం కూలీలు వస్తుండడం గమనార్హం. స్థానిక రైతులు భారీగా పత్తిసాగు చేయగా.. ఒకేసారి కోతకు వచ్చాయి. దీంతో పత్తి తీసేందుకు కూలీల కొరత ఏర్పడింది. ఈ మేరకు స్థానిక కూలీలు ఆంధ్రప్రదేశ్ నుంచి కూలీలను రప్పిస్తున్నారు. నర్సరావుపేట నుంచి జీడిపల్లికి.. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన 140మంది కూలీలు కల్వకుర్తి జీడిపల్లి గ్రామానికి వచ్చారు. ఈ మండలంలో 1600ఎకరాలకు పైగా పత్తి సాగుచేశారు. స్థానికంగా ఎక్కువ ధర ఇచ్చినా కూలీలు దొరకకపోవడంతో నర్సరావుపేట నుంచి కూలీలను రప్పించారు. వారికి ఇక్కడ ఉండేందుకు అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు కేజీ పత్తికి రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు. అక్కడ పనులు లేకే.. నర్సరావుపేటలో మాకు సరైన పనులు దొరకడం లేదు. ఏ పని చేద్దామన్నా లభించక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఏం చేద్దామని ఆలోచించే సమయంలో జీడిపల్లి రైతులు మమ్ముల్ని సంప్రదించారు. ఈ మేరకు పత్తి ఏరడానికి వచ్చాం. ఇక్కడ పని పూర్తయ్యాక మరో చోటకు వెళ్తాం. – కనకం, నర్సరావుపేట -
చెత్త ఎత్తేస్తారు..ఇళ్లు దోచేస్తారు..
పెందుర్తి: పగటిపూట చెత్త ఏరుకుంటూ మనుషులు లేని ఇళ్లను కనిపెడతారు. రాత్రయ్యే సరికి ఆ ఇళ్లను గుళ్ల చేస్తారు. ఇలా దొంగతనా లకు పాల్పడుతున్న నేరస్తుల ఆటను పెందుర్తి పోలీసులు కట్టించారు. పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గుర్ని శనివారం అరెస్టు చేశారు. దొంగసొత్తును కొనుగోలు చేసిన మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెస్ట్ సబ్ డివిజన్ క్రైం బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సూర్యనారాయణ కేసు వివరాలను వెల్లడించారు. గోపాలపట్నం ఇం దిరానగర్కు చెందిన చలపాక రాజేష్(తునీగా),గాజువాక సమతానగర్‌కు చెందిన పెర్రటి ప్రతాప్, మధురవాడ మారికవలస కాలనీకి చెందిన రంగల రంగరావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో చలపాక రాజేష్ భుజాన గోనె సంచి తగిలించుకుని జనవాసాల్లో చెత్త ఏరుకుంటున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. అనంతరం ప్రతాప్, రంగా రావులతో కలసి ఆయా ఇళ్లతాళాలు బద్దలు కొట్టి దోచేస్తారు. పెందుర్తి, గోపాలపట్నం పోలీస్స్టేషన్ల పరిధిలో వీరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వీరిని గోపాలపట్నం ప్రాంతంలో పట్టుకున్నారు. వీరంతా నగరంలో కూడా పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. కొనుగోలు చేసిన వారూ అరెస్ట్ దొంగ బంగారాన్ని టౌన్ కొత్తరోడ్ ప్రాంతానికి చెందిన చెట్టి శ్రీనివాసరావు, 104 ఏరియా ప్రాంతానికి చెందిన కలిశెట్టి రాంబాబు, గోపాలపట్నం కొత్తపాలేనికి చెందిన వేగి రాం బాబులు కొనుగోలు చేశారు. వీరు గతంలో కూడా దొంగసొత్తును కొనుగోలు చేసినట్లు సీఐ వివరించారు. ఆరుగురు నిందితుల నుం చి రూ.1,83,000 విలు వైన 61.06గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంకా 121.8 గ్రాముల బంగారంతో పాటు, 816 గ్రాముల వెండిసామగ్రి స్వాధీనం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. -
ఆశలు కుప్పకూలి!
గత్యంతరం లేక కూలీలుగా మారుతున్న యువతరం ► చదువు మానేసి కొందరు.. చదివే స్తోమత లేక ఇంకొందరు.. ► రాష్ట్రంలో పెద్దసంఖ్యలో పెరుగుతున్న నవతరం కూలీలు ► సాగు సంక్షోభం, సామాజిక అంతరాలు, నైపుణ్య లేమి కారణం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కూలీల సంఖ్య పెరిగిపోతోంది. అందులోనూ చదువు మధ్యలో మానేసినవారే అధికంగా ఉంటున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటంతో సాగును వదిలేసి కూలీలుగా మారుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న సామాజిక అంతరాలు, వృత్తి నైపుణ్యాల కొరత వల్ల కూడా యువత కూలిబాట పట్టక తప్పడం లేదని సామాజిక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా పాత ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో వ్యవసాయ కూలీల సంఖ్యలో పెరుగుదల ఎక్కువగా ఉంది. 2001లో రాష్ట్రంలో 1.40 కోట్ల మంది కూలీలుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 1.64 కోట్లకు చేరింది. 2001లో 82 లక్షలున్న వ్యవసాయ కూలీల సంఖ్య ఇప్పుడు 92 లక్షలు దాటింది. 15 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న యువతీ యువకులే కూలీలుగా మారుతుండటం ఆందోళనకర పరిణామమని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మానవాభివృద్ధి సూచీలో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ వ్యవసాయం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రంలో సాగు గిట్టుబాటుగా లేకపోవటంతోపాటు 90% మంది రైతులు అప్పుల్లో ఉన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న భూముల్లో 65.5% భూమి కౌలు రైతుల చేతుల్లో ఉంది. రైతులు సైతం పెట్టుబడులు, అప్పుల భారం భరించలేక తమ భూములను కౌలుకు ఇచ్చేస్తున్నారు. దీంతో కౌలు భూమి విస్తీర్ణం పెరిగి పోతోందని వ్యవసాయశాఖ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బడిబాట కాదు.. కూలిబాట సాగు గిట్టుబాటు కాకపోవటం, విత్తనాలు, పెట్టుబడులు కూలీ ఖర్చులు భరించలేక చాలామంది రైతులు తమ పిల్లల్ని.. పనిలో చేదోడువాదోడుగా ఉంటారన్న ఉద్దేశంతో పనులకు తీసుకెళ్తున్నారు. దీంతో రైతు కుటుంబాల్లో మధ్యలోనే చదువులు మానేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది . రాష్ట్రంలో దాదాపు 29 శాతం మంది రైతు బిడ్డలు ఇలాగే కూలీల అవతారమెత్తినట్లు ఇటీవల ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు చేసిన అధ్యయనంలో తేలింది. అత్యధికంగా ఎస్సీల్లో 38 శాతం మంది, ఎస్టీల్లో 24 శాతం మంది, ఇతర కులాలకు చెందిన వారిలో 30 శాతం మంది కూలీలుగా మారినట్లు అంచనాలున్నాయి. వీరంతా వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలుగా పని చేస్తున్నారు. దాదాపు 90 శాతం మందికి నైపుణ్యం లేకపోవటంతో కాయకష్టం నమ్ముకునే బతుకులీడిస్తున్నారు. కనీస వేతనాలు సైతం అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూలీలు (కోట్లలో) 1.64 2001లో 1.40 కోట్లకు పైగా ప్రస్తుతం వ్యవసాయకూలీలు (లక్షల్లో) 92 2001లో 82 లక్షలకు పైగా చదువుకునే స్తోమత లేక.. చదువుకోవాలనే ఆరాటమున్నా.. ఆర్థిక స్తోమత లేక కూలీలుగా మారుతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. వారసత్వంగా నమ్ముకున్న వ్యవసాయం, కుటుంబ వృత్తులు చేసుకోలేక ఉద్యోగాలకు చేరువ కాలేక నలిగిపోతున్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో ఇలాంటి యువత సంఖ్య 15% , ఇతర కులాల్లో 11% మేర ఉన్నట్లు ఇటీవల ప్రణాళిక విభాగం చేయించిన మానవాభివృద్ధి ర్యాంకుల అధ్యయనంలో వెల్లడైంది. వారసత్వంగా వచ్చిన సాగు, వృత్తులకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగావకాశాలు లక్ష్యంగా చదువుకునే వారున్నా.. మిగతా కేటగిరీలతో పోలిస్తే వారి సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. -
జస్ట్ డెలీవరీకి ముందు ఈ డాక్టర్ ఏం చేశారో తెలుసా..
కెంటకీ: వైద్యులంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేవారని ప్రతీతి. అందుకే దాదాపు రోగులందరూ డాక్టర్లను దేవుడితో సమానంగా చూస్తారు. దీనికి అనుగుణంగానే ఓ మహిళా డాక్టర్ డ్యూటీలో లేకపోయినా..పెద్దమనసుతో వ్యవహరించి శబాష్ అనిపించుకుంది. ప్రసవ వేదనను అనుభవిస్తూ..తోటి మహిళ కష్టాన్ని, వేదను అర్థం చేసుకుని కార్యరంగంలోకి దూకింది. మరి కొద్దిక్షణాల్లో తాను బిడ్డకు జన్మ నివ్వబోతూ కూడా వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్న వైనం పలువురి ప్రశంసలందుకుంటోంది. డా. హాలా సాబ్రీ ఈ ఉదంతాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. డాక్టర్ అమండా హెస్ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరారు. పేషెంట్ గౌన్ వేసుకుని లేబర్ రూంలో వెళుతున్నారు. ఇంతలో మరో మహిళ ప్రసవ వేదన ఆమె చెవిన పడింది. ఆమె గర్భంలో బిడ్డ పేగు మెడకు వేసుకుని ప్రమాదంలో పడ్డాడు. దీంతో ప్రసవం కష్టంగా మారింది. మరోవైపు డ్యూటీ డాక్టర్ రావడానికి ఇంకా సమయం ఉంది. దీంతో సమయ స్పూర్తిగా వ్యవహరించిన డా. అమండా క్షణం ఆలస్యం చేయకుండారంగంలోకి.. తల్లీ బిడ్డలను కాపాడారు. ఆ తరువాత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తాను తన వృత్తిని ప్రేమిస్తానని, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడం తనకు సంతోషాన్నిస్తుందని డా. అమండా తెలిపారు. అంతేకాదు అనారోగ్యానికి గురైనా తమ రోగుల సంరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించే డాక్టర్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. -
గుర్తింపు కార్డులతో కార్మికులకు ప్రయోజనాలు
కదిరి అర్బన్: గుర్తింపు కార్డులు కలిగి ఉండే కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని మార్కెటింగ్ శాఖా మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన స్థానిక ఎమ్యెల్యే అత్తార్ చాంద్‌బాషా నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కదిరిలో భవన, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారంతా గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు కలిగిన కార్మికులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తారని ఆయన చెప్పారు. ఇళ్లు కట్టుకున్నాక అత్యవసరమైతే విక్రయించుకునే వెసులుబాటు కూడా ఉంటుందన్నారు. ఇంటిపై ఉన్న రుణం కొన్నవారు కట్టుకోవాలన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు చంద్రన్న భీమా పథకంలో చేరితే వారింట్లోని ఇద్దరు అమ్మాయిలకు ఒక్కొక్కరి వివాహానికి రూ.20 వేల చొప్పున పెళ్లికానుక, అలాగే ఒక్కొక్కరికి రెండు ప్రసవాలకు రూ.20 వేల చొప్పున ప్రసవ కానుక అందజేస్తారన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుడిసె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుకదిన్నె పడి కూలీ మృతి
పరిగి (పెనుకొండ రూరల్) : పరిగి మండలం కోనాపురం సమీపంలో సోమవారం ఇసుక దిబ్బపడి కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. మణేసముద్రం గ్రామానికి చెందిన గౌరప్ప(48) దినసరి కూలీ. సోమవారం ట్రాక్టర్ పనులకు వెళ్లాడు. ట్రాక్టరుకు ఇసుక లోడు వేసి కూలీలు పంపారు. అనంతరం ఇసుకను కింది భాగంలో ఒక చోటుకు చేర్చుతుండగా పైనుంచి ఒక్కసారిగా ఇసుకదిన్నెలు విరిగి మీద పడటంతో గౌరప్ప ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సిమెంట్‌రంగంలో అగ్రగామి భారతి సిమెంట్
– రోబోటిక్ టెక్నాలజీతో నాణ్యతా ప్రమాణాలు – భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా – జిల్లా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ పత్తికొండ టౌన్: సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా కొనసాగుతోందని ఆ కంపెనీ జిల్లా సేల్స్ మేనేజర్ ఎ.విజయభాస్కర్ అన్నారు. మంగళవారం రాత్రి పత్తికొండలో భారతి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ కంపెనీకి వైఎస్ఆర్ కడపజిల్లా నల్లలింగాయపల్లెలో ఏడాదికి 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటు, కర్నాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లాలో ఏడాదికి 7.5టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్లాంటు ఉన్నాయన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన 7ఏళ్లలోనే వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొని, మార్కెట్లో అగ్రగామిగా దూసుకెళ్తోందన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే 3రెట్లు మెరుగైన సిమెంట్‌ను భారతి కంపెనీ వినియోగదారులకు అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి అయిన జర్మన్ టెక్నాలజీ సహకారంతో భారతి సిమెంట్ ఉత్పత్తి అవుతోందన్నారు. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజిజనీరింగ్ నిపుణుల విభాగం పర్యవేక్షణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, సాటిలేని, మేటి అయిన సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీకి ఎలాంటి అవకాశం లేకుండా ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా భారతి సిమెంట్ కంపెనీ భవన నిర్మాణకార్మికులు, తాపీమేస్త్రీల సంక్షేమం కోసం కూడా కృషిచేస్తోందని సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. కార్మికులకు రూ.లక్ష ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారతి సిమెంట్ విశిష్టత, రోబోటిక్ టెక్నాలజీ, ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్, సిమెంట్ వాడకం గురించి భవన నిర్మాణ కార్మికులకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్, మార్కెటింగ్ అధికారులు ఇక్భాల్బాషా, నితేశ్యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి ఏజెన్సీ నిర్వాహకుడు, భారతి సిమెంట్ కంపెనీ స్థానిక డీలరు బండల వీరేష్, వార్డుసభ్యుడు గుండుబాషా, తాపీమేస్త్రీలు పాల్గొన్నారు. -
‘కూలి’ కష్టం!
‘ఉపాధి’ కూలీల ఖాతాల్లోకి జమ కాని రూ.3 కోట్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కూలీలు రెండు నెలలుగా ఇదే దుస్థితి ఆధార్ అనుసంధానం కాకపోవడమే కారణం 18 శాతం మందికి బ్యాంక్ అకౌంట్లే లేని వైనం పనులు చేసినా కూలి డబ్బు తీసుకోలేని దయనీయ పరిస్థితి ఉపాధి హామీ కూలీలది. బ్యాంక్ ఖాతాలున్నా ఆధార్ అనుసంధానం కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూలీలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.3 కోట్లు బ్యాంకులకు వెళ్లి వెనక్కు వచ్చేసింది. జిల్లాలోని 1003 పంచాయతీల్లో 6,77,776 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 5,59,244 మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. 1,18,532 మందికి ఖాతాలు లేవు. గతంలో ఉపాధి పనులు చేసిన వారి నుంచి పుస్తకాల్లో సంతకాలు తీసుకుని తపాలా సిబ్బంది నగదు పంపిణీ చేసేవారు. ఇందులో అక్రమాలు చోటుచేసుకోవడంతో వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెచ్చారు. కొందరి వేలిముద్రలు, మరికొందరి ఆధార్ సరిపోలకపోవడంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వేతనాల చెల్లింపు ఆలస్యమైంది. దీంతో ప్రత్యక్ష నగదు బదిలీకి కేంద్రం శ్రీకారం చుట్టింది. జాబ్ కార్డులు ఉన్న వారందరికీ ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) లేదా వ్యక్తిగత పొదుపు ఖాతాలు ఏదో ఒక బ్యాంకులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. గత ఏడాది వరకు కొన్ని పంచాయతీల్లో కూలీలకు బ్యాంక్ ఖాతాల ద్వారా, మరికొన్ని చోట్ల పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు చేశారు. అయితే.. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ బ్యాంక్ ఖాతాల ద్వారానే కూలి డబ్బు అందిస్తున్నారు. ప్రతి రోజూ రెండు లక్షల మంది వరకు కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ప్రతి వారం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లోని కూలీల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో సమస్య తలెత్తుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు పది వేల మంది కూలీలకు రూ.3 కోట్లు అందించాల్సి ఉంది. ఈ డబ్బు బ్యాంకులకు వెళ్లినా ఆధార్ అనుసంధానం కాక వెనక్కు వచ్చేసింది. ప్రధానంగా కనగానపల్లి మండలంలో కూలీలకు ఉపాధి సొమ్ము అందలేదని తెలుస్తోంది. 18 శాతం మందికి ఖాతాల్లేవ్ జిల్లాలో ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీల్లో 1,18,532 మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. మొత్తం కూలీల్లో 18 శాతం మందికి అకౌంట్లు లేవు. గుడిబండ మండలంలో 10,594 మంది కూలీలుంటే 7091 మందికి, కదిరిలో 8,988 మందికి గాను 6,128, రొద్దంలో 11,367 మందికి 7,997, మడకశిరలో 11,795 మందికి గాను 8,263, చెన్నేకొత్తపల్లి మండలంలో 14,778 మందికి గాను 10,557 మందికి మాత్రమే బ్యాంక్ ఖాతాలున్నాయి. ఇలాంటి మండలాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. గుత్తి, గుంతకల్లు, పెద్దపప్పూరు, తాడిమర్రి, ఉరవకొండ మండలాల్లో మాత్రం 98 శాతానికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఖాతాలు తెరిపిస్తే కూలీలకు మేలు జరిగే అవకాశం ఉంది. చర్యలు తీసుకుంటున్నాం : నాగభూషణం, డ్వామా పీడీ ఉపాధి కూలీలందరికీ బ్యాంక్ ఖాతాలు తప్పనిసరి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరికీ వ్యక్తిగత ఖాతాల్లోనే నగదు పడుతుంది. ఖాతాలు తెరిపించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. కూలి చెల్లింపు సమస్య ఉన్న చోట ఆధార్ లింకేజీ చేయిస్తున్నాం. కూలీలు కూడా తమ ఖాతాలకు ఆధార్‌తో లింక్ చేయించుకుని మండల కంప్యూటర్ సెంటర్ (ఎంసీసీ)కు వెళ్లి అప్లోడ్ చేయించుకోవాలి. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. -
కూలీ.. కడుపు ఖాళీ
► నెలలుగా వేతనానికి నోచుకోని ‘ఉపాధి’ కూలీలు ► పనులకు వెళ్లేందుకు విముఖత ► గణనీయంగా తగ్గిన కూలీల సంఖ్య ► హాజరుకావాలని కోరుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ► జిల్లాలో రూ. 8.45 కోట్ల వేతన బకాయిలు ► ప్రగతిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం స్వేదం చిందించి శ్రమను నమ్ముకున్న బతుకులు భారంగా కాలం వెళ్లదీస్తున్న దృశ్యాలు జిల్లాలో అడుగడుగునా కళ్లకు కడుతున్నాయి. ఎన్నో నిరుపేద కుటుంబాలకు ‘ఉపాధి’ పనులే ఊతం. వీటి ఆధారంగా వచ్చే వేతనాలతోనే వారు జీవనం సాగిస్తున్నారు. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో చేతిలో డబ్బులు లేక కూలీలు అగచాట్లు పడుతున్నారు. తమ దయనీయ పరిస్థితిపై అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో చివరకు వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘పది వారాలపాటు పనిచేసిన డబ్బులు ఇంతవరకు రాలేదు. ఎప్పుడొస్తాయో ఇప్పటికీ తెలియదు. ఉపాధి పనుల డబ్బులు వస్తేనే.. మా కుటుంబం గడిచేది. నెలల తరబడి ఒక్క పైసా కూడా మా ఖాతాల్లో పడకుంటే ఏం తినాలి? ఎలా బతకాలి? నిధులు విడుదల చేశాకే మళ్లీ పనులకు వస్తాం. అప్పటిదాకా మా దారి వేరే’. జిల్లాలోని ఉపాధి హామీ పథకం కూలీల మనోవేదన ఇది. ఏ కూలీని పలకరించినా దాదాపు ఇదే సమాధానం వస్తోంది. ఫలితంగా పనులపై వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ప్రస్తుతం పనుల్లోకి వచ్చే కూలీల సంఖ్య క్రమేపీ గణనీయంగా తగ్గుముఖం పడుతోంది. ఉపాధి పనుల నిర్వహణకు మార్చి నెల అత్యంత కీలకం. ఇదే నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. ఈ లోగా నిర్దేశించుకున్న లక్ష్యాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెలలో వ్యవసాయ, దాని అనుబంధ పనులు కాస్త తక్కువగానే ఉంటాయి. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపాధి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతారు. గతేడాది ఇదే నెలలో పనుల్లోకి వచ్చిన వారి సంఖ్య దాదాపు 41 వేలు. ప్రస్తుతం 31 వేలకే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. తీవ్ర నష్టమే.. ప్రతి నిరుపేద కుటుంబం ఒక ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా వంద రోజుల పని పొందవచ్చు. దీనికి గడవు ఈ నెలాఖరు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 9,300 కుటుంబాలు వంద రోజుల ఉపాధి పొందాయి. మరో 4 వేలకు పైగా కుటుంబాలు 80 రోజుల పని మార్క్‌ను చేరుకున్నాయి. మరో 20 రోజులు పనుల్లోకి వెళ్తే ఉపాధి లక్ష్యం పరిపూర్ణం అవుతోంది. అయితే ఇప్పటికే చేసిన పనులకు సంబంధించిన వేతనాలు విడుదల కావడంతో వారంతా కొన్ని నెలలుగా పనులకు దూరంగా ఉంటున్నారు. నిధుల విడుదల మరింత జాప్యమైతే ఈ కూలీలు పని దినాలను నష్టపోయినట్లేనని స్పష్టమవుతోంది. మిగిలిన కుటుంబాలు కూడా ఉపాధిని కోల్పోయినట్లేనని కార్మిక నేతలు చెబుతున్నారు. పనులపై ప్రతికూల ప్రభావం.. ఉపాధిలో భాగంగా నీటి సంరక్షణ, స్వచ్ఛత పనులపై గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు దృష్టి సారించారు. నీటి, ఊట కుంటలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల తదితర పనుల లక్ష్యాలను ఈనెలాఖరులోగా చేరుకోవాల్సి ఉంది. అయితే ఆశించిన స్థాయిలో కూలీలు పనుల్లోకి రాకపోవడంతో ప్రగతిపై కొంత ప్రతికూల ప్రభావం అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను పనుల్లోకి రాని కూలీల వద్దకు రాయబారం పంపుతున్నారు. డబ్బులు ఎక్కడికీ పోవని.. త్వరలో వస్తాయని వారికి నచ్చేజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పనులకు హాజరుకావాలని వారిని కోరుతున్నారు. అయితే చాలా మంది కూలీలు మెట్టు దిగడం లేదు. వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవడం లేదని.. ఇలాంటప్పుడు పనుల్లోకి ఎలా వస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్‌లో రూ. 8 కోట్లకు పైమాటే.. జిల్లాలో ప్రస్తుతం నిత్యం సగటున 32 వేల మంది కూలీలు పనులకు వెళ్తున్నారు. ఏడాది ఆసాంతం (గతేడాది వేసవి నుంచి ఇప్పటి వరకు) దాదాపు 1.30 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారని అంచనా. వివిధ రకాల అభివృద్ధి పనుల కోసం ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు రూ. 62 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వ్యయం చేసినా.. కూలీలకు మాత్రం సకాలంలో వేతనాలు అందడం లేదు. దాదాపు 65 వేల మంది కూలీలకు రూ. 8.45 కోట్లు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత నవంబర్ వరకు అరకొరగా వేతనాలు ఇస్తూ నెట్టుకొచ్చారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్కపైసా విడుదల కాలేదని సమాచారం. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీలకు వేతనాలు అందాల్సి ఉంది. కానీ, ఆ మేరకు జిల్లాలో పరిస్థితులు లేకపోకవడంతో కూలీలు సతమతం అవుతున్నారు. ఒక్కో కూలీకి వేల రూపాయల వేతనం రావాల్సి ఉంది. అయినా ఆలస్యమే... గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని కూలీల ఖాతాల్లో జమచేసేది. ఈ విధానంతో వేతనాల అందజేతలో తీవ్ర జాప్యం చోటుచేసుకునేది. అంతేగాక సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం.. కూలీల ఖాతాల్లో జమ చేయ కపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మరో నిర్ణయం తీసుకుంది. నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలని నిశ్చయించుకుంది. గత జనవరి నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రానికి కేటాయింపులు జరిపిన నిధుల్లోంచే.. కేంద్రం కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది కేంద్రం.. రాష్ట్ర కోటా కింద రూ.300 కోట్లను కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తం నిధుల వినియోగం ఇప్పటికే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. మరో దఫా నిధుల విడుదలపై కార్యాలయాల మధ్య ఫైళ్లు కదులుతున్నాయని.. తొందరలోనే ఈ సమస్య కొలిక్కి వస్తుందని వివరిస్తున్నారు. దీనిపై డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్‌ను వివరణ అడగగా.. త్వరలోనే డబ్బులు కూలీల ఖాతాల్లో జమ అవుతాయని సమాధానమిచ్చారు. పెండింగ్‌లో ఉన్న మొత్తం నిధులు వస్తాయని చెప్పారు. రూ.6వేలు రావాలి నేను, నా భర్త ఉపాధి హామీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వచ్చిన కూలిడబ్బులే మాకు ఆధారం. ఇప్పటివరకు ఏడు వారాలకు సంబంధించిన దాదాపు రూ. 6 వేలు అందాల్సి ఉంది. కాని నేటికీ నయాపైసా అందలేదు. ఫీల్డ్ అసిస్టెంట్‌ను అడిగితే.. గడువు పెడుతున్నా మార్పు లేదు. చేతిలో పైసలు లేక ఇంట్లకు అవసరమైన వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బందిగా మారింది. చివరకు ఉప్పు, పప్పు, కూరగాయలకూ వెనకాముందు ఆలోచిస్తున్నాం. అత్యవసరమైతే అప్పు చేస్తున్నాం. – కట్టెలబాలమ్మ, ఉపాధి కూలి, పోల్కంపల్లి రూ.3,653 రావాల్సి ఉంది ఐదు వారాలు పనులు చేస్తే ప్లే స్లిప్పులు వచ్చాయి. మొత్తం రూ.3,653 రావాల్సి ఉంది. కాని నేటికీ చెల్లించలేదు. ఎర్రటి ఎండల్లో కష్టపడి పని చేస్తే శ్రమకు తగిన ఫలితం రావడం లేదు. బయట పనికి వెళ్లకుండా ఉపాధిని నమ్ముకుంటే నిరాశకు గురి కాకతప్పడం లేదు. అధికారులను అడిగితే మేము బిల్లులు చేసి పంపించాం.... ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. కూలి డబ్బులు తొందరగా అందించి ఆదుకోవాలి. –గూడెం దానయ్య, కూలీ, పోల్కంపల్లి -
వృద్ధురాలికి 'ఆన్లైన్' బురిడీ!
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట మండలంలోని చెంచుగారిపల్లె దళితవాడకు చెందిన యాగల లక్ష్మీనరసమ్మ కూలి పని చేసుకొని జీవిస్తోంది. ఆమె భర్త 20 ఏళ్ల క్రితం మరణించారు. వితంతు పింఛన్ తీసుకుంటోంది. తనకు ఎవరూ లేకపోవడంతో పెన్షన్, కూలి పని చేసుకుని సంపాదించుకున్న మొత్తాన్ని ఒంటిమిట్ట స్టేట్‌బ్యాంకులో నంబర్: (11524745925)తో 2007లో ఖాతా ఓపెన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఖాతాలో కొంత నగదుతోపాటు, భర్త ద్వారా సంక్రమించిన భూమిని విక్రయించగా వచ్చిన రూ.50 వేల నగదును అకౌంట్లో వేసుకుంది. 2015 నాటికి రూ.99,928 నిల్వకు చేరుకుంది. 2016లో బ్యాంక్‌కు వెళ్లి రూ.20 వేలు డ్రా చేసుకుంది. తర్వాత అకౌంట్ పుస్తకంలో కంప్యూటర్ ద్వారా నగదు వివరాలను ఎక్కించుకుంది. రూ.19,909 మాత్రమే నిల్వ ఉన్నట్లు చూపడంతో వృద్ధురాలిలో ఆందోళన మొదలైంది. మిగతా డబ్బు గురించి బ్యాంక్ అధికారులను అడగ్గా తమకు తెలియదని చెప్పడంతో ఏమీ చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఆన్లైన్లో ఎవరో ట్రాన్స్క్షన్ చేసుకొని ఉంటారని బ్యాంకు అధికారులు ఉచిత సలహా ఇచ్చేశారు. ఏడు దఫాలుగా డ్రా.. తన అకౌంట్ నుంచి ఏడు దఫాలుగా రూ.63 వేలను ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా వివరాలు తెలుసుకోగలిగింది. కాగా వృద్ధురాలికి గ్యాస్ కనెక్షన్ ఉంది. గ్యాస్ సిలిండర్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత సబ్సిడీ కోసం ఆధార్‌కార్డును చిన్నకొత్తపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇప్పించుకుని, వేలిముద్ర వేయించుకునే వాడు. అతనిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇదే విధంగా వేరే వారికి చేస్తే.. వారు నిలదీస్తే డబ్బులు తిరిగి ఇచ్చేశాడనే ఆరోపణలు ఉన్నాయని ఆమె చెబుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని విలేకర్ల వద్ద వాపోయింది. దళిత వృద్ధురాలికి కనీసం దళితనాయకులు అండగా నిలిచి.. ఆమెను ఆన్లైన్ ద్వారా మోసం చేసి నగదు తస్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. బ్యాంక్ మేనేజర్ ఏమంటున్నారంటే.. లక్ష్మీనరసమ్మ అకౌంట్లో నగదు గల్లంతు విషయంతో తనకు సంబంధం లేదని ఒంటిమిట్ట ఎస్బీఐ మేనేజర్ వెంకట్రావు తెలిపారు. ఆన్లైన్లో నగదు ట్రాన్స్క్షన్ జరిగి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. -
ఉపాధి కూలీలకు నేరుగా వేతనాలు!
వారి ఖాతాల్లోనే జమ చేయనున్న కేంద్రం సామగ్రి ఖర్చు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఇకపై వేతన ఇబ్బందులు తొలగిపోనున్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ పథకం కింద పనులు చేసిన కూలీలకు వేతనాల సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని కేంద్రం నిర్ణరుుంచిం ది. కేంద్రం నుంచి ఉపాధి సొమ్ము రాష్ట్ర ఖజానాకు జమ కావడం, ఆ సొమ్మును వెంటనే గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనులకు మళ్లించడం వంటివాటితో కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు మానేయడం, వలస పోయిన దుస్థితి ఏర్పడడంతోపాటు కొన్నిసార్లు ఉపాధి నిధులను విడుదల చేరుుంచడానికి రాష్ట్ర గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది కూడా. ఇలా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తాము అప్రదిష్ట పాలుకావాల్సి వస్తోందని భావించిన కేంద్రం... నేరుగా కూలీల ఖాతాల్లో వేతనాలు జమ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా.. ఉపాధి కూలీలకు రోజు వారీ వేతనాలను చెల్లించేందుకు ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉపాధి పనులు చేసిన కూలీల పేరు, ఆధార్, జాబ్‌కార్డ్ నంబర్, చెల్లించాల్సిన వేతనం తదితర వివరాలను ‘తెలంగాణ పేమెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్(టీపీఎంఎస్)’ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కేంద్రానికి పంపుతారు. ఆ వివరాలను ఎన్ ఈఎఫ్ఎంఎస్కు అనుసంధానించి, కూలీ లకు వేతనాలు చెల్లిస్తారు. దీనికి సంబంధిం చి రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలు ఇవ్వడంతో.. రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణరుుంచారు. దీంతో ఉపాధి కూలీలకు ఇకపై వేతన సమస్యలు ఉండవని ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు పేర్కొంటున్నారు. రూ.202 కోట్లు విడుదల రాష్ట్రంలో డిసెంబర్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పనుల చెల్లింపుల కోసం మూడో విడత కింద కేంద్రం రూ.202 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి ఏకే సంబ్లీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మొత్తం సొమ్ములో రూ.152.23 కోట్లను వేతన చెల్లింపులకు, రూ.50 కోట్లను మెటీరియల్ కాంపొనెంట్ కింద అవసరమైన సామగ్రికి వినియోగించుకోవాలని అందులో పేర్కొన్నారు. కూలీల కు వేతన చెల్లింపులను ఎన్ఈఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని.. మెటీరియల్ కాంపొనెంట్ సొమ్మును త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. -
శ్రమ, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలకు
హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ జనగామ : విద్యార్థులు తమ లక్ష్యాలను అధిగమించేందుకు శ్రమ, పట్టుదలతో కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి బి.చంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని సాహితీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించినప్రేషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ కరై కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని చంద్రకుమార్ ప్రారంభించారు. కష్టపడితే ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్లాలో తనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వాల నుంచి దేశంలో పారిశ్రామికవేత్తలు తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను రాబట్టుకోగలితే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించవచ్చన్నారు. కానీ, ప్రభుత్వాల అసమర్థత కారణంతో పారిశ్రామిక వేత్తలు వేల కోట్ల రూపాయల రుణాలను చెల్లించడం లేదన్నారు. జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా కన్న తల్లిదండ్రులు, విద్యాబుద్దులు నేర్పిన గురువులను మరిచిపోవద్దని సూచించారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం చంద్రకుమార్‌ను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు ఆకుల నర్సింహులు, అధ్యాపకులు ఉపేందర్, రత్నాకర్, భాస్కర్, సతీష్, మహేష్, రాజు, భాస్కర్, రాంబాబు, రామచంద్రం, రాజకొంమురయ్య, దివ్య, చైతన్య, శ్వేత, శ్రీకాంత్ ఉన్నారు. 12జెజిఎన్05 : చంద్రకుమార్‌ను సత్కరిస్తున్న యాజమాన్యం -
కార్మిక వ్యతిరేక విధానాలు వద్దు..
అరండల్‌పేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఇతర వామపక్ష యూనియన్లతో కలిసి వైఎస్సార్టీయూసీ శుక్రవారం నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా మద్దు ప్రేమ్‌జ్యోతిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విచ్చలవిడిగా అనుమతిస్తుందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలలో వాటాలను ఉపసంహరించే ప్రక్రియను వెంటనే విడనాడాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుష్కరాల పనుల్లో కీలకమైన పాత్ర పోషించిన పారిశుధ్య కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వకుండా వారి ఉసురుపోసుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. -
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
హన్మకొండ అర్బన్ : కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం(టీకేజీకేఎస్) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జనగాం శ్రీనివాస్ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారం చెల్లించాలని, శాశ్వత వైకల్యం పొందిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం కోసం జిల్లా వ్యాప్తంగా 200 మంది ఎదురు చూస్తున్నారని అన్నారు. బాధితులు వివరాలు ఇస్తే వెంటనే మంజూరు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని ఆరోపించారు. తమ సమస్యలు తక్షణమే పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తాళ్లపెల్లి రామస్వామి, కుర్ర ఉప్పలయ్య, కోల జనార్దన్, బుర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
బొజ్జ గణపయ్యలు సిద్ధమయ్యారోచ్..!
-
సార్వత్రిక సమ్మెకు సన్నద్ధం
* రౌండ్‌టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల నాయకుల పిలుపు గుంటూరు వెస్ట్: దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 2న సమ్మెకు కార్మికులు సన్నద్ధం కావాలని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపును గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టాన్ని తీసుకు రావాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని చెప్పారు. 31న ర్యాలీలు, ప్రదర్శనలు.. 31న మున్సిపల్, మండల కేంద్రాల్లో సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలని నాయకులు కోరారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించి పెట్టుబడిదారులకు దోచిపెట్టే ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పాశం రామారావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వీ క్రాంతికుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేతనాలివ్వకండా వేధిస్తున్నారు..
సీఆర్డీఏ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన కమిషనర్ హామీతో ఆందోళన విరమణ తుళ్ళూరు: వెట్టిచాకిరీ చేయించుకుని వేతనాలు ఎగ్గొట్టారని ఆరోపిస్తూ పారిశుద్ధ్యకార్మికులు మంగళవారం తుళ్ళూరు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వేతనాలు వెంటనే ఇవ్వాలంటూ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. సీఐటీయూ రాజధాని కమిటీ కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్, సీపీఎం రాజధాని డివిజన్ నాయకుడు జె.వీర్లంకయ్యల ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నెలరోజులపాటు పనులు చేయించుకుని రెండునెలలు కావస్తున్నా కూలిడబ్బులు ఇవ్వలేదని వివరించారు. పంచాయతీ అధికారులను అడిగితే సీఆర్డీఏ అధికారులను అడగమంటున్నారని, సీఆర్డీఏ అధికారులను అడుగుతుంటే తమకు సంబంధం లేదని అంటున్నారని చెప్పారు. గత్యంతరంలేక ఆందోళనకు దిగామని వివరించారు. ఈ మేరకు తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం అధికారి కేశవనాయుడికి వినతిపత్రం సమర్పించారు. దీంతో కేశవనాయుడు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ కమిషనర్ మల్లికార్జునరావులతో మాట్లాడారు. వచ్చే గురువారం లోగా బకాయి కూలి చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు. అధికారులు చెప్పిన మాటప్రకారం నాలుగు రోజులలో బాధితులకు కూలి డబ్బులు ఇవ్వకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకుడు జె.నవీన్‌ప్రకాష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎలా బతకాలి.. వెలగపూడి గ్రామం నుంచి 30 మందిని తీసుకుని తాడేపల్లి మండలం పెనుమాక, తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామాలలో సుమారు నెలరోజులు పారిశుద్ధ్యం పనులు చేశాం. అలవాటు లేకపోయినా రూపాయి అక్కరకు వస్తుందని కష్టపడ్డాం. రెండునెలలు కావస్తున్నా కూలి డబ్బులు ఇవ్వలేదు. తోటి కూలీలతో ఇబ్బందులు పడుతున్నాను. 500 మందికి మచ్చర్లు రావాలి. ఇన్నాళ్లు డబ్బులు ఇవ్వకుంటే ఎలా బతకాలి. – భూలక్ష్మి, కార్మికురాలు, వెలగపూడి -
హామీలు నెరవేర్చాలని ధర్నా
కార్మికులకు జీతాలు పెంచాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ నెహ్రూనగర్: మున్సిపల్ శాఖలో పని చేసే ఇంజినీరింగ్ విభాగ కార్మికులకు (సెమీ స్కిల్డ్, స్కిల్డ్) గత సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన జీతాల పెంపు హామీలను నెరవేర్చాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. దిగుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన అప్పిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం జూలై 25వ తేదీన పుష్కర సమయంలో జరిగిన చర్చలలో భాగంగా ఇంజినీరింగ్ విభాగపు సెమీ స్కిల్డ్, స్కిల్డ్ కార్మికులకు వేతన పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ చేసిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. హామీ ఇచ్చి సంవత్సరం గడిచినా ఇంత వరకు ఈ విషయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మజ్దూర్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులకు సాక్ష్యాత్తూ రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీలను తక్షణమే ఇంజినీరింగ్ విభాగం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మధుబాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, యనమల రామకష్ణుడు, కె.అచ్చెన్నాయుడులతో ఇంజినీరింగ్ కార్మికులకు జరిగిన చర్చలలో అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలు పెంచిన విధంగానే సెమీ స్కిల్డ్, స్కిల్డ్ వర్కర్లకు కూడా పూర్వ ప్రభుత్వాలు అనుసరించిన వేతన పెంపు రీతిలో, రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు వేతన పెంపు చేయాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాదా వెంకటముత్యాలరావు, వరికల్లు రవికుమార్, సోమి శంకరరావు, సీఐటీయూ నాయకులు ముత్యాలరావు, ఆది నికల్సన్, ఐఎన్టీయూసీ నాయకుల పాల్గొన్నారు. -
ఎంసెట్–2 లీకేజీ వెలుగులోకి వచ్చిందిలా..
పరకాల : పరకాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు గుండెబోయిన రవి, వీరగంటి సతీష్, ఆకుల కృష్ణ, బొజ్జం రఘులు ఎంసెట్–2లో అక్రమాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేయడంతో ఎంసెట్–2 లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లలను డాక్టర్లు చేయడమే లక్ష్యంగా ఎంచుకొని వేలాది రూపాయలు చదివిస్తున్నారు. ఎంసెట్–2లో ర్యాంకు తప్పనిసరిగా వస్తుందని భావించిన తరుణంలో పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాల వల్లనే అనుకున్న ర్యాంకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెబోయిన రవి బాధిత విద్యార్థుల తల్లిదండ్రులను సమాయత్తం చేసి ఎంసెట్–2 విచారణ కోసం పట్టుపట్టారు. దీనితో సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా పరకాలకు చెందిన వాళ్లు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఒక్కొక్కటిగా లీకేజీ వ్యవహారం వెలుగులోకి వస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంసెట్–2 లీకేజీపై లోతైన విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, లీకేజీ వ్యవహారంలో విద్యార్థులను సైతం విచారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై రౌడీషీట్లు నమోదు చేయాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు రవి, సతీష్, కృష్ణ, రఘులు కోరుతున్నారు. ఎంసెట్‌పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా విచారణ ఉండాలని కోరుతున్నారు. ఇంకా విచారణ జరుతుగుందని, నివేదిక తరువాత భవిష్యత్ ప్రణాళికను చెబుతామన్నారు. -
మొక్కల సంరక్షణకు.. ‘ఉపాధి’ కూలీలు
మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల్ని సంరక్షించేందుకుగాను ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున పంచాయతీరాజ్ రోడ్లకు ఇరుపక్కల ఒకే రోజు 10 వేల మొక్కలు నాటాలని తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో నాటిన ప్రతీ మొక్కను రక్షించేందుకు ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుందన్నారు. ప్రైవేటు స్థలాల్లో నాటిన టేకు మొక్కలకు ఒక్కోదానికి నెలకు రూ. 1, పండ్ల మొక్కలైతే రూ.15, ఇతర ఒక్కో మొక్కకు రూ. 1 చెల్లిస్తామన్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర సంస్థల్లో నాటిన ఒక్కో మొక్కకు నెలకు రూ. 11.20 పైసలు చెల్లిస్తామన్నారు. రోడ్ల పక్కన నాటిన ఒక్కో మొక్కకు రూ. 12, ఈత చెట్లకు ఒక్కో దానికి రూ. 5, చెరువు గట్లు, ప్రభుత్వ భూముల్లో నాటిని ఈత చెట్లయితే ఒక్కో దానికి రూ. 11.20పైసలు చెల్లించనున్నట్లు వివరించారు. -
శ్రమ అనే ఆయుధంతో విజయం సాధించాలి
రామన్నపేట విద్యార్థులు శ్రమ అనే ఆయుధాన్ని ఉపయోగించి జీవితంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ డిగ్రీకళాశాలలో మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థి తాను ఎంచుకున్న సబ్జెక్టులో మంచి ప్రావీణ్యాన్ని సాధించాలని సూచించారు. అబ్దుల్‌కలాం ఆలోచనలకు అనుగుణంగా సామాన్యులకు నాణ్యమైనవిద్యను అందించేవిధంగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సరైనవసతులు లేనందున రవాణామంత్రి మహేందర్‌రెడ్డి కాలేజీలకు కూడా ప్రభుత్వం అనుమతించలేదని వివరించారు. కళాశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కళాశాల అధ్యాపకులు విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ భానుప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, టీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు బందెల రాములు, వైస్‌ప్రిన్సిపాల్ ఎ.ప్రదీప్‌రెడ్డి, అధ్యాపకులు బి.రవీందర్, కె.అనిత, సీహెచ్ భిక్షమయ్య, వి.బుచ్చిరెడ్డి, కె.భాస్కర్, ఆర్వీ రామారావు, కె.సాలయ్య, సీహెచ్ రాకేష్భవానీ, బీఎస్ఆర్యూ రాజశేఖర్, జి.యాదగిరి, మల్లేశం పాల్గొన్నారు. -
కార్మికుల ఆందోళనలపై ప్రభుత్వం ఆంక్షలు
వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి గుంటూరు వెస్ట్: కార్మికులు తమ హక్కుల కోసం ఆందోళనలు చేయడానికి వీల్లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంక్షలు విధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సన్నాహంగా గుంటూరులోని మహిమా గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఫ్యాక్టరీ చట్టంలో మార్పులు తీసుకువచ్చి యాజమాన్యానికి అనుకూలంగా మార్పులు చేస్తూ కార్మికుల నెత్తిన కుచ్చుటోపీ పెడుతోందని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహీదా నిజాం మాట్లాడుతూ సెప్టెంబర్ 2న జరిగే సమ్మెలో కార్మికులు ఐక్యంగా పాల్గొని కార్మికసత్తాను పాలకులకు తెలియజేయాలని కోరారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.గఫూర్ మాట్లాడుతూ గత సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో 17 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని అన్నారు. ఆ సమ్మె సందర్భంగా కార్మికసంఘాలతో చర్చిస్తామని చెప్పిన కేంద్రం ప్రభుత్వం 10 నెలలు గడిచినా ఇంకా చర్చించకపోవడం కార్మిక సమస్యలపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడిస్తోందన్నారు.. ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు విస్సా క్రాంతికుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమాలే శరణ్యమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్.నర్సింగరావు, ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు వీరాస్వామి, ఏఐయూటీసీ రాష్ట్ర నాయకులు సుధీర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు, టీయూసీసీ రాష్ట్ర నాయకులు సుందర రామరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, అధ్యక్షుడు చలసాని రామారావు, ఎంఎల్సీ చంద్రశేఖరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల సుందర్‌రెడ్డి, కార్యదర్శి రూబెన్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకష్ణమూర్తి, వివిధ ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. -
రైతు నెత్తిన.. భూ సేకరణ పిడుగు
వారంతా నేలతల్లిని నమ్ముకుని బతికే చిన్న, సన్నకారు రైతులు.. మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఎకరా.. ఒకటిన్నర ఎకరా భూమే వారికి జీవనాధారం. ఏళ్లక్రితం ఇచ్చిన గుంటలు మిట్టల భూమిని వారు తమ కాయకష్టంతో చదును చేసుకున్నారు. చెట్లు పుట్టలు తొలగించి సాగుకు యోగ్యంగా తయారు చేశారు. ఇప్పడు ఏడాదికి రెండుకార్లు చొప్పున పంటలు పండి స్తున్నారు. పెట్టుబడులు పెరగడంతో స్వయంసహాయక సంఘాల మహిళలందరూ కూలీలుగా మారి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే పరిశ్రమల పేరుతో.. ఆభూములను లాక్కునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఒకప్పుడు మేం ఇచ్చిన భూములే కదా.. తిరిగి ఇచ్చేయండంటూ హుకుం జారీ చేసింది. లేకుంటే చేయాల్సింది చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో ఏం చేయాలో తెలియక ‘మా కడుపుకొట్టొద్దు బాబూ..’ అంటూ రైతులందరూ ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. అధికారమదంతో బతుకుపై కొడితే రైతన్న సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం భూసేకరణ చేసేందుకు సిద్ధమవుతుండడంతో రైతులు, పేదలగుండెల్లో అలజడి మొదలైంది. మా కడుపుకొట్టొదని శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాల్లోని పేద, మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. పుడమితల్లిని నమ్ముకుని బతుకుతున్న తమపై భూసేకరణ పేరుతో పంజా విసిరితే.. ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాళహస్తిః జిల్లాలోని తూర్పువుండలాల్లో సాగునీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. ఒకప్పుడు చిట్టడవులుగా ఉన్నా భూవుులను రైతులు తమ కాయుకష్టంతో పంట చేలుగా వూర్చా రు. పుడమితల్లిని నవుు్మకుని రాత్రిపగలు తేడాలు లేకుండా సేద్యం చేస్తూ.. భూమిపుత్రులుగా బతుకుతున్నారు. అరుుతే ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణతో ఒక్కోరైతు భవిష్యత్‌ను కారుచీకట్లోకి నెట్టేస్తోంది. ఉన్న ఎకరం, అర ఎకరం భూవుులను లాక్కొని పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని సన్నాహాలు చేస్తుండ డంపై వారు ఆవేదన చెందుతున్నారు.‘‘మేం అధికారంలోకి వస్తే డీకేటీ భూవుులను సెటిల్మెంట్ చేస్తాం. రైతు సంక్షేవుం వూతోనే సాధ్యం’’ అని చెప్పిన చంద్రబాబు.. అధికార పీఠం దక్కడంతో తవు నోటికాడ కూడు లాగేసేందుకు యత్నిస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొట్టంబేడు, శ్రీకాళహస్తి వుండలంలోనే పరిశ్రమల కోసం 44 వేల ఎకరాల భూవుులు సేకరించాలనియ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొట్టంబేడు వుండలంలోని చియ్యువరం, కాసరం, రాంబట్లపల్లి, చోడవరం, చేవుూరు, గుండేలుగుంట, వూమిడిగుంట, గొట్టిపూడి తదితర గ్రావూల్లో 26 వేల ఎకరాల భూవుులు స్వాధీనం చేసుకోవాలని అధికారులు సర్వేలు పూర్తిచేశారు. ఇక శ్రీకాళహస్తి వుండలంలోని ఓబులాయుపల్లి, రెడ్డిపల్లి, యుర్రవురెడ్డిపల్లి, గంగలపూడి, ఇనగలూరు,వెల్లంపాడు, గోవిందరావుపల్లి, రావూంజుపల్లి, అక్కూర్తి, ఉడవులపాడు, జింగిలిపాళెం, గుంటకిందపల్లి, వుద్దిలేడు తదితర గ్రావూల్లో 18వేల ఎకరాల భూవుులు రైతుల నుంచి లాక్కోవాలని చూస్తోంది. ఈ ప్రాంతంలో అంతా సన్న, చిన్నకారు రైతులే. అధికంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీ తెగలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. కనీసం తావుు పంటలు సాగుచేయుడానికి కూలీలు ధరలు భరించలేవుంటూ వారే గ్రూపులుగా ఏర్పడి సేద్యం చేస్తున్నారంటే వారి పేదరికం తెలుస్తోంది. అరుునా ప్రభుత్వం కనికరం లేకుండా భూవుులు లాక్కోవడానికి శ్రీకారం చుట్టింది. దాంతో 50 వేల కుటుంబాలు భూవుులు కోల్పోనున్నాయి. 2లక్షల వుంది ప్రజలు నిరాశ్రయుులు కానున్నారు. దీంతో ఈరెండు వుండలాల్లోని అన్నదాతలకు భూవుుల భయం నెలకొంది. -
ఎస్పీ ఇంట్లో హోంగార్డ్ వెట్టిచాకిరీ
-
ఉపాధి కూలీలు సోమరిపోతులా?
► ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అనుచిత వ్యాఖ్యలపై మండిపాటు రాస్తారోకో, ధర్నా, ► దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే క్షమాపణ ► చెప్పాలని డిమాండ్ దేవరాపల్లి: గ్రామీణ పేదలు సోమరిపోతులు అంటూ ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజే పీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీరుపై వ్యవసాయ కార్మిక సంఘం మండిపడింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా మండల కేంద్రం దేవరాపల్లిలో బుధవారం ధర్నాతో పాటు రాస్తా రోకో నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో విష్ణుకుమార్‌రాజు దిష్టిబొమ్మ దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు సీహెచ్.రాజు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, ఉపాధి కూలీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఉపాధి చట్టం వల్ల సోమరిపోతులుగా మారుతున్నారని.. అనేక పనులకు ఆటంకం కల్గుతోందని.. సంక్షేమ పథకాలు, కిలో రూపాయి బియ్యం సరఫరా చేయడం వల్ల బద్ధకస్తులుగా మారి.. పనికిమాలిన వారుగా తయారవుతున్నారని అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నారు. విశాఖ జిల్లాలో సుమారు 1.50 లక్షలు కుటుంబాలు ఉపాధి పనులు చేసుకుంటున్నారని తెలిపారు. పేదల కష్టంపై జాలి, దయా లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఉపాధి చట్టం నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంతో పేదలపై బీజే పీకి ఎంత చులకన భావం ఉందో అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కర్రి సన్యాశినాయుడు, కె.బుచ్చిబాబు, ఈగల నాయుడు, ఈ.రవి, ఎస్.భారతి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు
విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు కూలీలకు తీవ్ర గాయాల య్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం మామిళ్లకుంట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. మామిళ్లకుంట గ్రామానికి చెందిన రైతులు జొన్నగిరి నుంచి ట్రాక్టర్ పై విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా.. అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 సాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
నత్తకు నేర్పిన నడకలివీ
జిల్లాలో ఉపాధి పనుల తీరిది... నిధులు ఉన్నా ... పనులు సున్నా ముందుకు సాగని పంట కుంటలు అదే బాటలో ఇంకుడు గుంతల తవ్వకం అమరావతి : జిల్లాలో ఉపాధి కూలీలకు పని దినాలు కల్పించడంలో అధికార యంత్రాంగం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. పనులు చేసిన కూలీలకు వేతనాల ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ఉపాధి పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. అక్కడ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంట కుంటలు...ఇంకుడు గుంతలు... జిల్లాలో పంట కుంటల పనులు ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా క్షేత్ర స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో లక్ష పంట కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం 12, 328 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 3, 863 పంట కుంటలు మాత్రమే పూర్తి అయ్యాయి. 10 మండలాల్లో 10 లోపు పంట కుంటలు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఇంకుడు గుంతల విషయానికి వస్తే పంచాయతీకి కనీసం ఒకటి, రెండు చొప్పున తవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకు 28, 907 ఇంకుడు గుంతలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది . ఇందులో 10,967 పనులు పురోగతిలో ఉండగా, పూర్తి స్థాయిలో ఎక్కడా పూర్తి కాలేదు. మొక్కలు లేక ఆగిన బండ్ ప్లాంటేషన్.... గత ఏడాది జిల్లాలో పొలాల గట్ల వెంబడి ఆరు లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యం కాగా, మొక్కలు దొరకలేదనే సాకుతో గత ఏడాది నిలిపివేశారు. ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ మొక్క ల కొరతే అడ్డంకిగా మారింది. ఈ ఏడాది కూడా అటవీ శాఖ మొక్కలను సరఫరా చేయలేమని ఇప్పటికే డ్వామా అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం ద్వారా 4లక్షల టేకు మొక్కల పెంపకాన్ని జిల్లాలోని ఆరు నర్సరీల్లో చేపట్టినప్పటికీ అందులో 50 శా తంకు పైగా మొక్కలు చనిపోయినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది కూడా గట్లపై టేకు మొక్కల పెంపకం ప్రశ్నార్థకంగా మారనుంది. సిబ్బంది కొరత... జిల్లాలో 602మంది రెగ్యులర్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా, ఎక్కువ శాతం అంటే 321మంది సీనియర్ మేట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. టీటీఏ లు 25మంది, నాలుగు కంప్యూటర్ అపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. గ్రామాల్లో సిమెంట్ రోడ్డు పనులతో పాటు, ఉపాధిశాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అన్ని పనులు మందకొడిగానే నడుస్తున్నాయి. కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేక దృష్టి సారించి, పనుల్లో వేగం పెంచే దిశగా చర్యలు తీసుకొంటున్నా క్షేత్రస్థాయిలో ముందుకు సాగటం లేదు. పనుల వేగం పెంచాం.. : జిల్లాలో పనుల వేగం పెంచాం. ఈ ఏడాది మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. - పులి శ్రీనివాసులు, డ్వామా పీడీ, గుంటూరు. జిల్లాలో ఇచ్చిన జాబ్ కార్డులు : 7,60, 930 ఇప్పటి వరకు పని కల్పించిన కూలీల సంఖ్య : 3,60,970 100 రోజులు పని దినాలు కల్పించిన కుటుంబాలు : 1209 -
‘ఉపాధి భరోసా’ యాత్ర
♦ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నిరోధానికి సర్కారు నిర్ణయం ♦ కూలీల డిమాండ్‌కు అనుగుణంగా పని కల్పనకు ప్రణాళికలు ♦ దరఖాస్తు చేసిన 10 రోజుల్లోగా పని కల్పించకుంటే నిరుద్యోగ భృతి ♦ ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల నుంచి పేద కూలీలు పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలసపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వలసల నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తామంటూ.. భరోసా యాత్రను చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ప్రతి ఊర్లోనూ గ్రామసభ నిర్వహించి కూలీల డిమాండ్‌కు అనుగుణంగా అక్కడికక్కడే ఉపాధి పనులు మంజూరు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధి పనులు కావాలని దరఖాస్తు చేసిన కూలీలకు 10 రోజుల్లోగా పనులు కల్పించకుంటే ఉపాధి హామీ చట్టం ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించారు. రాజస్థాన్ తరహాలో ప్రచారం పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు ‘కామ్ మాంగో అభియాన్’ పేరిట రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన వారిలో కనీసం 10 శాతం మంది కూడా పనులకు రాకపోతుడడంపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి క్యాంపెయిన్ నిర్వహించింది. చట్టంలోని అంశాలు, కూలీల హక్కులపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో ఉపాధి పనులకు వచ్చే వారి సంఖ్య 40 నుంచి 50 శాతానికి పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలోనూ ఉపాధి భరోసా యాత్రను ప్రయోగాత్మకంగా వలసలు అధికంగా ఉండే జిల్లాల్లో చేపట్టాలని సంకల్పించారు. దీని కోసం మహబూబ్‌నగర్ జిల్లాలోని 20 మండలాలు, నల్లగొండ జిల్లాలోని 10 మండలాలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రారంభించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద 14 కోట్ల పనిదినాలను కల్పించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, వచ్చే అక్టోబర్ వరకు 10 కోట్ల పనిదినాలను మంజూరు చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనుల నిమిత్తం ఇప్పటివరకు రూ.2,520 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, అక్టోబర్ తర్వాత డిమాండ్‌ను బట్టి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. యాత్రలో ప్రస్తావించే అంశాలివే.. ప్రతి పేద కుటుంబం తప్పనిసరిగా జాబ్ కార్డు పొందే హక్కు కలిగి ఉండడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో 100 రోజుల ఉపాధి పనిని పొందవచ్చు. అంతేకాక పని ప్రదేశంలో కనీస సౌకర్యాలను పొందే హక్కు కలిగి ఉంటారు. ప్రతి వారం పని కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఉపాధి పనులను పొందవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా పని కల్పించని పక్షంలో మొదటి పది రోజులకు రోజువారీ వేతనం(రూ.194)లో 1/3 వంతు, తర్వాత 10 రోజులకు 1/2 వంతు నిరుద్యోగ భృతిని పొందవచ్చు. పని ప్రదేశం ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటే 10 శాతం అదనపు వేతనం పొందవచ్చు. ఉపాధి హామీ చట్టంలో కల్పించిన హక్కులతో పాటు ఈ పథకం ద్వారా చేపట్టే కార్యక్రమాలపైనా భరోసా యాత్ర ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి.. కూలీలకు అవగాహన కల్పించనున్నారు. -
45.18 లక్షల కూలీలకు పనులు కల్పించాం
పీఆర్, ఆర్డీ డెరైక్టర్ అనితా రామచంద్రన్ సాక్షి కథనం ‘పనిసరే పైసలేవి?’పైవివరణ సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో 25.43 లక్షల కుటుంబాల్లో 45.18 లక్షల కూలీలకు పనులను కల్పించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ అనితా రామచంద్రన్ తెలిపారు. గ్రామస్థాయిలో పని అడిగిన ప్రతి కుటుంబానికి పని కల్పన, అలాగే సకాలంలో చెల్లింపులు చేసేందుకు రాష్ర్ట స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నట్లు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 21న సాక్షి దినపత్రికలో ‘పని సరే పైసలేవి?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆమె వివరణ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కూలీల చెల్లింపు కోసం కేంద్రం నుంచి రూ.615 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.68 కోట్లు కలిపి మొత్తం రూ.683.87 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకున్న వేతన బకాయిలు రూ.318.70 కోట్లు కూలీలకు చెల్లించామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి కూలీలకు ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్‌లో 30 శాతం, జూన్‌లో 20 శాతంగా నిర్ణయించిన పనికన్నా తక్కువ పని కేటాయించి, వారు చేసిన పనిమీద వేసవి అలవెన్స్ కలిపి కూలీ చెల్లిస్తామన్నారు. -
నాటి రైతు.. నేటి కూలీ
♦ అన్నదాత బతుకును కాటేసిన కరువు.. ♦ అడుగంటిన బోరుబావులు.. నెర్రెలువారిన భూములు ♦ 90 శాతం రైతులు ‘ఉపాధి’కే.. పిల్లాపాపలతో పనులకు.. ♦ పరిగి నియోజకవర్గంలో 27వేలు దాటిన కూలీల సంఖ్య ♦ ఎండలను సైతం లెక్కచేయకుండా పనులకు.. ఈ ఫొటోలో కనిపిస్తున్నది పరిగి మండలం మిట్టకోడూరుకు చెందిన మహిళలు.. వారి చంకలో పాలుతాగే చిన్నారులు.. వీరివి ఒకప్పుడు రైతు కుటుంబాలే.. ఇప్పుడు కరువు కాటేయడంతో భూగర్భజలాలు అడుగంటి చేలన్నీ బీళ్లుగా మారాయి. కుటుంబ పోషణ కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి బాట పట్టారు. చిన్నారులను చంకనెత్తుకొని పనులకు వెళ్తున్నారు. ఇది వీరొక్కరి పరిస్థితే కాదు. ఈ గ్రామంలో మొత్తం 450 రైతు కుటుంబాలున్నాయి. వీరిలో 435మంది ఇప్పుడు ఉపాధి కూలిపనులతో కడుపు నింపుకుంటున్నారు. ఈ పరిస్థితి పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొంది. ఎప్పుడూ బయటకు రాని పసిపిల్లలున్న తల్లులు మొదలుకుని వృద్ధులు, స్కూల్ పిల్లలు సైతం పనులకు వెళుతున్నారు. కూలీలైన రైతులు.. ఇక్కడ జనసంద్రంలా కనిపిస్తున్నది పరిగి మండలంలోని మిట్టకోడూర్ చెరువు.. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో అది నీళ్లతో కళకళలాడేది. రబీ సమయంలో సైతం ఈ చెరువు కింద వరి పంట సాగయ్యేది. ప్రస్తుతం అది పూర్తిగా ఎండిపోయింది. నెర్రెలు వారి దర్శనమిస్తోంది. దీంతో ఆ చెరువులో ఉపాధిహామీ అధికారులు పూడికతీత పనులు ప్రారంభించారు. దీంతో బతుకు భారమై ఎప్పుడూ చెరువు నీటితో పంటలు సాగు చేసుకునే రైతులు ఇప్పుడు కూలీల అవతారమెత్తారు. అదే చెరువులో వారు పూడికతీత పనులకు వెళుతున్నారు. వచ్చిన కూలితో తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పరిగి: కరువు రైతన్న బతుకు దెరువును కాటేసింది. గడిచిన ఖరీఫ్ మొదలు రబీ వరకు నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. విపరీతమైన ఎండలు రైతును పూర్తిగా కుంగదీస్తున్నాయి. వ్యవసాయ బావులు, బారుబావులు, చెరువులు పూర్తిగా అడుగంటాయి. చేలు బీళ్లుగా మారియి. చివరకు అన్నం పెట్టే రైతన్న రోడ్డున పడ్డాడు. నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచడంతో కాడిని వదిలేసి గడ్డపార గంప చేతబట్టాడు. రైతన్న కాస్త కూలీగా మారాడు. కొందరు ముంబై, పూణేలకు వలసలు వెళ్లగా మరికొందరు ఉన్న ఊరిని వదిలేయలేక ఉపాధి కూలీలుగా మారారు. ఏకంగా గ్రామాల్లో 90నుంచి 95శాతం మంది రైతులు ప్రస్తుతం ఉపాధి పనులకు వె ళుతున్నారు. పరిగి నియోజకవర్గంలో గత సంవత్సరం ఈ సీజన్లో 15వేల మంది కూలీలు పనులకు వెళ్లగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 27 వేలు దాటింది. నెల రోజుల క్రితం వరకు ఒక్కో మండలంలో 2వేల నుంచి 2500 మంది కూలీలు మాత్రమే పనులకు రాగా ప్రస్తుతం ఆ కూలీల సంఖ్య రెట్టింపయ్యింది. కరువు నేపథ్యంలో ఎండలను సైతం లెక్క చేయకుండా పెద్ద రైతులు మొదలుకుని చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలలు సైతం ఉపాధి హామీ పనులకు వెళుతున్నారు. ప్రస్తుతం పరిగి మండల పరిధిలోని 22 జీపీల్లో 5334మంది కూలీలు పనులు చేస్తున్నారు. దోమ మండలంలో 4500 నుంచి 5000 మంది కూలీలు పనులకు వస్తున్నారు. గండేడ్ మండలంలో 5500 మంది కూలీలు, కుల్కచర్ల మం డలంలో 6200 మంది, పూడూరు మండలంలో 5400 మంది కూలీల చొప్పు మొత్తం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో సగటున 25వేల నుం చి 27వేల మంది కూలీలు పనులకు వెళుతున్నారు. -
తిరుమలలో ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
తిరుమలలోని పీయూసీ-3 వద్ద కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ సోమవారం మధ్యాహ్నం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారికి స్థానిక అశ్వనీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. -
డిష్యుం... డిష్యుం...
గెస్ట్ కాలమ్ గనిలో పనిలో కార్ఖానాలో/యంత్రభూతముల కోరలు తోమే/కార్మిక ధీరుల విషాదాశ్రులకు/ఖరీదు కట్టే షరాబు లేడోయ్! ఎనభైఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు వుందా? వాలెంటైన్స్ డేల కాలంలో కార్మికుల దినోత్సవాలకు ప్రాముఖ్యం కనిపిస్తుందా? విత్ ఎ క్లిక్ ఆఫ్ సెకండ్లో కావలసినవి వచ్చేస్తుంటే, వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే, ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..? మేడే మొదలైందే పనిగంటల తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం అన్నది వారి నినాదం. కాని ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్ నిపుణులకు పనిగంటల నియమం ఖచ్చితంగా అమలవుతోందా? ఇంటికి కూడా లాప్‌ట్యాప్ తీసుకొచ్చి పడక గదిలోనూ పని చేయడం, వర్కింగ్ హాలీడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు, పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా. ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 25 మంది డాక్టరే ట్లు కూడా వున్నారు! ఛత్తీస్‌ఘడ్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు. భారత్ వెలిగిపోతుంది, మేకిన్ ఇండియా... ఈ నినాదాల వెలుతురు వెనుక చీకటి గాఢంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌లా వుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం సంపద ఏ కొద్దిమంది దగ్గరో పోగుపడటం. మన దేశ సంపదలోని సగం కేవలం ఒక శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. అమెరికాలో కూడా కేవలం 158 కుటుంబాలే దేశ సంపద మీద పెత్తనం చేస్తున్నాయి. ఈ సంపద అంతా ఎక్కడిది? కోటానుకోట్ల మంది కార్మికులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోవడం, వారికి అందాల్సిన వేతనాలని ఇవ్వకపోవడం, ఆదాయం పంచకపోవడం వల్లనే. ఇది చాలదన్నట్టు సాంకేతికాభివృద్ధిని పెంచడం వల్ల, రోబోల రంగప్రవేశం వల్ల నోరున్న మనుషుల ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుంది. మెషీన్లలో వారూ మెషీన్లుగా మారిపోక తప్పదు. తమ చైతన్యాన్ని, హక్కులను, డిమాండ్లను మర్చిపోయి మరమనుషులుగా మారక తప్పదు. కాని ఇది ఎంతోకాలం సాగకపోవచ్చు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మార్క్స్ మాటకు మర మనుషులు కూడా గొంతు కలిపే రోజు వస్తుంది. అయితే అప్పుడెప్పుడో ఆయన చెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులూ సులభం చేయలేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం, నాణ్యత మెరుగుపడలేదా? మరి కఠోరశ్రమ అవసరముందా? మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలనిస్తుంది కాని నడిపేది మనిషే. అవి తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి తప్ప తేడాపాడాలు వాటికి తెలియవు. కనుక మ్యాన్ అండ్ మెషీన్ ఒక కాంబినేషన్. ఒకటి వుంటేనే మరొకటి. మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశ వరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి. ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచాన్ని వూహించడానికి లేదు. - తెలకపల్లి రవి,సీనియర్ పాత్రికేయులు -
బస్సులో మహిళ ప్రసవం
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన నాగులపల్లి వద్ద బుధవారం జరిగింది. తాండూరుకు చెందిన ఓ గర్భిణీ బంధువులతో కలిసి జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్కు వెళుతోంది. కాగా.. బస్సు నాగులపల్లి సమీపంలోకి రాగానే.. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో వెంట ఉన్న బంధువులు బస్సులోనే పురుడు పోశారు. అనంతరం 108 సిబ్బంది వచ్చి తల్లి బిడ్డలకు వైద్య సేవలు అందించారు. -
మట్టి పెళ్లలు పడి ఇద్దరు కూలీలు మృతి
మట్టిపెళ్లలు విరిగి పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బెరైడ్డిపల్లె మండలం పెద్దచెరువలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మప్ప(22), మునిరత్నంరెడ్డి(35) పెద్ద చెరువులో నుంచి ఇసుక తరలిస్తుండగా.. ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు మీద పడి అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రుద్రూరులో ఈజీఎస్ కూలీల రాస్తారోకో
వర్ని మండలం రుద్రూరులో బాన్సువాడు-బోధన్ రహదారిపై ఈజీఎస్ కూలీలు సోమవారం రాస్తారోకోకు దిగారు. రెండు నెలల నుంచి చెల్లించని కూలీ డబ్బులు చెల్లించాలనీ, పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ రాస్తారోకోతో బాన్సువాడ, బోధన్ మధ్య రాకపోకలు కాసేపు నిలిచిపోయాయి. -
ఉపాధికి ‘ఉపశమనం’
♦ వేసవి నేపథ్యంలో పనివేళల్లో మార్పు ♦ ఎండ తీవ్రత పెరగకముందే పనులు పూర్తి ♦ సాయంకాలమూ పని చేసుకునే వెసులుబాటు ♦ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మార్పులు ♦ కొత్త పనివేళలు నేటినుంచి అమల్లోకి.. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధిహామీ కూలీలకు శుభవార్త. వేసవి తాపంతో అల్లాడిపోతున్న కూలీలకు ఉపాధి పనివేళలు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తున్నారు. తాజాగా ఎండలు మండిపోతుండడం కూలీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం ఈ వైఖరిని తీవ్రంగా పరిగణించి పనివేళలు మార్చాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పనివేళల మార్పు నిర్ణయాన్ని తీసుకుంది. బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 గంటల నుంచి 6గంటల వరకు ఉపాధి పనులు చేపట్టాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లను ఆదేశించింది. క్షేత్రస్థాయి అధికారులకు ఎస్ఎంఎస్లు.. జిల్లాలో 33 గ్రామీణ మండలాలకు గాను 25 మండలాల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఈ మండలాల్లో 2,89,885 జాబ్ కార్డులు జారీ చేయగా.. ప్రస్తుతం రోజుకు సగటున 62 వేల మంది ఉపాధి పనులకు హాజరవుతున్నారు. జనవరి నెలలో రోజుకు లక్ష మంది హాజరుకాగా.. తాజాగా ఎండల తీవ్రత పెరగడంతో కూలీల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పనుల వేళలను ప్రభుత్వం మార్చింది. బుధవారం నుంచి కొత్త పనివేళలను అమలు చేయాలంటూ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ క్షేత్రస్థాయి అధికారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని అందజేశారు. ఉదయం వేడి తీవ్రత తక్కువగా ఉండడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అయితే సాయంత్రం వేళలో కూలీల హాజరు తగ్గుతుందని డ్వామా అధికారులు చెబుతున్నారు. బకాయిల భారంతోనూ.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలలుగా కూలీ డబ్బుల చెల్లింపులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ నిధులను సర్దుబాటు చేయలేదు. ఫలితంగా రెండు నెలలుగా కూలీలకు డబ్బుల పంపిణీ స్తంభించింది. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 2.8 లక్షల మంది కూలీలకు రూ.32 కోట్లు చెల్లించాల్సి ఉంది. కూలీ డబ్బులు చెల్లించని కారణంగా ఉపాధి పనులకు కూలీల హాజరు తగ్గుతోంది. మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. పలువురు పీడీలు ఈ అంశాన్నే ప్రస్తావించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ రెండ్రోజుల్లో నిధులు విడుదలవుతాయని.. కూలీలకు వెంటనే చెల్లించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
లారీ బోల్తా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం సబ్జుల్లా వద్ద ఓ ఐషర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అరటి గెలలను కోసేందకు కూలీలలో నారపల్లి నుంచి యాడికి మండలం రాయలచెరువుకు ఈ వాహనం వెళుతోంది. -
తలసాని ఫ్లెక్సీల దహనానికి కూలీల యత్నం
అమీర్‌పేట (హైదరాబాద్): తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆగ్రహించిన కూలీలు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఫ్లెక్సీలను దహనం చేసేందుకు యత్నించారు. దీన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. బల్కంపేట డివిజన్లోని స్వామి థియేటర్ వద్ద ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మంత్రి గతంలో ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని పేర్కొంటూ ఉదయం అడ్డా కూలీలు తలసాని ఫోటోతో ఉన్న ఫ్లెక్సీని దహనం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేత గోదాస్ కిరణ్‌తోపాటు కొందరు అక్కడకు చేరుకుని కూలీల చేతిలో ఉన్న ఫ్లెక్సీని లాగేసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రి లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. అసోసియేషన్ కార్యాలయం ఏర్పాటుతోపాటు గృహ నిర్మాణ పథకం వర్తింపచేస్తామని మంత్రి హమీ ఇచ్చి పట్టించుకోవడం లేదని కూలీల అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తెలిపారు. దీనికి నిరసనగా చేపట్టిన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
ఎర్రచందనం దొంగలు అరెస్ట్
మైదుకూరు మండలం నల్లమల ఫారెస్ట్‌లోని మద్దడుగుకనం వద్ద బుధవారం 12 మంది ఎర్రచందనం దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.6.50 లక్షల విలువైన 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలంతా తమిళనాడుకు చెందినవారేనని అధికారులు తెలిపారు. -
సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె
* రైతుల గోడును ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు * కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో నేతలు సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా సెప్టెంబర్ 2న సార్వత్రిక సమ్మె చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆదివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్మిక, ఉద్యోగ సంఘాల సమరభేరిలో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న కార్మిక నిబంధనావళి బిల్లు-2015 కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేదిగానూ, కార్మిక వ్యతిరేకంగానూ ఉందని దుయ్యబట్టారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు బాసుదేవ ఆచార్య మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోకుండా వేలాది ఎకరాల జరీబు భూముల్ని రాజధాని నిర్మాణానికి తీసుకుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతన చట్టాలు అమలు చేయడానికి ప్రభుత్వాల వద్ద నిధులు ఉండవని, కార్పొరేట్ శక్తులకు రూ.కోట్లలో రాయితీలిచ్చేందుకు మాత్రం డబ్బు ఉంటుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె జరగడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పి.ఎస్.చంద్రశేఖరరావు (ఏఐటీయూసీ), వెంకటసుబ్బయ్య (ఐఎన్టీయూసీ), శ్రీనివాసరావు (హెచ్ఎంఎస్), వి.ఉమామహేశ్వరరావు (సీఐటీయూ), కె.సుధీర్ (ఏఐటీయూసీ), ప్రసాద్, రామారావు (ఐఎఫ్టీయూ) పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన రూ. 10 కోసం
తాగిన మైకంలో బండరాయితో కొట్టి చంపిన తోటి కూలీ శ్రీరాంపూర్: పది రూపాయల కోసం జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఇద్దరు కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధి దొరగారిపల్లెలో శనివారంరాత్రి జరిగింది. గ్రామపరిధిలోని మన్నెవాడకు చెందిన కుమ్మరి పోశం(30), కొడిపె లక్ష్మణ్(25) కూలీ పనులు చేస్తుంటారు. శనివారం ఇద్దరు వేర్వేరుగా గుడుంబా తాగి, పాన్‌షాప్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోశంను ఉద్దేశించి కొడిపె లక్ష్మణ్ ‘పది రూపాయలు ఇవ్వరా’ అంటూ అడిగాడు. ‘ఇంతలేనోనివి నువ్వు నన్ను పది రూపాయలు అడిగేటోనివా?, ఇంకా రా అంటవా..’ అంటూ పోశం ప్రశ్నిం చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి లక్ష్మణ్‌ను పోశం కింద పడేసి కొట్టాడు. తర్వాత తేరుకున్న లక్ష్మణ్ కోపంతో బండరాయి తీసుకొని పోశం ఛాతీపై బలంగా కొట్టగా, అతడు అక్కడికక్కడే చనిపోయాడు. -
ఎరుపెక్కిన విశాఖ
- వాడవాడల మేడే వేడుకలు - భారీ ర్యాలీలు, బహిరంగ సభలు - ఆకట్టుకున్న సీపీఎం బొమ్మల ప్రదర్శన విశాఖపట్నం(డాబాగార్డెన్స్): ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నగరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు కూడళ్లు, వీధుల్లో ఎర్రజెండాల తోరణాలు కట్టడడంతో అంతా ఎరుపుమయంగా కనిపించింది. దుకాణాలకు సెలవు దినం కావడంతో మేడే ర్యాలీల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. వాడవాడలా ఎర్ర జెండాలు ఎగురవేశారు. పలు చోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. కార్మికుల పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కార్మికులకు సంకెళ్లు-కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్లా, ఆమ్ ఆద్మీ, కార్మికుడు-రైతు బొమ్మలతో సీపీఎం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించింది. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు..నిర్భయ చట్టం ఎక్కడా? అంటూ ప్రదర్శించిన బొమ్మలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కేజీహెచ్‌లో: ఆంధ్రమెడికల్ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా కేజీహెచ్‌లో మేడే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదనరావు జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా శ్రమించి కేజీహెచ్‌ను అభివృద్ధిబాటలో నడిపిద్దామని కార్మికులకు పిలుపునిచ్చారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూ ర్తి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను నరేంద్రమోదీ ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్ఎంవో బంగారయ్య, ఎంప్లాయీస్ యూని యన్ అధ్యక్షుడు వై.త్రినాథ్, కార్యదర్శి టి.నాగరాజు, జె.డి.నాయుడు కార్మికులు పాల్గొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో... కార్మిక చట్టాలపై బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల దాడిని తిప్పికొట్టాలని సీపీఎం గ్రేటర్ విశాఖ నగర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. నగరంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. యల్లమ్మతోట నండూరి ప్రసాదరావు భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్ల కార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎ త్తున సీపీఎం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. డాల్ఫిన్ హోటల్స్ యూనియన్ ఆధ్వర్యంలో... డాల్ఫిన్ హోటల్స్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించింది. హోటల్ ముందు యూనియన్ జెండాను గౌరవాధ్యక్షుడు వై.రాజు ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల పైబడి హోటల్లో పని చేస్తున్న సీనియర్ స్టాఫ్‌కు ఇప్పటికీ రూ.10 వేల జీతం కూడా అందకపోవడం దారుణమన్నారు. జీతం పెంచకపోగా గెస్ట్‌ల నుంచి వసూలు చేసిన సర్వీసు చార్జీలో ప్రతి నెలా యాజమాన్యం లక్షలాది రూపాయలు దిగమింగుతోందని ఆరోపించారు. 8 గంటల పనిదినం సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు కె.అప్పలనాయుడు, ఉపాధ్యక్షుడు సిహెచ్.పాపారావు, కోశాధికారి ఎన్.కుమారస్వామి, సభ్యులు జి.ఆనంద్, బి.శ్రీనివాస్, టి.కృష్ణ, టి.సోమినాయుడు, సన్యాసిరావు పాల్గొన్నారు. వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. మే డేను పురస్కరించుకొని ఏపీ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ తెడ్డు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ ప్రణాళికలో 8 జోనల్ పెండింగ్ కమిటీలను ఒకటిగా ఏర్పాటు చేసి ప్రతి వీధి విక్రయదారునికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో.. జిల్లా ఆటోరిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రీన్‌పార్కు హోటల్ ఎదుట ఉన్న ఆటోస్టాండ్ వద్ద మే డేను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.రెహ్మాన్ మే డే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు. -
ఢిల్లీ వైద్యులతో రీ పోస్టుమార్టం చేయాలి
సీబీఐతో విచారణ చేపట్టాలి అన్బుమణి రాందాస్ డిమాండ్ బాధిత కుటుంబాలకు పార్టీల ఆర్థిక సాయం వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఎన్కౌంటర్లో 20 మంది కూలీలు మృతి చెందగా, అందులో ఆరుగురి మృతదేహాలను ఢిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులతో రీ పోస్టుమార్టం నిర్వహించాలని పార్లమెంట్ సభ్యుడు అన్బుమణి రాందాసు డిమాండ్ చేశారు. కన్నమంగళానికి చెందిన బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయనకు మృతుల భార్యలు ఏడుగురు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో తమ భర్త, కుమారులు కూలీ పనుల కోసం తిరుత్తణి వెళ్లారని అక్కడ నుంచి బస్సులో వస్తుండగా, నగరి పోలీసులు అనుమానంతో తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టి కాల్చి చంపారన్నారు. అనంతరం ఎన్కౌంటర్ పేరుతో మృత దేహాలను అడవికి తీసుకెళ్లి మూలకు ఒకరిని విసిరేసి ఎర్రచందనాన్ని వారి పక్కన ఉంచి సినీ తరహాలో చిత్రీకరించారన్నారు. అనంతరం మృతి చెందిన వారి బంధువుల ముందు పోస్టుమార్టం నిర్వహించి సొంత గ్రామాలకు పంపారన్నారు. మృతదేహాల్లో చేతులు, కాళ్లు లేకుండా శరీరంలోని కొన్ని బాగాల్లో యాసిడ్ పోసినట్లు గుర్తులు ఉన్నాయని, కత్తుల గాయాలున్నాయని వీటిపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేశామని అదే విధంగా న్యాయవాది బాలుతో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, న్యాయ విచారణ చేపట్టాలని ఆ వినతి పత్రంలో ఉంది. వినతి పత్రాన్ని స్వీకరించిన అన్బుమణి రాందాసు విలేకరులతో మాట్లాడుతూ ఎన్కౌంటర్ బాధితులైన 20 మంది అమాయక కూలీల మృత దేహాలను పరిశీలించేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని, డిల్లీ నిమ్స్ ఆస్పత్రి వైద్యులచే రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా మృతుల కుటుంబాలకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట పరిహారంగా రూ.25లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పామాక ఆధ్వర్యంలోను పరిహారం అందజేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు తెలిపారు. మృతి చెందిన వారి పిల్లలకు విద్యా ఖర్చులను భరిస్తామన్నారు. ఆయనతో పాటు తమాక పార్టీ అధ్యక్షులు జికే మణి, సెంజి ఎమ్మెల్యే గణష్‌కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. బాధితులకు రూ.5లక్షల పరిహారం తిరుపతి ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంగా అన్నాడీఎంకే పార్టీ నుంచి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. దీంతో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ముక్కూరు సుబ్రమణి, కలెక్టర్ జ్ఞానశేఖరన్ తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చె క్కులను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్ర హైకోర్టులో కేసు దాఖలు చేయాలని చెన్నై హైకోర్టు తీర్పు నిచ్చిందని అక్కడికి వెళ్లేందుకు బాధితులకు స్థోమత లేనందున ప్రభుత్వమే ఈ కేసును నడిపించాలన్నారు. తమాక ఆధ్వర్యంలో రూ.25 వేలు ఆర్థిక సాయం తమిళ మానిల కాంగ్రెస్ అద్వర్యంలో బాధిత కుటుంబాలను జీకే వాసన్ కుటుంబ సభ్యులను ఓదార్చి పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 వేలు చెక్కులను అందజేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ప్రకటించిందని వీటిని రూ.10 లక్షలకు పెంచాలన్నారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 3,500మందికి పైగా తమిళ కూలీలు ఆంధ్ర జైలులో ఉన్నారని వారందరినీ ఆంధ్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. డీఎంకే లక్ష ఆర్థిక సాయం డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు రూ.1లక్ష ఇస్తామని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ప్రకటించారు. దీంతో తిరువణ్ణామలై జిల్లాలోని 12 మంది మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే ఏవా వేలు, పార్టీ కార్యకర్తలు భాదిత కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.లక్ష చెక్కులను పరిహారంగా అందజేశారు. -
నీరసించిన ఉపాధి
సీజన్ ముగుస్తున్నా ఊపందుకోని పనులు పనుల్లేక అల్లాడుతున్న కూలీలు డిసెంబర్-ఫిబ్రవరి మధ్య గతేడాది 39.36 లక్షల పనిదినాలు, 3.73 లక్షల మందికి పనులు ఈ ఏడాది అదే సీజన్లో 8.24 లక్షల పనిదినాలు, 90 వేల మందికే పనులు పేరుకుపోయిన రూ.3.5 కోట్ల బకాయిలు అడిగిన వారికల్లా ఉపాధి కల్పించాలన్న ఆశయంతో ప్రారంభించిన మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అడిగినవారికి దేవుడెరుగు.. అసలు పనుల కల్పనే ఆశించినస్థాయిలో జరగడం లేదు. పనుల్లేక ఉపాధి కూలీలు అల్లాడి పోతున్నారు. ఒక పక్క ఉపాధి పనుల్లేక..మరోపక్క వ్యవసాయ పనుల్లేక వలసబాట పట్టే పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నం: ఉపాధి హామీ పథకం గ్రామీణ జిల్లాలోని 39 మండలాల్లో అమలవుతోంది. ఈ పథకం కింద 4,69,090 జాబ్‌కార్డులు జారీచేశారు. జిల్లాలో 31,503 శ్రమ శక్తి సంఘాలు (ఎస్ఎస్ఎస్) ఉండగా వాటిపరిధిలో 6,74,809 మంది కూలీలున్నారు. ఏటా డిసెంబర్లో ఉపాధి పనులు ప్రారంభమవుతుంటాయి. సరాసరిన నాలుగులక్షల మంది కూలీలకు డిసెంబర్ -మార్చి లోపు ఏటా 70 లక్షలకు పైగా పనిదినాలు కల్పిస్తుంటారు. వీరికి వేతనాల కింద సుమారు 75 కోట్ల వరకు చెల్లిస్తుంటారు. కానీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 20 వరకు చూస్తే ఇప్పటి వరకు కేవలం 90,056 మంది కూలీలకు 8,24,006 పనిదినాలు మాత్రమే కల్పించగలిగారు. అదే గతేడాది(2013-14)లో ఇదే సీజన్లో డిసెంబర్- ఫిబ్రవరిల మధ్య 3,73,466మంది కూలీలకు 39.36లక్షల పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.39.57కోట్లు చెల్లించారు. కానీ ఈ ఏడాది ఇదే సీజన్లో కూలీలకు చెల్లించాల్సిన వేతనాలు రూ.9.31కోట్లు మాత్రమే. జనవరి నుంచి పనిచేసిన సుమారు 35 వేల మంది కూలీలకు రూ.3.50 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో... 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇదే సీజన్లో నెల వారీగా చూస్తే డిసెంబర్లో 50,527మంది కూలీలకు 6,59,180 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనం కింద రూ.6 కోట్ల 65 లక్షల 90 వేలు చెల్లించారు. జనవరిలో 1,19,688 మంది కూలీలకు 12,29,429 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.11 కోట్ల 26లక్షల 77వేలు చెల్లించారు. ఇక ఫిబ్రవరిలో 2,03, 251 మంది కూలీలకు ఏకంగా 20,48,232 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ. 21కోట్ల 64లక్షల 36వేలు చెల్లించారు. ఇక ఆర్ధిక సంవత్సరం ముగింపు నెల మార్చిలో 77,217 పనుల కల్పన ద్వారా 2,76,694 మంది కూలీలకు ఆ సీజన్లోనే అత్యధికంగా 31లక్షల 90వేల 422 పనిదినాలు కల్పించారు. ఈమేరకు వీరికి వేతనాల రూపంలో ఏకంగా రూ.35 కోట్ల 19 లక్షల 49 వేలు చెల్లించారు. కానరాని పనుల జాడ 2014-15 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్లో 20,564 మంది కూలీలకు 2,28,833 పనిదినాలుకల్పించారు. వీరికి వేతనాల కింద రూ.2కోట్ల 50లక్షల 14వేలు చెల్లించాల్సి ఉంది. జనవరిలో 29,859 మంది కూలీలకు 3,07,618 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల రూపంలో రూ.3 కోట్ల 35 లక్షల 19 వేలు చెల్లించాల్సి ఉంది. ఇక ఫిబ్రవరిలో 39,634 మంది కూలీలకు 2,87,555 పనిదినాలు కల్పించారు. వీరికి వేతనాల కింద రూ.3 కోట్ల 46 లక్షల 44 వేలు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా గ త మూడు నెలల్లో రూ.9 కోట్ల 31 లక్షల 77 వేలు వేతనాల రూపంలో చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.5.85 కోట్లు మాత్రమే చెల్లించారు. గతేడాది మార్చి వరకు చూస్తే పనులు చేసిన 6,50,160 మంది కూలీలకు ఏకంగా 71 లక్షల 27 వేల 263 పనిదినాలు కల్పించగలిగారు. ఈ లెక్కన వేతనాల కింద ఏకంగా రూ.74.76 కోట్లు చెల్లించారు. కానీ ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 90,056 మందికి 8,24,006 పనిదినాలు కల్పించగలిగారు. మరో 40రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున గతేడాది స్థాయిలో పనులు కల్పించడం సాధ్యమయ్యే పని కాదని అధికారులే అంగీకరిస్తు న్నారు. -
పరిశుభ్రత లోపం వల్లే శిశు మరణాలు
గుంటూరు మెడికల్ : పరిశుభ్ర వాతావరణం లేకపోవటం వల్లే కాన్పు సమయాల్లో ఇన్ఫెక్షన్లు సోకి ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 63 మంది చనిపోతున్నారని స్వచ్ఛభారత్ ఏపీ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ ఎం.గోపీచంద్ అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంపై గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలోని శుశ్రుత హాలులో రోగుల సహాయకులు, వైద్య సిబ్బందికి ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత నర్సులు, శానిటరీ సిబ్బందిదేనని చెప్పారు. రోగుల సహాయకులు, వైద్య సిబ్బంది పాటించాల్సి జాగ్రత్తల గురించి వివరించారు. పరిశుభ్రత పెంచేందుకు ప్రతి నెలా ఒక్కో అంశంపై ఆస్పత్రి సిబ్బంది కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆస్పత్రి సిబ్బందితో స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేరుుంచారు. విజయవాడకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న కార్యక్రమాలతో ప్రపంచ దేశాలన్నీ భారత్‌వైపు చూస్తున్నాయన్నారు. అన్ని అనర్ధాలకు పారిశుద్ధ్య లోపమే కారణమని చెప్పారు. వ్యాధులు వచ్చాక బాధపడి డబ్బు ఖర్చుపెట్టడానికి బదులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. ప్రజలు, సిబ్బంది సహకారం లేకపోతే పారిశుద్ధ్యం మెరుగుపడదన్నారు. డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సురేష్, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ కృష్ణప్రసాద్ తదితరులు పారిశుద్ధ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాసులు, ఏడీ మల్లి ఉదయ్‌భాస్కర్, నర్సింగ్ సూపరింటెండెంట్ కె.పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ సిబ్బందిపై ఆగ్రహం ‘ప్రభుత్వం నెలకు రూ.30 వేలకు పైగా వేతనం ఇస్తోంది.. బాత్రూమ్స్లో మూడునెలలుగా నీటిసౌకర్యం లేకపోతే రోగులు వాటిని ఎలా వినియోగిస్తారు? మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా?’ అని డాక్టర్ గోపీచంద్ జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పుష్పావతి, స్టాఫ్ నర్స్ కళ్యాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌లను నిలదీశారు. జీజీహెచ్ లోని చిన్నపిల్లల వైద్యవిభాగం, డాక్టర్ పొదిలి ప్రసాద్ సూపర్‌స్పెషాలిటీ అండ్ ట్రామాకేర్ సెంటర్లలో ఆయన తనిఖీలు నిర్వహించారు. పిల్లల వార్డులో వాష్బేషిన్స్ లేవని గుర్తించి వాటిని ఏర్పాటు చేయించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వేణుగోపాలరావుకు సూచించారు. పీడియాట్రిక్ విభాగాన్ని పెలైట్ ప్రాజెక్టుగా స్వీకరించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటామన్నారు. ట్రామాకేర్ సెంటర్లోని మరుగుదొడ్లలో కనీస వసతులు, ట్యాంకులు సక్రమంగా లేకపోవడం, నీటివసతి లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పురుగు మందు సేవించిన వారి కడుపు శుభ్రం చేసే గది అపరిశుభ్రంగా ఉండటం చూసి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌పై మండిపడ్డారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. -
గ్రానైట్ క్వారీలో ప్రమాదం
ముగ్గురు కార్మికులు మృతి శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు చింతలగుట్ట వద్ద గ్రానైట్ క్వారీలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్ చేసి డిటోనేటర్ అమర్చుతుండగా పేలుడు జరిగినట్టు స్థానికులు అనుమానిస్తుండగా, బండరాయి కూలడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. క్వారీలో బీహార్, తమిళనాడుకు చెందిన కూలీలు కొన్ని నెలలుగా పనులు చేస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం డ్రిల్లింగ్ పనులను బిహార్‌కు చెందిన అజయ్‌నాయక్(22), రాహుల్‌నాయక్(21), బికారీ నాయక్(23), తమిళనాడుకు చెందిన మరియప్పన్(47), పలనీ(45)లు చేస్తున్నారు. మరికొందమంది కార్మికులు మరోచోట డ్రిల్లింగ్ చేసి, డిటోనేటర్లు అమర్చారు. ఇంతలో పేలుడు జరిగిందో, బండరాయి కూలిపోయిందో కానీ భారీ ప్రమాదం జరిగింది. అజయ్‌నాయక్, రాహుల్‌నాయక్, మరియప్పన్ అక్కడికక్కడే మృతిచెందగా, బికారీనాయక్కు తీవ్రగాయాలయ్యాయి. -
తాపీ లేని మేస్త్రీ
స్టార్ రిపోర్టర్ - చంద్రబోస్ పిడికిళ్లు బిగించి పలుగు, పార పట్టుకున్నా.. వారి చేతి గీత మారింది లేదు. చెమట నీరు చిందించి చలువరాతి మేడను కట్టినా.. వారి నుదుటి రాత బాగుపడ్డదీ లేదు. యజమానికి నచ్చినట్టుగా.. పది మందీ మెచ్చేటట్టుగా ఇళ్లు కట్టే భవన నిర్మాణ కూలీలు భారంగా బతుకీడుస్తున్నారు. పనులన్న రోజుల్లో మస్తుగా ఉండటం.. లేకుంటే పస్తులుండటం వాళ్లకు మామూలే. సిమెంట్, ఇసుక, నీళ్లు సమపాళ్లలో కలిపి ఇంటికి దృఢత్వం తీసుకువచ్చే వీరికి మాత్రం కష్టాల పాళ్లే ఎక్కువ. తాపీతో మెరిసిపోయే ఫినిషింగ్ ఇచ్చే ఈ మేస్త్రీల జీవితాలు మాత్రం తాపీగా సాగడం లేదు.ఈ కష్టజీవులను సాక్షి సిటీప్లస్ తరఫున సినీగీత రచయిత చంద్రబోస్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. చంద్రబోస్: ‘ఈ పేటకు నేనే మేస్త్రీ.. నిరుపేదల పాలిట పెన్నిధి..’ పాట మీరు వినే ఉంటారు. మేస్త్రీ అనే పదం చాలా బలమైనది. ఎంతో బాధ్యత కలది. మీకు గూడు లేకపోయినా మాకు ఇల్లు నిర్మించి ఇస్తారు. మిమ్మల్ని పలకరించడం ఆనందంగా ఉంది. వెంకటేష్: మాక్కూడ చాలా ఆనందంగా ఉంది సార్. చంద్రబోస్: చెప్పు వెంకటేష్ ఎన్నాళ్లయింది ఈ వృత్తిలోకి వచ్చి ? వెంకటేష్: 30 ఏళ్లవుతుంది సార్. చంద్రబోస్: అమ్మో..! ఎంత సంపాదించావ్..? వెంకటేష్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ప్రస్తుతం దారుణంగా ఉంది సార్. ఆర్నెళ్ల నుంచి రియల్ఎస్టేట్ పడిపోయింది. కట్టే బిల్డింగులు కూడా ఆపేశారు. చేతికి పనిలేదు.. నోటికి బువ్వ లేదు. చంద్రబోస్: అవును కన్స్‌స్ట్రక్షన్ ఫీల్డ్ కొంత డల్ అయినట్టు నేనూ గమనించాను. రాజు: అందుకే.. మీరు ఇంటర్వ్యూ చేస్తారనంగనే.. ఐదుగురిని పిలిస్తే యాభైమంది వచ్చిండ్రు. అందరూ ఖాళీగా రోడ్లెంట తిరుగుతుండ్రు. చంద్రబోస్: ఓకే భయ్యా.. అప్పటికీ, ఇప్పటికీ మేస్త్రిల్లో వచ్చిన తేడా ఏంటి? రాజు: తేడా మాలో రాలేదు సార్. యజమానుల్లో వచ్చింది. ఒకప్పుడు మేస్త్రీ్తక్రి బోలెడంత విలువ ఉండేది. నిర్మాణాలకు తరతరాలుగా ఒకే మేస్త్రి కుటుంబాన్ని పిలిచేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మమ్మల్ని కూడా మిషన్లను చూసినట్టు చూస్తున్నారు. చంద్రబోస్: ఈ వృత్తిలోనే కాదు.. అన్ని రంగాల్లో అనుబంధాలు తగ్గాయి. సరే.. మీ సంపాదన ఎలా ఉంటుంది? మన్నెంకొండ: మగవారికి రోజుకు రూ.450, ఆడవాళ్లకు రూ.250 ఇస్తారు. వారంలో నాలుగైదు రోజులకంటే ఎక్కువ పని చేయలేం. నెలలో అన్ని రోజులు పని ఉంటుందని గ్యారెంటీ లేదు. అప్పుల తిప్పలు తప్పవు సార్. చంద్రబోస్: మీ పనికి శరీరం బాగా అలసిపోతుంది. ఆ బడలిక తీర్చుకోవడానికి మీరు మందు, గుట్కాలను ఆశ్రయిస్తారని విన్నాను. నిజమేనా..? శ్రీనివాస్: అందరూ అలా ఉండరు. కానీ బాగా కష్టమైనపుడు ఒక చుక్క వేయక తప్పదు సార్. చంద్రబోస్: అందరూ పిల్లల్ని చదివిస్తున్నారా? వెంకటేష్: ఎక్కడ చదువులు సార్. పనులు బాగున్నప్పుడు మంచి స్కూళ్లల్లో చేర్పించాం. ఇప్పుడు పనుల్లేవు, డబ్బు లేదు. అలాగే స్కూల్లో ఫీజులడగడం మానరు కదా! ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు. మావోళ్లు చాలామంది పిల్లల్ని స్కూల్‌కు పంపడం ఆపేశారు. చంద్రబోస్: అయ్యో...అంత పని చేయకండి. మీరు ఇంత పని చేసేది మీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా! రమేష్: ఏం చేస్తాం. ఊళ్లకు తిరిగి పోదామంటే అక్కడ పంటలూ లేవు.. పనులూ లేవు. చంద్రబోస్: మీది ఏ జిల్లా? రమేష్: మహబూబ్‌నగర్. మాలో చాలామంది ఆ జిల్లా నుంచి వచ్చిన వారే ఉన్నరు. చంద్రబోస్: అవును మన రాష్ట్రంలో వలసల జిల్లా అదే. నేను చాలాసార్లు చూశాను, అడ్డంగా కట్టిన ఓ కర్రపై నిలబడి తాపి పని చేస్తుంటారు. పదుల అంతస్తుల పైన మీ పనులు చూస్తుంటే మాకే కళ్లు తిరుగుతుంటాయి. మీ పరిస్థితి ఏంటి..? వెంకటేష్: ఏం చేస్తాం. మా పనే అట్లాంటిది. చంద్రబోస్: భయం వేయాదా? మన్నెంకొండ: ఎందుకు వేయదు సార్. కాకపోతే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి. మనసు కాస్త అటుఇటూ అయిందా.. ప్రమాదం తప్పదు. చంద్రబోస్: అంటే ధ్యానం చేస్తున్నట్టు అన్నమాట. లేకపోతే క్షణం చాలు కదా కాలు జారడానికి, పట్టు తప్పడానికి. రాజు: ఎంత జాగ్రత్తగా చేసినా ఒకోసారి ప్రమాదాలు తప్పవు సార్. దెబ్బలతో ఆగవు ప్రాణాలే పోతుంటాయి. చంద్రబోస్: మరి అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? రాజు: ఈ మధ్యనే ఇక్కడ ఒక అపార్ట్మెంట్లో కూలీలు పని చేస్తున్నారు. ఓ 35 ఏళ్ల కుర్రాడు ఇసుక బస్తా మోస్తూ వెనక్కిపడిపోయాడు. ఆ బస్తా గుండెపై పడటంతో గుండె ఆగి చనిపోయాడు. అతనికి ఇద్దరు చిన్నపిల్లలు. మేమే తలో ఐదువందలు, వెయ్యి వేసుకుని లక్ష న్నర రూపాయలు జమ చేసి అతని కుటుంబానికి సాయం చేశాం. చంద్రబోస్: శభాష్ భయ్యా.. పనికి పోతేగానీ పొట్ట నిండని మీరు ఇంత పెద్ద మనసు చేసుకోవడం గొప్ప విషయం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం ఉండదా ? శ్రీనివాస్: ఒక్క పైసా రాదు సార్. అసలు మమ్మల్ని ప్రభుత్వం అసలు గుర్తించట్లేదు. అన్ని వృత్తుల వారికీ హెల్త్ కార్డులు, ఇళ్లు కట్టిస్తున్నారు. మాకు మాత్రం ఏం లేదు. చంద్రబోస్: అవును నేను కూడా ఎక్కడో విన్నాను. సర్కస్‌లో పని చేసేవారు, భవన నిర్మాణ కూలీలు ఇన్సూరెన్స్ చేయించుకునే అవకాశం కూడా లేదట. వెంకటేష్: మా కష్టాలకు అంతెక్కడుంది సార్. కొందరు అందంగా ఇల్లు కట్టించుకుంటరా..! పని అయిపోయాక పైసలు మాత్రం సరిగా ఇవ్వరు. మా తరఫున అడిగేటోళ్లు ఎవరుంటరు సార్. అందుకే మేమే సొంతంగా ఓ యూనియన్ పెట్టుకున్నం. చంద్రబోస్: గుడ్.. యూనియన్ వల్ల చాలా ఉపయోగాలుంటాయి. కష్టం వస్తే ఆదుకోవడం ఒక్కటే కాదు.. మీ మధ్య అనుబంధాలు కూడా పెరుగుతాయి. అమ్మా.. మీరు మౌనంగా వింటున్నారు. భవన నిర్మాణంలో మీ పాత్ర కూడా చాలా ముఖ్యమైంది. మీరు మాల్ అందిస్తేనే మేస్త్రీ ఇటుక పేర్చగలడు. ఏమంటారు? లక్ష్మమ్మ: ఔ సార్. చంద్రబోస్: లక్ష్మమ్మ.. ఇటుకలు, ఇసుక, మాలు అన్నీ బరువైనవే. అలాంటివి నెత్తిపై పెట్టుకుని మెట్లెక్కుతారు. ఆరోగ్య సమస్యలు రావా? లక్ష్మమ్మ: ఎందుకు రావు సార్. ఊకె తలనొస్తది, నడుంల నొస్తది, కాళ్లు గుంజుతయి. అట్లాని.. పనికి రాకుంటే రోజెట్ల ఎల్తది సార్. చంద్రబోస్: మా ఇంటి పక్కన బిల్డింగ్ కడుతుంటే చూశాను.. గర్భవతులు కూడా వచ్చి ఈ బరువైన పనులు చేస్తుంటారు. చాలా ప్రమాదం కదమ్మా? లక్ష్మమ్మ: పేదోళ్లకు ప్రమాదం ఏముంటది సార్. బిడ్డను కనే చివరి క్షణం వరకూ కష్టపడి బతికితేనే పుట్టే బిడ్డను పోషించగలదు. గవన్నీ మాకు మామూలే చంద్రబోస్: మీరు ఇన్ని కష్టాలు పడితే గానీ ఇంటికి ఓ రూపం రాదు. మిమ్మల్ని కూడా ఓ విభాగంగా గుర్తించి, ముఖ్యంగా ఆరోగ్య బీమా, హెల్త్‌కార్డ్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాను... ఉంటాను... ..:: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేశ్‌రెడ్డి -
లక్షాధికారులన్నారు.. కూలీలను చేశారు
⇒ ర్యాంపు నిర్వహిస్తున్న మహిళలకు రోజుకు రూ.200 చెల్లింపు ⇒ ప్రభుత్వ వైఖరితో ఖంగుతిన్న ఆడపడుచులు ⇒ లాభాలు పంచుతామని చెప్పి కూలీలుగా చేశారని ఆవేదన కొవ్వూరు రూరల్ : ‘డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తా.. అందులో భాగంగా ఇసుక ర్యాంపులను వారికే కేటాయిస్తామంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ర్యాంపుల కేటాయింపు వరకు బాగానే ఉన్నా.. వాటిని నిర్వహిస్తున్న మహిళలను మాత్రం దినసరి కూలీలను చేశారు. దీంతో వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇసుక అమ్మకాల్లో 25 శాతం లాభాన్ని స్థానిక డ్వాక్రా సంఘాలకు అందిస్తామని ప్రభుత్వం ఆయా సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో ర్యాంపులు నిర్వహిస్తున్న డ్వాక్రా మహిళలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా వారికి ఇప్పుడు రోజు కూలి రూ.200 చొప్పున చెల్లిస్తుండడంతో ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నారు. రెండు నెలలకు 30 రోజులకే జీతాలు చెల్లింపు జిల్లాలో మొట్టమొదటిగా కొవ్వూరు మండలం వాడపల్లిలో ఈ ఏడాది అక్టోబర్ 10న ఇసుక ర్యాంపును ప్రారంభించారు. 6 గ్రామ సంఘాలు ర్యాంపు నిర్వహణను చేపట్టాయి. 14 మంది మహిళలు ర్యాంపు నిర్వహణ విధులను నిర్వర్తిస్తున్నారు. ఒక్కో రోజు 6 నుంచి 14 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు రెండు నెలల 15 రోజులు వారు పనిచేశారు. రెండు రోజుల కిందట ర్యాంపు నిర్వహణ పనిలో పాల్గొన్న ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 30 రోజులకు రూ.51 వేలను చెల్లించారు. దీంతో వారంతా అవాక్కయ్యారు. కూలి కింద తమను లెక్కగట్టి ఇవ్వడంపై వారు మండిపడ్డారు. లాభాల్లో వాటా ఇస్తామంటే నిర్వహణను చేపట్టామని, దీంతో శ్రమ ఎక్కువైనా భరించామని తీరా ఇప్పుడు దినసరి కూలీల కింద లెక్కకట్టి ఇవ్వడం దారుణమని వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా ఇది ప్రస్తుతం అడ్వాన్స్‌గా ఇచ్చామని చెప్పారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే చెల్లించినట్టు సమాచారం. లాభాల పంపకాలపై ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు లేవని అధికారులే చెబుతున్నారు. 5 శాతమే గ్రామ సంఘాలకు గ్రామ సంఘాలకు 25 శాతం చెల్లిస్తానన్న ప్రభుత్వం 5 శాతాన్ని మాత్రమే చెల్లించనున్నట్టు సమాచారం. మిగిలిన 20 శాతం రాష్ట్ర మహిళా సాధికార సంస్థకు బదలాయిస్తామని పేర్కొనడంతో డ్వాక్రా మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఐదు శాతం నుంచే ర్యాంపును నిర్వహించిన మహిళలకు రోజుకి రూ.200 చొప్పున చెల్లించినట్టు సమాచారం. -
స్వేదం.. నిర్వేదం
మండుటెండలో చెమట చిందించినా.. సంజెవేళ పచ్చడి మెతుకులు కరువు. పేరు పేదలదే అయినా.. దళారుల ఇష్టారాజ్యం. కేటాయింపులు కాగితాల్లో కోట్లు దాటినా.. బడుగు జీవి చేతికందేది చిల్లర పైసలే. మూలిగేనక్కపై తాటికాయ పడినట్లు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన మండలాల పేరిట ‘ఉపాధి’ని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయజూస్తోంది. ఇదీ ఉపాధి పనుల తీరు. వరుస కరువు.. కలిసిరాని ప్రకృతి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కన్నతల్లి లాంటి ఊరును విడవలేక.. ఉన్నచోట చేయి చాచలేక.. కూలీలు పొట్టచేత పట్టుకుని పట్నాల్లో పిడికెడు ముద్ద దొరక్కపోతుందా అనే ఆశతో మూటాముల్లె సర్దుకుంటున్నారు. మెతుకు వేటలో బక్కజీవి ప్రాణం గాలిలో దీపంగా మారుతోంది. కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలసలను నిలువరించలేకపోతోంది. కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నా.. పర్యవేక్షిస్తున్న సిబ్బంది, దళారుల బొజ్జలు నింపుతోంది. ఎటొచ్చి కూలీల కడుపు మాడుతోంది. జిల్లాలో యేటా అతివృష్టి, అనావృష్టితో కరువు కరాళనృత్యం చేస్తోంది. వ్యవసాయ కూలీలతో పాటు చిన్న, సన్నకారు రైతులూ సుదూర ప్రాంతాలకు బతుకుదెరువుకు వలసబాట పడుతున్నారు. ఈనేపథ్యంలో స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు.. తద్వారా గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2007-08లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పథకంతో మేట్ నుంచి అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులు లబ్ధి పొందినా వ్యవసాయ కూలీలకు చిలిగవ్వ అందకపోయింది. ఉదయం 7 నుంచి 1 గంట వరకు నడుం వంచినా అందుతున్న కూలి అత్తెసరే. ఇప్పటి వరకు దాదాపు రూ.2వేల కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి జాడ కూడా కరువైంది. ఇప్పటికీ గ్రామాలకు సరైన రోడ్లు లేవు.. వ్యవసాయ భూముల్లో బావులు కనిపించవు.. భూగర్భ జలాలు అభివృద్ధి చెందిన దాఖలాల్లేవు.. అయితే కోట్లాది రూపాయలు మాత్రం ఖర్చయిపోయాయి. ఒక రోజుల్లో దాదాపు 8 గంటలు పనిచేస్తే రూ.100 కూలి లభించక కూలీలు గగ్గోలు పెడుతున్నారు. మేటల్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీలు, ఏపీఓలతో పాటు దళారీలకు మాత్రం కాసుల పంట పండుతోంది. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల నుంచి సిఫారసు లెటర్లు తీసుకొస్తుండటం వీరి ఆదాయాన్ని తెలియజేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల భర్తీలో ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడం.. వ్యవసాయ పనులు ముగుస్తుండటంతో పత్తికొండ, ఆలూరు, కోడుమూరు, డోన్, ఎమ్మిగనూరు, పాణ్యం నియోజకవర్గాల నుంచి వలసలు ఊపందుకున్నాయి. 2014-15లో ఇప్పటి వరకు రూ.103.85 కోట్లు ఖర్చు చేయగా.. అధికారిక లెక్కల ప్రకారం 2.05 లక్షల కుటుంబాలకు చెందిన 3.70 లక్షల మంది ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1.37 లక్షల పనిదినాలు కల్పించాలనేది లక్ష్యం కాగా.. 67 లక్షలకు మించకపోవడం గమనార్హం. పనులకు వెళ్లినా కూలి గిట్టుబాటు కాకపోవడంతో వ్యవసాయ కూలీలు ఊరిడుస్తుండటంతో లక్ష్యం పూర్తిగా వెనుకబడుతోంది. గరిష్ట కూలి రూ.169 కాగా.. ఉయ్యాలవాడ మండలంలో సగటున రూ.98.35.. దొర్నిపాడు మండలంలో రూ.93.31.. చాగలమర్రి మండలంలో రూ.81.53.. మిడుతూరు మండలంలో రూ.93.63.. నందవరం మండలంలో రూ.86.04.. వెల్దుర్తి మండలంలో రూ.92.98, హాలహర్వి మండలంలో రూ.98.18, కోసిగి మండలంలో రూ.91.03, కౌతాళం మండలంలో రూ.91.86, పెద్దకడుబూరు మండలంలో రూ.91.15 ప్రకారం అందుతోంది. జిల్లా మొత్తం మీద సగటున కూలీలకు అందుతున్న మొత్తం రూ.107.92 కావడం గమనార్హం. మేట్లకు, పీల్డ్ అసిస్టెంట్లకు వారపు మామూళ్లు ఇచ్చుకుంటే పని చేయకపోయినా రూ.130 నుంచి రూ.150 కూలి లభిస్తోంది. దారుణమైన విషయమేమంటే.. రోజుకు 8 గంటల పాటు పనిచేసినా రూ.30 నుంచి రూ.50 కూలి అందుకుంటున్న కూలీలు జిల్లాలో వేలల్లో ఉండటం ఉపాధి తీరుకు అద్దం పడుతోంది. మృత్యుబాట ఆస్పరికి చెందిన కొళ్లు వెంకటరాముడు(52), మరో 20 కుటుంబాలు ఈనెల 20న తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో తాటిపల్లికి వలస వెళ్లారు. మరుసటి రోజు శుక్రవారం పత్తి కోత పనులకు వెళ్లగా ఎండకు తాళలేక వెంకటరాముడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందడంతో వలస కుటుంబాల్లో విషాదం అలుముకుంది. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వలస బాట పట్టిన ఇలాంటి జీవితాలెన్నో అర్ధాంతరంగా రాలిపోతున్నాయి. -
పిడుగుపాటుకు 26 మందికి అస్వస్థత
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఘటన కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం మైలారంలో ఆదివారం ఉదయం 11 గంటలకు పిడుగు పడడంతో పత్తి చేనులో పనిచేస్తున్న 26 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారు చేనులో పత్తి తీస్తుండగా చిన్నపాటి వర్షం పడింది. దీంతో అందరూ సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్దామని బయలుదేరారు. వారు చెట్టుకు 100 గజాల దూరంలో ఉండగానే ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో షాక్‌కు గురైన కూలీలంతా అస్వస్థతకు లోనయ్యారు. పక్కనున్న వారు కూలీలను కొత్తగూడెం మండలం రేగళ్లలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
బిల్ట్ దుస్థితికి యాజమాన్యమే కారణం
కార్మిక నాయకుల మండిపాటు కమలాపురంలో బహిరంగ సభ పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబాలు కమలాపురం : యాజమాన్యం కుట్రల కారణంగానే బిల్ట్ పరిశ్రమకు ఈ దుస్థితి పట్టింది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్మాగారా న్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని ట్రేడ్ యూనియన్ల నాయకులు డిమాండ్ చేశారు. అండగా ఉంటాం.. అధైర్యపడవద్దని కార్మికులకు భరోసా ఇచ్చారు. గురువారం కమాలాపురంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్ట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పలువురు నాయకులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. కర్మాగారంలో దారపు మిల్లును ఏర్పాటు చేయాలని, లేఆఫ్ ఆలోచన మానుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం సభలో నాయకులు మాట్లాడుతూ కార్మికులు పని చేయకనో, నష్టాలు రావడంతోనో కర్మాగారం మూతపడలేదని, యాజమాన్యం మార్కెట్లో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేతకాకనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమతో 33 ఏళ్లుగా సుమారు రూ.3వేల కోట్లు కూడబెట్టిన సంస్థ శ్రమజీవులకు కాలుష్యాన్ని, అనారోగ్యాలను వదిలి బ్రిటీష్ పాలనను మరిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభా లు వచ్చినప్పుడు కార్మికులకు పంచని సంస్థ నష్టాల సాకుతో కార్మికులను ఇబ్బందులు పెట్టడం ఏమిటన్నారు. కార్మికులంతా నా గుండెపైనే ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు ఒక పక్క ఉపాధి కోల్పోయి రోడ్డుతున్నా కనిపించడంలేదాని అని ప్రశ్నించారు. జిల్లాలో భారీ పరిశ్రమగా వెలుగొందుతున్న బిల్ట్ కర్మాగారంపై సుమారు 20వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పరిశ్రమను పునరుద్ధరించి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని పేర్కొన్నారు. లేని పక్షంలో అన్ని కార్మిక సంఘాలు, ఇతర సంఘాలను కలుపుకుని కర్మాగారం తెరిపించే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్కయ్య, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఓంపెల్లి పురుషోత్తమరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి మారుతీరావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంకే.బోస్, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లట్టి జగన్మోహన్రావు, కార్యదర్శి పెంట శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చాగంటి కిషన్, బిల్ట్ జేఏసీ నాయకులు, కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. -
పి.పొన్నవోలులో భూపోరాటం
జెండాలు పాతిన సీపీఐ నాయకులు, కూలీలు పోలీసుల మోహరింపు పి.పొన్నవోలు(రావికమతం): మండలంలోని పి.పొన్నవోలు, జి.చీడిపల్లి రెవెన్యూలో ఇతర జిల్లాల బడాబాబుల చేతుల్లో ఉన్న వందెకరాల ప్ర భుత్వ భూముల్లో సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం భూపోరాటం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండలరా వు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల తదితర జిల్లా నాయకు లు పాల్గొన్నారు. పెత్తందార్ల చేతుల్లో ఉన్న భూముల్లో వారే స్వయంగా కత్తిపట్టి తుప్పలు నరికి, జెండాలు పాతారు. పాకలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో పొన్నవోలు, జి.చీడిపల్లి, ఆర్.కొత్తూరు గ్రామాల్లో భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు వందలాదిగా ఎర్రజెండాల తో కదం తొక్కారు. ఆ గ్రామాల్లోని 156, 157, 158, 142, 143, 172, 131, 168, 173, 179 తదితర సర్వే నంబర్లలో సుమారు 150 ఎకరాల్లో భూమిని ఇతర జిల్లాలకు చెంది న బొక్కా సూర్యారావు, పి.కన్నతల్లి, గంధం త్రిమూర్తులు తదితర 30 మంది బడాబాబులకు ఒక్కొక్కరికి ఐదెకరాల చొప్పున గతంలో పట్టాలి చ్చారు. పట్టాలు పొందిన వా రంతా మృతి చెందారని, భూములను కొం తమంది పెద్దలు 99 ఏళ్లకు లీజుకిస్తున్నారని ఐదేళ్లుగా సీపీఐ నాయకులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు మామూళ్లుకు అలవాటు పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో భూపోరాటం చేపట్టినట్టు సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి జెండాలు పాతిన భూములను భూమిలేని స్థానిక నిరుపేదలకివ్వాలని కోరారు. భారీ బందోబస్తు ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం జరిగిన భూపోరాటంలో పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో కొత్తకోట సీఐ పి.వి. కృష్ణవర్మ భారీ బందోబస్తు నిర్వహించారు. కొత్తకోట, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం ఎస్ఐలు, సిబ్బందితో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను, మహిళా పోలీసులు సుమారు 100 మందిని మోహరించారు. ప్రశాంతంగా కార్యక్రమం కొనసాగించాలని సీఐ కృష్ణవర్మ పదేపదే సీపీఐ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకులు జోగిరాజు, అజయ్‌బాబు, అర్జున్, సర్పంచ్ వరహాలుదొర, ఎంపీటీసి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు దిగుబడి
సంప్రదాయ పంటలతో పోలిస్తే అరటి సాగు మేలని భావించిన రైతు సుభాష్‌రెడ్డి పదేళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నాడు. దీని ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. వరితో పోలిస్తే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో అరటిని పం డించవచ్చు. చెరుకు, మొక్కజొన్న వంటి పంటలకు అడవి పందుల బెడద, కూలీల కొరత ఉంటోంది. దీనికి తోడు ఎన్నో కష్టాలను భరించి పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తే సకాలంలో డ బ్బులు అందక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే సంప్రదాయ పంటలకు స్వస్థి చెప్పక తప్పదని పలువురు అన్నదాతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి నాటితే మూడేళ్ల పాటు కాత... ఒక్కసారి అరటి మొక్కను నాటితే 3 సంవత్సరాల పాటు కాత వస్తుంది. పంట సాగుచేశాక ఈ విషయాన్ని హార్టికల్చర్ అధికారులకు చెబితే హెక్టారుకు రూ.33 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. అరటి తోటలోకి అడవి పందులు రావు. మొదట్లో ఈ ప్రాంతంలోని రైతులు గడ్డలను పెట్టడం ద్వారా తోటలు పెంచేది. కానీ పద్ధతి వల్ల చేనంతా ఒకేసారి కాపునకు వచ్చేది కాదు. కొంత కోతకు వస్తే.. మరికొంత పూత దశలో ఉండేది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతు సుభాష్‌రెడ్డి హైదరాబాద్‌లోని స్నేహ నర్సరీ నుంచి గ్రౌండ్ 9 వెరైటీ మొక్కలు తెప్పించి నాటాడు. వీటిని ఎకరాకు 1,540 చొప్పున ఏడెకరాల్లో 10,780 మొక్కలు పెట్టించాడు. పంట సాగుకు ముందు ఎకరం పొలంలో 5 ట్రాక్టర్ల ఎరువు(పశువుల)పేడను చల్లి బాగా కలియదున్నాడు. అనంతరం సబ్సిడీపై ప్రభుత్వం అందించిన డ్రిప్‌ను పొలంలో ఏర్పాటు చేయించాడు. తనకున్న రెండు బోర్ల సాయంతో తోటకు నీరందిస్తున్నాడు. దీనికోసం ఎకరాకు రూ.70 నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందని చెప్పాడు. అనంతరం ఏడాదికి పంట చేతికి రాగా ఎకరానికి రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు. ఈ లెక్కన తను పెట్టిన పెట్టుబడితో పాటు మొదటి కాపులోనే రెండింతల ఆదాయం వచ్చింది. పంట చేతికందిన సమయంలో పండ్ల వ్యాపారులే తమ కూలీలతో పొలం వద్దకు వచ్చి అక్కడే డబ్బులు చెల్లించి గెలలు తీసుకెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. హెక్టారుకు రూ.33 వేల చొప్పున హార్టికల్చర్ అధికారులు అందజేసిన ఆర్థిక సాయం మందుల ఖర్చులకు పనికొచ్చిందని చెప్పాడు. అరటి పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. అరటి సాగు వల్ల సాగు నీరు గణనీయంగా ఆదా అవుతోందన్నాడు. పంటను సాగు చేసిన మొదట్లో ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగుళ్లు సోకే ప్రమాదం ఉందన్నాడు. దీని నివారణకు క్వినాల్ఫాస్ మందును స్ప్రే చేస్తే సరిపోతుందని తెలిపాడు. 7 ఎకరాల పొలం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేస్తే రూ.1.20 లక్షల ఖర్చు వచ్చిందన్నాడు. దీంతో 7 ఎకరాల్లో సంవత్సరానికి ఖర్చులు పోను సుమారు రూ.4.5 లక్షల ఆదాయం వచ్చిందని వివరించాడు. మొక్కలు పెట్టిన మొదటి సంవత్సరం మాత్రమే ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల ఖర్చు వచ్చిందన్నాడు. ఆ తరువాత రెండేళ్ల పాటు కేవలం ఎరువులు, రసాయన మందుల ఖర్చు ఉంటుందని పేర్కొన్నాడు. మూడేళ్లపాటు సాగయ్యే అరటితో మంచి లాభాలున్నాయని చెబుతున్నాడు. -
జీతాలు ఇవ్వకపోతే బతికేదెలా..!
బందరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె ఐదు నెలలుగా జీతాలు అందలేని ఆందోళన సూపరింటెండెంట్ హామీతో నేటి నుంచి విధులకు మచిలీపట్నం టౌన్ : ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి నెలా జీతాలు ఇస్తామని విధుల్లోకి తీసుకున్న కాంట్రాక్టర్ ఐదు నెలలుగా పట్టించుకోవడంలేని ఆరోపిస్తూ గురువారం మెరుపు సమ్మెకు దిగారు. ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేశారు. కార్మికుల మెరుపు సమ్మెతో ఆస్పత్రిలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. వార్డులు అపరిశుభ్రంగా మారాయి. ఆందోళనకు దిగిన కార్మిక మహిళలు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సోమసుందరరావు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ జయకుమార్‌లను కలిసి తమ సమస్యను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. ఫిబ్రవరి నెల నుంచి తమకు జీతాలు రావాల్సి ఉందని, ప్రస్తుతం ఆరో నెల 24 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పెండింగ్ జీతాలు అందజేయాలని, లేకపోతే తాము విధులకు హాజరుకాబోమని ప్రకటించారు. అనంతరం సూపరింటెండెంట్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని, అందువల్లే జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. త్వరలో కొత్త కాంట్రాక్టర్‌కు ఈ పనులను అప్పగిస్తున్నామని, ప్రతి నెలా ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసేలోపే మీకు జీతాలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. ఇకపై జీతాలు ఆలస్యం కాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో శుక్రవారం నుంచి విధులకు హాజరయ్యేందుకు కార్మికులు అంగీకరించారు. అయితే పెండింగ్ జీతాల గురించి మాత్రం స్పష్టంగా చెప్పలేదు. -
మున్సిపల్ కార్యాలయం ముట్టడి
బైఠాయించిన 200 మందికి పైగా కూలీలు పనుల నిలిపివేతపై తీవ్ర ఆందోళన యలమంచిలి : ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కూలీలు గురువారం యలమంచిలి మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎర్రవరం నుంచి 22 గ్రూపులకు చెందిన 200 మందికి పైగా కూలీలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 22 వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పనులను అర్థాంతరంగా నిలిపి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. యలమంచిలిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం వల్ల వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నాయన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో ఉపాధి లేకపోవడంతో అప్పుల పాలవుతున్నామన్నారు. అధికారులు, నేతలు స్పందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారి వచ్చేవరకు కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న చైర్పర్సన్ మాట్లాడుతూ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడం వల్ల పనులను నిలిపివేశారని చెప్పారు. సమస్యను పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. -
‘అడవి’లో ఘోరం
క్వారీ బండరాయి పడి ఇద్దరి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పెనుమూరు మండలం అడవిపల్లిలో ఘటన మృతులు యాదమరి మండలం గొల్లపల్లివాసులు పత్తాలేని క్వారీ యాజమాన్యం సాక్షి, చిత్తూరు/సిటీ/పెనుమూరు/యాదమరి: క్వారీ ప్రమాదంలో యాదమరి మండలం పావుకూరు గొల్లపల్లికి చెందిన సురేష్(28), కన్నయ్య(38) మృతి చెందారు. కందన్, జీ సురేశ్‌బాబు(32) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పెనుమూరు మండలం అడవిపల్లి క్వారీలో బుధవారం చోటుచేసుకుంది. కూలీలు..గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి దళితవాడకు చెందిన వారు పనికోసం అడవిపల్లి క్వారీకి వెళుతుంటారు. వారం, పదిరోజులు భార్యాబిడ్డలకు దూరంగా అడవిలోనే ఉంటారు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే 11 మంది సోమవారం పనికి వెళ్లారు. బుధవారం కూడా ఉదయం 6.30 గంటలకు క్వారీకి వెళ్లారు. ఉదయం 9.45-10 గంటల మధ్యలో 30 అడుగుల ఎత్తున్న చిట్టాబ్రౌన్ రకానికి చెందిన గ్రానైట్ గుండును బ్లాస్ట్ చేసేందుకు రంధ్రాలు వేశారు. గుండు కింద మట్టి అధికంగా ఉండడంతో బ్లాస్ట్ చేసినా గుండు కిందకు పడదని భావించి మట్టిని తవ్వేందుకు కూలీలు ప్రయత్నించారు. సురేష్, కన్నయ్య సమ్మెటతో మట్టిదిబ్బలు పగులగొడుతున్నారు. మిగిలిన వారు గుండు కింద మట్టిని తొలగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గుండు నై చీలి పగిలిపోయి ఒక్కసారిగా సురేష్, కన్నయ్యపై పడి కింద ఉన్న కూలీలపై పడింది. క్షణాల్లో సురేష్, కన్నయ్య ప్రాణాలు వదిలారు. మిగిలిన కూలీలు అరగంటపాటు మట్టిని తవ్వి హిటాచీ సాయంతో బండరాళ్లను తొలగించారు. టిప్పర్ రాకుండా యాజమాన్యం అడ్డు ఘటన జరిగిన తర్వాత మృతులను, గాయపడిన వారిని టిప్పర్‌లో వేసుకుని చిత్తూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు క్వారీ నుంచి టిప్పర్ రాకుండా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. సమస్యను ఇక్కడే పరిష్కరించుకుందాం’ అని చెప్పబోయారు. దీంతో సెల్వనాథన్ అనే కూలీతో పాటు తక్కిన కూలీలు గొడవచేసి టిప్పర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన మృతదేహాలను మధ్యాహ్నం 3 గంటల వరకు టిప్పర్‌లోనే ఉంచారు. గాయపడిన సురేష్‌బాబు, కందన్‌కు చికిత్స చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో మిన్నంటిన రోదనలు క్వారీ ప్రమాద ఘటనను తెలుసుకున్న గొల్లపల్లి వాసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులైన సురేష్, కన్నయ్యను చూసి వారి బంధువులు, పిల్లలు గుండెలలిసేలా రోదించా రు. సురేష్ తల్లిదండ్రులు చిన్నబ్బులు, సింగారమ్మ ఆయన భార్య శైలజను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ‘లే సురేశా,లెయ్ నాన్నా’ అంటూ సురేష్ తండ్రి అక్కడ కన్నీరుమున్నీరయ్యారు. సురేష్‌కు కుమారుడు నితీష్, కుమారై అర్చన ఉన్నారు. కన్నయ్య ప్రమాదవార్త తెలుసుకుని అతని భార్య బుజ్జి స్పృహ కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు. కన్నయ్య కుమారై మహేశ్వరి తండ్రి మృతదేహం వద్ద బోరున ఏడుస్తూ ఉండిపోయింది. కుమారుడు కిరణ్ బెంగళూరులో క్వారీ పనిచేస్తున్నాడు. రెండురోజుల కిందట అడవిపల్లి క్వారీకి వచ్చి ఒక రోజు తండ్రికి సాయంగా పనిచేశాడు. తండ్రి మరణవార్తను తె లుసుకుని స్వగ్రామానికి బయలు దేరాడు. ఆ చిన్నారికేం తెలుసు...నాన్న ఇక రాడని..! కొడుకు చనిపోయాడని సురేష్ తల్లి సింగారమ్మ, భర్త దూరమయ్యాడని శైలజ, కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక సురేష్ తండ్రి చిన్నబ్బులు గొల్లుమన్నారు. నాన్నమ్మ ఒడిలో కూర్చున్న సురేష్ కుమాైరె అర్చన మాత్రం వారు ఎందుకు ఏడుస్తున్నారో! ‘నాన్న పనికి పోయాడు...పండ్లు, మిఠాయిలు తీసుకుని ఇంటికి మళ్లీ వస్తాడు’ అనేలా అలా ఉండిపోయింది. రోదనల మధ్యలోనే నాన్నమ్మ ఒడిలో నిదురపోయింది. ఎంటెక్ చేశాడు...రాళ్లు కొట్టే పనికి పోతున్నాడు గాయపడిన సురేష్‌బాబు హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. సెయింట్‌మెరీస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేరాడు. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాడు. బతుకుదెరువు కోసం క్వారీ పనికి వెళుతున్నాడు. ఈ ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా నడుము, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. కనీస జాగ్రత్తలు ఏవీ? క్వారీ వద్ద యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కూలీలకు హెల్మెట్లు, చేతులకు గ్లౌజులు ఇవ్వలేదు. అంత పెద్దరాళ్లను పగులగొట్టే ముందు ఇంజినీర్లు పర్యవేక్షణ తప్పనిసరి. కూలీలు మినహా అక్కడ మరో వ్యక్తి ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగితే చిత్తూరుకు వచ్చేంత వరకు ప్రథమ చికిత్స కూడా ఉండదు. ప్రమాదం నుంచి బయటపడిన కూలీల్లో వినోద్, లాజర్, సంపత్, ప్రభు, సెల్వనాథన్, దుర్గయ్య, రాజ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పాకాల సీఐ రాఘవన్, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి, ఆర్ఐ మహేశ్వరి, వీఆర్వో కోదండరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. -
వేవిళ్లు ఎక్కువగా ఉంటే!
అపోహ-వాస్తవం అపోహ : గర్భిణికి వేవిళ్లు ఎక్కువగా ఉంటే కడుపులో ఆడశిశువు ఉన్నట్లు ! వాస్తవం : ఈ అభిప్రాయం ఏ రకంగానూ ఆమోదయోగ్యం కాదంటారు వైద్య రంగ నిపుణులు. గర్భధారణ జరిగాక మొదటి మూడు నెలల సమయంలో ఉదయం నిద్రలేవగానే తల తిరగడం, వాంతులు, విపరీతమైన నిద్ర వంటి ఇబ్బందులు వేధిస్తాయి. అయితే ఒక్కొక్కరిలో వీటి తీవ్రత ఎక్కువగా ఉంటే, కొందరికి తక్కువగా ఉంటుంది. వేవిళ్లు తీవ్రంగా ఉంటే అమ్మాయి, తక్కువగా ఉంటే అబ్బాయి పుడతారని అని నిర్ధారించడం ఏ రకంగానూ సాధ్యం కాదు. ఇలాంటి అభిప్రాయం కలగడాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు... ఒక స్త్రీకి మొదటి కాన్పులో అమ్మాయి, రెండవ కాన్పులో అబ్బాయి పుట్టినట్లయితే అమ్మాయిని గర్భంతో ఉన్నప్పుడు వేవిళ్లు తీవ్రంగా ఉండవచ్చు. సాధారణంగా... వేవిళ్లు తొలి కాన్పులో ఉన్నంత తీవ్రంగా రెండవ కాన్పులో ఉండవు. అంతేతప్ప ఆ ఒక్క అంశాన్ని చూసి, పుట్టబోయేది ఆడపిల్ల అయితే వేవిళ్లు ఎక్కువగా ఉంటాయనుకోవడం తప్పు. -
భవన నిర్మాణ రంగం కుదేల్!
అమాంతం పెరిగిన సిమెంట్ ధర జిల్లాలో రూ.10 కోట్ల భారం ఖాళీగా ఉంటున్న కార్మికులు గుడివాడ : సిమెంటు ధరల దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇసుక, ఇనుము, కంకర ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణాలకు తీరని విఘాతం కల్గిస్తున్నాయి. నెల రోజులుగా పనులు కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. నెలలో మూడు సార్లు సిమెంటు, తదితర ముడిపదార్థాల ధరలు పెరగడంతో భవనాలు నిర్మించలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ రంగానికి అత్యంత గిరాకీగా ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో దీనిపై ఆధార పడిన కుటుంబాలు పనుల్లేక అల్లాడి పోతున్నారు. సిమెంటు కంపెనీల సిండికేట్ కారణంగా సిమెంటు ధరలు మరింత పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంటు ధరలు పెరుగుదల ఫలితంగా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై నెలకు రూ.10కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిమెంటుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో అభివృద్ధి పనులకూ విఘాతం కలుగుతోంది. నెల రోజుల్లో మూడుసార్లు పెరిగిన సిమెంటు ధరలు... ఈ ఏడాది మార్చి31 తరువాత నెలరోజుల్లోనే మూడుసార్లుగా సిమెంటు కంపెనీలు ధరలు పెంచారు. మార్చి 31 నాటికి ఏగ్రేడు కంపెనీలు బస్తా సిమెంటు ధర రూ.240 ఉండగా బీగ్రేడు కంపెనీలవి రూ. 225కి అమ్మారు. సీగ్రేడు కంపెనీల బస్తాధర రూ.190 చొప్పున అందించారు. అయితే మే1న అన్నికంపెనీలు బస్తాకు రూ.40 చొప్పున పెంచగా అదేనెల వారం రోజుల్లోపే బస్తాకు రూ 30 అదనంగా పెంచారు. ఈనెల 18నుంచి అన్నికంపెనీలు మరో 10 అదనంగా పెంచారు. దీన్ని బట్టి నెలన్నరలో అన్నికంపెనీలు బస్తాకు రూ.80 చొప్పున పెంచారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏగ్రేడ్ కంపెనీల బస్తా సిమెంటు ధర రూ.310 కాగా బీగ్రేడు కంపెనీల బస్తా సిమెంటు రూ.300కి చేరింది. సీగ్రేడు సిమెంటు రూ.280కి అందిస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధానమైన సిమెంటు ధరల పెరుగుదల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సిమెంటు వినియోగం 10శాతానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.10 కోట్లు భారం.. జిల్లా వ్యాప్తంగా 30 రకాల కంపెనీలకు చెందిన సిమెంటు నెలకు సగటున 62.5వేల టన్నులు వినియోగిస్తారు. జిల్లాలో వినియోగించే మొత్తం సిమెంటు వినియోగంపై దాదాపు రూ.10 కోట్లభారం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇసుక కొరత కారణంగా అపార్టుమెంట్లు అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అటు కొన్న వారు నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫినిషింగ్ పనులపై ప్రభావం... సిమెంటు ధరలు పెరగడంతో భవన నిర్మాణ దారుడి బడ్జెట్ దాటుతుంది. దీంతో భవనం ఫినిషింగ్ పనులపై ప్రభావం పడుతుంది. రంగులు, ఫ్లోరింగ్, ఉడెన్ కార్పంటింగ్ పనులపై దీని ప్రభావం చూపి సంబంధింత వ్యాపారాలు మందగిస్తాయి. సిమెంటు ధరల ప్రభావం ఇతర వ్యాపారాలపై కూడా ఉంటుంది. - టి.భాస్కర్ , సతీష్ పెయింట్స్ అధినేత అల్లాడిపోతున్నాం..? సిమెంటు ధరల ప్రభావం భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుం బంపై పడుతుంది.నిర్మాణాలు ఆగి పోతే ఫ్లంబర్ నుంచి అన్ని రకాల చేతిపనుల వారు పనులు లేక అల్లాడి పోవాల్సిందే. దీని ప్రభావం దాదాపు రెండు నెలలు పాటు చూపుతుంది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే లక్షలాది మంది కార్మికులు అల్లాడి పోవాల్సిందే. - లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మికుడు -
అబ్బో.. ఏం ప్రాధాన్యం!
శ్రీకాకుళం: మంత్రి పదవి విషయంలో పంతం నెగ్గించుకున్న కింజరాపు అచ్చెన్నాయుడు శాఖల కేటాయింపులో మాత్రం షాక్ తిన్నారు. ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యం లేని శాఖలను కట్టబెట్టడంతో జిల్లాలోని ఆ వర్గంలో నిస్పృహ, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ‘కళా’ వర్గం ఒత్తిళ్లు ఏమైనా పనిచేశాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయడు మంత్రిగా ప్రమాణం చేసిన నాటి నుంచి ఆయనకు పంచాయతీరాజ్ శాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ బుధవారం జరిగిన శాఖల కేటాయింపులో అచ్చెన్నకు కార్మిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఇచ్చారు. ఫలితంగా మంత్రి పదవి దక్కిందన్న ఆనందాన్ని ప్రాధాన్యత లేని శాఖ కేటాయింపు మింగేసింది. ఇది చాలదన్నట్లు జిల్లాలో తమకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న కళావెంకట్రావు మరదలైన చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి మృణాళినికి కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించడాన్ని కింజరాపు వర్గం జీర్ణించుకోలేకపోతోంది. జిల్లా నుంచి మంత్రి పదవి కోసం అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు తీవ్రంగా పోటీ పడ్డారు. ఎవరిస్థాయిలో వారు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసుకున్నారు. మొదట్లో కళాకు మంత్రి పదవి ఖాయమని వార్తలు వచ్చినా ప్రమాణం స్వీకారం నాటికి అచ్చెన్నాయుడు దాన్ని ఎగరేసుకుపోవడంతో కళా వర్గం చిన్నబోయింది. కింజరాపు వర్గానిదే పైచేయి అవుతోందని ఆందోళన చెందిన కళా వర్గం చంద్రబాబుపై తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితంగానే అచ్చెన్నాయుడుకు ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని కింజరాపు వర్గంతోపాటు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ పరిణామం జిల్లా టీడీపీలో వర్గపోరును మళ్లీ తీవ్రతరం అవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దివంగత వైఎస్ హయాంలో శ్రీకాాకుళం జిల్లా మంత్రలకు రెవెన్యూ, అటవీ, రవాణా వంటి కీలక శాఖలతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఆనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాలు సైతం అత్యంత ప్రాధాన్యత కలిగిన వైద్య ఆరోగ్యం, రోడ్లు, భవనాల శాఖలను కేటాయించడం ద్వారా జిల్లాను గౌరవించగా.. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాకు ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించడం కంటే ప్రాతినిధ్యం లేకుండా చేస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
కర్మ చేయడానికే నీకు అధికారం
ఇది ఒక ఆంగ్ల కథలోనిది. ఓ మనిషి తన గదిలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా ఆ గది అంతటా వెలుతురు నిండింది, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషి చేయదగిన పని ఉన్నదని అంటూ ఆ గది వెలుపల ఆరు బయట నున్న ఒక పెద్ద బండను చూపించి, ‘నీ శాయశక్తులా దానిని తోయాలి’ అన్నాడు. ఆ మనిషి పరమ విధేయతతో రోజూ దానిని తోస్తుండే వాడు. ఆవిధంగా ఏళ్లతరబడి తోస్తూనే ఉండి పోయాడు. ఇతడు తన భుజశక్తి ఎంత ప్రయోగించినా, ఎంత పట్టుదలతో చేసినా ఏ కొంచెమూ కదలలేదు. ‘ప్రతిరోజూ ఇంత శ్రమ చేసి, ఏమీ సాధించలేక పోయానే’అనుకుంటూ ప్రొద్దుకుంకే వేళకు తన గదికి తిరిగి వచ్చేవాడు. ‘రోజల్లా ఎంత నెట్టినా ఒక్క అంగుళం కదలడం లేదు. నేనీ శ్రమ అంతా ఎందుకు చేస్తున్నట్లు?’ అనే నైరాశ్యానికి గురయ్యాడు. ఇతడి నైరాశ్యభావం, సంశయం గమనించిన సైతాన్ ఇదే మంచి అదనుగా భావించి, అతడితో ‘చూడు బ్రదర్, నువ్వు ఆ బండను దీక్షగా నెట్టుతూనే ఉన్నావు. కానీ అది కదలడంలేదు. ఎందుకు నీవీ శ్రమ పడుతున్నట్టు?’ అని భగవంతుడి ఆజ్ఞనుల్లంఘించే దిశగా ప్రేరేపించాడు. ‘అవును నేనెందుకు ఈ అలవిమాలిన పనికి ఇంతగా శ్రమించడం? ఏదో భగవంతుడు ఆజ్ఞాపిం చాడు కాబట్టి తూతూ మంత్రంగా చేసినట్లు చేసి వదిలేస్తే, ఆజ్ఞాపాలన చేసినట్లే కదా? వృథా ప్రయాసనేనెందుకు పడుతున్నట్లు?’అని తలపోశాడు. భగవంతుడిని ప్రార్ధించేటపుడు ఆయనకు నివేదించి ఈ పథకాన్ని అమలుచేద్దామనుకున్నాడు. ‘దేవాదిదేవా, నేను నా యావచ్ఛక్తినీ వినియోగించి, నీ సేవలో చాలా పాటుబడ్డాను. ఒళ్లు దాచుకోకుండా శ్రమిస్తూ నీవు చెప్పిన పనిచేశాను కానీ ఇంత శ్రమకూ ఫలితమేమీ దక్కలేదు. ఆ బండరాయి ఒక్క రవ్వకూడా కదలలేదు. పొరపాటెక్కడ జరిగింది? నేనెందుకు విఫలుణ్ణవు తున్నాను?’ అని అడిగాడు. భగవంతుడు దయతో ఇలా అన్నాడు. ‘నువు నా సేవకు పూనుకున్నప్పుడు నేను ఆ బండరాయిని తోయమని మాత్రమే అన్నాను. నీకు చేతనైనంత చేశావు. దానిని నువు కదలించాలనీ, కదిలించగలవనీ నేననుకోలేదు. నీ పనల్లా దానిని తోయడం వరకే. నీవు నీ శక్తినంతా వెచ్చించి తోసి, శక్తి కోల్పోయానని నా వద్దకు వచ్చావు. కానీ, నీ ఓటమి నిజమా? నీ వంక నువ్వు చూసుకో. నీ చేతులు భుజాలు ఎంత గట్టిపడ్డాయో చూడు. కదలకుండా నుంచొని ఆ చలనరహితమైన రాయిని తోసినందువల్ల, నీ కాళ్లు ఎంత దృఢంగా రూపొందాయో చూడు. నీ నడుము ఎంత బలపడిందో గమనించు. ఒక కర్మ ఆచరించినందువల్ల ఏమి దక్కింది అనేది అటుంచి, ఆ ఆచరణద్వారా నువ్వేమైనావు అనేది గమనించు. రాయిని తోసినంత సేపు నన్ను తలచుకుంటూనే ఉన్నావు కదా? నీ మదినిండా నేనుండడం నిన్ను నాకెంత సమీపానికి తెచ్చిందో తెలుసా? రాయి కదలలేదనేమాట నిజమే అయివుండొచ్చు. కానీ నా ఆజ్ఞపాలించడమే నీ కర్తవ్యంగా పెట్టుకుని, నేను ఏదిచెప్పినా నీ మేలునుద్దేశించే చెప్పివుంటాననే నమ్మకంతో ఆజ్ఞాపాలన చేశావు. ఇక ఇప్పుడు ఆ బండను నేను కదిలిస్తాను’ అన్నాడు భగవంతుడు. భగవంతుడికి అసాధ్యమనేది లేదు. అతడు సర్వ శక్తిమంతుడు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ -
ఉపాధి పనులు కల్పించండి
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: జిల్లా వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి. షడ్రక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక కార్మిక కర్షక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 8.50లక్షల జాబ్ కార్డులు ఉంటే 50వేల మందికి కూడా ఉపాధి పనులు చూపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులు చేస్తే వేతనం త్వరగా రాదనే భావన కూలీల్లో ఉందన్నారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకు చేసిన పనుల బిల్లులు రూ.20కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సకాలంలో చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బేతంచెర్ల కో ఆర్డినేటర్ రూ.15లక్షల డ్రా చేసుకొని స్వాహా చేసి, ఉద్యోగానికి రాజీనామా చేశారని ఆరోపించారు. అయినప్పటికీ డ్వామా పీడీ మౌనంగా ఉండడం విచారకరమన్నారు. అనంతరం ఆసంఘం జిల్లా ప్రధాక కార్యదర్శి ఎం. నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 23 మంది ఉపాధి కూలీలు వడదెబ్బకు మృతి చెందారని, ముందస్తుగా మెడికల్ కిట్లు, టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరిగాయని వెల్లడిచారు. ఈ సమస్యలపై ఈనెల 26వ తేదిన అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి నారాయణ తెలిపారు. ఈ ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. -
రైతు కష్టం... బుగ్గిపాలు
మల్లవోలులో ఘోర అగ్నిప్రమాదం 8 ఎకరాల వరికుప్ప దగ్ధం వరి నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ కూడా మంటలపాలు రూ.11 లక్షల ఆస్తి నష్టం కన్నీటిపర్యంతమైన రైతు కుటుంబం గూడూరు, న్యూస్‌లైన్ : మరికొద్ది గంటల్లో నూర్పిడి చేసిన లక్షలాది రూపాయల ధాన్యం ఇంటికి చేరి సిరులు కురిపిస్తుందనే ఆనందంలో ఉన్న ఆ రైతు కుటుంబానికి అగ్నిప్రమాదం రూపంలో తీరని కష్టం ఎదురైంది. నూర్పిడి చేస్తున్న పంట బుగ్గిపాలైంది. ఈ ఘటనలో 11 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మండలంలోని మల్లవోలులో బాదర్ల వెంకటేశ్వరరావు అనే రైతు ఎనిమిది ఎకరాల్లో సొంత భూమి, కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. వర్షాలకు ముందే కోత పనులు పూర్తి చేసి నూర్పిడి కోసం కూలీలు అందుబాటులో లేక కుప్ప వేశాడు. బుధవారం వాతావరణం అనుకూలంగా ఉండటంతో పాటు కూలీల భారం తగ్గించుకునేందుకు కుప్పనూర్పిడి యంత్రం ద్వారా నూర్పిడి పనులు ప్రారంభించాడు. సుమారు నాలుగు ఎకరాల వరకు నూర్పిడి అయ్యాక నిప్పు రవ్వలు ఎగిరి గడ్డిపై పడటంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో నిప్పు రాజుకుంది. అసలే భగభగ మండే ఎండ కాయటంతో పాటు గాలులు తోడవటంతో ఎనిమిది ఎకరాల వరి కుప్పను మంటలు క్షణాల్లో వ్యాపించాయి. దీంతో పాటు కుప్పనూర్పిడి కోసం తీసుకువచ్చిన నూర్పిడి యంత్రం, ట్రాక్టర్‌కు కూడా మంటలు వ్యాపించటంతో తీరని నష్టం జరిగింది. పరుగులు తీసిన కూలీలు... మంటల వేడికి తాళలేక కూలీలు, రైతు నూర్పిడి యంత్రం యజమాని పరుగులు తీశారు. పరిసరాల్లో నీరు అందుబాటులో లేకపోవటంతో మంటలను అదుపు చేసే అవకాశం లేక అలాగే చూస్తుండిపోయారు. చుట్టుపక్కల రైతులు మచిలీపట్నం అగ్నిమాపక శకటానికి సమాచారం అందించటంతో వారు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వరిగడ్డి కావటంతో వారికి కూడా మంటలను అదుపు చేయటం ఒక పట్టాన సాధ్యం కాలేదు. ఊహించని విధంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల రైతులు హాహాకారాలు చేశారు. ప్రమాదం జరిగిన పరిసరాల్లోనే పదుల సంఖ్యలో వరికుప్పలు, గడ్డివాములు, ధాన్యపు రాశులు ఉన్నాయి. అగ్నికీలలు ఎక్కడ తమ కుప్పలపై పడతాయోనని పరిసర రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తీరని నష్టం... ఆరుగాలం కష్టించి పండించిన పంట కొద్ది గంటల్లో చేతికందే దశలో అగ్నిప్రమాదం కారణంగా సర్వనాశనం కావటంతో రైతు బాదర్ల వెంకటేశ్వరరావు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఎకరానికి రూ.22 వేల వరకు పెట్టుబడి అయ్యిందని, లక్షన్నరకు పైగా అప్పు చేసి సాగు చేశానని వెంకటేశ్వరరావు తెలిపారు. ఎకరానికి 40 బస్తాలకు పైగా పంట పండిందని, ఈ లెక్కన సుమారు 350 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతి కావటంతో రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు కిరాయి కోసం వచ్చిన ట్రాక్టర్ యజమాని సైతం తీవ్రంగా నష్టపోయాడు. నెలకుర్రు గ్రామానికి చెందిన రవీంద్రనాధ్ కుప్పనూర్పిడి యంత్రాలను తిప్పుతూ కుటుంబ పోషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో మల్లవోలులో గత కొంతకాలంగా నూర్పిడి యంత్రం పనులు చేస్తున్నాడు. ఈ నూర్పిడి యంత్రం ట్రాక్టర్ ఇంజన్‌తో అనుసంధానమై ఉంటుంది. ఈ నూర్పిడి సమయంలో ట్రాక్టర్ రేడియటర్ పుల్లీ నుంచి నిప్పు రవ్వలు ఎగసి గడ్డిపై పడి ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు. ఈ ట్రాక్టర్, కుప్పనూర్పిడి యంత్రం కూడా దగ్ధం కావటంతో యంత్రం యజమానికి రూ.8 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. పంట యజమాని, ట్రాక్టర్ యజమానులకు ఈ ప్రమాదం రూ.11 లక్షల మేర నష్టం మిగిల్చింది. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ బి.శ్రీదేవి, ఆర్ఐ నరసింహారావు, వీఆర్వోలు రాజమోహన్, బాలభాస్కర్, సర్పంచ్ పర్ణం అరుణశ్రీ, పీఏసీఎస్ అధ్యక్షుడు చీడేపూడి ఏడుకొండలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. -
పెద్ద కూలీ ఐఏఎస్సే
ప్రేమతోనే సివిల్స్‌లోకి రావాలి సీనియర్ ఐఏఎస్‌ల ఉద్ఘాటన సాక్షి,సిటీబ్యూరో: సమాజంలో అతి పెద్ద కూలీ ఐఏఎస్ అధికారే.. ప్రజలపై విపరీతమైన ప్రేమ, సమస్య-పరిష్కారాలే శ్వాస ధ్యాసగా భావించే మనస్తత్వం, జన శ్రేయస్సే లక్ష్యంగా ఉన్నప్పుడు మాత్రమే సివిల్ సర్వీస్‌లోకి అడుగుపెట్టాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో అన్నింటి కన్నా విలువైన పరీక్ష నేడు సివిల్స్ ఎగ్జామ్ అని తెలిపారు. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో తెలిసి వచ్చే ప్రతి అంశం సివిల్ సర్వీస్‌లో ఒక పాఠం లాంటిదనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ గుర్తెరగాలని కోరారు. మున్ముందు తెలుగువారు అత్యధికులు సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. సీనియర్ అధికారులు డాక్టర్ ఏ అశోక్, డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు నేటి తరం విద్యావంతులను సివిల్ సర్వీసుల వైపు కార్యోన్ముఖులను చేసేందుకు పుస్తకాలు రాయటం, అవగాహన కల్పించటం ఆదర్శ ప్రాయమన్నారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ 120 కోట్ల మంది ఉన్న దేశంలో అటు సమాజాన్ని, ఇటు జన జీవితాన్ని ప్రభావితం చేసే అతి గొప్ప సర్వీసు సివిల్స్ అని తెలిపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ అధర్ సిన్హా మాట్లాడుతూ సివిల్స్‌లో పద్ధతి ప్రకారం చదివితే విజయం సొంతమన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య కె.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే సమాచారం ఇస్తే మరిన్ని పుస్తకాల్ని తాము అచ్చు వేస్తామన్నారు. పుస్తకరచయితలు కార్మిక శాఖ కమిషనర్ డాక్టర్ ఏ అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్యలు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకొని సివిల్ సర్వీసు పరీక్షలు రాయాలనే కోరిక ఉన్నవారు ఎవరైనా తమను సంప్రదిస్తే కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ఎల్లవేళలా తాము సిద్ధమేనని చెప్పారు. అనంతరం ‘మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా?’ అనే పుస్తకాన్ని అజయ్ మిశ్రా ఆవిష్కరించారు. ఆంత్రోపాలజీకల్ తాట్, సోషియో కల్చరల్ ఆంత్రోపాలజీ పుస్తకాలను కళాశాల విద్య కమిషనర్ కె. సునీత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎల్. శశిధర్రావు, ఎ.దినకర్ బాబు, డాక్టర్ ఎం జగన్మోహన్, డాక్టర్ యు.వెంకటేశ్వర్లు, వాణీ ప్రసాద్ కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ ఏ. అశోక్, పశువైద్య విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.వి.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల ‘ఉపాధి’ మార్గం!
టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు కూలీల తరలింపు వీఆర్పీలే సూత్రధారులు పలు చోట్ల నిరసనలు... అయినా బేఖాతరు రోలుగుంట/బుచ్చెయ్యపేట, న్యూస్‌లైన్: ఏమీ లేకున్నా ఉన్నట్లు బిల్డప్ ఇవ్వాలి... జనాన్ని పిలిస్తే రారాయే... మరేం చేయాలి... తెలుగు తమ్ముళ్ల దృష్టి ‘ఉపాధి’ కూలీలపై పడింది. అంతే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్‌కి వారిని తరలించేశారు. దీనిపై కొందరు నిరసన వ్యక్తంచేసినా భేఖాతరంటూ తమ పని పూర్తి చేశారు. రోలుగుంట మండలం శరభవరం, బుచ్చెయ్యపేట మండ లం గున్నెంపూడి గ్రామాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. రెండు చోట్లా కూలీల తరలింపులో వీఆర్పీలే కీలకపాత్ర వహించారన్న ఆరోపణలు రావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే...శరభవరం పంచాయతీ పరిధిలోని పెదచెరువు అభివృద్ధికి రూ.16 లక్షల ఉపాధి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులను 59 జట్లతో వీఆర్పీ బండి రాజు ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. గురువారం యథావిధిగా కూలీలు పనులు ప్రారంభించారు. వాస్తవంగా నాలుగు గంటలపాటు పనులు పూర్తి చేయాలి. ఇందుకు భిన్నంగా ఏడు జట్లకు గురువారం ముందే మస్తర్లు వేయించారు. గంటన్నర తరువాత టీడీపీ అభ్యర్థి రాజు నామినేషన్ వేస్తున్నారని, దానికి తరలిరావాలంటూ బయట వ్యక్తుల నుంచి కబురందింది. వెళ్లేందుకు వీఆర్పీ కూడా సై అనడంతో ఈ ఏడు జట్లు పనులు వదిలి ప్రచార కార్యక్రమానికి వెళ్లిపోయారు. వీఆర్పీ మద్దతు వల్లే కూలీలు నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారని సర్పంచ్ బోళెం దారవెంకటలక్ష్మి, పంచాడ పెదబాబు తదితరులు గురువారం ఉపాధి పథకం ఏపీఓ డి.కాశివెంకటఅప్పారావుకు ఫిర్యాదు చేశారు. ఉపాధి కూలీ లతో రాజకీయాలు చేయడం సబవుకాదని, ఇందుకు కారకుడైన వీఆర్పీపై చర్య తీసుకోవాలని కోరారు. గున్నెం పూడి కూలీల ఆగ్రహం టీడీపీ అభ్యర్థి నామినేషన్ కోసం ఉపాధి పనులు నిలిపివేసిన వీఆర్పీ తీరుపై గున్నెంపూడి గ్రామ నాయకులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ సంతబయలు చెరువులో పని కోసం గురువారం ఉదయం సుమారు 600 మంది కూలీలు వెళ్లారు. సగం కాలం పనిచేసిన తర్వాత వీఆర్పీ నాగేశ్వరరావు జోక్యం చేసుకుని ‘చోడవరం టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు వెళ్లాలంటూ కూలీలందరినీ చెరువు నుంచి పంపించి వేశారు’ అని వార్డు సభ్యులు అల్లం శ్రీను, ముచ్చకర్ల అప్పారావు, పల్లా రాజు, కేశంశెట్టి లక్ష్మి, అల్లం రాజబాబు, అల్లం జ్యోతి, పల్లా పుష్ప, కూలి నాయకులు సోమిరెడ్డి తాతారావు, సోమిరెడ్డి అప్పారావు, శ్రీను, నక్క రాజు, రమణ, ఆరేవు అప్పారావు, మామిడి సత్తిబాబు తదితరులు ఆరోపించారు. ఓ ప్రత్యేక కార్యక్రమానికి హాజ రు కావాల్సి ఉన్నందున అరగంట ముందు పనినిలుపు చేయాలని బుధవారం కోరినా వీఆర్పీ అంగీకరించలేదని, గురువారం మాత్రం బెదిరించి పంపారని చెప్పారు. ‘టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు వెళ్లని వారికి మస్తర్లు వేయం. కూలి డబ్బులు ఇవ్వం’ అంటూ టీడీపీ నాయకులతో బెదిరించి మరీ వీఆర్పీ పంపడంపై వీరు నిరసన వ్యక్తం చేశారు. వీఆర్పీగా పనిచేస్తూ టీడీపీకి కొమ్ముకాస్తున్నందున అతనిపై అధికారులు తగిన చర్య తీసుకోవాలని పీడీకి, ఎంపీడీఓ, ఏపీఓ, మండల ప్రత్యేక అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీఆర్పీ నాగేశ్వరరావు వద్ద ప్రస్తావించగా ఇష్టమున్న వారు వెళ్లాలని మాత్రమే చెప్పాను తప్ప వారిపై ఎటువంటి ఒత్తిడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పీలా నామినేషన్‌కూ తరలింపు కశింకోట: అనకాపల్లి టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్‌సత్యనారాయణ నామినేషన్‌కు జనం లేకపోవడంతో మండలంలోని ఉపాధి హామీ పథకం కూలీలను సమీకరించి తరలించారని వైఎస్సార్ సీపీ స్థానిక నాయకుడు బొడ్డేడ సత్యసాయి బాలాజీ ఆరోపించారు. నామినేషన్‌కు వెళ్లేందుకు వీలుగా పనులను అర్ధంతరంగా నిలిపివేశారని తెలిపారు. ఇందుకు ఉపాధి సిబ్బంది సహకారం అందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దీన్ని స్థానిక ఏపీఓ వద్ద ప్రస్తావించగా ఉపాధి పనులకు ఎటువంటి ఆటంకం కలగలేదన్నారు. మండలంలోని 23 గ్రామాల్లోనూ పనులు జరిగాయని చెప్పారు. ఎండతీవ్రత కారణంగా కొందరు కూలీలు ముందుగానే పనిపూర్తి చేసి వెళ్లిపోయారని తెలిపారు. పనిపూర్తయ్యాక కూలీలు ఎక్కడికి వెళ్లారన్న దానితో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. -
100 మర మగ్గాలు.. 40 మంది కార్మికులు!
షోలాపూర్, న్యూస్‌లైన్: గత పదేళ్లుగా పట్టణంలోని వస్త్ర పరిశ్రమ కార్మిక లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చద్దర్లు నేసే మరమగ్గాలపై పనిచేసే కార్మికుల సంఖ్య ఏడేనిమిదేళ్లలో 80 శాతానికిపైగా పడిపోయిందని మరమగ్గాల సంఘం అధ్యక్షుడు పెంటప్ప గడ్డం ‘న్యూస్‌లైన్ ’తో వివరించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. చద్దర్ల మగ్గాలతోపాటు టవెల్స్ మగ్గాల కార్ఖాణాలు కూడా రోజుకోకటి మూతపడుతున్నాయన్నారు. ప్రస్తుతం వంద చద్దర్ల మరమగ్గాలకు కేవలం 40 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని చెప్పారు. అంటే రెండు మగ్గాల భారం ఒకే కార్మికుడిపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చద్దర్ల మరమగ్గాలు నడిపేందుకు యువతరం ఆసక్తి చూపడం లేదని, భవిష్యత్తులో ఈ మరమగ్గాలు నడిపేవారు దొరకడం మరింత కష్టంగా మారనుం దన్నారు. దీంతో ప్రపంచ ఖ్యాతి గడించిన షోలాపూర్ చద్దర్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదముం దని వస్త్రవ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షోలాపూర్ చద్దర్ తన అస్తిత్వాన్ని నిలదొక్కుకోలేక పోవడానికి అనేక కారణాలున్నాయి. టవెల్స్ ఉత్పత్తులకు సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీతో రూపొందించిన అత్యాధునిక మరమగ్గాలు కాలక్రమేణ మార్పులు చెందుతూ ఉత్పత్తిలో కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. కానీ చద్దర్లు ఉత్పత్తి చేసే కార్ఖాణాలలో మాత్రం ఇలాంటి అత్యాధునిక మరమగ్గాలు ఇంతవరకు రాలేదు. అందుకే వీటిల్లో పని చేసేందుకు కార్మికులు కూడా ఉత్సాహం కనబర్చడం లేదు. అందుకే గత ఏడెనమిదేళ్లుగా చద్దర్ల మరమగ్గం నడిపేందుకు ఏ ఒక్క కార్మికుడు చేరలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పట్టణంలో చద్దర్లు ఉత్పత్తి చేసే మరమగ్గాలపై పనిచేసే దాదాపు 1,200 మంది కార్మికుల వయస్సు 45 నుంచి 50 పైబడి ఉంది. అయితే ఈ మరమగ్గాపై పనిచేసేందుకు కొత్తగా ఎవరూ చేరకపోవడంతో ఒక్క కార్మికుడే రెండేసి మరమగ్గాలు రోజుకు 8 నుంచి 10 గంటలపాటు నడుపుతున్నాడు. ఇంత కష్టపడినా వారికి లభించేది కేవలం రూ. 300 మాత్రమే. ఇలా వేతనాలు తక్కువగా ఉండడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. చద్దర్ల ఉత్పత్తికి అత్యాధునిక మరమగ్గాలు తప్ప ప్రస్తుత తరుణంలో మరో గత్యంతరం లేదని కార్ఖానాల నిర్వాహకులు చెబుతున్నారు. ఆధునిక మగ్గాలపై పనిచేసే కార్మికుల కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందంటున్నారు. కాగా శిక్షణ కేంద్రాల ఏర్పాటు కోసం మరమగ్గాల సంఘం సిద్ధంగా ఉందని పెంటప్ప స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా ఈ రంగంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. -
మిన్నంటిన నిరసన
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. స్వార్థ రాజకీయాలకు తెలుగు ప్రజలను విడదీయడం అన్యాయమంటూ ఆదోనిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను పట్టణ పురవీధుల్లో చీపుర్లతో కొడుతూ ఊరేగించారు. ఇదే మండలంలోని యు.కొత్తపల్లెలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సోనియా జన్మ దినాన్ని బ్లాక్‌డేగా పాటించారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గోబ్యాక్ అంటూ నాలుగు స్తంభాల కూడలిలో నినదించారు. కోడుమూరులోని కోట్ల సర్కిల్లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సోనియా జన్మదినం తెలుగు జాతి కర్మదినం పేరిట సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలులోని రాజ్‌విహార్ సెంటర్లో నల్ల జెండాలతో రాస్తారోకో చేపట్టారు. సమితి జిల్లా చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ కొడిదెల శివనాగిరెడ్డి, విద్యార్థి జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు భానుచరణ్ రెడ్డి, బుద్ధి రాజు గౌడ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఆటో కార్మికుల జేఏసీ పిలుపులో భాగంగా మధ్యాహ్నం వరకు ఆటోల బంద్ చేపట్టారు.