సిమెంట్‌రంగంలో అగ్రగామి భారతి సిమెంట్
సిమెంట్‌రంగంలో అగ్రగామి భారతి సిమెంట్
Published Tue, Mar 21 2017 11:51 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM
– రోబోటిక్ టెక్నాలజీతో నాణ్యతా ప్రమాణాలు
– భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా
– జిల్లా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్
పత్తికొండ టౌన్: సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా కొనసాగుతోందని ఆ కంపెనీ జిల్లా సేల్స్ మేనేజర్ ఎ.విజయభాస్కర్ అన్నారు. మంగళవారం రాత్రి పత్తికొండలో భారతి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ కంపెనీకి వైఎస్‌ఆర్ కడపజిల్లా నల్లలింగాయపల్లెలో ఏడాదికి 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటు, కర్నాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లాలో ఏడాదికి 7.5టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్లాంటు ఉన్నాయన్నారు.
ఉత్పత్తి ప్రారంభించిన 7ఏళ్లలోనే వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొని, మార్కెట్‌లో అగ్రగామిగా దూసుకెళ్తోందన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే 3రెట్లు మెరుగైన సిమెంట్‌ను భారతి కంపెనీ వినియోగదారులకు అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి అయిన జర్మన్ టెక్నాలజీ సహకారంతో భారతి సిమెంట్ ఉత్పత్తి అవుతోందన్నారు. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజిజనీరింగ్ నిపుణుల విభాగం పర్యవేక్షణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, సాటిలేని, మేటి అయిన సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీకి ఎలాంటి అవకాశం లేకుండా ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా
భారతి సిమెంట్ కంపెనీ భవన నిర్మాణకార్మికులు, తాపీమేస్త్రీల సంక్షేమం కోసం కూడా కృషిచేస్తోందని సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. కార్మికులకు రూ.లక్ష ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారతి సిమెంట్ విశిష్టత, రోబోటిక్ టెక్నాలజీ, ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్, సిమెంట్ వాడకం గురించి భవన నిర్మాణ కార్మికులకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్, మార్కెటింగ్ అధికారులు ఇక్భాల్‌బాషా, నితేశ్‌యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి ఏజెన్సీ నిర్వాహకుడు, భారతి సిమెంట్ కంపెనీ స్థానిక డీలరు బండల వీరేష్, వార్డుసభ్యుడు గుండుబాషా, తాపీమేస్త్రీలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement