Bharathi Cement
-
భారతి సిమెంట్స్, వికా ఇండియా కార్పొరేట్ కార్యాలయంలో వేడుకగా వినాయక నిమజ్జనోత్సాహం
-
వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా:) కోవిడ్–19 ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా వీధిన పడిన పిల్లలు ఎందరో. కుటుంబ పెద్ద దిక్కయిన భర్తను కోల్పోయి ఆ భారాన్ని మోస్తున్న మహిళలు మరెందరో. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగు రేఖలు పూయించడం తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది భారతి సిమెంట్ యాజమాన్యం. క్షేత్ర స్థాయిలో ఈ ప్రణాళిక అమలును భుజానికెత్తుకుంది అవేర్ సంస్థ. జిల్లాలో 100 కోవిడ్ బాధిత కుటుంబాల పునరావాసానికి భారతి సిమెంట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద నిధులు అందించింది. దీంతో కడప నగరంలోని పలువురు మహిళలకు బతుకుపై భరోసా ఏర్పడింది. చదవండి👉: మనం ప్రజా సేవకులం జీవనోపాధి ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించగలిగితే తాము నిశ్చింతగా ఉండగలమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెలువరించిన వివరాల మేరకు జిల్లాలో 1,35,061 కోవిడ్ కేసులు నమోదు కాగా, 729 మంది మృతి చెందారు. జిల్లాలో 404 మంది పిల్లలు అనాథలుగా మారినట్లు ఐసీడీఎస్ సర్వే ద్వారా వెల్లడైంది. అనాథ పిల్లలను ఆదుకోవాలంటూ కలెక్టర్ విజయరామరాజు కార్పొరేట్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారతి సిమెంటు ముందుకొచ్చింది. సామాజిక సేవలో అపార అనుభవం ఉన్న అవేర్ స్వచ్ఛంద సంస్థను ఆహ్వానించి వారి ద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. ఆర్థికాభివృద్ధి యూనిట్ల పంపిణీ నగదు పంపిణీ చేయడం వంటి చర్యలు ఫలితం ఇవ్వబోవని, ఆర్థికాభివృద్ధి యూనిట్లు పంపిణీ చేస్తే బాధిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అవేర్ సంస్థ సూచించింది. ఈ కొత్త ప్రయోగానికి భారతి సిమెంటు యాజమాన్యం అంగీకరించింది. పాడి ఎనుములు, కిరాణాస్టోర్లు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సోఫా తయారీ వంటి స్వయం ఉపాధి కల్పించారు. భారతి సిమెంట్ ప్రధాన అధికారి సాయి రమేష్, పీఆర్ఓ మేనేజర్ భార్గవరెడ్డి కలెక్టర్ విజయరామరాజు ద్వారా యూనిట్లను బాధిత కుటుంబాలకు అందించారు. ఇలా వంద కుటుంబాల్లోని 212 మంది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తమకు ఒక దారి చూపి ఆదుకున్న భారతి సిమెంట్, అవేర్ సంస్థలకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. అవేర్ వ్యవస్థాపకులు మాధవన్ ఆదేశాలతో తాము జిల్లాలోని 11 మండలాలకు చెందిన వంద కుటుంబాలకు ఉపాధి యూనిట్లు అందజేశామని అవేర్ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. ఇందులో బేకరీ, జిరాక్స్, ఆటో, గొర్రెల పెంపకం తదితర యూనిట్లు ఉన్నాయని వివరించారు. యూనిట్లను బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరా దొరికింది నా భర్త అమానుల్లాబాషా, బావ అమీర్‌బాషా, అత్త షేక్ మురాద్‌బీ గత సంవత్సరం రంజాన్ నెలలో కోవిడ్‌తో మృతి చెందారు. సొంత ఇల్లు లేదు. చెర్లోపల్లెలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి. భారతి సిమెంట్స్, అవేర్ సంస్థ నాకు కిరాణా షాపు ఏర్పాటు చేయించడంతో కుటుంబం గడుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ఫీజులు చెల్లించలేక పోతున్నాను. దాతలు ఆదుకుని చదువుకు సాయం చేయాలి. – పర్వీన్‌బాను, రాజారెడ్డివీధి, కడప ఆపదలో ఆదుకున్నారు లాడ్జిలో గుమాస్తాగా పనిచేసే నా భర్త ఎం.చంద్రశేఖర్ గత ఏడాది జూన్ 19వ తేదీ బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. సొంత ఇల్లు తప్ప మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కోవిడ్ సోకడంతో వలంటీర్ నా భర్త వేలిముద్రను తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో వైఎస్సార్ బీమా రాలేదు. అప్పుల వారు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్, అవేర్ సంస్థలు చీరల వ్యాపారం యూనిట్ మంజూరు చేసి ఆదుకున్నాయి. దీంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించగలిగితే రుణపడి ఉంటాము. – ఎం.వెంకట సుజిత, పెద్దబెస్తవీధి, కడప -
మోదీతో సమావేశంలో పాల్గొన్న భారతీ సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి
-
Bharathi Cement: భారతి సిమెంట్ దాతృత్వం
కడప సిటీ: వైఎస్సార్ జిల్లాకు రూ. 22 లక్షల విలువైన 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణగా అందించిన భారతి సిమెంట్ వారి దాతృత్వం అభినందనీయమని కలెక్టర్ సి.హరికిరణ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో భారతి సిమెంట్ పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్, హెచ్ఆర్ చీఫ్ మేనేజర్లు భార్గవరెడ్డి, రవీంద్రకుమార్ 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వారికి అందజేశారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో కోవిడ్ రెండోదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతి సిమెంట్ యాజమాన్యం ముందుకు వచ్చి ఇప్పటికే స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో రూ.60 లక్షల ఖర్చుతో 20 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేసిందని తెలిపారు. -
కోవిడ్ రోగుల కోసం ముందుకొచ్చిన భారతి సిమెంట్స్
-
అస్పత్రి అభివృద్ధికి భారతి సిమెంట్ సహకారం
ఎర్రగుంట్ల :ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక వసతులతో, పరికరాలతో అభివృద్ధి చేయడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ముందుకు రావడం సంతోకరమని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎర్రగుంట్ల మున్సిపాలీటీలో గడిచిన 15 ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రిని ఏవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడు పనులతో పాఠశాలలు అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇక్కడి ఆసుపత్రిలో ఆధునిక వసతులు చాలా ముఖ్యమన్నారు. ఈ నేపథ్యంలో తాను ఎర్రగుంట్ల ఆసుపత్రిని కూడా కమలాపురం ఆసుపత్రి మాదిరిగా అబివృద్ది చేయాలని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించిందన్నారు. అడిగిన వెంటనే రూ.20 లక్షలు సీఎస్ఆర్ నిధులను మంజూరు చేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ నిధులతో 15 పడకలు ఏర్పాటు చేయనున్నామన్నారు. వివిధ పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. సిమెంట్ ఫ్యాక్టరీకి చెంతిన భార్గవర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంజనీర్లు సందర్శించి ఆధునికంగా తీర్చిద్దిదడానికి ప్రణాలిక సిద్ధం చేస్తారన్నారు.ఈ సందర్భంగా ఆయన యజమాన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూలె హర్షవర్థన్‌రెడ్డి, భారతి సిమెంట్ ఫ్యాక్టరీ భార్గవరెడ్డి, కమిషనర్ వై రంగస్వామిలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
హ్యాపీ క్రిస్మస్
మెదక్ జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చ్ ప్రాంగణం కిటకిటలాడింది. బిషప్ ఏసీ సాలమాన్‌రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆ«రాధనలు ప్రారంభమయ్యాయి. అనంతరం బిషప్ దైవ సందేశం వినిపించారు. మానవుల పాపాలను కడిగేసేందుకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన రారాజు ఏసయ్య అన్నారు. అనంతరం ప్రెస్బిటరీ ఇన్చార్జి ఆండ్రోస్ ప్రేమ్ సుకుమార్ ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వమంతా నిండి ఉన్న దేవుడు ఏసయ్య అని కొనియాడారు. భక్తులు ఇబ్బందులు పడకుండా దాదాపు 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రముఖులు... స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఉపేందర్‌రెడ్డిలు చర్చ్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకు అతీతంగా మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్పారు. ఏసుక్రీస్తు బోధించిన పరలోక మార్గం సూత్రాలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ: క్రిస్మస్ పండుగ సందర్భంగా మెదక్ సీఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో భారతీ సిమెంట్ ఆధ్వర్యంలో పాల వితరణ చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సుమారు 10 వేల లీటర్ల పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీ సిమెంట్ ప్రతినిధులు మల్లారెడ్డి, కొండల్‌రెడ్డి, సతీష్‌కుమార్, గంగాధర్, శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి భారతీ సిమెంట్ మెదక్ డీలర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ మార్కెట్లోకి భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్
మేడిపల్లి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ మరో ముందడుగు వేసింది. అల్ట్రా ఫాస్ట్ పేరుతో అత్యాధునిక సిమెంట్‌ను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో మొదటిసారిగా మేడిపల్లిలోని సవేరా ఏజెన్సీస్ ద్వారా గురువారం ఈ ఉత్పాదనను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతి సిమెంట్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎం.సి.మల్లారెడ్డి, సీజీఎం కొండల్‌రెడ్డి, చీఫ్ మేనేజర్ సతీష్‌రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే అత్యాధునిక టెక్నాలజీతో తయారవుతున్న భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ఈ సిమెంట్ ద్వారా ఒక్కరోజులోనే సెట్టింగ్ పూర్తి అవుతుందని వారు చెప్పారు. ముఖ్యంగా స్లాబ్‌లు, సిమెంట్ పైపులు, ఇటుకల తయారీకి ఈ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ సరైన ఎంపిక అని వివరించారు. మార్కెట్లో లభించే మిగతా సిమెంట్ల కన్నా దీని ధర సుమారు రూ.20 అధికంగా ఉంటుందని తెలిపారు. ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో మొదటిసారిగా 1,000 మంది ఫైవ్‌స్టార్ సిమెంట్ డీలర్ల సమక్షంలో ఈ ఉత్పాదనను సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మేనేజర్ వేముల నీరజ్, సవేరా ఏజెన్సీస్ మేనేజింగ్ పార్ట్నర్ శంకర్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం మరింత సులభతరం: భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ సెట్టింగ్, కలర్, చాలా అత్యుత్తమంగా ఉన్నాయని మొదటి వినియోగదారుడు జగన్నా«థ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సిమెంట్ ద్వారా నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా, సులువుగా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్మాన్‌ఘాట్ గాయత్రినగర్‌లోని ఆయన సైట్లో మొదటిసారిగా అల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌ను వినియోగించారు. -
మార్కెట్లోకి ‘భారతి అల్ట్రాఫాస్ట్’ సిమెంట్
సాక్షి, హైదరాబాద్: ‘భారతి అల్ట్రాఫాస్ట్’పేరుతో సరికొత్త ‘గ్రీన్ సిమెంట్’ను భారతి సిమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో తయారయ్యే ఈ సిమెంట్.. కాంక్రీట్ అనువర్తనాల్లో ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఓపీసీ 53 సిమెంట్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ అల్ట్రాఫాస్ట్ ద్వారా లభిస్తాయని చెప్పారు. ఈ సిమెంట్ వల్ల తేమ వాతావరణంలోనూ ప్రీ కాస్టింగ్ పని సులువవుతుందని, చాలా తొందరగా కాంక్రీట్ గట్టిపడుతుందని తెలిపారు. అల్ట్రాఫాస్ట్‌తో నిర్మితమైన కాంక్రీట్ స్లాబులు, పిల్లర్లు దృఢంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, ఎక్కువ బరువును తట్టుకోగలవని వివరించారు. అల్ట్రాఫాస్ట్ తక్కువ వేడిని విడుదల చేస్తుందని, కాబట్టి వేడి ద్వారా వచ్చే పగుళ్లు తగ్గుతాయని.. కాంక్రీట్‌కు నష్టం జరగదన్నారు. సిమెంట్ ఇటుకల తయారీకి అల్ట్రాఫాస్ట్ ఎంతో అనువైనదని చెప్పారు. -
కల్యాణం..కమనీయం
-
భారతి సిమెంట్ ‘ఎక్స్‌ప్రెస్ డెలివరీ’ ప్రారంభం
కడప కల్చరల్: డీలర్లకు సిమెంటును అతి తక్కువ సమయంలో సరఫరా చేసేందుకు భారతి సిమెంట్ ‘గ్రీన్ చానల్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ’ని ప్రారంభించింది. వైఎస్సార్ జిల్లాలోని భారతి సిమెంట్ కర్మాగారంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని సంస్థ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కర్మాగారం నుంచి సిమెంట్‌ను డీలర్లకు వేగంగా సరఫరా చేసేందుకు గ్రీన్ చానల్ ఎక్స్‌ప్రెస్ డెలివరీని రాయలసీమ ప్రాంతంలో తొలిసారిగా అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల డీలర్లు కస్టమర్లకు చెప్పిన సమయానికే సిమెంటు అందజేయవచ్చని తెలిపారు. అనుకున్న సమయం కంటే సిమెంటును ముందే అందజేయడంతో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు ఈ పద్ధతి ఎంతైనా ఉపయోగపడగలదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డీజీఎం కేఆర్ వెంకటేశ్, లాజిస్టిక్స్ ఏజీఎం సౌరభ్ పురువార్, మార్కెటింగ్ ఏజీఎం ఎంఎన్ రెడ్డి, మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ ఎ.ప్రతాప్‌రెడ్డి, హెచ్ఆర్ ఏజీఎం రవీంద్రకుమార్, ట్రాన్స్‌పోర్టు యజమానులు మహేందర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, బీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి వద్దకే నాణ్యత సేవలు
మొబైల్ టీమ్‌ను ప్రారంభించిన భారతి సిమెంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ భారతి సిమెంట్ మొబైల్ సాంకేతిక సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. శిక్షణ పొందిన సివిల్ ఇంజనీర్లు ద్విచక్ర వాహనంపై స్వయంగా కస్టమర్ల ఇంటి వద్దకు వెళ్లి ఎటువంటి బిల్డింగ్ మెటీరియల్ ఎంపిక చేసుకోవాలి, నాణ్యమైన కాంక్రీట్‌ను ఏ విధంగా తయారు చేయాలి వంటి అంశాలను వివరిస్తారు. అలాగే నిర్మాణానికి వాడే నీరు, ఇసుక, కంకర నాణ్యతను ప్రత్యేక పరికరాల ద్వారా అక్కడికక్కడే పరీక్షిస్తారు. మొబైల్ సాంకేతిక సేవలను దక్షిణాదిన ఇతర రాష్ట్రాలకు త్వరలో పరిచయం చేస్తామని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. సిమెంటు రంగంలో ఇటువంటి సేవలను దేశంలో తొలిసారిగా భారతి సిమెంట్ ప్రారంభించిందని గుర్తు చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సేవలను తమిళనాడులో అందిస్తోంది. -
సిమెంటుకు రవాణా వ్యయమే అడ్డంకి
♦ వ్యయాలు తగ్గితే ఎగుమతులకు ఊతం ♦ భారతి సిమెంట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలోని సిమెంటు కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 46.1 టన్నులకు చేరుకుంది. వినియోగం 28.5 కోట్ల టన్నులుంది. ఇందులో పొరుగునున్న దేశాలకు ఏటా 60 లక్షల టన్నుల సిమెంటు ఎగుమతి అవుతోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల వినియోగం 50 శాతం ఉండడంతో ఎగుమతులపై ఇక్కడి కంపెనీలు దృష్టిపెట్టాయని తెలియజేశారు. అయితే పరిశ్రమకు రవాణా వ్యయమే పెద్ద అడ్డంకిగా అభివర్ణించారు. కృష్ణపట్నం పోర్టు ద్వారా ఎగుమతయ్యే సిమెంటు విక్రయ ధరలో రవాణా వ్యయం 44 శాతం ఉంటోందని గుర్తు చేశారు. రైలు మార్గంలో నౌకాశ్రయాలకు నల్లగొండ క్లస్టర్ నుంచి దూరం 461 కిలోమీటర్ల వరకు, కడప క్లస్టర్ నుంచి 652 కిలోమీటర్ల వరకు ఉందని తెలియజేశారు. కంటైనర్ కార్పొరేషన్, రైల్వేల వంటి సంస్థలు రవాణా వ్యయం తగ్గేందుకు కృషి చేయాలని కోరారు. తద్వారా సిమెంటు ఎగుమతులకు ఊతమిచ్చినట్టు అవుతుందని చెప్పారాయన. ఆలస్యమవుతున్న ఎగుమతులు.. యూఎస్, యూరప్ తదితర పశ్చిమ దేశాలకు ఔషధ ఎగుమతులకు హైదరాబాద్ నుంచి 60 రోజుల దాకా సమయం పడుతోందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఇఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) చైర్మన్ మదన్ మోహన్‌రెడ్డి తెలిపారు. సమీప నౌకాశ్రయాల నుంచి పశ్చిమ దేశాలకు నేరుగా కనెక్టివిటీ లేకపోవడం, ముంబై పోర్టు రద్దీ దృష్ట్యా కొలంబో మీదుగా నౌకల్లో సరకు ఎగుమతి చేయాల్సి వస్తుండడం ఇందుకు కారణమన్నారు. తయారీ 30 రోజుల్లో పూర్తి అయినప్పటికీ, కంపెనీలు సమయానికి సరుకు డెలివరీ చేయలేకపోతున్నాయని గుర్తు చేశారు. పరోక్షంగా ఇక్కడి పరిశ్రమపై ఇది ప్రభావం చూపిస్తోందని అన్నారు. హైదరాబాద్‌లోని ఔషధ కంపెనీలకు ఎగుమతులకుగాను రవాణా వ్యయం 10–11 శాతం అవుతోంది. దీనిని 5–6 శాతానికి చేర్చడం సాధ్యమేనని ఆయన అన్నారు. కస్టమ్స్ అనుమతులకు గతంలో 7–11 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు సరుకు దిగే సమయానికే అన్ని క్లియరెన్సులు ఇస్తున్నట్టు హైదరాబాద్ కస్టమ్స్ కమిషనరేట్ అదనపు కమిషనర్ ఆర్.కె.రామన్ తెలిపారు. సమ్మిట్‌లో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్, బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జయంత్ టాగోర్, మారిటైమ్ గేట్‌వే పబ్లిషర్ రామ్‌ప్రసాద్ మాట్లాడారు. -
అత్యున్నత స్థానంలో భారతి సిమెంట్
⇒ లేటెస్ట్ టెక్నాలజీలో ముందడుగు... ⇒ భారతి సిమెంట్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి మహబూబ్‌నగర్: సిమెంట్ తయారీలో లేటెస్ట్ టెక్నాలజీ పద్ధతులను వినియోగిస్తూ వినియోగదారులు కోరుకునే విధంగా నాణ్యమైన సిమెంట్‌ను అందించడంలో భారతి సిమెంట్ ఎప్పటికీ ముందుంటుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సిందుహోటల్లో జరిగిన ఇంజనీర్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సిమెంట్ తయారీ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా అతి తక్కువ సమయంలో లక్షలాది వినియోగదారుల మన్ననలు పొందడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారుడి అవసరాలకు ఉపయోగపడే విధంగా, మారుతున్న వాతావరణం, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సిమెంట్‌ను తయారు చేస్తున్న భారతి సిమెంట్ కంపెనీ వినియోగదారులకు మేలైన సిమెంట్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్టిఫీషియల్ సిమెంట్ రంగమైన వికట్ సిమెంట్ కంపెనీ, భారతి సిమెంట్ జాయింట్ వెంచర్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారతి సిమెంట్‌ను నంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి ఇంజనీర్లు సహకారం అందించాలని ఆయన కోరారు. భారతి సిమెంట్ అత్యున్నత స్థానానికి చేరుకోవడానికి ఇంజనీర్ల సహకారం చాలా ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో భారతి సిమెంట్ గోదాం ఏర్పాటు చేశామని, వినియోగదారుడు ఆర్డర్ చేసిన రెండు గంటల వ్యవధిలో సిమెంట్‌ను సరఫరా చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జర్మన్ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ, ఉడ్ ప్యాకింగ్ ద్వారా భారతి సిమెంట్‌ను తయారు చేస్తున్నామన్నారు. ఇలా చేయడం ద్వారా సిమెంట్ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకపోవడంతోపాటు, కల్తీ చేసే ఆస్కారం ఉండదని తెలిపారు. కార్యక్రమంలో జీఎం కొండల్‌రెడ్డి, సీనియర్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, మేనేజర్లు సతీష్, నరేష్, మణికంఠ, డీలర్లు విజయభాస్కర సిమెంట్ ఏజెన్సీస్ భాను, విజయభాస్కర్‌రెడ్డితోపాటు 50 మందికి పైగా ఇంజనీర్లు పాల్గొన్నారు. -
సిమెంట్‌రంగంలో అగ్రగామి భారతి సిమెంట్
– రోబోటిక్ టెక్నాలజీతో నాణ్యతా ప్రమాణాలు – భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా – జిల్లా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ పత్తికొండ టౌన్: సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా కొనసాగుతోందని ఆ కంపెనీ జిల్లా సేల్స్ మేనేజర్ ఎ.విజయభాస్కర్ అన్నారు. మంగళవారం రాత్రి పత్తికొండలో భారతి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ కంపెనీకి వైఎస్ఆర్ కడపజిల్లా నల్లలింగాయపల్లెలో ఏడాదికి 5.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఒక ప్లాంటు, కర్నాటక రాష్ట్రంలోని కలుబుర్గి జిల్లాలో ఏడాదికి 7.5టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో మరో ప్లాంటు ఉన్నాయన్నారు. ఉత్పత్తి ప్రారంభించిన 7ఏళ్లలోనే వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొని, మార్కెట్లో అగ్రగామిగా దూసుకెళ్తోందన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే 3రెట్లు మెరుగైన సిమెంట్‌ను భారతి కంపెనీ వినియోగదారులకు అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే అగ్రగామి అయిన జర్మన్ టెక్నాలజీ సహకారంతో భారతి సిమెంట్ ఉత్పత్తి అవుతోందన్నారు. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజిజనీరింగ్ నిపుణుల విభాగం పర్యవేక్షణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, సాటిలేని, మేటి అయిన సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కల్తీకి ఎలాంటి అవకాశం లేకుండా ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అన్ని నాణ్యతా ప్రమాణాలను పరీక్షించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదబీమా భారతి సిమెంట్ కంపెనీ భవన నిర్మాణకార్మికులు, తాపీమేస్త్రీల సంక్షేమం కోసం కూడా కృషిచేస్తోందని సేల్స్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. కార్మికులకు రూ.లక్ష ప్రమాదబీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భారతి సిమెంట్ విశిష్టత, రోబోటిక్ టెక్నాలజీ, ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్, సిమెంట్ వాడకం గురించి భవన నిర్మాణ కార్మికులకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించారు. కార్యక్రమంలో టెక్నికల్ అధికారి కిరణ్‌కుమార్, మార్కెటింగ్ అధికారులు ఇక్భాల్బాషా, నితేశ్యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, శ్రీ ఉరుకుంద ఈరన్నస్వామి ఏజెన్సీ నిర్వాహకుడు, భారతి సిమెంట్ కంపెనీ స్థానిక డీలరు బండల వీరేష్, వార్డుసభ్యుడు గుండుబాషా, తాపీమేస్త్రీలు పాల్గొన్నారు. -
నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ
సంస్థ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి వ్యాఖ్య సిద్దిపేట రూరల్: నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల భారతి సిమెంట్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని భారతి సిమెంట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాపీమేస్త్రీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్..బహుళజాతి సంస్థ వికాట్ భాగస్వామ్యంతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దక్షిణాదిలోనే భారతి సిమెంట్ నంబర్ వన్ కంపెనీగా ఉందన్నారు. కంపెనీ తరఫున తాపీ మేస్త్రీలకు రూ. లక్ష ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు మేస్త్రీలు మాట్లాడుతూ భారతి సిమెంట్ నాణ్యతలు పాటించడం వల్ల వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అందుకే తక్కువ కాలంలోనే భారతి సిమెంట్‌కు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. -
కార్మిక సంక్షేమానికి భారతీ సిమెంట్స్ పెద్దపీట
గుడివాడ టౌన్: భారతీ సిమెంట్స్ వ్యాపారాభివృద్ధితోపాటు దీనికి అనుబంధమైన తాపీ కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని భారతీ సిమెంట్స్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ వి. పవన్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రైల్వే కళ్యాణ మందిరంలో గుడివాడ తాపీ కార్మికుల వ్యక్తిగత బీమా పాలసీల రెన్యువల్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా తమ వ్యాపారాభివృద్ధిలో తాపీ కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. వారి ప్రోత్సాహానికి తగినట్లుగానే అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల్లో సైతం తాము ముందజలో ఉన్నామన్నారు. వారి సంక్షేమం కోసం కంపెనీ ఉచిత బీమా సౌకర్యం కల్పించిందని వీటిల్ల ప్రతి కార్మికుడు రూ. 2 లక్షలు ప్రమాద రక్షణ బీమా సౌకర్యాన్ని పొందుతాడని వివరించారు. భవిష్యత్‌లో కూడా ఈ పాలసీ విధానాన్ని అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని భారతి సిమెంట్స్ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ జి. ప్రసాద్, భారతీ సిమెంట్స్ డీలర్స్, సతీష్ పెయింట్స్ యజమానులు టి. భాస్కరరావు, టి. సతీష్‌కుమార్ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా ప్రసాద్, కార్యదర్శి పి. జేమ్స్, తాపీ వర్కర్స్ యూనియన్ అథ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మురళి, కోశాధికారి కనకరాజు పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
భారతి, కల్బుర్గి సిమెంట్ ప్లాంట్లకు ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు
భారత్‌లో వికాట్ సిమెంట్ తయారీ కర్మాగారాలు- కల్బుర్గి ప్లాంట్ (కల్బుర్గి సిమెంట్), కడప ప్లాంట్ (భారతి సిమెంట్ కార్పొరేషన్)లకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిష్టాత్మక ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు లభించాయి. హైదరాబాద్, హెచ్ఐసీసీలో సీఐఐ 2016 ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ 17వ జాతీయ అవార్డుల ప్రక్రియ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరిగింది. ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకోడానికి సిమెంట్ విభాగంలో ఏకంగా 80 ప్లాంట్స్ పోటీపడ్డాయి. అయితే చివరకు అవార్డులను గెలుచుకున్న 32 ప్లాంట్లలో కల్బుర్గి ప్లాంట్, భారతి సిమెంట్ (కడప) ప్లాంట్ నిలిచాయి. కల్బుర్గి సిమెంట్స్సహా మొత్తం ఎనిమిది సిమెంట్ ప్లాంట్స్ ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ అవార్డులను దక్కించుకున్నాయి. భారతి సిమెంట్ కార్పొరేషన్‌సహా 24 సిమెంట్ ప్లాంట్స్‌కు ‘‘ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ గుర్తింపు లభించింది. వికాట్ ఇండియా సీఓఓ అనూప్ కుమార్ సక్సేనా, భారతి సిమెంట్ కడప ప్లాంట్ హెడ్ ఎం.సాయి రమేశ్, కల్బుర్గి ప్లాంట్ హెడ్ అనుభవ్ వర్మలు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అగ్ర స్థానానికి భారతి సిమెంట్
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తిని, సేవల్ని అందించి వారి మన్ననలు పొందుతున్నామని భారతి సిమెంట్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.సీ.మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఈస్ట్ జోన్ పరిధిలోని ఇంజనీర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఈస్ట్‌జోన్ పరిధిలో భారతి సిమెంట్ ఇంజనీర్ల సహకారంతో మొదటిస్థానంలో నిలిచిందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి అభివృద్ధి దిశగా భారతి సిమెంట్‌ను అన్ని ప్రాంతాల్లోనూ అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు. అత్యంత నాణ్యమైన సిమెంటును అందిస్తూ ప్రీమియం సిమెంటుగా వినియోగదారుల ఆదరణతో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. హైదరాబాద్ ఐఐఐటీ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్ డా.ప్రదీప్‌కుమార్... భూకంపాలకు కూడా చెదరకుండా వుండే భవనాలు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫ్లైఓవర్లు, పెద్ద భవనాలు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన మెళకువల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించారు. -
నాణ్యతకు చిరునామా భారతి సిమెంట్
అనంతపురం రూరల్: అత్యంత నాణ్యత గత సిమెంట్గా భారతి సిమెంట్ పేరుగాంచిందని ఆ కంపెనీ మార్కెటింగ్ విభాగం అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి అనంతపురంలో ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్‌ను ప్రజలకు చేరువ చేయడంలో ఇంజనీర్ల సహాయ సహకారాలు, చేయూత మరువలేనివన్నారు. ప్రస్తుతం నాలుగు దేశాలకు భారతి సిమెంట్ ఎగుమతి అవుతోందన్నారు. అక్కడ సైతం వినియోగదారుల ఆదరాభిమానాలు పొందిందన్నారు. జేఎన్టీయూ మాజీ రెక్టార్, ఏసీఎస్ డెరైక్టర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ, భారతి సిమెంట్ వాడడం వల్ల బిల్డింగ్ జీవితకాలం పెరుగుతుందని ఇటివల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైందన్నారు. ఎక్కడా రాజీపడకుండా అత్యంత నాణ్యతతో కూడిన సిమెంట్‌ను సరఫరా చేస్తున్న కంపెనీగా భారతి సిమెంట్ పేరుగాంచిందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంఎన్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ సీ ఓబుళ్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ విజయవర్ధన్ రెడ్డి, ఇంజనీర్లు, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. -
నాణ్యత వల్లే భారతి సిమెంట్‌కు ఆదరణ
కమలాపురం: భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందంటే నాణ్యతే కారణమని భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) సీఈఓ మార్కస్ ఓబెర్లె అన్నారు. వైఎస్ఆర్ జిల్లా నల్లింగాయపల్లె వద్ద ఉన్న ఫ్యాక్టరీలో ఆరవ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కస్ ఓబెర్లే మాట్లాడుతూ తమ పరిశ్రమ నెలకొల్పిన అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిందన్నారు. ఇదంతా పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు కలసి మెలసి పని చేయడం వల్లే సాధ్యమైందన్నారు. సీఓఓ అనూప్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ మార్కెట్లో తీవ్ర పోటీని తట్టుకుంటూ భారతి సిమెంట్ ముందు వరుసలో నిలిచిందంటే నాణ్యత ప్రమాణాలే కారణం అన్నారు. వర్క్స్ డెరైక్టర్ బీఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా సమీప గ్రామాల్లో రోడ్లు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, విద్యాభివృద్ధికి చేయూత నిస్తూ భారతి సిమెంట్ మిగిలిన పరిశ్రమలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ప్రతినిధులు బాలాజి, భద్రన్, జీజీకే మూర్తి, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
వైట్ టాపింగ్ రోడ్డు పూర్తి
మరిన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వానికి లేఖ.! - సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ - అసోసియేషన్ ప్రతినిధుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంక్రీట్ వైట్‌టాపింగ్ పద్ధతిలో రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నట్లు భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీందర్ రెడ్డి చెప్పారు. సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన కాంక్రీట్ వైట్‌టాపింగ్ ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ తరహా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ త్వరలో ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వి.కిషన్‌రావు, మహా సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.జెమథయ్తో కలిసి ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లు 16 రోజుల్లో కిలోమీటరు మేర నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణాన్ని వైట్‌టాపింగ్ పద్ధతిలో పూర్తిచేశామని, ఈ విషయం తెలియజేస్తూ జీహెచ్ఎంసీకి లేఖ రాశామని తెలియజేశారు. 30 మంది ఇంజినీర్లతో కూడిన బృందం రేయింబవళ్లు పడిన కష్టానికి ఫలితం లభించిందన్నారు. ప్రాజెక్టును సందర్శించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఇంజినీర్లు, విద్యావేత్తలు సంతృప్తి వ్యక్తం చేశార న్నారు. ‘‘డెమో ప్రాజెక్టుకు మొత్తం రూ.2.25 కోట్లు ఖర్చయింది. ఒక్కో చదరపు మీటరుకు రూ.1,686 ఖర్చయింది. పెద్ద మొత్తంలో పనులు చేపడితే ఈ వ్యయాన్ని మరో 15 శాతం వరకు తగ్గించవచ్చు. నగరంతోపాటు, జిల్లా కేంద్రాలు, రహదారుల్లో ఈ పద్ధతి ద్వారా రోడ్డు నిర్మిస్తే గరిష్టంగా 30 ఏళ్ల వరకు మన్నిక ఉంటుంది’’ అని రవీందర్ రెడ్డి వివరించారు. అలా చేస్తే ప్రభుత్వానికి నిర్వహణ ఖర్చు తప్పడంతోపాటు.. ఎన్నో సౌలభ్యాలుంటాయని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఒకే ధరకు సిమెంట్ సరఫరా చేయటానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారాయన. -
భారతి సిమెంట్‌కు టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డు
హైదరాబాద్: టీవీ-5 నిర్వహించిన బిజినెస్ లీడర్-2015 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో జరిగింది. వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన భారతి సిమెంట్ సంస్థతో పాటు, 23 విభాగాల్లో ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ ఐటీస్ తదితర రంగాల్లో అవార్డులు గెలుపొందినవారు ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు ద త్తాత్రేయ, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, సినీనటులు నాగార్జున, మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అదిరిన ‘టెక్ ఫెస్ట్’
-
ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న భారతి సిమెంట్
సాక్షి, చెన్నై: భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. తమిళనాడు గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ రవీంద్రరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. కన్స్ట్రక్షన్స్ ఇండస్ట్రీ అవార్డ్స్ - 2014 కార్యక్రమం చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ హాలులో శనివారం రాత్రి జరిగింది. దీనికి గవర్నర్ రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. నిర్మాణ రంగంలో ప్రతిభ చూపిన 34 సంస్థలకు, ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేశారు. విరివిగా మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ ప్రాముఖ్యతను చాటుతున్న తమిళ హాస్య నటుడు వివేక్‌కు గ్రీన్ గ్లోబ్ అవార్డును ప్రదానం చేశారు. భారతి సిమెంట్‌కు ఎక్సలెన్సీ ఇన్ హైటెక్ సిమెంట్ టెక్నాలజీ అవార్డును అందచేశారు. నిర్మాణ రంగంలోని ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.