నాణ్యతలో మేటి భారతి సిమెంట్
Published Wed, Dec 11 2013 2:49 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
అనంతపురం, న్యూస్‌లైన్: నాణ్యతలో భారతి సిమెంట్ మేటి అని ఆ సంస్థ మార్కెటింగ్ జీఎం ఎంసీ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి నగర శివారులోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో జిల్లా ఇంజనీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము వంద శాతం నాణ్యతను పాటించడం వల్ల అనతి కాలంలో దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ‘భార తి సిమెంట్’కు మంచి పేరు వస్తోందన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకింగ్, రోబోటిక్ టెక్నాలజీతో సూక్ష్మ లోపాలు కూడా లేకుండా సిమెంట్‌ను అందిస్తున్నామన్నారు. అనంతరం భారతి సిమెంట్ నాణ్యత గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో టెక్నికల్ మేనేజర్ ఓబుళరెడ్డి, సీనియర్ మేనేజర్లు ఎంఎన్ రెడ్డి, ఎ.ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఆఫీసర్లు రామాంజనేయరెడ్డి, ప్రతాపరెడ్డి, కిరణ్‌కుమార్, పలువురు డీలర్లు, వంద మంది ఇంజనీర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement