మేడిపల్లి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ మరో ముందడుగు వేసింది. అల్ట్రా ఫాస్ట్ పేరుతో అత్యాధునిక సిమెంట్‌ను తెలంగాణ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో మొదటిసారిగా మేడిపల్లిలోని సవేరా ఏజెన్సీస్ ద్వారా గురువారం ఈ ఉత్పాదనను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతి సిమెంట్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎం.సి.మల్లారెడ్డి, సీజీఎం కొండల్‌రెడ్డి, చీఫ్ మేనేజర్ సతీష్‌రాజులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే అత్యాధునిక టెక్నాలజీతో తయారవుతున్న భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. ఈ సిమెంట్ ద్వారా ఒక్కరోజులోనే సెట్టింగ్ పూర్తి అవుతుందని వారు చెప్పారు. ముఖ్యంగా స్లాబ్‌లు, సిమెంట్ పైపులు, ఇటుకల తయారీకి ఈ అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ సరైన ఎంపిక అని వివరించారు. మార్కెట్‌లో లభించే మిగతా సిమెంట్ల కన్నా దీని ధర సుమారు రూ.20 అధికంగా ఉంటుందని తెలిపారు.
ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో మొదటిసారిగా 1,000 మంది ఫైవ్‌స్టార్ సిమెంట్ డీలర్ల సమక్షంలో ఈ ఉత్పాదనను సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్ మేనేజర్ వేముల నీరజ్, సవేరా ఏజెన్సీస్ మేనేజింగ్ పార్ట్‌నర్ శంకర్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణం మరింత సులభతరం: భారతి అల్ట్రా ఫాస్ట్ సిమెంట్ సెట్టింగ్, కలర్, చాలా అత్యుత్తమంగా ఉన్నాయని మొదటి వినియోగదారుడు జగన్నా«థ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సిమెంట్ ద్వారా నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా, సులువుగా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కర్మాన్‌ఘాట్ గాయత్రినగర్‌లోని ఆయన సైట్‌లో మొదటిసారిగా అల్ట్రా ఫాస్ట్ సిమెంట్‌ను వినియోగించారు.
Comments
Please login to add a commentAdd a comment