
కడప సిటీ: వైఎస్సార్ జిల్లాకు రూ. 22 లక్షల విలువైన 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణగా అందించిన భారతి సిమెంట్ వారి దాతృత్వం అభినందనీయమని కలెక్టర్ సి.హరికిరణ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో భారతి సిమెంట్ పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్, హెచ్‌ఆర్ చీఫ్ మేనేజర్లు భార్గవరెడ్డి, రవీంద్రకుమార్ 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వారికి అందజేశారు.
కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో కోవిడ్ రెండోదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతి సిమెంట్ యాజమాన్యం ముందుకు వచ్చి ఇప్పటికే స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో రూ.60 లక్షల ఖర్చుతో 20 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment